దేశంలో ఉత్తమ రాష్ట్ర, నేటి నాయకులు ఎవరు? ఉత్తమ ప్రజా పౌరులు ఎవరు? - Politics - లోకం తీరు/ News
           
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. 2073 కధనాలు. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు. 2108 General Articles and views 1,864,102; 104 తత్వాలు (Tatvaalu) and views 224,750.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
2 min read time.

* దేశంలో నేటి ఉత్తమ నాయకులు ఎవరు?

ధైర్యంగా ప్రజల ముందు, మా సొంత వెరిటేజ్ వస్తువులు లేదా మనసాక్షి పేపరు ఉచితం గా చచ్చినా ఇవ్వము, ప్రజల అంటే ప్రభుత్వ ఆస్ధిని అమ్మి లేదా ప్రజల నెత్తిన అప్పు తెచ్చి మరియు ప్రజల పన్నులు పెంచి, మా అనుచరుల బానిసల కంపెనీల ఆస్తులు పెంచి,

మీలో కొంత మందికి, జీవిత శాశ్వత ఉపాధి కల్పించకుండానే, ప్రస్తుతం ఉచితంగా పంచుతాము, మా పేరు మా తండ్రి మామ పేరున, మిమ్మల్ని దాని మీదే జీవితాంతం ఆధారపడేటట్టు చేస్తాం, అని చెప్పే మన తెలుగు రాష్ట్ర నాయకులు కే ఈ ఉత్తమ అవార్డు. దేశంలో ఇంకెవరు ఈ స్ధాయిలో లేరు.

హేట్సాఫ్ టు దెమ్. నీతి నిజాయితీ అంటే అది, ధైర్యంగా ముందే చెపుతున్నారు. దాపరికం లేకుండా. ఏళ్లుగా, తరాలుగా.

* దేశంలో నేటి ఉత్తమ ప్రజలు పౌరులు ఎవరు?

మీరెన్నైనా అమ్మండి, తాకట్టు పెట్టండి, మా పేరున అప్పులు తెచ్చి, పప్పు కూడు తింటూ మాకు ఇంత పెట్టండి. వింగపూర్ కు ఎకరాలు రాసిచ్చిన పర్లేదు, ఒక ఏరియా మొత్తం ధారాధత్తం చేసినా పర్లేదు. ఒక విదేశాల్లో వ్యక్తి దగ్గర నుంచి, అప్పు అయినా పర్లేదు. సముద్ర తీరం మొత్తం, గల్ఫ్ కంపెనీకి రాసినా పర్లేదు.

డబ్బు పలుకుబడి మోసం దగా, మమ్మల్ని ఊరి అభివ్రుద్ది మరలా ఐదేళ్లు దాకా పట్టించుకోని, అవసరం అయితే నిర్లజ్జగా పార్టీ దూకే నాయకులు నే, ఎన్నుకుంటాం ఎన్ని తరాలైనా. బీదవాడు మంచివానికి చదువుకున్న వాడికి, డిపాజిట్ రానీయం.

మేము విదేశాల్లో, పక్కన రాష్ట్రాలలో కూడా రాలీలు నిర్వహిస్తాం, కుల వర్గ సంఘాలు పెట్టి, వీరికి అనుకూలంగా. పల్లెటూరు వాడు తెలీక జ్ఞానం లేక చేసినా, పట్టణం వాళ్ళం కూడా అమిత జ్ఞానంతో, కుల మత వర్గ అవకాశ అవసర వాదులు గా, మాత్రమే ఉంటాం.

మోదీ యోగీ లాంటి వ్యక్తులు, మాకు మా స్వభావం కు పడరు. కేజ్రీవాల్ లాగా కొత్త తరం ను, రానీయం. మీ మనవళ్లు మాత్రమే గెలవాలి గెలిపిస్తాం, మీరు మాత్రమే మమ్మల్ని మాయాలోకం లో ఓలలాడించగలరు, సాధ్యమైనంత ఎక్కువ అప్పులతో.

కానీ దయచేసి సీరియల్స్, సినిమాలు, జబర్దస్త, బతుకు జట్కా, బిగ్ బాస్ లాంటి, మహా కావ్యాలు మాకు దూరం చేయవద్దు.

పిల్లల కు రామాయణ భారత భగవద్గీత నేర్పటానికి సమయం లేదు చాలదు, మనలాగే మోహం లో ఉంచాలని, మన తప్పులు కు అడ్డు రాకూడదని, పాడుతాతీయగా ఢీజోడీ లేదా ఇంకో టీవీ ప్రోగ్రాం సాధనకు, ఫోన్ల లో కంప్యూటర్ లలో, పబ్జీ గేంలు టిక్ టాక్ లు ఇంకో గేం లు, ఆడుకునే సమయం మాత్రమే ఉంది,

అనే ముందు చూపుగల, ఉత్తమ బాధ్యత గల పౌరులు గా, ఎన్నికయ్యే అవార్డు కొట్టేసే అవకాశం, కేవలం మన తెలుగు ప్రజలకే ఉంది.

ఆఖరికి అమెరికా కోసం నిజాయితీ గా మంచి చేస్తున్న, రాజకీయ అవ లక్షణాలు నటనలు లేని, ట్రంప్ ని కూడా, ఓడించేందుకే ముందుకు వెళుతున్నాము మన స్వార్థ ప్రయోజనాల కోసం.

కాదంటామా మిత్రమా? తప్పు నాయకులు అధికారులు ది కానే కాదు, కేవలం ఆత్మాభిమాన మానవత్వం మంచితనం లేని ప్రజలమైన మనదే కదూ?

ఒప్పకోలేవు లే, పూర్తిగా మనల్ని, తాకట్టు పెట్టిందాక.

కౌరవులు కు అర్థం అయింది, చివర భారత యుద్ధంలో నే కదూ.

అందుకే, జై కరోనా గురవేనమః.  
Author photo Sri, Telugu , 15+ yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 840+ Foreign and local events/ places coverage, 2108 General Articles and views 1,864,102; 104 తత్వాలు (Tatvaalu) and views 224,750
Dt : 04-Nov-2020, Upd Dt : 04-Nov-2020, Category : Politics
Views : 679 ( + More Social Media views ), Id : 791 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags : best , state leader , country , public , citizens
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.

Share
NRI , అమెరికాలో లేదా విదేశం లో ఉంటారా, అయినా USA వార్తలూ ఇక్కడే
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 11 yrs
No Ads or Spam, free Content