Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
1 min read time. వదినా ఈ మాటలు విన్నారా? ఎవరో 5 ఏళ్లుగా శనివారం ఉదయం 8 కి నేతి దీపం శని శివయ్య కు, శ్రీరామ 5 లక్షలు రామకోటి, 3 ఏళ్లుగా రోజూ తులసి దీపం, 20 ఏళ్ళ నేల నిద్ర తోపాటు నీసు లేదంట, 15 వారాలు గా ఉదయం 10 లోపు గుడి 108 ప్రదక్షిణలు చేస్తున్నారు అంట ఖాళీ కడుపు మరియు పాదము తో. మనము మామూలు గా చేసే పూజలు వ్రతాలు తో పాటుగా. ఒంటి మీద వీసమెత్తు బంగారము ఉండదంట.
ఊరుకో వదినా, ఈ కాలంలో అలాంటి పిచ్చి వాళ్ళు ఎక్కడ ఉన్నారు. మనకు ఇరుగుపొరుగు గొడవలు, సీరియల్స్, ఉద్యోగాలు, షాపింగ్, ఇంట్లో వాళ్ళ ను చావ గొట్టి చెవులు మూయటానికే సమయం లేదు. అవి అన్ని, మామూలు మనషులకే గానీ, మనకు గాదు లే వదినా.
వాళ్లు బీదవాళ్ళు అయి ఉండి, పీకల్లోతు అప్పుల్లో ఉండి, పది మంది సంతానం ఉండి, అష్ట కష్టాలు లో ఉండి, దిక్కుతోచని స్ధితిలో, అలా చేస్తున్నారు ఏమో వదినా కనుక్కో, ఎవరో ఏ ఊరో, వాళ్లు పాపం. కాకినాడా వారిది, బ్రాహ్మలా?
ఇంకోటి, నువ్వు అస్తమానం భక్తి టీవీల్లో లేదా బయట చాగంటి, గరికపాటి, సామవేదం లాంటి గురువు ల మంచి మాటలు అసలు వినకు వదినా. ఇలాంటి పాడు బుద్దు లే పుడతాయి.
భౌతిక విషయాల చుట్టూ తిరుగుతూ ఉంటే రూపాయీ వస్తుంది కానీ, దేవుడు చుట్టూ తిరిగితే ఏమి వస్తుంది, కాళ్ళు నొప్పులు, నెయ్యి ఖర్చు తప్ప. హయిగా బిగ్ బాస్ చూడు, బతుకు జట్కా చూడు, ఎన్ని తగువులో, ఎంత సమయం వ్రుధా చెయ్యచ్చో కదా. ఒంటి మీద 3 ఉంగరాలు, 4 దండలు లేకుండా బయటకు వెళతామా మనమూ?
అదేమిటి వదినా అలా అంటావు, మంచి చెయ్యమంటే, ఎవరన్నా చేస్తున్నారా ఈ రోజుల్లో అంటావు. చేస్తున్నారూ అంటే, వారికి పని లేదు అంటావు. నా కొడుకు అల్లుడు లావు పెరిగి, బద్దకముతో దేనికి పనికి రాకుండా, డాక్టర్ దగ్గరకి మరియు జిం కు తిరిగే బదులు, ఇది మంచి పద్దతి కదా.
పూజ అంటే, తూతూ మంత్రము గా చేసి, నైవెద్యము తినడము కాదు. కష్టము ఉంటేనే, మనసు వంగుతుంది. మనసును అదుపులో ఉంచాలి అంటే, కఠిన నియమాలు తప్పవు.
అదీగాక, నేను అన్ని కనుకున్నా వదినా, మన ఊళ్ళు లో ఎవరికి అంత ఓపిక తీరికా ఉంది. ఏది చేసినా పశ్చిమం వాళ్ళే చేయాలి. వాళ్ళు అమెరికా లో ఉంటారంట, బ్రాహ్మణేతరులు అంట. అందరు వదిలేసిన అనాధలు అంట. ఏ బంధాలు, బాదరా బందీ లేదంటా. అన్ని బాగానే ఉన్నాయి అంట. ఆమెకు పెద్ద వయసు కూడా అంట.
మరి కమ్మగా తిని కూర్చోక, ఈ పిచ్చి పనులు ఏమిటి వదినా. మరి, వాళ్ళే ఇంత కష్టం నియమాలు, ఇన్ని వారాలు ఏళ్ళు చేస్తే, మరి మన సంగతి ఏమిటి? మరి మన పిల్లలు ఎదగాలి, చదవాలి , సంపాదించాలి , గొప్పవారు కావాలి, పెళ్ళిళ్ళు, కాపురాలు, కానుపులు, మన ముదుసలి తనం.
వామ్మో, వణుకు వస్తుంది. మనకున్న బంధాలు, అత్త ఆడబిడ్డ కోడలి అరుపులు, చదువు ఇంటి అప్పులు, అన్ని వైపులా గొడవలు ఉన్న మనమెంత కష్ట నియమాలు చెయ్యాలి వదినా?
వామ్మో, శని దశ వచ్చే ముందే మనమూ మొదలు పెడితేనే బాగుంటుంది ఏమో. జీవితం కష్టాలు ను, దేవుడు తప్ప ఎవరూ కాపాడలేరు. తీర్చక పోయినా, మానసిక బలం ఇవ్వలి అంటే తప్పదు. లేకపోతె, ఫానో నుయ్యో చూసుకోవాలి కష్టాలు తట్టుకోలేక. స్వార్ధముతో కష్టాలు వచ్చిన తర్వాత వెళితే, ప్రయోజనం శూన్యం.
Sri, Telugu , 15+ yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 840+ Foreign and local events/ places coverage, 2115 General Articles and views 1,873,503; 104 తత్వాలు (Tatvaalu) and views 225,606 Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది. అన్నీ వార్తలే, నాకు నచ్చిన వార్తా వీడియో లు కొన్ని ఎంచుకోని, పని చేస్తూ ఇక్కడే వినొచ్చు చూడొచ్చు
Facebook Comments