Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
1 min read time. ముందు మన తండ్రిలాంటి వారు తెలుగు గురువులు బ్రహ్మం, రాఘవేంద్ర, వేమన గార్లు. ఆ తర్వాత బాబాయిలు ఇతర భాషా గురువులు. ఇతర బాబాయిలు ను అనేకన్నా, మనది సరైన నిర్ణయమేనా, లేదా వ్యాపార బలహీన మానసిక బానిస రోగమా అన్నది చాలమంది కి తెలీదు.
తండ్రి తప్పు ఉంటే స్పష్టము గా చెప్పు, ఆయనా రాసిన కాలజ్ఞానం కంటే, వీరు రాసిన వేమన శతకం కంటే, మా 2 ఏళ్ళ ఆచరణలో, పరాయి భాష హైందవ బాబాయి స్వయముగా రాసిన చరిత్ర బాగుంది అని చెప్పు.
రుజువులు లేకుండా, గాలి మాటలు నమ్మేసి, తమ జీవితాలను వ్రుధాగా బలి చేసుకుంటారు. అదేమంటే వారి వితండవాదం ఎలా ఉంటుంది అంటే, అన్ని దేశాలు లో కోటి మంది పైగా కరోనా తో పోయారు, అంటే ఇన్ని దేశాలు ఇంత మంది తెలివి తక్కువ వారా? కాబట్టి మేమూ పోతాము, ఇదే ఉత్తమమైన భవిష్యత్తు బలమైన నమ్మకం అంటారు.
అసలు మహారాష్ట్ర ముఖ్యమంత్రి కి, బలము మహిమ ఉందా లేదా, మనకెందుకు? ఆయనకు 100 పూజలు చేసినా, భాగ్యనగరము/విజయవాడ లో మనకు ఏమి చేస్తారు? అది, తెలుగు నేల సీయెం కి అవమానం కాదా? అంటే తెలుగు పుటక పుట్టి, తెలుగు వారికే వెన్నుపోటు పొడుస్తామా?
ఇంకొకరు మాతాత లేదా మా అమ్మ చెప్పింది అంటారు. తప్పు ఎవరు చెప్పినా, ఒకటే. ధర్మము అయితే, పసిపిల్లలు చెప్పినా వినాలి.
10 ఏళ్ళ అబ్బాయి, ఓ తండ్రి మీరు పొగ మరియు మందు తాగవద్దు అంటే, మనము మానేయాలి. నీకేమి తెలుసు గమ్ముగా ఉండు అంటే, ఎదురుగా చేస్తూ. రేపు ఎదిగాక, అతనూ అదే మాట అంటాడు.
కాబట్టి పెద్దా చిన్నా కాదు ముఖ్యం, ధర్మమా అధర్మమా అనేది మాత్రమే ముఖ్యం. మనము రుజువు చూపించాలి తాగితే చావము, కుటుంబము రోడ్ మీద పడదు అని. అంతే గానీ సినిమా పాటలో చెప్పారు, తాగని వాడు గాడిద అని, కాబట్టి నేను తాగాలి అంటే. పిల్లాడూ చాటుగా మొదలు పెడతాడు.
పసివాడు ప్రహ్లాదుడు, కన్న తండ్రి చెప్పిన తప్పుడు మాటలను అభూత కల్పనలను విశ్వసించలేదు, నారాయణుడు మాత్రమే సర్వాంతర్వామి దైవము ఆర్తుల రక్షకుడు నిజము అని నమ్మాడు.
ఇది చదివిన తెలిసినా కూడా మూర్ఖులు, తల్లి తండ్రులకు నచ్చ చెప్పి, మార్చరు. చదువు, తెలివి, కల్లా కపటం లేని లేదా ఉన్న పెద్దలు, విమానం లో బెల్ట్ వద్దు, మన ఊళ్ళో మన కారులో పెట్టుకోము కదా అంటే, 2 చోట్ల పెట్టుకోవాలి, అని తప్పును సరిచేయమా? అన్ని విషయాలు తల్లి దండ్రుల కు తెలియాలి అని ఉందా?
సరే చిన్న కధలోకి వెళదాము.
తెలిసిన స్నేహితులు కూతురు కి సంబంధం చూడటానికి వెళుతూ, మనల్ని పిలిచారు, మీరైతే వారి అంతరంగాన్ని ముఖకవళికలు చదవగలరు, అబద్ధాలు కు ఎదురు ప్రశ్నిస్తారు, 20 ఏళ్ళుగా చూస్తున్నాం అన్నారు. మీరు దైవ ఉపాసకులు కూడా, కఠిన సాధన చేస్తున్నారు పక్కా సాక్ష్యం తో, ఏళ్ళుగా అందరికీ చూపిస్తున్నారు, అన్నారు.
ఈరోజులలో సంబంధం దొరకడమే కష్టం. దొరికిన దానితో తృప్తి పడి, ముందుకు పోక, మాలాంటి వారు ఎందుకు. మాది లోగుట్టు లాగే, గూడాఛారి రాశి. వాళ్ళు సమాధానం చెప్పలేక, తప్పు లు ఒప్పుకోలేక, మనల్ని గెట్ అవుట్ అంటే, మన పరువూ పోతుంది, సంబంధం చెడిపోతుంది. మేము రాము అన్నాము.
వారు బతిమాలుతూ, పెళ్లి వారు కోపం తో, నిజం గా, గెట్ అవుట్ అని బయటకు నెడితే, ఈ సంబంధం ఆగిపోతే వారి నటన అబద్ధాలు వలన, మీకు లక్ష రూపాయల బహుమతి ఇచ్చి, మా ఇంటిల్లిపాదీ మీ కాళ్ళకు నమస్కారం చేస్తాము. సజీవ గురువు సేవ చేస్తూ ఉన్న మీకన్నా, మాకు దగ్గర తెలిసిన, మా గుణాలు పూర్తిగా తెలిసిన, దగ్గరి శ్రేయోభిలాషి గురువు ఎవరు ఉన్నారు? తల్లిదండ్రులు కూడా దగ్గర లేరు మాకు, మీదే భారం, అన్నారు.
మీకు పిచ్చి నా? ఇంత నేరుగా చెప్పిన కూడా మూర్ఖత్వం తో రమ్మంటున్నారు, కొంపతీసి మీరు, వాస్తవం కు దూరంగా భ్రమల్లో ఉండే, బాబాయి భక్తులా అని అడిగాం.
లేదండీ, తండ్రి భక్తులం కాబట్టే, మీ మాటే వేదం. ఇందు లో మా స్వార్థం కూడా ఉంది. మా బంధువులు ఇలాగే పెళ్లి వారి అబద్ధాలు నమ్మి, కోటి తగలబెట్టి పిల్ల గొంతు కోసారు, ఇంక పెళ్లి కాదు, మరలా దొరకదని, ఉప్పు లో కాలేసారు. ఇప్పుడు కోర్టు లు లాయర్లు చుట్టూ లక్షలు పోసి, మనశ్శాంతి లేకుండా తిరుగుతున్నారు. వీసా సమస్య, పుట్టిన సంతానం సమస్యలు లో వాళ్ళ బాధ వర్ణనాతీతం. తర్వాత తెలిసింది, ఇరువైపులా కూడా, వాస్తవాన్ని విడిచి, బ్రమలలో ఉండే బాబాయి భక్తులు అని. అవతల వారు చెప్పింది అన్ని అబద్దాలు, వీరు పిచ్చిగా నమ్మారు మోహములో.
కాబట్టి పెళ్లి తర్వాత, గెట్ అవుట్ అంటే, నిద్ర లేని రాత్రులు కంటే, కోటి ఖర్చు కంటే, మీకు లక్ష బహుమతి ఇచ్చి, వారితో ఇప్పుడే గెట్ అవుట్ తేలిక, వారి బుద్ది బయటపడుతుంది, శ్రమ సమయం పరువు ధనం మనశ్శాంతి మిగులు తుంది.
మీ ప్రశ్నలు కు, పెళ్లి వారు, జవాబు గౌరవం గా ఓపిక సహనం మర్యాద తో చెబితే, ఇంక జీవితం లో ఎన్ని కష్టాలు వచ్చినా కూడా, ఆ జంట విడిపోదు, 80 శాతం గారంటీ అన్నారు. ఎందుకు అంటే, మోహం పెళ్లిళ్లు 50 శాతం కూడా గారంటీ లేదు కదా, అన్నారు.
సరే, అని వెళ్ళాం అక్కడ కు. ఓ పక్కన అనామకుని లా కూర్చుని, వాళ్ళ తతంగం మొత్తం విన్నాము. ముందే జాగ్రత్తలు చెప్పాము, తెలిసిన స్నేహితులు అన్న పదం తప్ప, మన గురించి ఏమీ చెప్పవద్దు, అసలు మనం అక్కడ లేనట్లు మీ ప్రవర్తన ఉండాలి. లేదంటే వారూ మాటలు చేష్టలు జాగ్రత్తలు పడుతారు, అని ముందే చెపితే, వారూ అదే విధంగా తూచ తప్పకుండా చేశారు.
ఇచ్చి పుచ్చుకోవడం అన్ని విషయాలు మాట్లాడారు. ఇప్పుడు మనం దగ్గర పూర్తి సమాచారం ఉంది. అలాగే వారి ముఖ కవళికలు, భావాలు, నటనలు, తొందరపాటు, తడబాటు, నాలిక కరచుకోవడం, ఆగి జవాబు చెపడం, అతి వినయం, ఆర్భాటం, అబద్ధాలు అన్ని స్పష్టం గా కనపడుతుంది, భవిష్యత్తు సమస్యలు సినిమాలా తెలుస్తుంది, కప్పదాటు మాటలు ఎన్నో.
ఇంక మన ప్రశ్నలు పరంపర మొదలు అయింది, ఇందాక మీరు ఇలా అన్నారు, దీని అర్థం ఏమిటి? వారు పది చెప్పారు, మనం 20 అడిగాము. నీళ్ళు నమిలారు. మొఖ కవళికలు ఊసరవెల్లి రంగులు మారుతూ, జవాబు లేక ఎదురు ప్రశ్నలు మొదలు పెట్టారు.
అసహనం తో, మీరు లాయరా పోలీసా, మమ్మల్ని ఇలా గుచ్చి గుచ్చి, దొంగలు గా చేసి అడుగుతున్నారు అని అడిగారు.
కాదు, కాలజ్ఞానం రాసిన బ్రహ్మం, శతకాలు రాసిన వేమన, రాఘవేంద్ర స్వాముల, భగవద్గీత కృష్ణయ్య, కాశీ శివయ్య, సజీవ గురువు సేవ చేస్తూ ఉన్న అజ్ఞాన శిష్యులం. మీ ఇంట్లో తెలుగు గురువు ల ఫోటో కూడా లేదు, ఎక్కడా. అంటే వాస్తవం లో ఉండరు, వాస్తవాలు మాట్లాడరు ఒప్పుకోరు తొందరగా.
లోపాలు ఉన్నా, నిజాన్ని గౌరవిస్తాం, మీ దగ్గర పెళ్లి విషయాలు గురించి సరిన జవాబు లేదు కాబట్టి తప్పు ను గౌరవం గా ఒప్పుకోండి, లేదా సెలవు ఇప్పించండి అని లేచి నమస్కరించాము.
అయ్యో అంత కోపం తొందర అయితే ఎలా. కాసేపు ఆగండి, ఆలోచించుకోనీయండి, మంచి సంబంధం, బంగారం లాంటి పిల్ల అన్నారు.
సరే ఆ పెళ్లి ప్రశ్న లు వదిలేయండి. మీ తల్లి తండ్రి గారి గురించి చెప్పగలరు. ఏమి చేశారు ఉద్యోగం, ఇప్పుడు ఎక్కడ ఉన్నారు అని అడిగాం.
ఏవండీ అంతా మా బాబాయే చూశారు. బాబాయి వలనే పెరిగాం. బాబాయి వలనే పెళ్లి అయింది, ఇల్లు కట్టుకున్నాం, పిల్లలు కన్నాం. పచ్చకార్డు పౌరసత్వం కూడా బాబాయి నే ఇప్పించారు. అంతా బాబాయి దయ మహిమ అన్నారు.
జవాబు దాట వేసారు, పిచ్చి స్థాయి అర్ధం అయ్యింది. మీకు గురువు దేవుని వైపు మాత్రమే ద్రుష్టి మరలుస్తారు అన్న విషయం కూడా తెలీదు.
సరే మీ అబ్బాయితో విడిగా మాట్లాడవచ్చా? సరే మాట్లాడండి.
అబ్బాయి, నాన్న కనపడలేదు, ఏమి చేస్తారు నాన్న? నాన్న గురించి 2 మంచి మాటలు చెప్పు?
నా చదువు నా పెంపకం అంతా బాబాయి దయ. నాకు ఈ పెళ్ళి కూడా, బాబాయి వలనే కుదురుతుంది. ఈ రోజు నా శ్వాస కూడా, బాబాయే.
ఓహో ఇంట్లో అందరూ ఇంతేనా? అవునండి, మా నాన్న తప్ప, అందరూ ఇంతే. నాన్న ఆ గదిలో ఉన్నారు.
అవును, అన్ని బాబాయి దయ అన్నావు, మీ సొంత అమ్మ నాన్న, 25 ఏళ్ళుగా చేసింది ఏమీ లేదా? మనకు దేవుళ్ళు విష్ణువు/ శివుడు/ ఆదిశక్తి అందరి వలన, ఏమీ ఉపయోగం లేదా? మీ అమ్మా నాన్నలు నీ గురువులు కాదా? తెలుగు గురువులు తెలీదా? అయితే, వారి గురించి ఏమీ చెప్పలేదు ఇంతవరకు?
ప్రతి దానికి, బాబాయి లోనే అన్ని చూస్తాను అండి అని జవాబు.
మరి శివుడు/ విష్ణువు/ అమ్మా నాన్న లోనే, ఇతర భాషా బాబాయిని మామయ్యను కూడా చూడవచ్చు కదా? ఇంకా ఇతర భాషా బాబాయిల గొడవెందుకు? పోనీ మీ స్నేహితులకు మన తెలుగు గురువుల ఫోటోలు ఇచ్చి ఇంట్లో పెట్టుకోమని కోరావా?
ఇచ్చాను అండి, కానీ వారు తీసుకోలేదు, మాకు స్థానికి భాషా గురువులు ఉన్నారు, అని గౌరవముగా చెప్పారు.
సరే, మీ అమ్మా నాన్న ను, ముదుసలి తనములో దగ్గర ఉంచుకుని చూస్తావా?
అంతా బాబాయే చూసుకుంటారు, నాకు పని లేదు. మా తాత అమ్మమను కూడా మేము దగ్గర పెట్టుకోలేదు, బాబాయి కే వదిలేశాము.
సరే, మీ నాన్న గది చూపించు, 2 మాటలు ఆయనవి విని, వెళ్ళి పోతాము. చూపించాడు.
నమస్కారమండి అంటూ లోనికి వెళ్ళాను, ఆయన ఆప్యాయముగా చేతులు పట్టుకుని, భలే వారే, రండి కూర్చోండి, మిమ్మల్ని వచ్చిన దగ్గర నుంచి గమనించా, నా మనస్తత్వానికి సరిపోయే వారు మీరే అన్నారు.
ఏమిటి అండి, మొదట నిమిషము కనిపించి వెళ్ళి పోయారు, ఇచ్చిపుచ్చుకోవడం అప్పుడు ముభావముగా ఉన్నారు, మరలా మాయం అని అడిగాను.
మీరు మనసులోనే పెట్టుకోండి అంటూ, చేతులు పట్టుకుని చెప్పారు. ఇంట్లో వారి పిచ్చి మాటలు అబద్దాలు నేను వినలేక పక్కకు వచ్చాను. బయటి తప్పుడు మాటలు వింటారు, ఊహించుకుంటారు, నాకు అవి నచ్చవు. అందుకే నన్ను దూరంగా పెడతారు, అని అన్నారు.
అర్ధము అయ్యింది, మీరు ఒక్కరే వాస్తవం మాట్లాడారు. మరి మేము వెళితే, మీరు బాధ పడతారా? అని అడిగాను.
లేదండీ, నిజాయితీ గా ఉండే వారికే, పిల్లను ఇవ్వండి. మాయలు బ్రమలు అబద్దాలను నమ్మే, వాటిలో బతికే వారికి ఇవ్వద్దు. ఎందుకంటే, తర్వాతి బ్రతుకంతా, బ్రమలే అన్నారు నవ్వుతూ.
ధన్యవాదాలు, దేవుడు మీతో కూడా ఉన్నారు, నిజాలు మాట్లాడే ప్రతి వ్యక్తిలోనూ, దేవుడు ఉంటారు. ధర్మం ముఖ్యం, బంధం కాదు. అని వారి దగ్గర సెలవు తీసుకుని, త్వరలో కబురు చేస్తాము అని ఇంట్లో అందరికి చెప్పి, ఆనందముగా అందరమూ బయటకు వచ్చాము, ఉచ్చునుంచి బయటపడినట్లు.
ఒక తప్పును సర్ది పుచ్చుకోవడానికి 100 తప్పులు చేయాలి. అలాగే ఒక బ్రమను నమ్మించడానికి 100 బ్రమలు అబద్దాలు మాయలు మోహాలు కల్పించాలి. నీటి బుడగలు పేలితే, అక్కడ ఏమీ ఉండదు. కాబట్టి వాస్తవము లో బతుకుదాము. అరిషడ్వర్గాల బానిసలు, రుజువులు లేని మాటలను నమ్ముతారు.
ఇది చదివిన వారికి, అర్ధం చేసుకుని ఆచరించిన వారికి, బయట బాబాయిల మాయలు తొలగి వాస్తవం ఎరిగి, గురు పౌర్ణమి రోజున, ఆదిశక్తి, క్రిష్ణయ్య, శివ, వాల్మీకి, వ్యాస, శంకర, రామానుజ, బ్రహ్మం, రాఘవేంద్ర స్వామి, వేమనలను కొలిచిన పుణ్యం దక్కును గాక.
*Praise uncle with foolishness, dont belittle the quality of our elders and upbringing marriage words*
Sri, Telugu , 10 yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 828 Foreign events/ places coverage, 1801 General Articles and views 1,394,092; 94 తత్వాలు (Tatvaalu) and views 184,767 Dt : 12-Jul-2022, Upd Dt : 12-Jul-2022, Category : General
Views : 329
( + More Social Media views ), Id : 1460 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags :
raghavendra ,
vemana ,
brahmam ,
worship ,
guru ,
purnami ,
facts ,
praise ,
guruvu ,
uncle ,
foolish ,
belittle ,
quality ,
elders ,
upbringing ,
marriage Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది. అన్ని పత్రిక, టీవీ, సంక్షిప్త, రేడియో వార్తలు ఇక్కడే, అబ్బో అన్ని లింక్ లు గుర్తు వద్దు
Facebook Comments