పాటతో పరమార్ధం - శ్రీరామ లేరా ఓ రామా - శ్రీరామ రాజ్యం - బాలకృష్ణ, నయనతార, ANR, శ్రీకాంత్ - Songs - లోకం తీరు/ News
           
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. 2085 కధనాలు. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు. 2120 General Articles and views 1,881,923; 104 తత్వాలు (Tatvaalu) and views 226,362.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
చివరలో ఉన్న చిత్రం/ వీడియో/ ఆడియో మరువద్దు. 1 min read time.

Song Spirit - Srirama Lera - Sri Rama Rajyam - Balakrishna, Nayanthara, ANR, Srikanth, Ilaiyaraaja, Bapu

రాముడిని మనస్పూర్తిగా ధ్యానించాలి, దేవా మీ గుణ గణాలను మేము రోజూ ఆచరణలో చూపగలిగే, మానసిక ఆత్మ బలాన్ని ఇవ్వమని. మరి దేవుడు, ఆత్మ జ్ఞానం, బలాన్ని ఎలా ఇస్తారు? మన సాధనతో, మన త్యాగం, ఓర్పు, సహనం, సజీవ గురువు సేవ, సాత్విక ఆలోచన తో?

రాముడు కూడా శివుని పూజించి, ఇంట్లో కూర్చోలేదు, రావణుని వెతుక్కుంటూ వెళ్ళారు మైళ్ళ దూరం నడచి, స్వయముగా ఎన్నో రోజులు యుద్దం చేసారు, ఎంతో మంది సహాయము తీసుకున్నారు, వారికి సహాయం చేసారు.

మరి మనము రామ సుగుణాలను ప్రయత్న పూర్వకముగా ఆచరణలో చూపకపోతే, ప్రయోజనము లేదని, రాముడే చెప్పారు, చేతలలో చూపారు.

మన మనసునే, మనము తలచాలి, బలపరచాలి, దోవలో పెట్టాలి నీతి నియమాలతో. ఓ శ్రీ ఆత్మా రామ, లేరా ఓ ఆత్మా రామా, మా ఇలలో, పెనుచీకటి మాపగరా, ఆ దైవ సీతారామ చూపే తన మహిమా, మన మదిలో, అసుర ఆలోచలనల సరళిని మాపగ. కామ లోభ మొహ మద మత్సర క్రోధములే, మా నుంచి తొలగించి, సుగుణాలను కలిగించి, మా హృదయాలను వెలిగించి, మా జన్మము ధన్యము చేయుమురా..

ధీరమతియై న్యాయపతియై, ఏలు రఘుపతియే మనకు ప్రేమ స్వరమై, స్నేహపరమై, మేలు ఒసగునులే. జీవులు అందరు ఒకటేలే రామునికి, ఆయన మన అందరికీ పక్షపాతము లేకుండా పంచే ఆదరమొకటేలే. మరి అలాంటి సకల గుణ ధాముని రీతిని, రాముని నీతిని, ఏమని పొగుడుదులే, రోజూ ఆచరణలో పాటించడము కన్నా అని మనము చేతలలో చూపాలి.

ఒక సారి మన మనసు స్తిరపడితే సాధనతో, ఇది ఆత్మా రామ ప్రేమ లోకం, ఇలా సాగి పోవు జీవుల స్నేహం, ఇందులోనె మనకు పరలోక మోక్షం, మన కళ్ళకు కనపడే రవి చంద్రులింక సాక్ష్యం, ఇది ఎన్ని జన్మలకైనా ఏనాడు వీడిపోని బంధం ఆ పరమాత్మతో సుమా.

శ్రీరామ, రామ రఘు రామ, అని పిలిచే, ఆ సమ్మోహన సుస్వరమా అని మనము పులకిస్తాము. ఆ సీతాభామ, ప్రేమారాధనమా, ఆ శ్రీ హరికే, హరిచందన బంధనమా. ఆ శ్రీరాముని అనురాగం, ఆ సీతా సతి వైభోగం అమోఘం. మన శ్రీరాముడు రసవేదం, శ్రీ జానకి ఆయనకు అనువాదం, కాబ్ట్టి ఏనాడు వీడిపోని బంధమూ వారిది, వారితో మన మనసుది.

శ్రీరామ, లేరా ఓ రామా
ఇలలో, పెనుచీకటి మాపగరా
సీతారామ, చూపే నీ మహిమా
మదిలో, అసురాళిని మాపగరా
మద మత్సర క్రోధములే, మా నుంచి తొలగించి
సుగుణాలను కలిగించి, హృదయాలను వెలిగించి
మా జన్మము ధన్యము చేయుమురా..||శ్రీరామ లేరా||

ఆ ఆ ఆ ఆ ఆ
దర్శనమును కోర, దరికే చే.రే.
దయగల మా రాజు, దాశరధి..
తొలుతనె ఎదురేగి, కుశలములడిగె.
హితమును గా.వించె, ప్రియ వాది..
ధీరమతియై న్యాయపతియై, ఏలు రఘుపతియే..
ప్రేమ స్వరమై, స్నేహపరమై, మేలు ఒసగునులే..
అందరు ఒకటేలే, రామునికి, ఆదరమొకటేలే
సకల గుణ ధాముని రీతిని, రాముని నీతిని, ఏమని పొగుడుదులే ||శ్రీరామ లేరా||

తాంబూల రాగాల, ప్రేమా. మృతం.
తమకించి సేవించు, తరుణం..
శృంగార శ్రీరామ, చంద్రో.దయం.
ప్రతిరేయి వైదేహి, హృదయం..
మౌనం., కూడ, మధురం..
సమయం. అంతా, సఫలం..
ఇది రామ ప్రేమలోకం, ఇలా సాగిపోవు స్నేహం
ఇందులోనె మోక్షం, రవి చంద్రులింక సాక్ష్యం
ఏనాడు వీడిపోని బంధం..||శ్రీరామ లేరా||

శ్రీరామ, రామ రఘు రామ
పిలిచే, సమ్మోహన సుస్వరమా..
సీతాభామ, ప్రేమారాధనమా
హరికే, హరిచందన బంధనమా..
శ్రీరాముని అనురాగం, సీతా సతి వైభోగం
శ్రీరాముడు రసవేదం, శ్రీ జానకి అనువాదం
ఏనాడు వీడిపోని బంధమూ...  
Author photo Sri, Telugu , 15+ yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 840+ Foreign and local events/ places coverage, 2120 General Articles and views 1,881,923; 104 తత్వాలు (Tatvaalu) and views 226,362
Dt : 06-Feb-2024, Upd Dt : 06-Feb-2024, Category : Songs
Views : 141 ( + More Social Media views ), Id : 2008 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags : Srirama , Lera , Sri , Rama , Rajyam , Balakrishna , Nayanthara , ANR , Srikanth , Ilaiyaraaja , Bapu
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.

Share
ఆ టీవీ, ఈ టీవీ, మీ టీవీ, మా టీవీ, వాళ్ళ టీవీ పత్రిక - అన్ని టీవీ, పత్రిక వార్తలు వినోదం ఇక్కడే
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 11 yrs
No Ads or Spam, free Content