జగనన్న చాణక్యం తో తాడిపత్రి చైర్మన్ జేసీ నే, ఫేస్బుక్ లో గెలుపు ని అభినందించని చంద్రన్న - Politics - లోకం తీరు/ News
           
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. 1629 కధనాలు. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు. 1664 General Articles, 64 Tatvaalu.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
* 77 ఏళ్ల వయసు నవ యువకుడైన
* సేవ్ తాడిపత్రి నినాదంతో
* జగనన్న సహకారము చాణక్యం
* పార్టీలు మారిన తెదేపా నాయక ద్రోహులు
* మందితో ఇంటి మీదకు పోయి, పెద్దారెడ్డి
* జేసీ సోదరులను పొగుడుతూ, ఒక్క పోస్ట్ అధికార
* జేసీ సోదరులు గతంలో తప్పులు చేసినా
చివరలో ఉన్న చిత్రం/ వీడియో/ ఆడియో మరువద్దు. 2 min read time.

రాష్ట్రంలో తెదేపా తరపున, ప్రాణాలు ఒడ్డి నిలిచిన ఒకే ఒక మొనగాడు, కేసులతో అరెస్టు లు చేసి జిల్లా అంతా తిప్పినా, కరోనా కు భయపడకుండా పుట్టిన జిల్లా లోనే ఉండి తిరిగి, అధికార వైసీపీ తో 2 ఏళ్లుగా పోరాడి గెలిచి,

రతనాల రాయలసీమ నేల పై పులి బిడ్డ లో, కడుపు లో కపటం కుట్ర లేకుండా, తప్పో ఒప్పో గట్టిగా గళం విప్పి మాట్లాడే నాయకుడు, అనంతపురం పౌరుషం గల బిడ్డ,

77 ఏళ్ల వయసు లో కూడా నవ యువకుడైన, జేసీ ప్రభాకర్ (దివాకర్) తాడిపత్రి గడ్డ పై, మున్సిపల్ ఛైర్మన్ గా విజయ పతాకం ఎగురవేసారు.

సేవ్ తాడిపత్రి నినాదంతో, అందరినీ కలుపు కు పోతాను అని, మార్పు ను స్పష్టం గా చెప్పారు. తనకు సహకరించిన జగనన్న కు ధన్యవాదాలు తెలిపారు. జగనన్న సహకారము లేనిదే గెలుపు కష్టమని ఒప్పుకున్నారు. తాడిపత్రి అభివ్రుద్ది కోసం, ఎమ్మెల్యే, ఎంపీ తో కలసి పనిచేస్తాం అన్నారు.

ప్రజల కోసం, తాను జగనన్న తో కలసినా ఇప్పుడు, ధర్మం ప్రకారం తప్పు కాదు. 2 ఏళ్ళు మనస్ఫూర్తిగా పోరాడి, నమ్మిన తెదేపా ను గెలిపించి, ఇప్పుడు తాను పరిస్థితి కి తలవొగ్గి, వ్యక్తిగతంగా తలవంచినా, తప్పు లేదని శాస్త్రం చెపుతుంది. ఆత్మ రక్షణ, తన ప్రజల రక్షణ బాగు కోసం, పోరాడి మొనగాడు గా నిరూపించుకున్న తర్వాత, పార్టీ గోడ దూకినా ధర్మ మే.

ఇన్నాళ్లు తెదేపా అధికారంలో పదవులు సౌకర్యాలు అనుభవించి, కేవలం తమ స్వార్థ వ్యాపారం గనులు ఆదాయం కుటుంబం వారసుల కోసం, పోరాడకుండా, దద్దమ్మలు గా పిరికి పందలు లా విశ్వాస ఘాతకులుగా నీతి నిజాయితీ లేని వారు గా, ఇంట్లో లేదా బయట రాష్ట్రంలో దాంకుని, లేదా భయపడి మొదటి సంవత్సరమే, వ్యక్తిత్వం ఆత్మాభిమానం చంపుకుని, పరుగులతో పార్టీలు మారిన తెదేపా నాయక ద్రోహులు, ఫలితం అనుభవిస్తారు. భవిష్యత్తు లో, వారి వారసుల పై ఆ మచ్చ మరక పడుతుంది కదా, అని విజ్ఞులు భావిస్తున్నారు.

చాణక్యం అంటే చంద్రన్న పేరు ఎందుకంటారో, వారి పత్రికలకు కూడా తెలీదు. కుటిలత్వంతో గెలుపు ఏనాడు, చాణక్యం కాదు. శకుని పన్నాగాలను చాణక్యం అనరు. మంచి చాణక్యం అంటే, ఇక్కడ జగనన్న నడిపింది చాణక్యం, తాను గెలిచి, జేసీ ని ఛైర్మెన్ గా గెలిపించారు. కుటిల మనసు తో, ఎక్స్ అఫిషియో ఓట్లు ను వాడలేదు, మెంబర్ల ను కొనలేదు, మార్చలేదు. ఎటువంటి అరుపులు గొడవలు పరుగులు లేవు. ఇద్దరు కూ లాభం.

మందితో ఇంటి మీదకు పోయి, పరువు నైతికత వదులుకున్న, పెద్దారెడ్డి ఈ జేసీ గెలుపు తో అన్నా మనసు మారి, మంచి పనులతో ప్రజల మనసు గెలిచి, తర్వాత ఎన్నికల్లో ఎమ్మెల్యే పదవి నిలబెట్టుకోవాలని, ఆయన అభిమానులు ఆశిస్తున్నారు.

చిత్రం ఏమిటి అంటే, ఇంత విజయం సాధించి, పార్టీ పేరు నిలబెడితే, మొన్న ఫలితాలు లో, జేసీ సోదరులను పొగుడుతూ, ఒక్క పోస్ట్ కూడా తెదేపా అధికార, చంద్రన్న, లోకన్న ఫేస్బుక్ లో కనపడలేదు, 14 వ తేదీ నుంచి నిన్నటి వరకూ. ఒకవేళ ఉంటే మీరు లింక్ పంపగలరు. సాధారణముగా లీడర్ల పుట్టిన రోజు, గెలుపు విజయాలు, ఫోటోలు పెట్టి అభినందనలు తెలుపుతారు కదా.

అంటే, ఇంకో వర్గం అని పొగడమా లేదా 77 ఏళ్ల యువకుడు అనంత లోనే కరోనా కు ఎదురొడ్డి ఉన్నారని పొగడమా లేక ఒక్క తెదేపా గెలిచిన మున్సిపాలిటి అని పొగడమా, దేనికి పొగడలేదు ఇన్నిరోజులుగా?

ఇదేనా కష్టపడే నాయకులు కు చంద్రన్న ఇచ్చే భరోసా, చేయూత, అండ? మరి మనం పొగడనప్పుడు, అండ గా ఉండనప్పుడు, కలుపుకుని పోనప్పుడు కూడా, ఇతరుల తో తిరగవద్దా కలవవద్దా అని, చంద్రన్న మరియు జేసీ అభిమానులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

జేసీ సోదరులు గతంలో తప్పులు చేసినా, ఇప్పుడు జైలు చుట్టూ తిరిగి, అవమానాలు ఫలితాలు పొందారు కాబట్టి, ఇకనుంచి అయినా, గొడవలు అరుపులు జోలికి పోకుండా, తాడిపత్రి అభివృద్ధి మీద దృష్టి పెట్టి, తనయులకు ఆదర్శంగా మార్గం చూపి, ప్రజలకు అండగా ఉండాలి అని, అభిమానులు కోరుతున్నారు.  

Author photo Sri, Telugu , 10 yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 828 Foreign events/ places coverage, 1664 General Articles, 64 Tatvaalu
Dt : 18-Mar-2021, Upd Dt : 18-Mar-2021, Category : Politics
Views : 575 ( + More Social Media views ), Id : 1041 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags : tadipatri , chairman , jc , prabhakar , jagan , chanakyam , chandranna , victory wish , congrats , social media , facebook
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.

Share
కేసియార్, కేటీయార్ , బాబు , జగన్ , పవన్ కు చెందిన టీవీ, పత్రిక వార్తలు ఇక్కడే, ఒక చోటే చూడొచ్చు
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 10 yrs
No Ads or Spam, free Content