మోదీ, యోగీ, పవన్, వీర్రాజు, బండి లాంటి వారిని తెలుగు రాష్ట్రాలలో ఎందుకు అధికారం లోకి రానీయం? - Politics - లోకం తీరు/ News
           
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. 2095 కధనాలు. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు. 2130 General Articles and views 1,937,234; 104 తత్వాలు (Tatvaalu) and views 230,574.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
1 min read time.

ఏవండీ మోదీ, యోగీ, పవన్, వీర్రాజు, బండి లాంటి వారి ని తెలుగు రాష్ట్రాలలో ఎందుకు అధికారం లోకి రానీయం? కొత్త వారిని రానీయకుండా, కుటుంబ వర్గ పాలన సాగించే మరియు, ప్రజల ధనం పధకాలు కు వాడుతూ, తమ సొంత వ్యాపారాలను ఉచితంగా పంచకుండా, సిగ్గు లజ్జ ఆత్మాభిమానం లేకుండా, తమ కుటుంబ సభ్యుల పేర్లు పెట్టుకుని, ప్రచారం చేసే వారినే, ఎందుకు తిరిగి తిరిగి ఎన్నుకుంటున్నాం? ఆఖరికి కొందరు చదువు కున్న ఎన్నారైలు లేదా పక్క రాష్ట్రంలో పనిచేసే చదువుకున్న మూర్ఖులు కూడా, సిగ్గు లేకుండా, అవే అబద్ధాలు ప్రచారం చేస్తున్నారు.

జవాబు, ఎక్కువమంది మన తెలుగు వారికి, మన తో కూడా కలిపి, ఊహాలు అవకాశవాదం బాధ్యత లేని తనం ఆర్భాటం ఎక్కువ, ఆత్మాభిమానం ముందు చూపు తక్కువ, నిజం నచ్చదు. ఇప్పుడు మనకు ఏదైనా లాభం వస్తుంది అంటే, లేదా మన వర్గం వాడైతే, ఎన్ని అబద్ధాలు పనులు కైనా వెనుకాడం.

బీజేపీ కి ఓటు వెయ్యవద్దు మన తెలుగు ఆత్మాభిమానం పోతుంది, అని అబద్ధాలు చెపుతారు, వాళ్ళు అందరూ ఢిల్లీ వెళ్లి, వంగి దండాలు పెడతారు. బీజేపీ మతతత్వ పార్టీ అంటారు, వీళ్లు మత పార్టీలు తో కలవడం లేదా ప్రచారం చేస్తారు. కుల పార్టీ అంటారు, వీరి కుల అధికారుల నాయకుల లిస్ట్ వారు, వారి లిస్ట్ వీరు పంపుతారు.

ఇంకా గెలవని పార్టీలకి, కుల నాయకులు అధికారులు వస్తారా? వీరికి కుల సంఘాలు లేవా, ఇండియా లో విదేశాలలో?

ఒకరికి ఇంకొకరికి కోవర్ట్ లు సప్పోర్ట్ లు అని, పాకేజ్ లు అందాయి అంటూ మానసిక డ్రామాలు మొదలు పెడుతారు, తాము చేస్తున్న పనులు ఇతరులకు అంటగడుతూ, ఎందుకంటే కొత్త వారు రాకూడదు.

అంటే మనం అందరం అబద్ధాలు చెపుతాం నమ్ముతాం ప్రచారం చేస్తాం, అందులోనే బతుకుతాం మరణిస్తాం.

పోనీ మోదీ సరిగ్గా చేయడం లేదా? మన నాయకులు ఎవరూ, లోపాలు ఎత్తి చూపరు, స్కాం లు ఉన్నాయని నిరూపించరు. ఒక వేళ గల్లీ లో అరచినా, డిల్లీ వెళ్ళగానే, మాట మార్చేస్తారు.

చూడండి, కరోనా తో నాయకులు, చంద్రన్న జగనన్న రాష్ట్ర అభివ్రుద్ది వైద్యం నమ్మలేక హైదరాబాద్ పోతుంటే, మనం చేసిన పాపం లో, మనమే ప్రభుత్వ ఆసుపత్రిలో, మన నాయకులు కోసం ప్రాణాలు పదవులు అధికారం ఐశ్వర్యం వదిలి, మన సొంత కుటుంబం కు ద్రోహం చేస్తూ, దిక్కు లేని చావు ఆనందం గా చస్తున్నాం.

అందుకే, నాయకులు ది ఎప్పుడూ తప్పు కాదు, వారు మనం ఎన్నుకున్న ఆణిముత్యాలు.

తెలుగు వాళ్ళ మంతా, మన సంస్కారం, ఆలోచన, అవకాశవాదం అవసరం బట్టి, మన అస్సెంబ్లీ, ఎంపీ, జిల్లా నాయకులు ఎలా ఉండాలి అనేది సమిష్టిగా నిర్ణయం చేసుకున్నాం అంటారు కొందరు.

రాక్షసులు కు రాజు, వీర శూర పెద్ద రాక్షసుడు మాత్రమే ఉండాలి కదా, మంచి వాడు ఉండకూడదు, బాధ్యత గలవారు మనకు నచ్చరు, చచ్చినా రానీయం. కొత్త వారి పని మనకు నచ్చకపోతే, మనమూ మార్చేయ వచ్చు 5 ఏళ్ళకు అందరికీ భయం ఉంటుంది, కానీ అవకాశం ఇవ్వము. ఎందుకంటే, మనకు కావల్సిన లక్షణాలు వారికి లేవు అని మనం ముందే, నిర్ణయం చేసేస్తాం.

లంక లోని వారు, రాముడు ను రాజుగా ఎప్పుడు అయినా ఒప్పకుంటారా, కలలో అయినా? అది రాముడు లోపమా , ప్రజల ఆలోచన సంస్కార లోపమా, వారికి శాపమా?

పక్క రాష్ట్ర తెలుగు వారు, నాయకులు అంటే, నేను కాపలా కుక్క లాగా ఉంటాను దళితుని ముఖ్యమంత్రి చేసి లాంటి బహిరంగ సత్యాలు చెప్పి, దేవాలయం లాంటి సచివాలయంలో కాకుండా ఫామ్ హౌస్ లో నుంచి ప్రభుత్వం నడపాలి, బయట జనాలకు ఉద్యోగాలు లేకపోయినా, తమ కుటుంబం లో అందరికీ ఏదో ఒక పదవి తప్పక ఉండాలి. ధనిక రాష్ట్రం, అప్పుల పాలు చేయాలి. ఇలాంటి ఎన్నో ఉత్తమ లక్షణాలు ఉన్న, వారిని వదిలి, ఇంకొకరు కు ఎందుకు అవకాశం ఇస్తారు? ఇవ్వరు, ఇవ్వకూడదు కదా.

ఇక మన రాష్ట్రం, మన నాయకులు కు ఒక హోదా ఉండాలి ఇలా - పక్కన రాష్ట్రంలో నివసించాలి, గనులు ఫాక్టరీలు వ్యాపారులు బినామీ లు ఉండాలి, కనీసం 10 కోట్లు తక్కువ ఆస్తి ఉండకూడదు వేలకోట్ల సంపద ఉంటే ఇంకా మంచిది, వెన్నపోటులో డిగ్రీ ఉండాలి, రాష్ట్రాన్ని అప్పుల్లో ముంచాలి, విదేశాల్లో ఆస్తులు ఉండాలి, రౌడీయిజం ఉండాలి, ఊళ్ళో ప్రజలకు దగ్గరగా ఉండకూడదు, ఇళ్ళు మీదకు తన్నడానికి వెళ్ళినప్పుడు వాళ్ళు ఇంట్లో లేకపోతే కేసులు పెట్టాలి, అధికారులను తిట్టినా తన్నినా ఎవరూ పట్టించుకోకూడదు, ఓ పది కేసులు అన్నా కోర్టు లో నడుస్తూ ఉండాలి, ప్రజల టాక్స్ లతో నడిపే పధకాలు కు తమ కుటుంబం పేర్లు పెట్టుకోవాలి, ప్రభుత్వ దేవాలయ భూములు అమ్మాలి, . . . ఇలా మనకు మనం కొన్ని అర్హతలు నిర్ణయం చేసుకున్నాం కదా, అందరము కలసి మన మనోభావాలకు తగ్గట్లు. ఈ అర్హతలు లేకుండా, మన నాయకులు గా, కొత్త వారిని అంగీకరించం.

కాబట్టి మన సంస్కార సాంప్రదాయ లక్షణాలు కు సరిపోయే ప్రభుత్వం ను నాయకులు ను, మన లో నుంచి, మనం స్వహస్తాలతో ఎన్నుకుని, మనలోని సంస్కార ఆణిముత్యం ఆశాజ్యోతి లాంటి నాయకులు ను, తప్పు పట్టడం, తప్పు నేరం పాపం.

కొత్త వారు వద్దే వద్దు, వారు వస్తే, మన గొయ్యి మనం తీసుకోలేము కదా, మన పతనం సంపూర్ణంగా జరగదు కదా.

ఇక ఎన్నారై అయినా బెంగుళూరు అయినా హైదరాబాద్ అయినా అంతరిక్షంలో అయినా, మన తెలుగు తేజమే కదా. మన లక్షణాల రక్తపు కణాల వాసన, నర నరాలలో ఉంటుంది. వారి బంధువులు స్నేహితులు ఊళ్ళోనే ఉంటారు కాబట్టి, కుల వర్గ సంఘాలు పెట్టుకుని, తమ వర్గాలు కు అండగా ఉండి ప్రచారం చేస్తూ, నెప్పి తెలీకుండా ఇంకా వేగంగా పతనం కావడానికి, కావలసిన నెయ్యి కట్టెలు అందించాలి కదా.

ఊళ్ళో ఉండి మనమంతా 6 అడుగులు గొయ్యి స్వయముగా తీసుకుంటుంటే, వారూ సహ్రుదయముతో ఒక చెయ్యి వెయ్యాలి కదా, సంపూర్ణ గొయ్యి కోసం, మరలా లెగవకుండా బయటకు రాకుండా.

మన కొత్త పిల్లల కు ఉద్యోగాలు రావాలి లేదా రాలేదని ఏడుపూ, మన పై నాయకులు మాత్రం, కొత్త కుటుంబాలు నుంచి రాకూడదు.

హతవిధీ మన తెలుగు జాతి ని, ఆ దేవుడు కూడా కాపాడలేడేమో, అని అందరూ అంటున్నారు, మరి మీరేమంటారో.  
Author photo Sri, Telugu , 15+ yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 840+ Foreign and local events/ places coverage, 2130 General Articles and views 1,937,234; 104 తత్వాలు (Tatvaalu) and views 230,574
Dt : 30-Dec-2020, Upd Dt : 30-Dec-2020, Category : Politics
Views : 899 ( + More Social Media views ), Id : 897 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags : elect , power , leaders , modi , yogi , pawan , veerraju , bandi , telugu , states
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.

Share
కేసియార్, కేటీయార్ , బాబు , జగన్ , పవన్ కు చెందిన టీవీ, పత్రిక వార్తలు ఇక్కడే, ఒక చోటే చూడొచ్చు
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 11 yrs
No Ads or Spam, free Content