పానకం, వడపప్పు, సీతారాముల కళ్యాణం, చలువ పందిళ్ళు, మైకు ల్లో భక్తి పాటలు - Health - లోకం తీరు/ News
           
     
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. 1247 కధనాలు. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు. 1277 General Articles, 47 Tatvaalu.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
చివరలో ఉన్న చిత్రం/ వీడియో/ ఆడియో మరువద్దు. 1 min read time.

గురువు లందరికీ శ్రీరామ నవమి శుభాకాంక్షలు. ఆ రోజుల్లో ప్రతి ఇంట మోగే, శ్రీ సీతారాముల కల్యాణము చూదము రారాండి పాటను చూడండి కింద వీడియోలో.

పానకం, వడపప్పు, సీతారాముల కళ్యాణం, చలువ పందిళ్ళు, మైకు ల్లో సినిమా మరియు భక్తి పాటలు, చింతామణి, హరిశ్చంద్ర, కృష్ణ రాయబారం, రామాంజనేయ యుద్ధం నాటకాలు, అబ్బో ఇంకా ఎన్నెన్నో. ఇంకో వైపు తెరలు కట్టి, పాత సినిమాలు కూడా, చాపలు కుర్చీలతో జనం.

సెంటర్ నుంచి ఇంటికి వెళుతుంటే, మూడు పందిళ్ళు ఆరు ప్రసాదాలు గా సందడే సందడి. ఇదంతా గతం, ఇప్పుడు బయటకు రాలేము, కానీ పాత ఫోటోలు, వీడియో లు, సినిమా లు చూడగలం. రామసేతు లాంటి మంచి సాక్ష్యము ఉన్నా కూడా, రామాయణం నిజమా అంటారు కొందరు. సరే, ఏది అనుకున్నా, ఆ లక్షణాలు మంచితనము మనకు ఉన్నాయా?

ఇంతకీ రామయ్య కుటుంబం నుంచి ఏమి నేర్చుకున్నాము? వారిది, మంచి ఆదర్శం కుటుంబ వ్యవస్థ. కనీసం ఈనాడు, వాటిలో ఒకటి అయినా పాటిస్తూ ఉన్నామా? పాటించకుండా, ఏమైనా పాముకున్నామా? చూద్దాం మరి, రామయ్య కుటుంబ విశేషాలు.

* తండ్రి మాట జవదాటని కొడుకు లు కూతుళ్లు, అన్న మాట జవదాటని తమ్ముళ్లు చెల్లెళ్ళు, భర్త మాట మీరని భార్యలు, భార్యలను ప్రేమగా బాధ్యత గా చూసే భర్త లు

* ప్రజలను కన్న బిడ్డలు గా చూసే రాజులు. ఈనాటికీ రామరాజ్యం రావాలి అని మనం అంటున్నాము

* అక్క, చెల్లెళ్ళ బిడ్డలను తమ సొంత బిడ్డ లు గా చూసే తల్లులు

* భర్త కోసం అడవికి పోయిన భార్య, అన్న తో పాటు అడవి కి తమ్ముడు, అది కూడా ముందు కాపలాగా నడవడం

* గురువు గారి మాటవినే శిష్యులు, శిష్యులు నే కౌసల్యా సుప్రజా రామా అని నిద్ర లేపే గురువు. రాజు గారి బిడ్డలైనా, గురువుని ఆయన విద్యను నమ్మి అడవులకు బిడ్డలను తోడు పంపారు, రాక్షస వధకు

* మంత్రించిన బాణాలనే, మారణహోమం సృష్టించే మిస్సైల్ గా, మరియు పని అయ్యాక తిరిగి వచ్చే ఆయుధాలు గా ఉపయోగించే, ఉత్తమమైన శక్తిగల చదువు

* నమ్మిన బంటు, సేవకుడు, విద్యావేత్త, బలవంతుడు ఎలాగ అణుకువగా ఉండాలో చూపిన ఆంజనేయుడు

* అధర్మ బలవంతుడైన వాలిని వదలి, ధర్మ బలహీనుడైన సుగ్రీవుని తో చెలిమి చేసిన రాజు

ఇంకా ఇలాంటివి ఎన్నో రామాయణం నుంచి మనకు నీతి నియమాలను నేర్పే విషయాలు. కనీసం ఇప్పుడు అయినా, మన సూక్ష్మ చెల్లి కరోనా దయవలన, మన పాత సాంప్రదాయాలను పాటిద్దాం.

భవిష్యత్ లో కరోనా 19, తమ అక్క లైన అనుష్క 21, ఇలియానా 22 వైరస్ లను, పంపనిచ్చే పరిస్థితి ని, ముందు జాగ్రత్తలు తో ఆపేద్దాం.

సర్వేజనా సుఖినోభవంతు  
Author photo Sri, Telugu , 10 yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 828 Foreign events/ places coverage, 1277 General Articles, 47 Tatvaalu
Dt : 01-Apr-2020, Upd Dt : 01-Apr-2020, Category : Health
Views : 861 ( + More Social Media views ), Id : 464 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags : ramayanam , ramanavami
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.

Share
కేవలం ఒక మీడియా వార్త నే నమ్మలేము, ఒకే చోట అందరి వార్తలను ఇక్కడ చూసి, నిజాలు పోల్చుకోగలము
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 9 yrs
No Ads or Spam, free Content