రామయ తండ్రీ ఓ రామయ తండ్రీ- సంపూర్ణ రామాయణం - శోభన్ బాబు, చంద్రకళ, ఎస్వీ రంగారావు, జమున - Songs - లోకం తీరు/ News
           
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. 2073 కధనాలు. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు. 2108 General Articles and views 1,865,800; 104 తత్వాలు (Tatvaalu) and views 224,917.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
చివరలో ఉన్న చిత్రం/ వీడియో/ ఆడియో మరువద్దు. 1 min read time.

Ramaya Tandri O Ramaya Tandri - Sampoorna Ramayanam - Shobhan Babu, Chandrakala, SV Ranga Rao, Jamuna

రామయ తండ్రీ! ఓ రామయ తండ్రీ! మా నోములన్ని పండినాయి రామయ తండ్రి, మా సామివంటే నువ్వేలే రామయ తండ్రి అంటూ, 1972 లో తెలుగు నాట ప్రతి పల్లె పల్లె మారుమోగింది ఈ పాటతో. ఏదో ఒక రూపములో రామయ్య తండ్రి ని, వారి లీలను తలవాలి, పిల్లలకు రాముని లక్షణాలు చెప్పాలి, నేర్పాలి, ప్రాపంచిక మోహములో పడనీయకుండా పతనంకానీయకుండా ఆపాలి అన్నట్లుగా ఉండేది.

రామునికి ఉన్న సద్గుణాలు బహుశా ప్రపంచములో ఎవరికీ లేవు. తనకు తానే పోటీ అన్నట్లు గా, క్రిష్ణుడు కూడా, సద్గుణాలు లో రాముని కన్నా తక్కువే. అందుకే క్రిష్ణాంజనేయ యుద్దం సినిమా లో, తానే రాముడు గా మారి, ఆంజనేయునికి మనశ్శాంతి తో కూడిన కనువిప్పు కల్గించారు.

రామ నామం ఎంత గొప్పది అంటే, రామాంజనేయ యుద్దం సినిమాలో, ఆంజనేయుడు రామ బాణం కు ఎదురు, రామ నామం నే సంధిస్తారు. అంటే రాముడు గొప్పా, రామ నామం గొప్పా అంటే, రామ నామమే గొప్ప. అలా ఉంటాయి, ధర్మ సూక్ష్మాలు.

రామ నామము తారక మంత్రం. భవ భందాల నుండి విముక్తి కలిగించి, సంసార సాగరాన్ని దాటించగల ఏకైక మంత్రం.

ప్రణవనాదమైన ఓంకారం తర్వాత అంత మహత్వపూర్ణమైనది. ప్రతి మంత్రానికి రామనామంతో సారూప్యం చూపిస్తాడు. మనురిషి స్యవనుడు తన స్యవన స్మృతితో రామనామము సకల వేదాలు, శాస్త్రాలు ఇతిహాసాల సారంగా పేర్కొన్నాడు.

రా అనే అక్షరం అష్టాక్షరి మంత్రం అయిన ఓం నమోనారాయణాయి నుంచి, మ అనే అక్షరం పంచాక్షరి మంత్రం అయిన ఓం నమశివాయ నుంది వచ్చాయి.

ఈ నామాన్ని పిల్లల నుంచి వృద్ధుల వరకు జాతి, కుల, మత బేధాలు లేకుండా జపించవచ్చు, రాయవచ్చు, స్మరించవచ్చు. ఒక్క మాటలో చెప్పాలంటే ఈ సకల చరాచర సృష్టికి ఆది దేవుడు అయిన శివ పరమాత్ముడు నిత్యం రామనామం జపిస్తారు. అంత గొప్పది రామ నామం.

పడవ నడిపే అతను ఎంత చమత్కారముగా రాముని పొగుడుతున్నారో/ ఆరాధిస్తున్నారో - నీ కాలు దుమ్ము సోకి రాయి, ఆడది అయినాదంట, నా నావ మీద కాలు పెడితే యేమౌతాదో తంట, దయజూపి ఒక్కసారి కాళ్ళు కడగనీయమంట, మూడు మూర్తులా నువ్వు నారాయణ మూర్తివంట.

మరి మీరు మీ పిల్లలూ, రాముని మీద ఓ మంచి పాట లేదా ఇదే అయినా పాడి వినిపిస్తారు తరిస్తారు కదూ? ఎంత సంపాదించినా, గ్రహాలను కొన్నా, చివరకు ఆధ్యాత్మికత లేనిదే మనశ్శాంతి మోక్షం లేవు సుమీ.

రామయ తండ్రీ! ఓ రామయ తండ్రీ!
మా నోములన్ని పండినాయి రామయ తండ్రి
మా సామివంటే నువ్వేలే రామయ తండ్రి - 2 సార్లు మొత్తము

తాటకిని ఒక్కేటున కూల్చావంట
శివుని విల్లు ఒక దెబ్బకే ఇరిశావంట - 2 సార్లు మొత్తము
పరశరాముడంతవోణ్ణి పారదరిమినావంట
ఆ కతలు సెప్పుతుంటే విని ఒళ్ళు మరిచిపోతుంట ||రామయ తండ్రీ||

ఆగు బాబూ ఆగు!
అయ్యా నే వత్తుండా, బాబూ నే వత్తుండ 2
నీ కాలు దుమ్ము సోకి రాయి, ఆడది అయినాదంట
నాకు తెలుసులే!
నా నావ మీద కాలు పెడితే యేమౌతాదో తంట
నీ కాలు దుమ్ము సోకి రాయి, ఆడది అయినాదంట
నా నావ మీద కాలు పెడితే యేమౌతాదో తంట
దయజూపి ఒక్కసారి కాళ్ళు కడగనీయమంట
మూడు మూర్తులా నువ్వు నారాయణ మూర్తివంట ||రామయ తండ్రీ||

అందరినీ దరిజేర్చు మారాజువే
అద్దరినీ చేర్చమని అడుగుతుండావే - 2 సార్లు మొత్తము
నువు దాటలేక కాదులే రామయ తండ్రీ 2
నన్ను దయజూడగ వచ్చావు రామయ తండ్రి

హైలెస్సా లేలో హైలెస్సా 4

హైలెస్సా.. లేలో.. హైలెస్సా
హైలెస్సా.. లేలో.. హైలెస్సా ఓహోహో..ఓఓఓఓ

హైలెస్సా.. లేలో.. హైలెస్సా 4

Ramaya Tandri O Ramaya Tandri, Maa Nomulanni Pandinayi Ramaya Tandri" (Lyrics: Kosaraju Raghavaiah; Singer: Ghantasala) -
Sampoorna Ramayanam (1972)

Shobhan Babu, Chandrakala, SV Ranga Rao, Jamuna

చిత్రం : సంపూర్ణ రామాయణం (1972); సంగీతం : కె.వి. మహదేవన్; సాహిత్యం : కొసరాజు; గానం : ఘంటసాల, కోరస్

శోభన్ బాబు, చంద్రకళ, ఎస్వీ రంగారావు, జమున  
Author photo Sri, Telugu , 15+ yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 840+ Foreign and local events/ places coverage, 2108 General Articles and views 1,865,800; 104 తత్వాలు (Tatvaalu) and views 224,917
Dt : 01-Jun-2023, Upd Dt : 01-Jun-2023, Category : Songs
Views : 442 ( + More Social Media views ), Id : 1768 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags : ramaya , tandri , sampoorna , ramayanam , shobhan , babu , chandrakala , sv , ranga , rao , jamuna
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.

Share
తెలుగు మీడియాను నమ్మరా, ఆంగ్ల హిందీ మీడియాను నమ్ముతారా? పర్లేదు, వాటినీ ఇక్కడే చూడొచ్చు
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 11 yrs
No Ads or Spam, free Content