పాటతో పరమార్ధం - ఆలనగా పాలనగా (భక్తి పేరడీ) - కుంకుమ తిలకం - మురళీ మోహన్, జయసుధ, శారద - Songs - లోకం తీరు/ News
           
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. 2085 కధనాలు. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు. 2120 General Articles and views 1,882,812; 104 తత్వాలు (Tatvaalu) and views 226,446.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
చివరలో ఉన్న చిత్రం/ వీడియో/ ఆడియో మరువద్దు. 1 min read time.

Song Spirit - Aalanaga Palanaga (Bhakti Parody) - Kunkuma Thilakam - Murali Mohan, Jayasudha, Sharada

ఈ ప్రాపంచిక పరుగులలో, బంధాలకు విలువ లేకుండా, క్రుతజ్ఞత విశ్వసనీయత అంటే వారి జీవిత డిక్షనరీ లోనే లేకుండా, సంపాదనల ప్రేమలో పడి, ఆతర్వాత రోగాల బారిన పడి ఇంట్లో వారే చీత్కరించి దూరముగా పెడితే, చివరకు మానసికముగా పతనమైన వారికి, ఆలనగా, పాలనగా, అలసిన గుండెకు, ఆలంబనగా తోడు ఉండే వారు, ఎవరు దొరుకుతారు? ఎవరు కనికరము చూపుతారు?

అన్ని బాగున్నప్పుడు, ఏ మంచి వారికి, మనం అండగా ఉన్నాము? కనీసం మన ముదుసలి అమ్మ నాన్న అత్త మామ కు, సజీవ గురువు సేవ చేసామా? అబ్బే లేదే, లోకమంతా చెడిపోయింది, కాబట్టి మేము చెడిపోయాము, అని మన గొయ్యి మనమే తవ్వుకున్నాము.

చివరకు మన దగ్గరకు వచ్చేసరికి, నీతి నియమాలు ధర్మం, గుర్తుకు వస్తే ఎలా? ఏది పంచామో బిడ్డలకు, బాగస్వామికి, ప్రపంచానికి, అదే కదా మనకు తిరిగి వచ్చేది? కపట, నటన, 2 నాల్కల ధోరణి పంచితే, అదే చివరకు మనల్ని ముంచేది, మరువకు మిత్రమా.

అమ్మా, ఆలనగా, పాలనగా, అలసిన గుండెకు, ఆలంబనగా దయతో మమ్ము మీదాల దగ్గర సజీవ గురువు సేవ చేసుకునే భాగ్యముతో ఉండనిచ్చావు. మమ్ము లాలించు మీ భక్తునిగా, స్వామీ/ తల్లీ పాలించు మీ దాసునిగా, అంటే, కన్న తల్లి మన ఇంటి అన్నపూర్ణ ఒక అన్నం ముద్ద వేయదా రోజూ, ఈ శరీరం ఇంకొన్ని రోజులు, పదిమందికి మంచి పంచడానికి, దైవానికి చేరువ అవ్వడానికి.

మోక్షము అంటే ఎక్కడ ఉంటుంది అండి? ఓరి పిచ్చివాడా, ప్రాపంచిక మోహాలకు దూరంగా ఎప్పుడు అయితే ఉండగలమో, ఆరోజే మోక్షము వచ్చినట్లు, ఈ జీవిత చక్ర వ్యామోహాల నుంచి.

ఓ స్వామీ, మోక్షము కోరే, సాత్విక నిస్వార్ధ ఓర్పు సహన స్తిర త్యాగ జీవులు మేము, చిత్తశుద్ది వాక్సుద్ది తో మీ పూజకు వేచిన, పువ్వులు మేము. నిన్నటి దాకా మాలో మేము మోహాలతో, బుద్ది వచ్చిన తర్వాత ఈ నిమిషానా మీతో మేము, మాది అంటూ ఏదీ లేదు, మాతో పరలోకానికి రాదు.

దేవా చల్లని మీ అభయం ఒక మహా సాగరమైతే, అందులో మీ కరుణ ఒక బిందువునైనా చాలును మాకు. ఎందుకు ఇవ్వాలి రా మీకు అంటారా, మేము మీ ఒడిలో పసిపాపలు కామా, మీ పాదాల రేణువు కామా? అవి కేవలము మాటలు కాదు స్వామీ, 10+ ఏళ్ళ సజీవ గురువు సేవ అర్హతతో ప్రార్ధిస్తున్నాము.

ఒకరు అడిగారు, భక్తి గీతాలే కదా మీరు పాడుతుంది, ఇంక ఆ సినిమా బొమ్మలు ఎందుకు వీడియోలో అని. వారికి జవాబు చెప్పాము, క్రుతజ్ఞత విశ్వసనీయత కు, మనము అవి ఉంచాలి. రజో తమో గుణ దాసులకు అర్ధమయేలా మనము పాడుతూ, మాటలు/ కధనము/పేరడీ రాస్తూ, ఒక సినిమా గీతాన్ని వాడినపుడు, వారికి ధన్యవాదాలు తెలుపుతూ, ఆ ఫొటో ఉన్నవాటిలో మంచిది ఉంచడం, వారిని స్మరించి గౌరవించినట్లే. ఆ సినిమా కు పబ్లిసిటీ కూడా ఇంకో విధముగా. అమాయకులు, పాట కూడా మనదే అనుకోకూడదు కదా.

అందరికీ మనము క్రుతజ్ఞత ఉండాలి అని చెపుతూ, మనమే అది ఆచరించకపోతే ఎలా? మొదలు చివర తప్ప, మధ్యలో అంతా, మన శనివార సాధనల ఫోటోలే ఉన్నాయి, గమనించండి అన్ని కొత్త వీడియోలలో.

మీరూ సంస్కార తల్లి దండ్రుల సేవతో, సంస్కార పిల్లల పెంపకముతో, ఈ మంచి పాటలను, అందరికీ పంచుతూ, అందరినీ భాగస్వామ్యం చేస్తారు కదూ, మానసిక బల స్తిర ధర్మ సమాజానికి.

Parody

ఆలనగా, పాలనగా., అలసిన గుండెకు, ఆలంబనగా
లాలించు మీ.. భక్తునిగా.., స్వా..మీ.. పాలించు మీ.. దా.సుగా.. - 2 సార్లు మొత్తం

మోక్షము కో.రే., జీవులు మే.ము., పూజకు వే.చిన, పువ్వులు మే.ము. 2 ఆ ఆ
నిన్నటి దా..కా. మా.లో. మే.ము., ఈ నిమిషా..నా. మీ.తో. మే.ము.
లాలించు మీ.. భక్తునిగా.., స్వా..మీ.. పాలించు మీ.. దా.సుగా.. ||ఆలనగా పాలనగా||

మీ అభయం. ఒక సా.గరమై.తే., బిందువునై.నా. చా.లును మా.కు 2
మీ ఒడిలో. పసిపా..పలు కా.మా.., మీ పాదా..ల రే..ణువు కా.మా
లాలించు మీ.. భక్తునిగా.., స్వా..మీ.. పాలించు మీ.. దా.సుగా..||ఆలనగా పాలనగా||

ఆలనగా, పాలనగా., అలసిన గుండెకు, ఆలంబనగా
ఆహాహ హా ఆహహా ఆ ఆ ఆ ఆ ......

Original

ఆలనగా, పాలనగా., అలసిన గుండెకు, ఆలంబనగా
లాలించు నీ.. దానిగా.., స్వా.,మీ.. పాలించు నీ.. దా.సిగా.. - 2 సార్లు మొత్తం

పున్నమి కో.రే. రేయిని నే.ను., పూజకు వే.చిన పువ్వును నే.ను. 2
నిన్నటి దా.కా. నా.లో. నే.ను., ఈ నిమిషా.నా. నీ.తో. నే.ను.
లాలించు నీ దానిగా, స్వామీ.., పాలించు నీ దాసిగా.. ||ఆలనగా పాలనగా||

నీ హృదయం. ఒక సా.గరమై.తే., బిందువునైనా. చా.లును నే.ను 2

నీ ఒడిలో. పసిపాపను కా.నా.., నీ పాదా.ల రే.ణువు కా.నా
లాలించు నీ. దానిగా., స్వామీ.., పాలించు నీ దాసిగా..||ఆలనగా పాలనగా||

ఆలనగా, పాలనగా., అలసిన గుండెకు, ఆలంబనగా
ఆహాహ హా ఆహహా ఆ ఆ ఆ ఆ ......  
Author photo Sri, Telugu , 15+ yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 840+ Foreign and local events/ places coverage, 2120 General Articles and views 1,882,812; 104 తత్వాలు (Tatvaalu) and views 226,446
Dt : 29-Feb-2024, Upd Dt : 29-Feb-2024, Category : Songs
Views : 125 ( + More Social Media views ), Id : 2043 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags : Aalanaga , Palanaga , Bhakti , Parody , Kunkuma , Thilakam , Kunkuma , Tilakam , Murali , Mohan , Jayasudha , Sharada
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.

Share
కేవలం ఒక మీడియా వార్త నే నమ్మలేము, ఒకే చోట అందరి వార్తలను ఇక్కడ చూసి, నిజాలు పోల్చుకోగలము
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 11 yrs
No Ads or Spam, free Content