పాటతో పరమార్ధం - ఆకాశ వీధిలో అందాల జాబిలీ(పేరడీ) - మాంగల్య బలం - ANR, సావిత్రి - Songs - లోకం తీరు/ News
           
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. 2085 కధనాలు. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు. 2120 General Articles and views 1,884,755; 104 తత్వాలు (Tatvaalu) and views 226,520.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
చివరలో ఉన్న చిత్రం/ వీడియో/ ఆడియో మరువద్దు. 1 min read time.

Song Spirit - Aakaasa Veedhilo(Parody) - Mangalya Balam - ANR, Savitri

చల్లనిరాజా ఓ చందమామ, మీ కథలన్ని తెలిసాయి ఓ చందమామ, మన ఇస్రో చంద్రయాన్ 3 యాత్ర తో. దక్షిణ ధ్రువాన దిగిన సందర్భముగా, ప్రపంచ దేశాలు శుభాకాంక్షలు తెలిపాయి. మరి మనము ఓ 4 రాత మాటలు, ఓ గాత్ర నైవేద్య పాట తో, అదీ మన అందరి నాన్నలు అమ్మమ్మలు నాయనమ్మలు తాతలకు నచ్చిన మెచ్చిన మాటలుతో, అలాగే మన ఆధ్యాత్మిక భావనల పేరడీతో, అభినందనలు తెలుపు దామా. అందరికన్నా మనది ప్రత్యేకముగా ఉండాలి కదా, చిత్తశుద్ది వాక్సుద్ది తో.

సూర్య చంద్రులు ను మనము దైవాలుగా కొలుస్తాము. వారు కూడా, ఆది దేవులను కొలుస్తారు. కాబట్టి, మన అందాల జాబిలి, అలాగే చందమామ దైవాన్ని తలస్తున్నారు, అలాగే మనము చేయాలి, అన్న ఆలోచనలతో ఈ పాట పాడుదాం.

చూడండి ఆ ఆకాశ వీధిలో, మన అందాల జాబిలీ, దైవాల సన్నిధి జేరీ, జపతపాల లూగెనే, సాధనల మునిగినే అంతేనా, ధ్యానం చేసినట్లుగా ప్రశాంతముగా ఉంటాయి.

ఆకాశములో కమ్ముకునే, తలసారు మేనిమబ్బు, పరదాలు నేసీనా, మన ధ్యానాలతో తెరచాటు తీసీ, పలుమారు సాది సాది అంటే సాధనలు చేసి, ఫలితముగా మన మోహ బ్రమలన్నీ పోయీ, మదిలో న శాంతాలు విరిసి, అందాల చందామామా, ఆ దైవ వేద గానం చాటెనే, మనకు మోక్ష దోవ చూపెనే.

ఎంత నీతి నియమ క్రమ బద్దముగా ఉంటుంది, చందమామ/ జాబిల్లి రాక పోకలు. అమావాస్య, పౌర్ణమి తప్పక ప్రతి నెలలో చూస్తాము, అవి స్వార్ధము నిర్లక్ష్యము బద్దకము లెక్కలేనితనము తో గతులు తప్పితే, మనలాగే? మన బతుకు ఇంకా దుర్భరము.

మన జీవితములో, జడివాన హోరుగాలి, సుడిరేగి రానీ, మనల్ని జడిపించ బోనీ,
కలకాలం మన అందరం, మానసిక నియంత్రణ బలము పలు సాధనలతో పొంది, ముక్తి మోక్షము ద్వారా దైవం చెంత చేరీ, అందాలా చందమామా, దైవరాగం చాటెనే, ముక్తిదోవ చూపెనే అని ఆనందముగా పాడుకుందాము.

భావనకు హద్దులు ఉండవు సుమా. ఇది రాసినంతసేపు, చదివినంత సేపు, పాడినంత సేపు, మీకు పంపినంత సేపు, దైవ ధ్యానమే, మానసిక శారీరక నైవేద్యమే, మానవ సేవనే కదా, ఏకాగ్రతతో?

అమ్మ ఓపికగా రామకోటి రాసుకుంటూ, ఇంకా లక్షలు పూర్తి చెయ్యాలన్న దైవ సంకల్పాన్ని నెరవేర్చుకుంటూ, రారా అన్నము తిందాము అంటుంది, మరి వెళుతున్నా.

ఆకాశ వీధిలో.., అందా.ల జాబిలీ..
దైవాల సన్నిధి జేరీ, జపతపాల లూగెనే, సాధనల మునిగినే - 2

తలసారు మే.నిమబ్బు, పరదాలు నే.సీ., తెరచాటు తీసీ
పలుమారు సాది సాది, బ్రమలన్నీ పో.యీ., శాంతాలు విరిసి
అందాల చందామామా, వేదగానం చాటెనే, మోక్షదోవ చూపెనే

ఆకాశ వీధిలో.., అందా.ల జాబిలీ..
దైవాల సన్నిధి జేరీ, జపతపాల లూగెనే సాధనల మునిగినే
ఆ..ఆ..ఆ..ఆ ఆ..ఓ..ఓ..ఓ..ఓ..ఓ 2

జడివాన హోరుగా.లి, సుడిరేగి రా.నీ.., జడిపించ బోనీ
కలకాలం మన అందరం, పలు సాధనలతో.., దైవం చెంత చేరీ
అందాలా చందమామా, దైవరాగం చాటెనే, ముక్తిదోవ చూపెనే

ఆకాశ వీధిలో.., అందా.ల జాబిలీ..
దైవాల సన్నిధి జేరీ, జపతపాల లూగెనే సాధనల మునిగినే
ఆ..ఆ..ఆ..ఆ ఆ..ఓ..ఓ..ఓ..ఓ..ఓ 2  
Author photo Sri, Telugu , 15+ yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 840+ Foreign and local events/ places coverage, 2120 General Articles and views 1,884,755; 104 తత్వాలు (Tatvaalu) and views 226,520
Dt : 19-Sep-2023, Upd Dt : 19-Sep-2023, Category : Songs
Views : 293 ( + More Social Media views ), Id : 1922 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags : Aakaasa , Veedhilo , Parody , Mangalya , Balam , ANR , Savitri
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.

Share
ఆ టీవీ, ఈ టీవీ, మీ టీవీ, మా టీవీ, వాళ్ళ టీవీ పత్రిక - అన్ని టీవీ, పత్రిక వార్తలు వినోదం ఇక్కడే
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 11 yrs
No Ads or Spam, free Content