మీ జిల్లా మంత్రి బాలినేని కి, మీ ఊరు ఎమ్మెల్యేకి, భవిష్యత్ చెప్పారు, మొత్తుకున్నారు, పరిహారం కూడా - Politics - లోకం తీరు/ News
           
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. 2073 కధనాలు. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు. 2108 General Articles and views 1,865,793; 104 తత్వాలు (Tatvaalu) and views 224,916.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
2 min read time.

*ఏవండీ ఏళ్ళు గా చదువుతున్నా, మీ సొంత బంధువుకు నచ్చ చెప్పినట్లుగా, మీ ఉమ్మడి జిల్లా మంత్రి బాలినేని కి, మీ ఊరు ఎమ్మెల్యేకి, భవిష్యత్ మరీ మరీ చెప్పారు, మొత్తుకున్నారు. కానీ వారు వినలేదు, లెక్క చేయలేదు. నాకు ఆశ్చర్యము వేసింది, అంత గట్టిగా ఎలా చెప్పారు అని. ఇప్పుడు ఫలితము గా అన్ని పదవులు పోయాయి/ వదిలారు. మీరు ఇంత చెపుతున్నా వెంటపడీ వారి క్షేమం కోసం, ఎందుకు వారు పట్టించుకోరు? చిన్న పరిహారం కూడా చెప్పారు. కనీసం, వారు మీ మాట విని ఉంటే బాగుండేది, అని ఇప్పుడైనా అంటారా?*

*జవాబు*, గురువు గారు, మేము చెప్పాము జరిగింది అని అనకండి, లేని పోని తలనొప్పులు మాకెందుకు. వారి తరుపున లేదా ఎవరైనా, ఎవరూ మనల్ని ఒక్క మాట అనలేదు, ఈ 4 ఏళ్ళుగా. ఎందుకంటే, 80 శాతం మంది మంచి వినరు, పాటించరు అని వారికి బాగా తెలుసు. మన రాతలతో వారికి నష్టం లేదు.

ఇంకోటి గుర్తు పెట్టుకోండి, అసలు మనము నాయకుల నటుల జోలికి వెళ్ళం. ఎందుకంటే మన చుట్టు ఉన్న వారు 50 శాతం అరిషడ్వర్గాలలో ఉంటే, వీరు 80 శాతం పైన అరిషడ్వర్గాలు లో ఉంటారు. చెన్నారెడ్డి, విజయ భాస్కర రెడ్డి, నల్లపురెడ్డి, ఎంటీయార్ వారసులు ఏరి, నంబర్ 1 పొజిషన్ లో? రేపు నేటి నాయకుల/ ఓటర్ల సంతానం పరిస్తితి అంతే. ఎవరైనా ఓ సందర్భములో వివరాలు పంపి, అవి మనకు అరిషడ్వర్గాల బానిసత్వం గా కనపడితేనే, జాగ్రత్తలు చెపుతాము. లేదంటే ఆధ్యాత్మికానికి, వీరికి అసలు కుదరదు.

చూడండి, వాట్సాప్ ప్రొఫైల్ ఫోటో కనీసం చెట్టు గుట్ట కట్ట అయినా, ఎవరినైనా అడిగి పెట్టుకోండి అన్నాము బొట్టులా, వింటారా? ఓ పెద్ద ఫలితము వస్తే, అప్పుడు వింటారు. అవసరమా, ఆ కన్నీళ్ళ ఫలితము, ఇప్పుడు మారలేమా? ఇక్కడ బొమ్మ కాదు అసలు విషయము, మన మానసిక మచ్చ, దాని ప్రభావం జీవితం లో ఇంకో దానిమీద. ఆ బంధం తేలికగా మీకు అర్ధం కాదు.

తాగితే ఆరోగ్యం చెడుతుంది అంటాము, అంటే మేము అన్నందుకు ఆరోగ్యం చెడింది అంటారా లేదా తాగినందుకు అంటారా? మాకు సంబంధము ఉందా అసలు? మీకు తెలీదా అలా అవుతుంది అని? కానీ మీరు స్వార్ధం తో చెప్పరు, వారితో పనులు కావాలి, కానీ వారి క్షేమం మీకు అవసరం లేదు.

కానీ మాకు వారితో పని లేదు, కానీ వారి లేదా ఇతరుల క్షేమం కావాలి కాబట్టి, గట్టిగా చెబుతాము, అదే మాట మీద ఉంటాము. ఎక్కడా, అగౌరవము అమర్యాద ఉండదు. వారు క్షేమం గా గౌరవంగా ఉంటే, మనము ఎప్పుడైనా సహాయం అడగవచ్చు కదా. మనము అందరి మంచి కోరాలి.

మంచి మాట అంతే, వారి మార్పు మా బాధ్యత కాదు. వారిని వారే మార్చుకోవాలి. సాధనలు మనము చాలా చెప్పాము శనివారం.

వారు మారితే, ఇది అందరికీ ఉపయోగం మిత్రమా, మా జిల్లాకే కాదు, ప్రతి మనిషికి కూడా. నవగ్రహాలను మరియు పంచభూతాలను, మనము తప్పించుకోలేము. సావిత్రమ్మ, రామన్న, రాజన్న, ఇంకా చాలా మంది, ఇప్పుడు మన చుట్టూ ఉన్న నాయకులు సంఘాలు కూడా మన మాట వినవు, నవ్వు కుంటారు, గేళి చేస్తారు, స్పందించరు, మార్చుకునే ప్రయత్నం చేయరు.

ఎందుకంటే, వారి తీరం వారు చేరాలి కాబట్టి. చేరినాక నవ్వు ఉండదు, తోడు నీడ ఉండదు, అండ ఉండదు, మనశ్శాంతి ఉండదు. నువ్వు ఏ గుడికి వెళ్ళి ఎన్ని పూజలు అయినా చెయ్యి, ఫలితాలు శూన్యం. ఫలితాలు వచ్చాక, కర్ణుని దుర్యోధనుని కాపాడలేదు మన క్రిష్ణయ్య ఎదురు ఉండి, మరువద్దు.

వీరికి పంచభూతాల శక్తి యుక్తి మాయ అర్ధం కాదు. రామన్న రాజన్న సావిత్రమ్మ ను కాపాడటానికి ఒక్కరు వచ్చారా? మనకన్నా అన్ని ఎక్కువే కదా వారికి, ఆస్తులు బలగం అధికారం?

80 శాతం అంటారు, అంతా చెడిపోయింది అండి ప్రపంచం అని, కాని తమను తాము మార్చుకోరు, మరి వారందరికీ శిక్ష పడింది అని మాత్రం చెప్పరు, నమ్మరు, వినరు.

ఎప్పుడు కూడా, అవతల వ్యక్తి మనసు ఆలోచన మాత్రమే మారాలి అనుకోవాలి కాని, వారికి నష్టం ఇబ్బంది కలగాలని మనము ఎప్పుడూ అనుకోకూడదు మనసులో కూడా, దేవుడు మెచ్చడు, మనకే ఇబ్బందులు ఇస్తారు. వారి మోహ పనులు బట్టి, వారి భవిష్యత్తు మనకు అర్ధం అయినప్పుడు, ఏళ్ళు గా మంచి చెప్పడం వరకే మన బాధ్యత, ఫలితము వారిదే. మనకు ఎవరి మీదా ద్వేష భావం ఉండకూడదు. ఉంటే దైవ పూజకు, భవిష్యత్ ఆలోచనకు, మానసిక నియంత్రణకు పనికి రాదు ఆ మనసు.

వాసన్న కు పదవి ఉంటేనే, మనకు లాభము. మా కరణం బాబాయి లేదా మాగుంట అన్న లేదా ఇంకొకరి ద్వారా అయినా, మన ఊరికి మంచి చేపించవచ్చు/ అడిగించవచ్చు. ఇప్పుడు మనకు పలికే నిఖార్సైన పెద్ద మంత్రి దిక్కు ఏరి?

ఆ రోజు మూర్చపోయారు బీపీ తో అని విన్నప్పుడు, స్వామి, మా ఊరు బాధ తెలిపాము, చాలు ఇబ్బంది పెట్టొద్దు, అని అనుకున్నాము. తర్వాత పదవీ వదిలేశారు. కానీ వాసన్న చాలా విషయాలులో తప్పటడుగు వేసారు, ఇక మనకు తిరుగు లేదు అని. కానీ జగనన్న పరువు ప్రతిష్ట మాట మొత్తము గంగ పాలు చేసారు. మనకు అన్ని తప్పుల గురించి వద్దు, మానసిక పరిస్తితి చాలు. మానసికముగా తప్పు దోవలో ఉంటే, మిగతావి అన్ని అలాగే జరుగుగాతాయి.

అసలు మనకు ఎమ్మెల్యే లేదా మంత్రి తో పని లేదు. ఎందుకో దేవుడు చెపుతున్నాడు. వారికి పెద్ద బాధ రాబోతుంది అని, అలాగే వారి వారసుల భవిష్యత్ కు చాలా ఇబ్బంది అని.

ఇంకోటి, వాసన్న గనుక, మా కరణం బాబాయితో అక్రమము గా కలవకపోతే, ఆమంచి ని అన్యాయముగా అణగదొక్కకపోతే, అసలు మనము వారికి చెప్పే వారము కూడా కాదు. గమ్ముగా ఉండే వారము, మనకెందుకు లే అని. ఎప్పుడూ తప్పుడు పద్దతిలో అధికారం పొందకూడదు, బలప్రయోగం చేయకూడదు. తమ ఎన్నో వంకర పనులలో ఇది ఒకటి, మనకు చెందిన ప్రాంతం రెండోది.

కానీ ఇప్పుడు మా తమ్ముడు వెంకటేష్ కు కూడా నష్టము జరుగుతుంది, అలాగే వాసన్న తనయుడికి, పైన సజ్జల మరియు జగనన్నకు కూడా అని అర్ధము అయ్యే సరికి, మన ప్రయత్నము మనము చేయాలి, పాప ఫలాన్ని తగ్గించడానికి అని ప్రయత్నము చేసాము.

కనీసం పరిహారము గా, చీరాలకు ఏదైనా ఒక పెద్ద అభివ్రుద్ది పని ఇవ్వమని అడిగాము, మన ప్రయత్నములో భాగముగా. ఎందుకంటే ఒక అరిషడ్వర్గాలు అష్టవ్యసనాలు జయించే ప్రయత్నం లో ఉన్న ఓ సజీవ గురువు సేవకుడికి సంతోషం కలిగించాలి. అంటే నేరుగా మనకు లేకపోయినా, ఆ ప్రాంతానికి ఉండాలి. అది కేవలము, వారి సమస్య తగ్గించడానికి మాత్రమే. తప్పు ఒప్పు అవ్వదు. కనీసం జిల్లా ఇవ్వమని ధర్నా చెయ్యమన్నాము, ఏదీ చేయలేదు.

మా స్నేహితులు బంధువులకు ఇలాగే 20 ఏళ్ళు గా చెపుతుంటాం, కానీ వారు నవ్వి, తేలికగా ఇలాగే కొట్టి వేస్తారు. 2 ఏళ్ళ కో 5 ఏళ్ళ కో 25 ఏళ్ళకో మనం చెప్పిందే, పొల్లు పోకుండా స్పష్టము గా జరుగుతుంది, అప్పుడు వారి బాధ ఎవరూ తీర్చలేరు. మనమూ ఏమీ చేయలేము, దేవుని శిక్షకు, అందుకే ముందే వారికి బతిమాలి నచ్చచెపుతాము వంద సార్లు. చూడండి తెలుగు సంఘాలకు కూడా, ఎన్నో రాసి పంపాము. పాత వారి కధలు మారి పోయాయి, కొత్త వారి కధలు కూడా భవిష్యత్ లో మారుతాయి.

అంటే మనకేదో జ్ఞానం ఉంది అని కాదు, మోహం బయట ఉంటే మీరైనా చెప్పగలరు. మనము నేరుగా వారితో మాట్లాడలేము కాబట్టి, ఇలా బహిరంగముగా వారి అనుచరులతో మిత్రులతో పంపుతున్నాము, వారినా నచ్చ చెపుతారని.

రైలు పట్టాల మీద అడ్డముగా లెక్కలేనట్లు విననట్లు నడుస్తుంటే, ప్రమాదం అని మాత్రమే మనము లేదా మీరైనా చెపుతాము. వారు మోహం భ్రమలు వీడితే, అవి పట్టాలు ఏ క్షణమైనా ప్రమాదం అని వారికీ తెలుసు.

పక్కన ఉన్న వారు కి కూడా, ఇది తెలుసు. కానీ ఆ నాయకులతో అవసరం ఉండటం వలన, వారు నిజాలు చెప్పరు. మనము చెప్పేది వారికి చేర్చరు.

మనకు వారి క్షేమమే తప్ప, వారి తో అవసరం లేదు. వారి కుటుంబ మరియు పిల్లల భవిష్యత్ కు మంచి కోరుతున్నప్పుడు, మనకు భయము ఎందుకు చెప్పడానికి?

రేపు మరలా ఆయన ఇంకో పదవి తెచ్చుకున్నా కూడా, ఎన్ని వదులుకున్నా కూడా, పశ్చాత్తాపం లేకుండా ఉంటే, ఆ తర్వాత వారి పిల్లలకు ఇబ్బంది. ఆయన మరలా ఆ తప్పు చేయకూడదు. కాలం బలమైనది, వారు ఇప్పుడైనా విశ్వసించాలి. చంద్రన్న కు ఎన్నికల ముందు చెప్పాము, వినలేదు.

మా కరణం బాబాయి కూడా, బాలినేని తో కలవకపోతే ఇప్పుడు నష్టం చూస్తున్నారే గానీ, భవిష్యత్ లో జరగబోయే భారీ నష్టాన్ని ఆయన చూడటం లేదు. మోహము లో ఆ ఇద్దరు చూడలేరు.

ఈ రోజు 100 రుపాయలు పోయినా, నీతి గా ఉంటే రేపు 1000 వస్తాయి. కానీ ఇప్పుడు 100 కోసం నీతి తప్పితే, రేపు 1000 పోతాయి. ఇది ఎవరు ముందు చెపితే వినరు, గేళి చేస్తారు. అనుభవం అయినాక, వగచినా, ఉపయోగం లేదు.

మనము వారి తప్పులు అన్నిటిని ఆపమనము, కనీసం ఒక మంచి పని చేసి, ఫలితాన్ని ఇంకో 2 ఏళ్ళు వెనక్కి వేసినట్లయితే, అప్పుడు ఎలక్షన్ లో ఇంకో విధము గా ఉండేది.

ఇప్పటికైతే, ఎవరూ మనతో ఏమీ అనలేదు, అధికారం ఐశ్వర్యం హోదా అహంకారాలు అడ్డువస్తాయి కదా.

ఎన్ని పూజలు చేసినా, పుట్టేటప్పుడు పోయేటప్పుడు మనమంతా ఉత్త చేతులతో వచ్చి వెళుతున్నాము అని గ్రహిస్తే, వారే పలకరించి, భవిష్యత్ జాగర్తలు తీసుకుంటారు.

మనకు ఎటూ మన జనం, మన పనులు ఉన్నాయి కదా, భగవంతుని పై భారం వేసి, ఇలాగే ముందుకు వెళదాము, అందరి క్షేమం కోరి.

prakasam district minister Balineni and chirala MLA, future is told, explained, even told compensation  
Author photo Sri, Telugu , 15+ yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 840+ Foreign and local events/ places coverage, 2108 General Articles and views 1,865,793; 104 తత్వాలు (Tatvaalu) and views 224,916
Dt : 17-Apr-2022, Upd Dt : 15-May-2023, Category : Politics
Views : 812 ( + More Social Media views ), Id : 1349 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags : prakasam , minister , balineni , tdp , mla , karanam , chirala , ycp ,
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.

Share
కేవలం ఒక మీడియా వార్త నే నమ్మలేము, ఒకే చోట అందరి వార్తలను ఇక్కడ చూసి, నిజాలు పోల్చుకోగలము
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 11 yrs
No Ads or Spam, free Content