నాటి రాముని నినాదం, ధర్మమును కాపాడు, నేటి రావణుల నినాదం, బలవంతము గా? - General - లోకం తీరు/ News
           
     
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. 1220 కధనాలు. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు. 1250 General Articles, 47 Tatvaalu.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
2 min read time.

శుభోదయం, శుభదినం, శుభసంకల్పం. ఓం నమో నారాయణాయ, ఓం శ్రీమాత్రే నమహా, ఓం కరోనా గురవే నమహా.

శ్రీ రామ నవమి శుభాకాంక్షలు, సహ్రుదుయులైన, మంచి మనసు ఉన్న, పదిమంది మంచి కోరే, గురువు లందరికి, శిరస్సు వంచి, ఈ అజ్ఞాన శిష్యుని నమస్కారములు. రామయ్య పరివారం ఫోటో శని వారం పంపాను, ఇప్పుడూ వాట్సాప్ స్టేటస్ లో ఉంది, చూడగలరు.

7 ఏళ్ళు గా, అమ్మా నాన్నల, అలాగే దైవముతో అండతో పాటుగా, మీ అందరి ఆశీస్సులు అండతో, చిన్న చిన్న పదాలుతో మొదలు పెట్టి, మీరు చెప్పిన తప్పులు సరిచేస్తూ, రాష్ట్ర జిల్లా పట్టణ గ్రామ అధికారులు నాయకుల కు, అలాగే అమెరికా తెలుగు వారికి, సవినయముగా విన్నపాలు చెప్పుకునే స్థాయికి మీరే తెచ్చారు, మీకు ఎప్పుడూ రుణపడి ఉంటాము.

అలాగే అన్ని పార్టీల అధిష్టానమునకు, మంత్రులు ఎంపీలు ఎమ్మెల్యేలకు కూడా, తమ సొంత నాయకుల అధికారుల పని తనం, స్పష్టము గా అర్ధము అవుతుంది, ఇప్పుడు. రేపు టిక్కెట్ లేదా బదిలీలకు, వారికి తగిన సమాచారం ఇప్పుడు, ఎప్పటికప్పుడూ అందుతుంది, నమ్మకమైన అందరి క్షేమం కోరే మనిషి వద్ద నుంచి.

మీరు రాసిన సొంత తెలుగు (లేదంటే తెలుగు కాని వారు ఇంగ్లీష్) మాటలనే పంపగలరు, ఎందుకంటే మీ మాటలలోనే, మీ వ్యక్తిత్వము, మీ ఆత్మ సౌందర్యం తెలుస్తుంది. మీ మీద గౌరవం అభిమానం విశ్వసనీయత పెరుగుతుంది. ఒకవేళ నేను సహాయం చేయగలిగిన పనైతే, మీకు చాలా తేలిక అవుతుంది, ఎందుకంటే మీ మంచి, మీ మాటల్లోనే ఇన్నాళ్ళు చూసాను కాబట్టి.

అధికారులుకు నాయకులకు, విన్నపము చేయడం వరకే మన పని, దానిని అమలు చేసి పుణ్య అభివ్రుద్ది, లేదా నిర్లక్ష్యం చేసి పాప అభివ్రుద్ది, వారి పని, దాని ఫలితాలు కూడా వారికే, వారి వారసులకే.

చీరాల జిల్లా సాధనకు మీరంత సహకరిస్తారని, ఆశిస్తున్నాము ఏళ్ళు గా.

నాటి రాముని నినాదం, ధర్మమును కాపాడు, అది మనల్ని కాపాడుతుంది అని.

నేటి రావణుల నినాదం, బలవంతము గా పరాయి లేదా ప్రభుత్వ ప్రజా సొమ్ము తెచ్చుకో దాచుకో, వంశముతో సహా, సర్వనాశనం అవ్వు.

ఆనాటి ప్రజలు ఉత్తములై, నీతి నియమాలతో ఉండి, పెద్దలను గౌరవించి, మంచిని ఆచరించి, రాముడు లాంటి రాజును పొందారు.

ఈ నాటి ప్రజలమైన మనము, భారత రాజ్యాంగము అవకాశం ఇచ్చినా కూడా, ఓటు అనే ఆయుధాన్ని సరైన మంచి వ్యక్తికి వేయకుండా, పిల్లలకు దాని విలువ చెప్పకుండా వారిలో సంస్కారం పెంచకుండా, రాముడు లాంటి నాయక వ్యక్తులను మనమే ఓడిస్తూ, రాముడు లాంటి అధికారులను దూరముగా బదిలీ చేపిస్తూ,

రామ రాజ్యం ఆకాశం నుంచి, ఏనాటికైనా ఊడి పడుతుంది అని, మూర్ఖముగా మనం చేయవలసిన పని గాలికి వదిలి, ఆకాశం వైపు చూస్తున్నాము 20 ఏళ్ళు గా, ఇంకా మంచి రోజులు ఎప్పుడు వస్తాయా అని.

రారాజైన రాముడు కూడా, ఆనందముగా వన విహారము చేస్తు, కందమూలాలు తింటూ, నేలపై పవళిస్తూ, కాలి నడకన నడిచారు. మనము కనీసం, మన ఇంట్లో శాఖాహార భోజనముతో, చాప మీదైనా పడుకోము.

ఒకే మాట, ఒకే బాణం, ఒకే భామ ఆయన నినాదం. 2 నాల్కలు 2 మాటలు 2 వందల అబద్దాలు తో, పెళ్ళి అయి పిల్లలు ఉన్నా, పక్క చూపులుతో అటు ఇటు సంసారాలను పిల్లలను, చిన్నా భిన్నం చేస్తున్నాము.

మన ఇంట్లోనే రామ రాజ్యం లేదు, బహుశా ఇక రాదు. మన ఇంట్లో నే, రాముడు లాంటి భర్త, సీత లాంటి భార్య, లక్ష్మణుడు లాంటి తమ్ముడు, లవ కుశలు లాంటి పిల్లలు లేరు.

కానీ ఇంటికొక, పరాయి సొమ్ము ఆశించే రావణుడు, మోహము లో ఉండే శూర్పణఖ, పుల్లలు పెట్టే పగలు రగిల్చే మంధర, విడదీసి చెడు కోరి కాపురం కూల్చే దురాశ కైక, మదమెక్కిన వాలి, నిద్రపోతూ కుంభకర్ణులు, మాత్రం ఉన్నాము.

మీరు కూడా దైవ ధ్యానముతో గౌరవముతో, ముదుసలి తల్లి దండ్రులను గౌరవిస్తూ ఇంట్లోనే దగ్గరగా పెట్టుకుంటూ, మీరూ అలాగే పిల్లలతో తెలుగు లో 2 పదాలు రాపించి, పెద్దల ను మాత్రు భాషను గౌరవిస్తారని భావిస్తున్నాము, వేడుకుంటున్నాము.  
Author photo Sri, Telugu , 10 yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 828 Foreign events/ places coverage, 1250 General Articles, 47 Tatvaalu
Dt : 20-Apr-2021, Upd Dt : 20-Apr-2021, Category : General
Views : 123 ( + More Social Media views ), Id : 1105 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags : slogan , rama , treta yuga , protector , dharma , ravanas , force
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.

Share
కేసియార్, కేటీయార్ , బాబు , జగన్ , పవన్ కు చెందిన టీవీ, పత్రిక వార్తలు ఇక్కడే, ఒక చోటే చూడొచ్చు
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 9 yrs
No Ads or Spam, free Content