ప్రజానాయకుడి జులై డైరీ - పాలకొల్లు ప్రజలకు అండగా నిమ్మల రామయ్య - మీతో నేను - Politics - లోకం తీరు/ News
           
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. 2139 కధనాలు. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు. 2174 General Articles and views 2,220,090; 104 తత్వాలు (Tatvaalu) and views 245,336.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
1 min read time.

10 కాలాలు పచ్చ గా ఉండాలి అనుకునే నాయకుడు ఎప్పుడూ, కనీసం 15 రోజులు ప్రజలకు ఊళ్ళో అందుబాటులో ఉంటూ, వార్డులలో పల్లెలలో కలియ తిరుగుతూ, తన పార్టీ చేస్తున్న గొప్ప పనులు, ఇతర పార్టీల పనులలో లోపాలను, ప్రభుత్వ పనులలో అసమర్ధతను వివరముగా ధైర్యముగా సాక్ష్యాలతో చూపిస్తూ, వాక్సుద్ది తో విమర్శిస్తూ, తన స్వయం శక్తి, గుణములతో, నిజాయితీ గా పైకి ఎదగాలి. దీనివలన లేటు కావచ్చు, గాని గట్టి పునాది పడుతుంది, ఖచ్చితముగా అద్రుష్టము కలసి వస్తుంది.

మిగతా రోజులు కూడా, స్పష్టముగా ఫలానా ఊరిలో ఫలానా నాయకులతో ఉన్నాను లేదా విశ్రాంతి లో ఉన్నాను అని తప్పక తెలుపుతూ ఉండాలి. తన ప్రతి పబ్లిక్ అడుగు, సోషల్ మీడియాలో ప్రజలతో పంచుకోవాలి. అలాంటి ఉత్తములను, ప్రజలు మరియు ఇతర పార్టీలు గౌరవిస్తాయి.

కేవలము పై నాయకుల లేదా పార్టీ ప్రెసిడెంట్ భిక్షతో, సూర్యుని చాటు సొంత వెలుగు లేని చందమామ లా, మీడియా నాయకుని లా, పెట్టుడు పండ్లు లా ఉండకూడదు. కేవలము ధనము మీడియా మేనేజ్మెంట్ మోసము అబద్దాల తో, ఏరోజూ కైనా పతనము తప్పదు.

అలాంటి కష్టపడే తత్వము, ప్రజలతో కలిసే మనస్తత్వము, స్వయం ప్రకాశం గల వారే మన నిమ్మల. రేపు తెదేపా/ చంద్రన్న ఉన్నా లేకపోయినా, ఇలాంటి నాయకుడిని, ఎవరైనా కళ్ళకు అద్దుకుని తమలో భాగం చేసుకుంటారు.

నిమ్మల రామా నాయుడు (షుమారు 53 ఏళ్ళు) పాలకొల్లు నియోజకవర్గం నుండి తెలుగుదేశం పార్టీ సభ్యునిగా 2014 లో తొలిసారిగా ఎన్నికయ్యారు. ప్రస్తుత ఎమ్మెల్యే కూడా.

2014 ఆస్తులు 2 కోట్లు+, 2019 ఆస్తులు 9 కోట్లు+, ఆన్లైన్ సమాచారం నుంచి షుమారు, మరి ఇంత తేడా 5 ఏళ్ళలో, మరి వారికే తెలియాలి, ప్రజలకు వివరముగా చెప్పాలి. రేపు మంత్రి అయితే, ఇంకా ఎక్కువ తేడా కనిపిస్తుందా?

మన పొగడ్తలు, కేవలము ప్రజలలో నిరంతర అందుబాటు, అదీ ప్రతిపక్షములో ఉండి కూడా, అంటే గొప్ప విషయమే.

మనము దాదాపుగా 2 ఏళ్ళు నుంచి గమనిస్తున్నాము, 2 వ సారి ఎమ్మెల్యే అయినా కూడా, చురుకుగా, నవ యువకునిలా, జనము వెంట ఊళ్ళ వెంట పరుగులు తీస్తూ, మీకు తోడు నేనున్నాను అని ధైర్యముగా తిరుగుతూనే ఉన్నారు, అన్ని ఫోటో/ వీడియో సాక్ష్యం మీరు సోషల్ మీడియాలో చూడవచ్చు. గతములో సైకిలు పై, అమరావతి కూడా వెళ్ళి నిరసన తెలిపి వచ్చారు అనుకుంట.

మనము 3 ఏళ్ళు పైన అందరు నాయకులను మరియు అధికారులను కోరుతున్నాము, దయచేసి మీ సోషల్ మీడియా రోజూ పనుల సమాచారముతో నింపండి అని. కొంతమంది ఇప్పుడు తమ నాయకులు అరిచారు ఆదేశించారు అని మొక్కుబడిగా తిరుగుతున్నారు. కొంతమంది, నిజాయితీ గా మొదటి నుంచి తిరిగారు. వారిలో నిమ్మల ఒకరు.

మనము గతములో వైసీపీ, తెదేపా, జనసేన, కాంగ్రెస్స్, ఎమ్మెల్యేల అందరి గురించి మంచి విషయాలు రాసాము, పక్షపాతము లేకుండా. మీ ఊరి నాయకుడు కూడా ఇలాగే ప్రజలలో ఉంటే గత 3 ఏళ్ళుగ, దయచేసి సోషల్ మీడియా లింక్ లు పంపగలరు. మీరు రాయగలిగితే, కొంత తెలుగు సమాచారం కూడా వారి గురించి. ఆ మాటలకు మేము మెరుగులు దిద్దుతాము.

* జులై నెల డైరీ నుంచి కొన్ని - మీరూ ఇలా చేయండి, నాయకులు గా ఎదగండి*

** 18 - ప్రభుత్వం మొద్దు నిద్ర పోతున్న – ఇప్పటి వరకు గ్రామాల్ని కాపాడిన యువతకు, గ్రామ ప్రజలకు ధన్యవాదాలు.
** స్వహస్తాలతో అల్లూరి విగ్రహాన్ని శుభ్రం చేయడం జరిగింది ..
** లాకులకు గ్రీజు కూడా లేదు.. ప్రకృతి వైపరీత్యం వల్ల ఏటిగట్టు లోపల ఉన్న లంక గ్రామాలు, కొన్ని నష్టపోతున్నాయంటే భరించవచ్చు కానీ, ఏటిగట్టు వెలుపల ఉన్న గ్రామాలు, పంట పొలాలు నష్టపోతున్నాయంటే ప్రభుత్వ వైఫల్యం

** 17 - బాడవ ప్రజల కోసం వరద గ్రామంలోనే రాత్రి సైతం బస చేసి, కలెక్టర్ తో మాట్లాడి అధికారులను సమన్వయం చేయడంతోపాటు, తీవ్ర వరదలో గ్రామంలో పర్యటించి, వారితో మాట్లాడి ధైర్యం చెప్పి భరోసా

** 16 - 3 సం లలో ఏటిగట్టు పటిష్టత లేదు. గోదావరి వరదలకు ముందు జాగ్రత్తగా వేసవిలోనే ఇసుక బస్తాలు, సర్వీబాదులు, తడికలు వంటి అత్యవసర సామాగ్రి టెండరు పిలిచి సర్వ సన్నద్ధంగా ఉండవలసిన ప్రభుత్వం మొద్దు నిద్ర

** 15 - ఆకాశంలో జగన్- వరద లో జనం. కనకాయలంక లో రాత్రి బస అనంతరం లంక గ్రామాలలో వరద నీటిలో, ఇంటింటికి తిరుగుతూ, ప్రజలకు ధైర్యం చెప్తూ వారి సమస్యలను తెలుసుకుంటూ. ప్యురిఫైడ్ నీటిని అందించాలని, పిల్లలకు పాలు, బిస్కెట్లు, పెద్దలకు బోజనాలు సమయానికి అందించాలని కలెక్టర్ని కోరడం జరిగింది...

** 14 - కనకాయలంకలో రాత్రి బస. గత 3 రోజులుగా కనకాయలంక గ్రామాన్ని వరద నీరు చుట్టుముట్టి ఇంట్లో నుండి బయటకు వచ్చే పరిస్థితి లేనప్పటికీ కనీసం మంచినీరు, పిల్లలకు పాల ప్యాకెట్లు గానీ లేక కట్టెలు, పొయ్యలు నానిపోయి వంటలు చేసుకోలేనటువంటి స్థితిలో, కనీసం భోజనాలు ఏర్పాటు చేయని స్థితిలో కనకాయలంక

** గాలి వాగ్దానాలు, గాలిలోనే. గోదావరి వరదలు ముంచెత్తుతాయని గత 4 రోజుల నుండి సమాచారం ఉన్నప్పటికీ ఒక్క ముందు జాగ్రత్త చర్య కూడా తీసుకోని మొద్దు ప్రభుత్వం.

** ప్రజారోగ్యం దృష్టిలో పెట్టుకుని పారిశుధ్య కార్మికుల సమస్యలను వెంటనే పరిష్కరించాలి

** 13 - నియోజక వర్గం లో నేడు ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం లో భాగంగా పాలకొల్లు మండలం ఉల్లంపర్రు గ్రామం, యలమంచిలి మండలం కాజా వెస్ట్, వడ్డిలంక గ్రామాలలో పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొని పార్టీ సభ్యత్వ నమోదు మరియు, వాటర్ వెరిఫికేషన్, ప్రభుత్వ బాదుడు వివరిస్తూ తిరగడం

** రాష్ట్రపతి అభ్యర్ధి శ్రీమతి ద్రౌపది ముర్ము గారి పరిచర్య కార్యక్రమానికి ముందుగా తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారు, BJP రాష్ట్ర అధ్యక్షులు సోము వీర్రాజు గారు, సభ్యులు జీవిల్ గారు, రమేష్ గారు ,MLC మాధవ్ గారు అచ్చెం నాయుడు గారు, యనమల గార్లతో డా.నిమ్మల

** 11 - పంచాయతీలలో చిల్లిగవ్వ ఉంచలేదు…
** పుస్తకాల సంచితో లీటర్ వాటర్ బాటిల్ సార్... జోరు వానలో మా చిట్టిమాను గర్వు స్కూల్ ను విడగొట్టవద్దు అంటు పసిపిల్లలు వారి తల్లిదండ్రులతో కలసి మొగల్తూరు డ్రైన్ వంతెన పై ధర్నా చెయ్యగా వార్కి అండగా ఉంటానని సంఘీభావం

** ఓటర్ ఇంటింటి సర్వే , సభ్యత్వ నమోదు మరియు ప్రభుత్వ బాదుడే బాదుడు వివరిస్తూ నేడు 35వ వార్డు, కొమ్ముచిక్కాల ఇంటింటికి తిరుగుతుంటే నేడు పనులు చేయట్లేదుగాని పన్నులు మాత్రం ముక్కుపిండి వసూలు చేస్తున్నారు...

** 10 - ధాన్యం డబ్బులు లేవు

** 9 - కొడుకు కరోనాతో చనిపోతే కనికరం లేకుండా తండ్రి పెన్షన్ తీసేసారు…

** 8 - నేడు రైతు దినోత్సవం కాదు రైతు దగా దినోత్సవం..
ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమంలో భాగంగా నేడు పాలకొల్లు మండలం గవరపేట, యలమంచిలి మండలం బూరుగుపల్లి, పాలకొల్లు టౌన్ 14వ వార్డులలో ఓటర్స్ సర్వే , మెంబెర్షిప్ చేస్తూ ప్రజలపై జగన్ బాదుడు ను వివరిస్తూ .....

** 7 - మా స్కూల్ ఉంటేనే చదువుకుంటాం ....
పాలకొల్లు మండలం లంకలకోడేరు గ్రామంలో నెం.1 ప్రైమరీ స్కూల్ నుండి 3,4,5 తరగతులు విడదీసి హైస్కూల్లో కలపడంతో విద్యార్ధులు,తల్లితండ్రులు నిరసనకు సంఘీభావం తెలియచేయడం జరిగింది.

** 3 సంవత్సరాలు అయిన ఇల్లు లేదు... ఈ రోజు 24 వ వార్డు నందు ఇంటింట వాటర్స్ సర్వే , మెంబెర్షిప్ కార్యక్రమం లో తిరుగుతున్నప్పుడు ప్రభుత్వ బాదుడుపై మండి పడుతున్న మహిళలు....

** ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ సంఘాల సమాఖ్య (FAPTO) వారు ప్రాధమిక పాఠశాలలు విచ్చిన్నం చేసి 3,4,5, తరగతులు ఉన్నత పాఠశాలలలో వీలీనం చేయడం, GO.117 కి సవరణలు చెయ్యాలని,సిఫార్సు బదిలీలు వంటి సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి తమకు తగిన న్యాయం చెయ్యాలని వినతి పత్రం అందించడం జరిగింది..

Prajanayakaudis Diary - Nimmala Ramaiah for Palakollu public- I am with you  
Author photo Sri, Telugu , 15+ yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 840+ Foreign and local events/ places coverage, 2174 General Articles and views 2,220,090; 104 తత్వాలు (Tatvaalu) and views 245,336
Dt : 18-Jul-2022, Upd Dt : 18-Jul-2022, Category : Politics
Views : 705 ( + More Social Media views ), Id : 1467 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags : prajanayakadu , leader , political , mla , tdp , diary , nimmala , ramaiah , palakollu , assembly , public
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.

Share
కేవలం ఒక మీడియా వార్త నే నమ్మలేము, ఒకే చోట అందరి వార్తలను ఇక్కడ చూసి, నిజాలు పోల్చుకోగలము
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 12 yrs
No Ads or Spam, free Content