APLatestNews.com top Banner

Social Media links
పౌరులకు 5 ప్రశ్నలు? జవాబు విజ్ఞతకే - ప్రభుత్వ సోషల్ మీడియా - వైకాపా, బీజేపీ, జనసేన, తెదేపా - Request - లోకం తీరు/ News
           
     
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
1 నిమిష చదువు సమయం.

బాధ్యత గల పౌరులకు ప్రశ్న? జవాబు మీ విజ్ఞతకే. మీ జిల్లా లో కూడా ఇదే నిర్లక్ష్య బాధ్యతారహిత పరిస్థితి, ఉందేమో చూసుకోండి, మరి. అన్ని జిల్లాల సోషల్ మీడియా రిపోర్టు, మరలా త్వరలో పంపుతాము.

మనము గౌరవ కలెక్టర్ మరియు ఇతర జిల్లా స్ధాయి అధికారులు కు, జగనన్న పధకాల అమలు తీరు ను, తమ సొంత సోషల్ మీడియాలో వివరించమని, విన్నపాలు పంపాము వివిధ పద్ధతులలో అంటే వాట్సాప్, ఈమెయిలు ద్వారా, గత మే నెలలో పంపాము. ఒకవేళ కొత్త సోషల్ మీడియా వెబ్సైట్ లింకు, ఉంటే ఇవ్వమని ప్రాధేయపడ్డాము. link.

అలాగే మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, పార్టీ పెద్దలు, ప్రతిపక్షాలు కు కూడా విన్నపాలు పంపాము, వారైనా నచ్చ చెప్పి, ముందుకు నడిపిస్తారు, తమకు తమ జిల్లా అధికారుల దగ్గర, ఒకవేళ విలువ గౌరవం మర్యాద ఉంటే అని.

ఏ విధమైన జవాబు కూడా లేదు, వారికి ఇష్టం లేకపోతే, కనీసం జగనన్న ప్రభుత్వం ఉన్నంతకాలం, మేము మా సోషల్ మీడియా లో, ప్రజల కోసం, సమాచారం ఇవ్వమని, చెప్పినా చాలు కదా? ఇక మనమూ అడగము, వారిని ఇబ్బంది పెట్టము. అదే జవాబు రాసుకుంటాము, మన వెబ్సైట్ లో, ప్రజలకు మంత్రులకు జగనన్న కు తెలుపుతాము, ఫలానా జిల్లా కలెక్టర్ లేదా మంత్రి లేదా ఎంపీ లేదా ఎమ్మెల్యే గారు ఇలా చెప్పారు అని. ఓ సామాన్య విలేఖరి చేయగలిగింది, అంతే కదా?

ఇప్పుడు బాధ్యత గల పౌరులు గా మీరు చెప్పండి,

1. పైన చెప్పిన వారందరూ అంటే నాయకులు మరియు అధికారులు అవమానించింది, సంవత్సరం గా సోషల్ మీడియా లో చెప్పకుండా, లెక్క చేయనిది, ఓ సామాన్య విలేఖరి నా? తమ వృత్తి ధర్మం పదవి బాధ్యత నా? వేల జీతాలు సౌకర్యాలు ఇచ్చిన టాక్స్ కట్టిన ప్రజలనా?

లేదా, మన లక్షల ప్రజల ఆరాధ్య నాయకుడు, ప్రభుత్వ అధినేత జగనన్న నా? వీరికి ప్రజాస్వామ్యం, భారత ప్రభుత్వం పై, నమ్మకము విశ్వాసము మర్యాద గౌరవము ఉందా?

2. ఒకవేళ జిల్లా అధికారులు చిత్తశుద్ది తో పని చేస్తున్న, బాధ్యత గల చిత్తూరు విశాఖ కడప అనంతపురం జిల్లా స్ధాయి అధికారుల లాగా, మనం ఫేస్బుక్ లో ఎందుకు సమాచారం ఇవ్వము?

వారంత చదువు జీతాలు బాధ్యత ట్రైనింగ్, మనకు లేవా? అనంతపురం కలెక్టర్ గారు అనుకుంటా, జిల్లా అధికారులు అందరి చేతా, ఫేస్బుక్ ట్విట్టర్ పేజీలు పెట్టించారు. మనకు సొంతముగా తెలీనప్పుడు, తోటి సోదర జిల్లా కలెక్టర్ ల ను మరియు ఇతర జిల్లా అధికారులను, అడిగి తెలుసుకోమా?

3. జిల్లా మంత్రులు, బంధువులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, జగనన్న భిక్ష తో, ఆయన ఫోటోలు పెట్టుకుని గెలిచారు, పదవులు జీతాలు సౌకర్యాలు పొందారు. మరి జగనన్న కు సంవత్సరం గా, ఇంత అన్యాయం తన ప్రభుత్వంలో తన అధికారులతో జరుగుతూ ఉంటే, అధికారుల సోషల్ మీడియా సమాచారం లో నిర్లక్ష్యమును, గమ్ముగా చోద్యం చూస్తున్నారు అంటే, వీరిలో ఎవరి కైనా, జగనన్న అంటే కృతజ్ఞతలు, అభిమానం, విశ్వాసం, ప్రేమ ఉందా?

రేపు వేరే ప్రభుత్వం వస్తే, గబుక్కున గోడ దూకేది వీరు కాదా? ఈ ప్రశ్నలు అడగాల్సింది ఓ విలేఖరా లేక పదవులు అనుభవిస్తున్న కృతజ్ఞతలు ఉన్నవారా?

4. ప్రతిపక్షాలు బీజేపీ, జనసేన, తెదేపా, మన లేదా మీ జిల్లా ల లో కొన ఊపిరి తో ఆరిపోయే దీపాలు లాగా ఉన్నాయా? రాష్ట్ర రాజధాని లో ఏసీ లో కూర్చుని, 4 మాటలు ఫోటోలు, ఒక స్టేట్మెంట్ ఇస్తే చాలా? ఏకపక్షంగా 151 సీట్లు జగనన్న కు ఇచ్చారు ప్రజలు అంటే, గత ప్రభుత్వం మరియు ప్రతిపక్షాలు వేస్ట్ పనికిరారు, అని మొఖాన ఉమ్మినట్లు కాదా, సిగ్గు రాదా?

ప్రజల నమ్మకం ను మరలా పొందాలి అంటే, ఎంత కష్టపడి పనిచేయాలి? ఎంత దగ్గరగా, ప్రజలకు స్ధానికంగా ఉండాలి? నేరుగా కలెక్టర్ మరియు జిల్లా అధికారులు నుంచి, సోషల్ మీడియాలో సమాచారం పొందే భాగ్యం అదృష్టం, ఈ జిల్లా ప్రజలకు లేదా? దానిని అడిగి, తెచ్చే బాధ్యత మీది కాదా?

5. అన్నిటికన్నా ముఖ్యం మనము అంటే ప్రజలము, కన్నభూమి పై కృతజ్ఞతలు లేకుండా బాగు కోరకుండా, సినిమా సీరియల్స్ బిగిబాస్ ఐపీఎల్ చూసుకుంటూ, మత్తులో జోగుతూ ఉంటే, ఇక మన ఊరు జిల్లా రాష్ట్రం లో ఏం జరుగుతుంది, అని అడిగేది ఎవరు?

అడగాల్సింది పక్క ఊరు, పక్క జిల్లా, పక్క రాష్ట్రం, పక్క దేశం వారా? లేక మనమా? మనమంతా చైతన్యం తో, ఈ విన్నపాలు ను, మీ జిల్లా ప్రజలు, అధికారులు మరియు నాయకులు కు పంపితే, వారు మేల్కొని వెంటనే తమ బాధ్యత ను తాము చేయరా?  
Author photo Sri, Telugu , 10 yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 828 Foreign events/ places coverage, 800 General Articles, 46 Tatvaalu
Dt : 01-Oct-2020, Upd Dt : 01-Oct-2020, Category : Request
Views : 121 ( + More Social Media views ), Id : 730 , State : AP/ Telangana (Telugu) , Country : India
Tags : 5 questions , citizens , answer , wisdom , andhra , govt , collector , prakasam , social media , ysrcp , bjp , janasena , tdp , jagan
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
Share
అన్ని పత్రిక, టీవీ, సంక్షిప్త, రేడియో వార్తలు ఇక్కడే, అబ్బో అన్ని లింక్ లు గుర్తు వద్దు
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 8 yrs
No Ads or Spam, free Content