APLatestNews.com top Banner

Social Media links
వేలు ఖర్చు పెట్టి, పేపర్ లో ఓ చిన్న బొమ్మ లేదా ప్రకటన వేయిస్తే, ఎంతమంది కి చేరుతుంది? - General - లోకం తీరు/ News
           
     
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
1 నిమిష చదువు సమయం.

మీరు ఆలోచన చేయండి, 2000 నుంచి 10000 వేలు ఖర్చు పెట్టి, పేపర్ లో ఓ చిన్న బొమ్మ లేదా ప్రకటన వేయిస్తే, ఎంతమంది కి చేరుతుంది ఈ రోజులలో? సైజు, కలర్, ఊరు, జిల్లా, ఎడిషన్, రాష్ట్రం, దేశం ను బట్టి ప్రకటన రేటు కదా?

సొంతముగా మన ఫేస్బుక్ లేదా ట్విట్టర్ లో పెట్టుకుంటే, మన డబ్బా మనము కొట్టుకున్నట్లు గా ఉంటుంది, అదే లింక్ ఇంకొకరిది అయితే గొప్పగా ఉంటుంది కదా. మన ఫేస్బుక్/ ట్విట్టర్ అకౌంట్ కు ఏదైనా సమస్య వస్తే, ఆ ఫోటోలు మొత్తము మాయం. పది పోస్టులలో పెట్టే ఫోటోలు, మనము ఒకే లింక్ లో అన్ని ఫోటోలు (వీలైతే డిజైన్ తో) మరియు మన యూట్యూబ్ లేదా ఫేస్బుక్ వీడియోతో సహా పెట్టవచ్చు కదా. మీ ఫేస్బుక్ ట్విట్టర్ అకౌంట్ లేదా పేజ్ కు, మిగతా స్నేహితులు నాయకులు కు, ఐడీలు ఇస్తే, టాగ్ చేస్తాము.

పీడీయెఫ్ లేదా ఇమేజ్ లేదా యాప్ (మన సెక్యురిటీ అండ్ ప్రైవసీ కూడా చూడాలి) ల లో లేదా లాగిన్ ఉన్న సైట్ లో వచ్చిన వార్తలు, గూగుల్ సెర్చ్ లో రావడము నమ్మకము లేదు కదా. కరోనా భయము తో పేపరు తాకలేము అనో లేదా ఆన్లైన్ ఉచిత వార్తలు చూస్తూ, జనము ఇంటిదగ్గర ప్రింట్ పేపరు వేయించుకోవడము లేదు.

ఇప్పుడు ఎంతమంది ఇంటికి, డబ్బు పెట్టి పేపర్ వేయించుకుంటున్నారు, చూస్తున్నారు? కరోనా సమయములో మరీ తగ్గింది. వార్తా పేపర్ వారికే లాభం ఉపయోగము లేక, ఇన్నాళ్ళు పనిచేసిన తోటి విలేఖరి సోదరులను ఇంటికి పంపుతున్నారు, అన్యాయం గా, ఇన్ని రోజుల శ్రమను కూడా మరచి. జిల్లా ఎడిషన్ లు మరియు ఇతర పేజీలు కూడా తీసేసారు లేదా తగ్గించారు.

మరి పోనీ, మనకు లాభమా, అదీ లేదు కదా? మరలా మనము, ఆ పేపర్ కటింగ్ సోషల్ మీడియాలో లేక వాట్సాప్ లో మన స్నేహితులు, బంధువులు కు మనమే పంపుకోవాలి, ఇదుగో మన చిన్న ఫోటో అచ్చు అయ్యింది ఓమూల చూడమని. ఆ రోజు దాటాక, అది మామూలు ఉత్త కాగితం. తర్వాత, మరలా పాత కాగితాలు వెతకాలి. మన యూట్యూబ్ లేదా ఫేస్బుక్ వీడియో పెట్టగలమా, ఆ పేపరు ప్రకటనలో? కుదరదు కదా.

అదే ఆన్లైన్ లో అయితే, మన ఫోటో పెద్దగా ఉంటుంది, కంప్యుటర్ లో, తగ్గి ఉంటుంది ఫోన్లో, చేత్తో పెద్దగ చేసి చూడవచ్చు. రెండు మూడు ఫోటోలు విడి విడి గా లేదా కలిపి కూడా పెట్టవచ్చు. వీడియో లింక్ లు పెట్టవచ్చు. అవసరాన్ని బట్టి ఆన్లైన్లో రోజు, వారం, నెల అయినా ప్రకటన ఉంచవచ్చు కదా.

వారి వరకే ఒక లింకు కూడా ప్రత్యేకము గా పంపుకోవడానికి ఉంటుంది. తమ స్నేహితులు, బంధువులు, ఫేస్బుక్ ట్విట్టర్ వాట్సప్ గ్రూపు లో, తేలికగా లింక్ పెట్టవచ్చు ఇతరులతో పంచుకోవచ్చు. మన ఆన్లైన్ ద్వారా ఇంకొంతమంది కి, ఎటూ చేరుతుంది.

పేపర్ ప్రింట్ కోసం, ఎన్నో చెట్లు కొట్టి వేసి, ప్రకృతి సమతుల్యత దెబ్బ తీస్తున్నాం. కరోనా కి అది నచ్చదు కదా. ఇంటర్నెట్ లో ఎక్కువ మందిని చేరే పరిధి ఎక్కువ, ఈ రోజు లేదా తర్వాత అయినా.

చూడండి మన సోదరుడు ప్రమోషన్ వార్తను ఆన్లైన్లో, ప్రపంచంలో ఎక్కడ ఉన్నా, వారి స్నేహితులు బంధువులు అందరూ చూడవచ్చు. వారు పంపుకోవాలన్నా, ఒక చిన్న లింకు మాత్రమే కదా. ఫోటో పెద్దగా చేసి చూడవచ్చు, ఫోన్ లో అయితే. లాప్ టాప్ లేదా కంప్యూటర్ లో ఎటూ పెద్దగా వస్తుంది. ఇంటర్నెట్ మహిమ కదా అంతా.

లింక్ లో లేదా మాటలులో, ఇంగ్లీషు మాటలు లో మన పేరు ఉంటుంది, గూగుల్ సెర్చ్ లో ప్రపంచంలో ఎక్కడ నుండి అయినా చూడవచ్చు, ఆ లింక్ తో.

యాప్ లో , ఫోటో లో , పీడీఎఫ్ లో, లాగిన్ లో ఉన్న చిన్న వార్తలు, పేజీ మొత్తం మనది కాదు కదా, పెద్దగా చేసి చూడలేము, వీడియో పెట్టలేము, గూగుల్ సెర్చ్ లో నమ్మకం లేదు.

పేపర్ కటింగ్ అప్లోడ్ చేయడం పాత పద్ధతి, గూగ్లె సెర్చ్ తో రాదు. మన సొంత లింక్ ఉన్న పుర్తి పేజ్ ని, షేర్ చేయడం కొత్త తేలిక పద్ధతి.

ఇంకొన్ని ఇతర లాభాలు మీకు తెలిసినవి ఉండవచ్చు, ఆలోచన చేయండి, మీకు లాభసాటి నిర్ణయం మీరే తీసుకోండి.  
Author photo Sri, Telugu , 10 yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 828 Foreign events/ places coverage, 793 General Articles, 46 Tatvaalu
Dt : 06-May-2020, Upd Dt : 06-May-2020, Category : General
Views : 198 ( + More Social Media views ), Id : 536 , State : AP/ Telangana (Telugu) , Country : India
Tags : spend thousands , a small picture ad , ads , news paper , how many people it reaching
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
Share
అన్ని పత్రిక, టీవీ, సంక్షిప్త, రేడియో వార్తలు ఇక్కడే, అబ్బో అన్ని లింక్ లు గుర్తు వద్దు
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 8 yrs
No Ads or Spam, free Content