APLatestNews.com top Banner

Social Media links
ఊరు మరలా లాక్ డౌన్, అని పేపర్లు లో అంటే, గర్వపడాలా లేక సిగ్గుతో తల దించుకోవాలా? - General - లోకం తీరు/ News
           
     
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
చివరలో ఉన్న చిత్రం/ వీడియో/ ఆడియో మరువద్దు. 1 నిమిష చదువు సమయం.

మన ఊరు మాత్రమే, మరలా లాక్ డౌన్ అయ్యింది అంటే, రాష్ట్ర వ్యాప్తంగా అన్ని పేపర్లు లో వస్తుంది అంటే, మనం గర్వపడాలా లేక సిగ్గుతో తల దించుకోవాలా?

అత్యంత నిర్లక్ష్యపు మనుషులు లేదా సమాజం ఉన్న ఊరు మనది, అని మనకు అవార్డు ఇవ్వవచ్చు కదా? ఇవ్వకపోయినా, మనకు దక్కినట్టేగదా, జాక్పాట్ కొట్టేసినట్టే గదా? అంటే మన సొంత కుటుంబ ఆరోగ్యం క్షేమం కూడా వదిలేసి, హ్రుదయము లేని కిరాతకులు గా, పెంపకము చాతకాని వారిలా, సంస్కారము లేని వారిలా, మన తల్లి దండ్రుల పరువు తీస్తూ, మనం ఎవరినీ పట్టించుకోకుండా దేనినీ లెక్క చేయకుండా, విచ్చలవిడిగా తిరుగుతూ ఉన్నాము.

మన ఊళ్ళో నే గౌరవం గా ఇన్నాళ్లు, కరోనా ని ఉంచితే, ఆ చిట్టి రేపు మన ఇంటి దాకా రాదా, మన గుమ్మము ఎక్కదా? మరి న్యూజిలాండ్ ప్రజలు, ఎలా దూరంగా పంపారు కరోనా ని? ప్రపంచం మొత్తం ఒప్పకోవాలి కదా, వారు అత్యంత సమాజ బాధ్యత గలిగిన ప్రజలు అని. మనము, వీలైతే, పక్క ఇళ్ళకు ఊళ్ళకు కూడా అంటిస్తాము. పరీక్షలు చేయించుకోము, దాచిపెడతాము, మనతో పాటే మిగతా వారు బాధపడాలి.

ప్రతి వారి ఫేస్బుక్, వాట్సప్ ల లో, గత మార్చి నెల నుంచి కూడా, అందరం కరోనా జాగ్రత్తలు మీద జాగ్రత్తలు. మరి ఆచరణలో శూన్యం. ప్రభుత్వము ఎంత వరకు చేస్తుంది, అది మన బాధ్యత కాదా? మన పిల్లలు చుట్టాలు స్నేహితులు, రోడ్ మీద ఎందుకు లెక్క లేకుండా తిరుగుతున్నారు?

అందుకే కేసీయార్ గారు చెప్పారు గతంలో, ఇలా పిచ్చి పిచ్చి గా జనాలు చేస్తే, మిలటరీ ని దింపాలి తప్పదు అని.

మన మాటలు మరియు చేతలు అసలు కలవవు, గట్టి దెబ్బ పడిందాకా, కుటుంబము చితికిన దాకా, అంతేనా? సెంటర్ లో నిల్చొని, అరే చూడరా, ఈ పిచ్చి జనం సమాజ బాధ్యత లేకుండా మాస్క్ గ్లౌజు లేకుండా, దగ్గర దగ్గర ఎలా ఉండారో చూడు అంటాం. అదే సమాజంలో, నేను కూడా ఉన్నాను అని, నేనెందుకు సెంటర్ కు వచ్చాను, అని మాత్రం అనుకోము.

నేను, నా కుటుంబం తప్ప, అందరూ మారాలి. ఊళ్ళో అందరూ బాధ్యత లేని వారే, మేము మా పిల్లలు తప్ప, అంతేగా? ఇలాగే అందరూ నిర్లక్ష్యంగా ఉంటే అనుకుంటే, నష్టం పడేది మన కుటుంబం కాదా.

ఇలాగే ఉంటే, నష్టపోయేదెవరు? మనమే, మన కుటుంబ మే, మన బజారే, మన ఊరే. ఒకవైపు కరోనా వచ్చిన వారు, ఆసుపత్రిలో ఎలా నరకము అనుభవిస్తున్నారో కూడా చూసాము. కరొనా తో చనిపోయిన వారి పరిస్తితి చూసాము, అయినా మనము మారము.

ఈ కరోనా గుణపాఠం కూడా, మనకు ఎక్కలేదు అంటే, మనకు హ్రుదయము లేనట్టే గదా? భవిష్యత్ లో రాబోయే శక్తివంతమైనా కరోనా చుట్టాల ను మనం ఆహ్వానిస్తున్నాము. జాగ్రత్తలు సుమా, ఆరోగ్య మే మహా భాగ్యం.

74 ఏళ్ళ కన్నతల్లి ని ఎంత జాగ్రత్తగా, కరోనా బారిన పడకుండా, ఆరు నెలలుగా తెస్తున్నానో తెలిసిన మనిషి గా, మీ పాదాలకు నమస్కారం చేసి ప్రాధేయపడుతున్నా, మన ఊరు కరోనా ఆతిధ్య లిస్టు లో, చెరిపే ప్రయత్నం చేయండి ప్రభుత్వానికి సహకరించండి. మన కుటుంబం ని కాపాడండి.  
Author photo Sri, Telugu , 10 yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 828 Foreign events/ places coverage, 808 General Articles, 46 Tatvaalu
Dt : 21-Jun-2020, Upd Dt : 21-Jun-2020, Category : General
Views : 181 ( + More Social Media views ), Id : 583 , State : AP/ Telangana (Telugu) , Country : India
Tags : town , village , again lock down , news , news papers , proud , shame , corona , kovid 19
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
Share
అన్ని పత్రిక, టీవీ, సంక్షిప్త, రేడియో వార్తలు ఇక్కడే, అబ్బో అన్ని లింక్ లు గుర్తు వద్దు
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 8 yrs
No Ads or Spam, free Content