పాటతో పరమార్ధం - ఆడుతు పాడుతు (పేరడీ) - తోడి కోడళ్లు - ఏఎన్ఆర్, సావిత్రి, ఎస్వీఆర్, జగ్గయ్య - Songs - లోకం తీరు/ News
           
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. 2104 కధనాలు. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు. 2139 General Articles and views 2,064,686; 104 తత్వాలు (Tatvaalu) and views 236,348.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
చివరలో ఉన్న చిత్రం/ వీడియో/ ఆడియో మరువద్దు. 1 min read time.

Song Spirit - Aadutu Paadutu (Parody) - Thodi Kodallu - ANR, Savitri, SVR, Jaggayya


ఆడుతు పాడుతు పనిచేస్తుంటే, అలుపు సొలుపేమున్నది అని పెద్దలు చెప్పారు. మరి అలాగే, ఏకాగ్రతతో ధ్యానం, ఆచరణ, సాధన నిలిస్తే మన రోజూ వారీ పనులలో, భయమేమున్నది, దైవం మనలో మనతో ఉన్నది అని కూడా పెద్దలు చెప్పారు.

గాలిలో ఊళ్ళు ఇళ్ళు గుళ్ళు తిరిగి వయ్యారంగా, కపట నటన 2 నాల్కలతో పూజలు యాత్రలు చేస్తుంటే, నటనలు కోటలు దాటుతుంటే, మన మనసు బలహీనమంటున్నదీ, అంటే ఎవరికీ అర్ధం కావడం లేదు.

ఎవరికీ మేము భయపడము అంటే, మన పిల్లలు అదే నేర్చుకుంటారు. రేపు మనల్ని చూసి కూడా భయపడరు. దాని వలన నష్టం మనకే. అదే మనము, నేను కోటీశ్వరుడిని ఎంపీ ని ఎమ్మెల్యేని రౌడీ ని అయినా, సజీవ గురువు సేవ 5 ఏళ్ళు పైగా చేసిన వారి జోలికి వెళ్ళను, వారంటే తల దించుతాను అంటే. పిల్లలు కూడా, అమ్మా నాన్న ఎందుకు, వారి కన్నా మనకే ఆస్తి అధికారం ఎక్కువ ఉంది కదా, అంటే. మన జవాబు, అన్నిటి కన్నా, కన్న తల్లి తండ్రి సేవ ముఖ్యం మాత్రు పిత్రు దేవోభవ, మనకు ఉన్న ఆస్తులు అశాశ్వతం, కాబట్టి వారి ముందు మేము, మీరు తల వంచాలి అని సంస్కారం నేర్పితే, ఆ పిల్లలు రేపు తమ పెద్దలను గౌరవిస్తారు.

కానీ జనం ఏమంటున్నారు, ఛీ మా బతుకు చెడ, ఇంట్లో భాగస్వామి అమ్మ అయ్య అత్త మామలు బంధువులు స్నేహితులు కూడా అడగరు, బొట్టు ఏదని భూతద్దంలో చూస్తూ. బయట వారికి/ పంచభూతాల కు భయపడి, ఆవాల సైజు నుంచి నామాల/ పావలా అంత బొట్టు కు వచ్చాం, నిండు బట్టలు కట్టుకున్నాము, నోటితో శ్లోకాలు వల్లె వేస్తున్నాము ఇంటిల్లిపాదీ.

పోనీ లే అలా అయినా శని/రాహు కేతు దశ దాకా నటిస్తే, చల్లగా అది దాటితే, లేదంటే అంతా గోవిందే, ఉన్నది పోయే ఉంచింది పోయే, అని వారికి తెలుసు. ఏదీ భయముతో చెయ్యకూడదు. భక్తి గౌరవము తో చెయ్యాలి.

నువ్వు లేదా ఇద్దరు లేదా పిల్లలు పాడిన దైవ పూజ పాటలు, శ్లోకాలు, వచ్చిన వరకే ప్రయత్నం చేయండి. 5 ఏళ్ళుగా కోరుతున్నాం, జాలి దయ కరుణ లేదా మా మీదా? పాడి మమ్మల్ని ఆనందింపజేసి, పుణ్యం కట్టుకోలేరా? ఉచితం నే, రూపాయి ఖర్చు లేదు కదా? ఆలస్యం ఎందుకు 5 -10 ఏళ్ళుగా?

అంటే, మా బతుకుల మీదే మాకు జాలి దయ కరుణ లేదు, మా ముదుసలి అమ్మ నాన్న అత్త మామ ను, మా ఇంట్లో చూస్తారా ఇంకో 10 ఏళ్ళు కైనా, అని మనల్ని తిరిగి ఈసడిస్తున్నారు.

స్పష్టంగా గొంతు పద్యం శ్లోకం పాట రాత రామకోటి లేనిదే, రాత/ వ్రాత మరియు గాత్ర నైవేద్యం, చిత్తశుద్ధి, వాక్సుద్ధి ఉన్నట్లు కాదు. మన రాత/ గీత మారదు నిరూపణతో.

30 ఏళ్ళు దాటినాక కూడా, ఇంకా మేము అభిషేకం చూసాము, గుడిలో పూజలు చేసాము, దేవుని పాటలు మంత్రాలు ఎంపీ3 లో విన్నాము అంటే, ఇంక ఆచరణలో దైవ గుణాలు చూపేది ఎప్పుడు? 50 తర్వాత రోగాలు, కాళ్ళు చేయి కదలవు, అప్పుడు మానసిక నియంత్రణ వస్తుందా?

రామన్న, రాజన్న, సావిత్రమ్మ, జయలలితమ్మ, కోడెలయ్య, శ్రీదేవమ్మ‌‌‌, కాఫీడేఅయ్య, . . . ఇంకా ఎందరో మహానుభావులు, ఇంతకన్నా పెద్ద పూజలు యాగాలు దానాలు ధర్మాలు చేశారు.

అంటే కూడా, వారితో 5 శాతం ధనం ఆస్తులు పదవి బలగం సరిపోకపోయినా, పై చిన్న పనులు చేయడానికే మానసిక బలం లేక ఏళ్ళు సాగిస్తూ, మాకేమీ కాదు లే అని, పిల్లి కళ్ళు మూసుకుని పాలు తాగినట్లు, బతుకు సాగదీస్తున్నారు.

తీరని కోరికలూరింపంగా, ఎంత అప్పు చేసైనా సరే ఇల్లు/ స్థలం/ కార్లు/ సౌకర్యాలు/ ఆనందాలు/ పదవులు/ పెళ్ళి కొనాలి, కావాలంటే గోఫండ్ ఉంది ఒకరు పోయినా లేదా విడిపోయినా, అన్న మత్తులోన మనం చిత్తుగ ఉంటే, తొందర పతనము చిందులు తొక్కి, ముప్పు ముంచుకొస్తున్నదీ. అబ్బే కుంభకర్ణుడి టైపు, మాకు పట్టదు.

నుదుట తీరిన కుంకుమ విభూతి రేఖలు, పెదవులపైన మంత్రము రాగము పద్యము ఉంటే, సాధన తలపులు మనలో ఏమో, శాంతిని ఇస్తూ ఉన్నవి, మనశ్శాంతిని ఇస్తూ ఉన్నవి అని 100 కి 20 శాతం మంది దైవం పై ద్రుష్టిని ఉంచుతారు ఎల్లప్పుడు, చుట్టూ అన్నీ పోయినా సరే.

మన మాటల్లో దైవాన్ని నిలిపి, మన రాగంలో శివనాదం కలిపి, నిత్య సాధన చేస్తుంటే, మనమది పరవశమైపోతున్నదీ, తరగని విడువని తెలియనై పరవశమైపోతున్నదీ. మరి ఒక్క సారి ఈ జీవితములో అనుభూతి పొంది, ఓ రాత, ఓ పాట పాడి చూపుతారా?

పల్లవి:
ఆడుతు పాడుతు పనిచేస్తుంటే, అలుపు సొలుపేమున్నది
ఏకాగ్రతతో సాధన నిలిస్తే, భయమేమున్నది దైవం మనలోఉన్నది - 2 సార్లు

1. గాలిలో తిరిగి వయ్యారంగా, పూజలు యాత్రలు చేస్తుంటే - 2 సార్లు
నటనలు కోటలు దాటుతుంటే, మన మనసు బలహీనమంటున్నదీ 2 ||ఆడుతు పాడుతు||

2. తీరని కోరికలూరింపంగా, మత్తులోన మనం చిత్తుగ ఉంటే 2
తొందర పతనము చిందులు తొక్కి , ముప్పు ముంచుకొస్తున్నదీ,
జీవిత ముప్పు ముంచుకొస్తున్నదీ ||ఆడుతు పాడుతు||

3. నుదుట తీరిన కుంకుమ రేఖలు, పెదవులపైన మంత్రము ఉంటే 2
సాధన తలపులు మనలో ఏమో 2 శాంతిని ఇస్తూ ఉన్నవి,
మనశ్శాంతిని ఇస్తూ ఉన్నవి ||ఆడుతు పాడుతు||

4. మాటల్లో దైవాన్ని నిలిపి, రాగంలో శివనాదం కలిపి
సాధన చేస్తుంటే.., మనమది పరవశమైపోతున్నదీ
పరవశమైపోతున్నదీ, ఆ....||ఆడుతు పాడుతు||

ఆడుతు పాడుతు పనిచేస్తుంటే; చిత్రం: తోడికోడళ్ళు (1957); సంగీతం: మాస్టర్ వేణు; గీతరచయిత: కొసరాజు; నేపధ్య గానం: ఘంటసాల, సుశీల  
Author photo Sri, Telugu , 15+ yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 840+ Foreign and local events/ places coverage, 2139 General Articles and views 2,064,686; 104 తత్వాలు (Tatvaalu) and views 236,348
Dt : 30-Aug-2023, Upd Dt : 30-Aug-2023, Category : Songs
Views : 242 ( + More Social Media views ), Id : 1897 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags : Aadutu , Paadutu , Parody , Thodi , Kodallu , ANR , Savitri , SVR , Jaggayya
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.

Share
ఆ టీవీ, ఈ టీవీ, మీ టీవీ, మా టీవీ, వాళ్ళ టీవీ పత్రిక - అన్ని టీవీ, పత్రిక వార్తలు వినోదం ఇక్కడే
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 11 yrs
No Ads or Spam, free Content