మేము ఫోన్ కూడా చెయ్యం, ఇంటికి మేము ఎందుకు వస్తాము, మా పతన స్నేహిత సర్కిల్/ స్ధాయి లో మీరు లేరు? - General - లోకం తీరు/ News
           
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. 2085 కధనాలు. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు. 2120 General Articles and views 1,884,976; 104 తత్వాలు (Tatvaalu) and views 226,524.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
1 min read time.

*We don't even call, we don't respond to messages, why do we come to your house, why do we say good and bad of life? you are not in our fall friends circle/ stage?*

*మేము ఫోన్ కూడా చెయ్యం, సందేశాలకు స్పందించం, మీ ఇంటికి మేము ఎందుకు వస్తాము, మా క్షేమం ఎందుకు చెపుతాం? మా పతన స్నేహిత సర్కిల్/ స్ధాయి లో మీరు లేరు కదా?*

చూడండి రావణ, దుర్యోధన, శూర్పణక, కైక లాంటి, నిజం పలికే, స్వార్ధ రాక్షస గుణ, రజో తమో మిత్రులు తో, ఎప్పుడూ మనకు సమస్యలు, తగవులు, వాదనలు రావు. వారి మానసిక బలం/ బలహీనత గురించి, వారికి స్పష్టత ఉంటుంది, పతనం అని తెలిసినా. మనకన్నా ముందే వారే చెపుతారు అన్ని, ఇంక మనము, వారికి జ్ఞానం చెప్పేది ఏమీ ఉండదు. తాము సాత్వికులు గా మారాలని ఉంటుంది, కానీ ముందుకు సాగలేరు, ప్రపంచ మోహాలతో, ఒక అడుగు ముందుకు వేస్తే, 4 అడుగులు వెనక్కి, సుగుణాలలో.

ఓ మిత్రుడి ని ఏరా, ఎందుకు నెలకు పక్షంకు, ఒకసారైనా ఫోన్ చేయవు, సందేశం పెట్టవు, కష్ట సుఖాలు చెప్పవు, అంతా బాగున్నారా, ఏడాది కి వచ్చి కష్టం అంటే నమ్మే రోజులు లేవు ఇప్పుడు అంటే, ఎంత సరదాగా, సుగుణాలు ను ఒప్పుకుంటూ, మనకూ చురకలు వేస్తూ చెప్పారో చూడండి.

అందరము చక్కగా నవ్వుకుంటాము. సహాయం అందరము చేసుకుంటాము.

సమస్యలు అంతా, కపట నటన అబద్ధాలు చంచల స్వభావం, దాపరికం, 2 నాల్కల వారితోనే. పైకి ఉత్తములుగా నటిస్తారు, చిలక పలుకులు, పూజలు పునస్కారాలతో, కానీ తమ బలహీన ఆలోచనలు పనులు మాటలను ఆపుకోలేరు, బలహీనత ఒప్పుకోలేరు, అవమానం గా భావిస్తారు.

మా చావు మేము చస్తాం అని ముందు అన్నా, శిక్షణ వచ్చేసరికి రావణ, దుర్యోధనులు గా పారిపోతారు భయపడి, ఆ పాప ఫలితాలు తట్టుకోలేక. వీరికి ఒక తప్పుకు 100 రూపాయల పాపం అయితే, ఉన్నది ఉన్నట్లు గా చెప్పే వారికి, 75 రూపాయల పాపమే ఉంటుంది మిత్రమా. అందుకే కోర్ట్ లో కూడా, అప్రూవర్ కు విలువ ఇస్తారు. మనము రోజూ అప్రూవర్ గా ఉండాలి.

చెపితే వారికి కోపం, చెప్పకపోతే వారి పతనం, అయ్యో పాపం అనిపిస్తుంది, జరగబోయేది తలచుకుంటే, అది వారికి అర్ధం కాదు, ఇప్పుడు ఎక్కదు. మన బిడ్డలు, మందు తాగితే గమ్ముగా ఉంటామా, మంచి చెడు చెప్పమా? అలాగే ఇతరులు, మన పిల్లలు కాదా? భేదం ఎందుకు, మంచి చెప్పడానికి? రేపు మన పిల్లలు, మనుమలు దిగజారితే, చెడిపోయి తిరుగుతూ ఉంటే, ఎవరైనా మంచి చెపుతారా,? చెప్పడం వరకే మన బాధ్యత, వినకపోతే వారి ఖర్మ.

మనం ఉత్తములు కానక్కరలేదు, కానీ పైన చెప్పిన కపట నటన పతన ముసుగు దుర్గుణాలు లేకుండా ఉండాలి.

*1) హలో, మేము ఫోన్ కూడా చెయ్యం, సందేశాలకు స్పందించం, మీ ఇంటికి మేము ఎందుకు వస్తాము, మా పతన స్నేహిత సర్కిల్/ స్ధాయి లో మీరు లేరు కదా, ఎన్ని జన్మలు ఎత్తినా? కనీస అర్హతలు - కపటం, నాటకం, వర్గం, ప్రాంతం, 2 నాల్కల ధోరణి, అబద్ధాలు, అరిషడ్వర్గ అష్టవ్యసన బానిసత్వం, అవసరం అవకాశం, 2+ ఇళ్ళు, 2+ ఆదాయాలు కార్లు బంధాలు, 2+ లక్షల ఆదాయం మరియు అప్పు, గోఫండ్ ఆధారం, గుణ పెళ్ళి కాకూడదు వీసా అందం ధనం పదవి ఏదో ఒకదానికి అమ్ముడు పోయి ఉండాలి, వెన్నుపోటు గుండెపోటు ఉండాలి, క్రుతజ్ఞత విశ్వసనీయత ఉండకూడదు, పెద్దలకు పిల్లలకు తెలుగు రాయడం రాకూడదు, పిల్లలు పెద్దల మాట వినకూడదు, పిల్లలు పెద్దలు తమ స్నేహితుల/ బంధువుల లో కూడా ఇవే నియమాలు పాటించాలి, పిల్లల సంస్కారం చెప్పుకోవడానికి ఏమీ ఉండకూడదు, ముదుసలి తల్లి తండ్రుల అత్తా మామల వాసన వద్దు, పిల్లలు మనల్ని ముదుసలితనంలో ఇంట్లో దేవతలు గా ఉంచుకోకూడదు, ఆదాయం పోయినా రోగం వచ్చినా భాగస్వామి గౌరవముగా చూస్తారని నమ్మకం ఉండకూడదు, మందు/ కిట్టీ పార్టీలని భాగస్వామి పిల్లలకు దూరంగా ఉండాలి ఖర్చులు భరించాలి, ఒక్కో ఇల్లు ఆస్తి పెరిగే కొద్దీ, పాత వారిని మరచిపోవాలి, ముదుసలి అమ్మ నాన్న అత్త మామలను వదిలినట్లు.

ఇవేవీ మీకూ మాకు కుదరవు, మేము పతన సర్కిల్/ స్ధాయి తప్పి రాలేము, ఫోన్ చేయలేము, మన్నించాలి. సహనం, ఓర్పు, క్రుతజ్ఞత, విశ్వసనీయత, సమ సమాజం, ఒక మెట్టు దిగుదాం, అన్న మంచి ఆలోచనలు మా పిల్లల మది లోకి అసలు రాకూడదు.

రేపు మాకూ ఆదాయం పోయినా, రోగం వచ్చినా, భాగస్వామి విడిపోయినా లేదా గతించినా, మా సర్కిల్/ స్ధాయి లో నుంచి, మమ్మల్నే తీసేస్తారు/ బహిష్కరిస్తారు నిర్దయగా. కనీసం మొఖము కూడా చూడరు అని తెలిసినా, బలహీన మనసులతో ఈ గుంపు మోహాలలో పతనం చెందుతాము.

చాలా సరదా మనుషులు. ఇంకొన్ని ఉదాహరణలు చూడండి.

*2) ఇంకో మిత్రులు, అన్నా నువ్వు కరోనా సమయం లో, ఆల్కహాల్ తో చేతులు కడిగి ఉంటావు సిల్లీ గా, అంతకు మించి నువ్వు ఏమీ చేయలేవు. మేము ఏళ్ళుగా, కడుపులో నరాలనే, ఆల్కహాల్ తో కడుగుతున్నాము. రావణుడు పొట్టలో నరాలతో, సంగీతం పాడినట్లుగా/ పలికించినట్లుగా. కరోనా మమ్మల్ని, మా తాగుబోతు మిత్రులను, ఏమీ చేయదు. హోటెల్ తిండి, బయట గడ్డి మాని, ఆసుపత్రులకు అన్యాయం చేయము. నిత్య కలహాలతో, పొంతన లేని గుణ పెళ్ళిళ్ళతో, లాయర్లకు అలాగే అనాధాశ్రమాలకు చేతి నిండా పని కల్పిస్తాము.

*3) ఇంకో మిత్రులు, అరే పిల్లల పెళ్ళిళ్ళు చేశాను అప్పో సొప్పో చేసి, ముందే మొత్తం వివరంగా చెప్పాను వారితో, మన ముత్యాల గుణ గణాలు.

ఇంక రేపుటి నుంచి, ఆ భాగస్వామి కి, అత్తా మామల కు సంకురాత్రి పండుగే, నిత్యం సంబ్రమాశ్చర్యాలతో కళ్ళు చెమ్మగిల్లడం, అనేక నిద్ర తిండి లేని రాత్రులు పగళ్ళు, తెరిచే అవకాశం లేని నోరు మూతలు బడటం, వాళ్ళ దుంప తెగడం, టెన్షన్ తో బీపీ షుగర్ ఆసుపత్రి విజిటింగ్ పెరగడం అన్ని మామూలే.

ఇన్నాళ్ళు మన నెత్తిన ఉన్న కుంపటిని, వదిలించుకున్నాము, తగిన ఖర్చుతో. ఇక వారి నెత్తిన పెట్టుకొని ఊరేగుతాం అన్నారు, ఆనందముగా ధన మోహం లో పడి, ఇంక వాళ్ళ ఖర్మ. మిగతా సంబంధాలు, ఇంతకన్నా ఘోరం అంటా. మనమే బెటరు.

ముందే స్పష్టంగా మన పిల్లల లక్షణాలు చెప్పినా, మనం దాచిపెట్టుకున్న మనకు పాపం ఎందుకు, అని చెప్పినా. వెన్నుపోటు, గుండెపోటు కు ఓటేసే జనం, ఏం పర్లేదు అన్నారు రా. మనది తప్పు లేదు కదా, నీ మాటలే నాకు వేదం.

*4) ఇంకో మిత్రులు, అత్తా మామ ఇంటికి వస్తే, వాళ్ళకి, ఇంట్లో భాగస్వామికి, ఇత్తడి చిత్తడే అవుతుంది. నీతి నియమాలు లేని వారిని, ఇంటి చాయలకు కూడా రానీయద్దని, ఇద్దరము తీర్మానించుకున్నాము. ఎన్నో సార్లు చెప్పాము, కపట నటన 2 నాల్కల బుద్ది వద్దు అని చెప్పాము.

మీరు కూడా, మా అత్తా మామతో 10 ఏళ్ళుగా మారమని చెప్పారు, మిమ్మల్నే వారు సోది గంటలు గంటలు, మా ఇష్టం మాది, లోకమంత మా తప్పుడు దోవలోనే ఉంది, నీతి గా ఎవరూ లేరు, మాకు ధనం ఆశ్రమం తోడు ఉంది, డబ్బు విసిరితే కుక్కలా వచ్చి సేవ చేస్తారు గొంతు కోస్తారా అని, మాకు దేవుడు అండ ఉన్నారు అని నటించారు. ఇప్పుడు మా పంచన చేరడానికి వస్తారంట. పశువును అమ్మాక, పశువు దగ్గరకు ఎవరైనా వస్తారా? ఇన్నాళ్ళు దేశ సేవ చేసి, ఇప్పుడు మా ఎదాన పడటమా? ఆశ్రమం లోనే ఉండాలి కదా, వారి మాట ప్రకారం?

కానీ వారు, వారి బుద్ది మారడం లేదు, ముదుసలి వయసులో కాళ్ళు చేతులు కదలకపోతే, మీరు అమ్మను చూస్తున్నట్లు గా, ఒక విశ్వసనీయత క్రుతజ్ఞతలు గల మనిషి కావాలి అని, ఆ మూర్ఖులకు అర్ధం కావడం లేదు. వారికి లేని నీతి నియమాలు, మాకు ఎందుకు ఉండాలి అని వారి తపన?

*5) ఇంకో మిత్రులు, అన్నాయ్, వద్దు అనే కొద్ది, ఇంటికి తెచ్చి మరీ, అప్పు ఇచ్చి పోతున్నారు అడగకుండానే, మాకు వడ్డీలు కావాలని, మాకు ఫైనాన్స్ వ్యాపారం వ్రుద్ది చెందాలని. తీర్చేది లేదు చచ్చేది లేదు, వ్యాపారం లో నష్టం ఎటూ వస్తుంది, పెట్టుబడి వారిది, జాతర ఖర్చు మనది, అదే వారికి చెప్పి సాక్ష్యం చూపుతాము. మనము అబద్దాలు చెప్పము. జరిగినంతకాలం కింగ్ లము, జరగకపోతే బ్రంట్రోత్తులము. అప్పు చేసి పప్పు కూడు తినరా ఓ నరుడా, రోగ మొచ్చి మంచమెక్కితే కార్పొరేట్ ఆసుపత్రి ఉందిరా, మొత్తము ఊడ్చి మన కుటుంబాన్ని రోడ్ న వెయ్యడానికి. మా బలహీన బతుకులు ఇంతే, మా జీవహింస జంతు తిండ్లు అంతే.

ఇలా బంధువులు స్నేహితులు నవ్వుతూ, వాస్తవాలు అలవాట్లు చెప్పాలి, నవ్వు కోవాలి. కష్టం సుఖం పంచుకోవాలి. కపటం నాటకం 2 నాల్కల ధోరణి, గుండెపోటు వెన్నుపోటు లేని, సమాజం రావాలి. ఇందులో తప్పులు ఉన్నా కూడా, తమ గురించి తాము తెలుసుకున్నారు కాబట్టి, ఏదో ఒక రోజు దేవుని వైపు తిరుగుతారు, ఏదో ఒక జన్మలో.

* * *

*మేము ఫోన్ కూడా చెయ్యం, సందేశాలకు స్పందించం, మీ ఇంటికి మేము ఎందుకు వస్తాము, మా క్షేమం ఎందుకు చెపుతాం? మా పతన స్నేహిత సర్కిల్/ స్ధాయి లో మీరు లేరు కదా? - స్పందనలు, మార్పులు*

We don't even call, we don't respond to messages, why do we come to your house, why do we say good and bad of life? you are not in our fall friends circle/ stage - responses, changes?

1.1. ఏవండీ, మా పతన సర్కిల్ లో ఉన్న, అవలక్షణాలు అన్ని, చాలా చక్కగా అక్షరాలు గా తీర్చిదిద్దారు. నిజం గా ఒప్పుకుంటాము, ఓపికగా వరుసలో అంతా రాయడం, ఒక గొప్ప కళ, సరస్వతీ కటాక్షం ఉంది. మేము మా లక్షణాలే గొప్పగా అనుకుంటూ, ఇన్నాళ్ళు బ్రమలలో ఎంజాయ్ చేస్తున్నాము, ఇప్పుడు మీరు 2 వ కోణం వైపు చూపించారు, భవిష్యత్ బూతద్దములో చూపారు.

1.2. మా కమ్మునిటీ లో కొత్త గా ఇద్దరు చేరారు. మమ్మల్ని, మీ ముఠా/ గుంపు/ సమూహ కార్యక్రమాలకు పిలవడం లేదు అని, వారి బాధ. మా బాధేమో, ఆల్రేడీ మేము చెడిపోయాము బండబారిపోయాము, అవసర అవకాశవాదముతో, మీరు కూడా అనవసరముగా మా లక్షణాలు నేర్చుకుని, పతనము అవుతారు, కాబట్టి పిలవము ఏమీ అనుకోవద్దు. చంద్రన్న లాగా మేము పవన్ జీవితము తో ఆడుకోము, తెలుగు సంఘం లాగా ధనం ఇచ్చి మరీ సభ్యత్వం ఇవ్వలేము. మా గుంపులో కొత్త వారు వద్దు, అది మీ మంచి కోసమే, అన్నా కూడా, వారు ఇద్దరూ వినడం లేదు. మేము నలుగురితో నారాయణ, గొర్రెల మందల సభులమే, దయచేసి మాకు పతన భాగ్యం కలిగించండి, ఇక్కడ ఎవరూ మాట్లాడటం లేదు. బోరు తో చచ్చే బదులు, మీ గుంపులోనే చద్దాం అంటున్నారు.

1.3 మేము గ్రూప్ లో, పబ్లిక్ గా, మీరు ఎండగట్టినట్లు రాయలేము, అందరమూ మానసిక బలహీన దొంగలము కాబట్టి. ఇది చదివితే కళ్ళ నుండి నీళ్ళు వచ్చాయి, ఎంత పతన దిశలో ఉన్నామో కుసంస్కారముగా. ఇంక పిల్లలు మా మాట ఏమి వింటారు, ఇలా మా కుసంస్కారం లో బాధ్యత లేకుండా పెరిగితే, ప్రాపంచిక మోహాలతో వాస్తవానికి దూరముగా కలలో బతికితే? రామన్న రాజన్న శ్రీదేవమ్మ సావిత్రమ్మ కోడెలయ్య జయలలితమ్మ చెప్పిన, స్వయం పతనం చూసాక కూడా, మాకు బుద్ది రావడం లేదు.

1.4 ఆ కొత్త వారికి, ఈ లింక్ ఇస్తాను, మీరు మాలా, ఇలా పతనానికి రేడీ అంటే, మిమ్మల్ని పిలుస్తాము అని చెపుతాను. మీరు కొన్ని మర్చిపోయారు, అవి కూడా కలపండి. ధనం, అధికారం, సౌకర్యాలు చేతిలోకి వస్తే, మనుషులు బంధాలు లేని మ్రుగాలుగా ఎలా మారతారో, కుక్కల/ పందుల గోల గుంపులు గుంపులు గా చేరి ఎలా పతనం అవుతారో, మీ కధనం చాలా బాగా ఎండగట్టింది. తిట్టారా పొగిడారో అర్ధం కాకుండా భలే రాస్తున్నారు/ కడిగారు. కొత్తగా చెప్పినవి కూడా కలిపి, అందరికీ మరలా పంపండి. జంతులువు పిల్లలను కంటాయి, ఊరి మీద వదులుతాయి. ముదుసలి జంతువులకు యువ జంతువుల సేవ ఉండదు. సేం టు సేం, ఇప్పుడు మా గుంపు మొత్తము, ఇలాగే జంతు సంస్క్రుతిని ఎలుగెత్తి చాటుతున్నాము.

4.1 మీరు మా అత్తా మామలతో మాట్లాడి మంచి చెప్పారు, అది రాయలేదు. అదీ కలపండి. రాబోయే కాలములో, కపట నటన 2 నాల్కల అత్తలకు మామలకు ఏగతి పడుతుందో, తాము నీతి గా లేకుండా, కోడళ్ళను/ కూతుళ్ళను/ అల్లుళ్ళను/ కొడుకులను మాత్రమే నీతిగా ఉండాలి, మాకు సేవ చెయ్యాలి అని అనడం, ఎంత వరకు చెల్లు బాటు అవుతుందో, అందరికీ బుద్ది వచ్చేలా రాయండి. వారికి మంచి మాటలు సోది అయితే, మాకు వారి మాటలు సోది కాదా?

5.1 మా అప్పుల భాగోతం కూడా రాయండి. మావి రాయల్ అప్పులు, మేము ఎవరినీ అడగము. వారే మా దగ్గర కు వచ్చి, ఇచ్చి, పోగొట్టుకోవాలి. ఇంటికి వచ్చి మరీ ఇస్తారు. మరి వారి కోరిక తీర్చడం కూడా, మా తప్పేనా?  
Author photo Sri, Telugu , 15+ yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 840+ Foreign and local events/ places coverage, 2120 General Articles and views 1,884,976; 104 తత్వాలు (Tatvaalu) and views 226,524
Dt : 19-Feb-2024, Upd Dt : 19-Feb-2024, Category : General
Views : 204 ( + More Social Media views ), Id : 2027 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags : call , house , fall , circle , stage , friends
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.

Share
కేవలం ఒక మీడియా వార్త నే నమ్మలేము, ఒకే చోట అందరి వార్తలను ఇక్కడ చూసి, నిజాలు పోల్చుకోగలము
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 11 yrs
No Ads or Spam, free Content