భౌతిక పదవులు పొందడానికే ఇంత కష్టపడితే, మరి ఆధ్యాత్మిక మెట్లు అంటే, ఎంత సాధన చెయ్యాలి - Devotional - లోకం తీరు/ News
           
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. 2095 కధనాలు. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు. 2130 General Articles and views 1,965,650; 104 తత్వాలు (Tatvaalu) and views 231,397.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
1 min read time.

ఐఏఎస్ చదవందే కలెక్టర్, ఐపీఎస్ చదవందే ఎస్పీ కాలేము. గ్రూప్ పరీక్ష రాయందే, ప్రభుత్వ ఉద్యోగం రాదు. ఎలక్షన్ లో గెలవందే ఎమ్మెల్యే, ఎంపీ కాలేము.

ఇప్పుడు ఆ పదవి వచ్చినా, ఎన్ని రోజులు ఉంటుందో, అయినా తర్వాత టెర్మ్ లో వస్తుంది అనే గ్యారెంటీ లేదు. కాలం, అద్రృష్టం కలసి రానిదే, ఏదీ నమ్మకం లేదు. ఇవన్నీ ఎంత కష్టమో, ఎంత నిష్ట, ఎంత కృషి కావాలో అందరికీ తెలుసు.

మరి దేవ దేవుడు మాత్రం తేలికగా, టెంకాయ, పూలు, నైవేద్యం, పూజతో, నాలుగు మంత్రాలతో, క్షణం లో కనపడతారా, మన వేదన వింటారా లేక వినాలా? ఐఏఎస్ కష్టపడి చదవకుండా, 200 కొబ్బరికాయలు కొట్టి, 100 గుంజిల్లు తీస్తే, 50 యాగాలు చేస్తే, తిరుపతి మెట్లు ఎక్కితే, కలెక్టర్ పదవి వస్తుందా?

భౌతిక మైన పదవులు పొందడానికే ఇంత కష్టపడితే, మరి ఆధ్యాత్మిక మెట్లు ఎక్కాలి అంటే, ఎంతో సాధన చెయ్యాలి కదా.

అరిషడ్వర్గాలను జయించనిదే, పంచేద్రియాలను నిగ్రహించలేము అని ఎన్నో కధలలో చూసాము. ఎంత సాధన ఉంటే అరిషడ్వర్గాలను జయించగలము, ఆలోచన చేయండి. ఎన్ని పోగొట్టుకున్న తర్వాత, ఎంత త్యాగ బుద్ధి తో ఉంటే, అది సాధ్యపడుతుంది. కొందరికి, ఎన్నో జన్మలు పడుతుంది.

మరి ఇంద్రియ నిగ్రహం, ఇంకా కష్టం. అన్ని జయించిన వారు కూడా మరలా బోర్లా పడుతున్నారు. అంటే అది నిరంతరమైన సాధన. అన్ని జయించిన విశ్వామిత్రుడు కూడా, మొహములో పడ్డారు.

మరి రాజకీయాలలో, అధికారములో, హోదాల లో ఉండే వారికి, అరిషడ్వర్గాలను జయించడం చాలా కష్టము. ఇక సామాన్యులకు అది తేలికైనా, అటువైపు చూడరు ఇతర మొహాలలో చిక్కుకుని.

పంచ ఇంద్రియాలు ను జయించిన, వారే దేవుని కనుగొనగలరు, దేవుని గురించి మాట్లాడే హక్కు గలవారు. అప్పటి వరకూ, అంటే అన్ని జన్మల వరకు, ప్రాపంచిక విషయాలలో మునిగి తేలుతూ, ఈతి బాధలు పడుతూ, ఈ చిన్న చిన్న అశాశ్వత సుఖాలే, జీవిత పరమార్థం గా భ్రమలలో బతుకుతూ ఆనంద పడుతూ, ఈ బతుకు మరియు జన్మ చక్రములో పడి, కొట్టుమిట్టాడుతూ ఉంటాము అని పెద్దలు చెప్పారు.

సాధన చేయుము రా నరుడా సాధ్యము కానిది లేదురా.  
Author photo Sri, Telugu , 15+ yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 840+ Foreign and local events/ places coverage, 2130 General Articles and views 1,965,650; 104 తత్వాలు (Tatvaalu) and views 231,397
Dt : 31-May-2020, Upd Dt : 31-May-2020, Category : Devotional
Views : 1156 ( + More Social Media views ), Id : 570 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags : struggling , physical position , practice more , spiritual stairs position
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.

Share
NRI , అమెరికాలో లేదా విదేశం లో ఉంటారా, అయినా USA వార్తలూ ఇక్కడే
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 11 yrs
No Ads or Spam, free Content