పాటతో పరమార్ధం - వగపే తగునా తల్లీ విధియే రాసిన వింత రాతకు - జై సంతోషి మాత - కనన్ కౌశల్, ఆశిష్ కుమార్ - Songs - లోకం తీరు/ News
           
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. 2078 కధనాలు. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు. 2113 General Articles and views 1,871,276; 104 తత్వాలు (Tatvaalu) and views 225,373.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
చివరలో ఉన్న చిత్రం/ వీడియో/ ఆడియో మరువద్దు. 1 min read time.

Song Spirit - Vagape taguna talli, vidhiye rasina vinta rataku - Jai Santhoshi Maa - Kanan Kaushal, Ashish Kumar, Anita Guha, Bharat Bhushan, Rajani Bala

मत रो मत रो आज राधिके (Mat Ro Mat Ro Aaj Radhike) - जय संतोषी माता - कानन कौशल, आशीष कुमार, अनिता गुहा, भारत भूषण, रजनी बाला

Living beings are trapped in worldly delusion without thinking before and after. Some people are innocent and get caught in the illusion. If they have chittaSuddi vaaksuddi, they will be happy away from all these.

జీవులు ముందు వెనుకా ఆలోచన చెయ్యక ప్రాపంచిక మాయలో చిక్కుని, విలవిలలాడుతుంటాయి. ఇంకొంత మంది అమాయకముగా, మాయలో చిక్కు కుంటారు. చిత్తశుద్ది వాక్సుద్ది ఉంటే, వీటన్నిటికీ దూరంగా సంతోషముగా ఉంటారు.

Right or wrong, when the results start, if they cannot cope with their pain at home, or if they are crying tears of distress when a trusted child/ partner goes away, then as human beings, we should comfort them. They should be given mental courage. Such is this song. See how well they gave dare.

సరే తప్పో ఒప్పో, ఫలితాలు మొదలు అయ్యాక, ఇంట్లో వారి బాధను తట్టుకోలేకపోతే, లేదా నమ్ముకున్న బిడ్డ/ భాగస్వామి దూరమైతే కలిగే కష్టాలు కన్నీరుతో విలపిస్తూ ఉంటే, మానవత్వం ఉన్న వారిగా, మనము ఓదార్చాలి. వారికి మానసిక ధైర్యం కలిగించాలి. అలాంటిదే ఈ పాట. ఎంత చక్కగా ధైర్యం చెప్పారో చూడండి.

While the song seems to comfort women, the same courage applies to men. Why is the mother/father sad for the strange writing written by God/ fate? Why is the sad sister/ brother? Let's walk bravely, this time will change again, take away our grief.

పాట ఆడవారిని ఓదారుస్తున్నట్లు ఉన్నా, మగవారికి కూడా అదే ధైర్యం వర్తిస్తుంది. విధియే రాసిన వింత రాతకు, విషాదమెందుకు తల్లి/ తండ్రి? విచారమేలనే చెల్లి/ తంబి? ధైర్యముగా పయనించాలి, ఈ కాలం మారును మళ్ళి, మన శోకం తీరును చెల్లి/ తంబి.

Karuna, Mamata, filled solids, our gentle beings (Sattvic Soul). If those eyes burn with grief, then produce fire particles by divine results. Even if this gentle creature feels pain, Trilok will be swayed. Therefore, do not hurt or bind anyone. Those who appreciate our virtues/ Guna, no matter how much we scold, they will feel good for us, do not leave us. Those who cherish the passions, keep running after same passions, abandoning all others.

కరుణా, మమతా, నిండిన ఘనులు, మన సాత్విక జీవులు. ఆ కనులే శోకాన రగిలితే, కురియును అగ్నికణాలు, దైవ ఫలితాలు చే. ఈ సాత్విక జీవి గానీ అలిగిందంటే, ఊగును ముల్లోకాలు. అందుకే, ఎవరినీ బాధపెట్టవద్దు, బంధించవద్దు. మన సుగుణాలను మెచ్చే వారు, ఎన్ని అన్నా మన మంచికే అని, మనల్ని విడిచి పోరు. అదే మోహాలను మెచ్చే వారు, మోహాల వెంట పరుగులు తీస్తూనే ఉంటారు, అందరినీ వదలి.

In our heart, always shining, the flame of adventurous life. Like a rock that doesn't move despite hardships and pleasures. It is only through suffering that the reputation of steadfast sattvic is gained.

మన హ్రుదయములో, సదా వెలగనీ, సాహస జీవన జ్యోతి. కష్టసుఖాలకు చెలించకండి, కదలని పెను శిల రీతి. బాధలలోనే పొందాలీ, ఆ స్తిర సాత్వికులు అనే ఖ్యాతి.

Jaganmata is the one who avoids all the dangers. We will get happiness at last by the God. Even if the whole world against to us, but the victory will be ours.

ఆపదలన్నీ నివారించులే ఆ జగన్మాత. ఆనందాలే ప్రసాదించులే, ఆఖరికైనా విధాతా. ప్రపంచమంతా మనకెదురైనా, విజయము మనదే కాదా.

* * *
వగపే.. తగునా...తల్లీ...
విధియే రాసిన వింత రాతకు, విషాదమెందుకు తల్లి, విచారమేలనే చెల్లి
ధైర్యముగా పయనించాలి, ఈ కాలం మారును మళ్ళి, నీ శోకం తీరును చెల్లి ||వగపే||

కరుణా మమతా, నిండిన ఘనులు, భారత నారీ కనులు 2
ఆ కనులే, శోకాన రగిలితే, కురియును అగ్నికణాలు 2
ఇల్లాలు గానీ అలిగిందంటే.., ఊగును ముల్లోకాలు..
ధైర్యముగా 2 పయనించాలి, ఈ కాలం మారును మళ్ళి, నీ శోకం తీరును చెల్లి ||వగపే||

నీ హ్రుదయములో, సదా వెలగనీ, సాహస జీవన జ్యోతి..2
కష్టసుఖాలకు చెలించకమ్మా, కదలని పెను శిల రీతి..
బాధలలోనే పొందాలమ్మా.., ఆ ఇల్లాలి వనే ఖ్యాతి.
ధైర్యముగా 2 పయనించాలి, ఈ కాలం మారును మళ్ళి, నీ శోకం తీరును చెల్లి ||వగపే||

ఆపదలన్నీ నివారించులే, [ఆ సంతోషి మాతా]..2
ఆనందాలే ప్రసాదించులే, [ఆఖరికైనా విధాతా]..2
ప్రపంచమంతా నీకెదురైనా.., విజయము నీదె కాదా.
ధైర్యముగా 2 పయనించాలి, ఈ కాలం మారును మళ్ళి, నీ శోకం తీరును చెల్లి ||వగపే||  
Author photo Sri, Telugu , 15+ yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 840+ Foreign and local events/ places coverage, 2113 General Articles and views 1,871,276; 104 తత్వాలు (Tatvaalu) and views 225,373
Dt : 27-Feb-2024, Upd Dt : 27-Feb-2024, Category : Songs
Views : 88 ( + More Social Media views ), Id : 2038 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags : Vegape , Thaguna , Vagape , taguna , vidhiye , rasina , Jai , Santhoshi , Maa , mata , Santoshi , Kanan , Kaushal , Ashish , Kumar , Anita , Guha , Bharat , Bhushan , Rajani , Bala
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.

Share
కేవలం ఒక మీడియా వార్త నే నమ్మలేము, ఒకే చోట అందరి వార్తలను ఇక్కడ చూసి, నిజాలు పోల్చుకోగలము
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 11 yrs
No Ads or Spam, free Content