Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
1 min read time. నాయకుల ఫొటోలు లేకుండా, అమెరికా ప్రభుత్వం సహాయం ప్రజలకు, మరి మన దగ్గర ఎవరి జేబు డబ్బులు?
అమెరికా ప్రభుత్వం, కరోనా సహాయార్ధం, గతంలో అంటే ఈ సంవత్సరం ప్రధమార్ధంలో, తక్కువ సంపాదన ప్రజలకు, 1200 డాలర్లు చెక్ పంపించింది. ఎక్కడ కూడా ట్రంప్ కరోనా సహాయ పధకం అని ప్రభుత్వం రాయలేదు. రాయరు కూడా. ఇక మధ్యలో, నాయకుల ఫోజులు ఫోటోలు, నాటకాలు, తప్పెట్లు తాళాలు ఉండవు.
మీడియా మాత్రం రాస్తుంది పేపర్లో, ట్రంప్ కరోనా చెక్, ఒబామా కేర్ అని, ప్రజలకు తెలియడం కోసం అంతే. ప్రభుత్వం మాత్రం రాయదు. అది ప్రజలు టాక్స్ ల ధనం, వారి జేబులో ది కాదు, చైతన్య వంతులు అయిన జనం, కోర్టు లో కేసులు వేస్తారని భయం.
చెక్ మీద మాత్రం, ఎకానమీ దెబ్బ తిందని చెల్లింపు, అధ్యక్షుడు ట్రంప్ అని రాశారు అంతే, బాంకు లో జమ చేస్తారు కదా.
కొన్ని రాష్ట్రాలలో మెడికాల్ అని, మన ఆరోగ్యశ్రీ కన్నా, ఉత్తమ పధకాలు ఉన్నాయి. కానీ ఎక్కడ కూడా రాష్ట్ర నాయకుని పేరు, ఫోటోలు వాడరు. వాళ్ళ కు తెలుసు, తమ జేబులో ధనం కాదని, ప్రజలు విమర్శలు చేస్తారని, నీతి నిబద్ధత రాజ్యాంగం అంటే గౌరవం.
ఇవన్నీ సోనియా, మోడీ, కేసీఆర్, చంద్రన్న, జగనన్న, పవనన్న, వీరన్న గార్లు అందరికీ తెలుసు. చదువు కున్న పేపరు చదివే వారికి తెలుసు. కానీ ఒప్పుకోరు, పల్లెటూరు జనం కు చెప్పరు. అంటే పిచ్చి జనం, పిచ్చి ఓట్లు, మంచి తెలివైన నాయకులు. మన బతుకులు ఇంతే, అబద్ధాలు అవకాశవాదం అవసరం.
ఒకవేళ పేర్లు పెడితే ఇలా పెట్టాలి, ఉదాహరణకు.
* పీఎం, సీఎం, సొంత చేతి లేదా జేబు డబ్బు సున్నా.
* పుణ్యాత్ములైన టాక్స్ కట్టి న జన ధనం, కేంద్రం వాటా 40, మరియు రాష్ట్రం వాటా 20 శాతం.
* ప్రపంచ బాంకు అప్పు వాటా 40 శాతం, 2 రూపాయల వడ్డీ తో, పిచ్చి ప్రజల నెత్తిన.
* నేటితో మొత్తం వెర్రి జనం నెత్తిన, లక్ష కోట్లు 2 వేలు అప్పు, 2 రూపాయల వడ్డీ తో.
* భవిష్యత్తు లో పన్నులు పెంచుతాం, చచ్చినట్టు వెర్రి జనం కట్టాలి. మన పార్టీ కోసం, మన వెర్రి జనం కడతారులే.
ఇలా రాస్తే, తప్పు లేదు కదా, అది వాస్తవం. ఉచితంగా ఏ పధకాలు రావు. అంత ధైర్యం గా చెప్పే నాయకులు, అదృష్టం ప్రజలకు ఉందా?
Sri, Telugu , 15+ yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 840+ Foreign and local events/ places coverage, 2117 General Articles and views 1,878,099; 104 తత్వాలు (Tatvaalu) and views 225,960 Dt : 09-Oct-2020, Upd Dt : 09-Oct-2020, Category : Politics
Views : 833
( + More Social Media views ), Id : 746 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags :
leaders ,
photos ,
usa ,
govt ,
plans ,
helping ,
public ,
india ,
pocket money ,
modi ,
jagan ,
chandra babu ,
kcr Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది. కేసియార్, కేటీయార్ , బాబు , జగన్ , పవన్ కు చెందిన టీవీ, పత్రిక వార్తలు ఇక్కడే, ఒక చోటే చూడొచ్చు
Facebook Comments