వైద్యో నారాయణో హరి? శారీరక, మానసిక రోగం తో సంధానం, అరిషడ్వర్గ అష్టవ్యసన బానిసలకు అర్ధం కాదు? - General - లోకం తీరు/ News
           
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. 2085 కధనాలు. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు. 2120 General Articles and views 1,882,859; 104 తత్వాలు (Tatvaalu) and views 226,447.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
1 min read time.

Question - Vaidya Narayan Hari is not present today. The connection between physical illness and mental illness is meaningless to todays Arishadvarga Ashtavyasana addicts. You should explain with good examples.

*ప్రశ్న - వైద్యో నారాయణో హరి నేడు లేరు. శారీరక రోగం, మానసిక రోగం తో సంధానం అంటే, నేటి అరిషడ్వర్గ అష్టవ్యసన బానిసలకు అర్ధం కాదు. మీరే మంచి ఉదాహరణలతో వివరించాలి.*

*జవాబు* - వైద్యో నారాయణో హరి అన్న మాట కరెక్ట్, ఇది పాత రోజుల్లో. వైద్యుడు దేవునితో సమానం. అంటే అతనికి, పని యే ప్రత్యక్ష దైవ గా భావించి, దైవ ఉపాసనతో ఆనాడు ఆయుర్వేద వైద్యం చేసేవారు. అలాగే తన ఇతర అన్ని పనులు కూడా, వాక్సుద్ది చిత్తశుద్ది తో ఉండేవి, నిస్వార్ధముగా.

మరి నేడు, నీతి నియమం లేని డొనేషన్ల తో చదువులు, అది ఏ వ్రుత్తి అయినా, సమస్య ఉన్నవారు కష్ట నష్టాలను ఎదుర్కునే వారు, తమ ఆదాయానికి శాశ్వత మూల స్థంబాలు అనే దగ్గరకి వచ్చాము. వాళ్ళకి రోగం తగ్గితే, మనకు ఆదాయం ఆస్తి తగ్గిపోతుంది కదా.

పోనీ మామూలు మనుషులు మరియు రోగులు మాత్రము ఉత్తములా అంటే అదీ లేదు, అందరూ భోగులే, కోరికల వెంట పరుగులే, తిండితో పతనమయ్యే కక్కుర్తి పరులే, అప్పులతో సతమతమయ్యే ప్రాపంచిక మోహులే, అరిషడ్వర్గ అష్టవ్యసన దాసులే, మానసిక బలహీనులే. ఇంగ్లీష్ మందుకు కోటి అయినా ఖర్చుపెడతా, కానీ ఉచితమైనా ఆయుర్వేదం వద్దు అంటారు.

ఇంగ్లీషు మందు పెయిన్ కిల్లర్ తో నొప్పి తగ్గితే ఆ రోజుకు చాలు అని, అలాగే మగత కు నిద్ర మాత్రలు, మందు, మత్తు కూడా వదలడం లేదు, మానసిక బలహీనతతో.

అందుకే, ప్రతి ఒక్కరూ ఏ అనారోగ్య సమస్య వచ్చినా, అందరికీ స్పష్టముగా నిజము చెప్పాలి - నేను మందు తాగడం వలన, లివర్ పాడు అయ్యింది లేదా ఇంకోటి, ప్రజలను అప్రమత్తం చెయ్యాలి. ఇది దైవ పూజనే.

లేదంటే, దాపరికముతో, అది ఇంకో కొత్త పాపం మనకు. ప్రజలు వినకపోతే, మనకు ఎటూ నష్టం లేదు, కానీ మన వంతు బాధ్యత గా మంచైనా, చెడైనా నలుగురుకి తెలియాలి.

ఇంగ్లీష్ మందు కు గారెంటీ లేదు, జీవితాంతము వాడాలి తగ్గక పోయినా, అయినా ఎవరు దానికి రుజువు అడగరు, మన ఖర్మ ఇంతే అనుకుంటారు, ఎన్ని సైడ్ అఫ్ఫెక్ట్ లు ఉన్నా, మనిషి తగ్గిపోతున్నా, కనపడకుండా పోతున్నా, అవే వాడతారు. షుగర్, బీపీ బిళ్ళలు చూడండి, ఇన్సులిన్ ఇంజెక్షన్ లు చూడండి. వారు జీవితాంతము వేసుకోవాలి, బతికి ఉన్నంత వరకు. పుండు అంటే, పెద్దది కానీయండి, తేలికగా తీద్దాము అంటారు. ఇంకేదో తెరపీ తీసుకొండి కొన్ని ఏళ్ళు అంటారు, ఎక్కడా వ్యాధికి అంతము ఉండదు. కరోనా తో కోట్ల వ్యాపారం చేసారు.

అదే మనము 10 ఏళ్ళ దైవ ఉపాసనతో, 215+ వారాల 108 ప్రదక్షణలతో, లక్షల ఆదాయ ప్రభుత్వ ఉద్యోగం వదిలి, నిస్వార్ధ సజీవ గురువు సేవతో, సొంత ఆయుర్వేద వైద్యముతో, 78+ ఏళ్ళ అమ్మకు, వాడి, మ్రుత్యువు నుంచి బయటకు వచ్చి, ఇన్సులిన్ ఇంజెక్షన్ లకు పోకుండా, నిండు బిళ్ళ నుండి అర బిళ్ళకు వచ్చాము అంటే, ఉచితము మీరూ వాడండి రోజూ అంటే, అబ్బే మాకు చిలుము వదలనిదే, తల కు ఎక్కదు అంటున్నాము.

కానీ చిలుము వదిలే సరికి, మనిషి పోతే, తీసుకు రాగలమా? అబ్బే సంపాదన లేని మనిషి మనకెందుకు అంటారా? లేదు ఇదంత మోసము అని, మంచివారి మీదే చెడు చెప్పి, వంశ నాశనం పొందుతారా? మీ ఇష్టం.

ఒక్క మందుకే, ఏ రోగమైనా తగ్గదు. మానసిక బలం కూడా ఉండాలి. తన కష్ట నష్టాలు, నమ్మకము అయిన వారితో చెప్పాలి, ఊరట పొందాలి. ఇంగ్లీషు డాక్టర్ ఈ సోది అంతా, రోజు వింటారా? మిగతా రోగుల ఆస్తుల బదిలీ వద్దా? కార్పొరేట్ స్థాయికి ఎదగద్దా? మరి మానసిక బాధ ఎలా పొతుంది?

ఉదాహరణకు భాగస్వామి మాట వినడం లేదు, పిల్లలు లెక్క చేయడం లేదు, ఆస్తి లాక్కుంటారు, నన్ను హీనముగా చూసి అంతము చేస్తారు, ఆశ్రమములో వదిలి పెడతారు లాంటివి - ఈ బాధలు అనుమానాలు మనసులో గిలి బాధ ఉంటే, ఇంక ఏ మందు పని చేయదు.

వీటికి సరైన అనుభవము కలిగి, దైవ ఉపాసన ఉండి, ఆయుర్వేదం తెలిసి ఉండి, వారిని మనము నమ్మి, ఆహార అలవాట్లు నీతి నియమాలతో పాటిస్తే, మనసులో ఉన్న కల్మషాలు చెప్పుకుని వదిలేస్తే, గుండె భారం దింపుకుంటే, తన మానసిక వ్యధను చెప్పుకుని ఓదార్పు పొందితే, తనకు ఆ మందు వంటపడుతుంది.

ఇవన్నీ అందుబాటులో ఉంటే, ఏ రోగమైన కూడా, గుణం కనపడుతుంది. అంటే 1. మన ఆయుర్వేదం తగిన మోతాదులో తగిన సమయం లో తీసుకోవాలి 2. ఆహార నియమాలు నిబద్ధత ఉండాలి, బయట తింటా లేదా నీసు బిర్యానీ వేపుళ్లు ఉండకూడదు 3. మానసిక ప్రశాంతత ఉండాలి, అరిషడ్వర్గ అష్టవ్యసన బానిసత్వం వీడాలి, బాధ పంచుకోవడం, చేయి పట్టుకొని నడిపించడం, భుజం తట్టి ధైర్యము చెప్పేవారు, గౌరవముగా చూసేవారు, నిస్వార్ధ సేవ 5 ఏళ్ళ రుజువు ఉన్నవారు ఉండాలి.

ఈ మూడు అక్కడ ఉండవు, దొరకవు. కాబట్టి మాతో లేదా మాకు దగ్గరలో ఉండాలి.

శారీరక రోగం, మానసిక రోగం తో సంధానం అంటే, నేటి అరిషడ్వర్గ అష్టవ్యసన బానిసలకు అర్ధం కాదు. అర్ధం చేసుకోవాలి, మానసిక నియంత్రన ఉండాలి, అది మనకు లేనప్పుడు, ఆత్మ బలం దైవ ఉపాసన గల వారి మాట తూచ తప్పకుండా వినాలి. లేదంటే, అర్ధాంతరముగా ఆయువు వీడితే, అదీ మన తప్పిదము వలన, మనము వచ్చే జన్మలో ఇంకా ఎక్కువ నరకాలు కష్టాలు కన్నీళ్ళు అనుభవించాలి.

రామన్న, రాజన్న, సావిత్రమ్మ, జయలలితమ్మ, కోడెలయ్య, శ్రీదేవమ్మ‌‌‌, కాఫీడేఅయ్య, మాల్య, మీ ఇంట్లో మా ఇంట్లో లాంటి మహానుభావుల చివరి పేజీలు చదవండి.  
Author photo Sri, Telugu , 15+ yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 840+ Foreign and local events/ places coverage, 2120 General Articles and views 1,882,859; 104 తత్వాలు (Tatvaalu) and views 226,447
Dt : 04-Dec-2023, Upd Dt : 04-Dec-2023, Category : General
Views : 151 ( + More Social Media views ), Id : 1957 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags : Vaidya , Narayan , Hari , connection , physical , mental , illness , Arishadvarga , Ashtavyasana , addicts
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.

Share
కేసియార్, కేటీయార్ , బాబు , జగన్ , పవన్ కు చెందిన టీవీ, పత్రిక వార్తలు ఇక్కడే, ఒక చోటే చూడొచ్చు
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 11 yrs
No Ads or Spam, free Content