లైవ్ లో ఆవేశ జేయేసీ నేత, బీజేపీ నేత పై చెప్పుతో దాడి - ఖండించిన పెద్దలు - Politics - లోకం తీరు/ News
           
     
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. 1099 కధనాలు. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు. 1127 General Articles, 47 Tatvaalu.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
2 నిమిష చదువు సమయం.

దమ్మున్న అని వారు అనుకునే చానెల్ జ్యోతి లో, గట్టి గా అరిచే నీతులు చెప్పే, వెంకట క్రిష్ణ అనే పాత్రికేయుని సమక్షములో, వాదోపవాదాలకు వచ్చిన, ఆంధ్రప్రదేశ్ అమరావతి పరిరక్షణ సమితి జేయేసీ (తెదేపా మద్దతు దారు అంటున్నారు) అధ్యక్షుడు డాక్టర్ కొలికపూడి శ్రీనివాసరావు, చంద్రన్న చెపుతున్న సామరస్య నీతి పాఠాలను వంట బట్టించుకోకుండా, మనము ఇప్పుడు అధికారములో లేము అని గ్రహించకుండా,

బీజేపీ నాయకుడు విష్ణువర్ధన్ ని, మాటల దాడితో ఎదుర్కొనలేక, ఎదురు దాడితో జవాబు చెప్పలేక, ఆవేశాన్ని ఆపుకోలేక, చెప్పుతో కొడుతుంటే, అతిధుల మర్యాదను అడ్డుకోవడానికి, దమ్మున్న సీనియర్ జర్నలిస్ట్ రాధాక్రిష్ణ తరపున, ఒక్క బౌన్సర్ లేదా సహాయకుడు కూడా, జేయేసీ అలాగే తెదేపా మరియు ఆ చానెల్ పరువు గంగలో కలవకుండా ఉండడానికి, కాపాడడానికి, ఎవరూ ముందుకు రాలేకపోయారు, అని ప్రజలు విస్తుపోతున్నారు. వీడియోలో చూడగలరు.

దీనిని బీజేపీ నాయకులు వీరన్న, జీవియెల్, అలాగే వైసీపీ నాయకులు ఖండించారు. చానల్ యాజమాన్యమే తగిన చర్యలు తీసుకోవాలని కోరారు.

వైసీపీ నాయకులు బూతులు మాట్లాడుతూ ఉంటే, బాగా ప్రెస్స్ కవరేజ్ వస్తుంది, మనము మాత్రము ఎందుకు తగ్గాలి అని, తెదేపా సమర్ధన దారులు ఇలా చేస్తే, దోవ చూపిస్తే, రేపు అధికార వైసీపీ వారు ఇలాగే ఇంతకన్నా రెచ్చిపోతే, ఇక సామాన్యులకు దిక్కు ఎవరు, అని ప్రజలు విస్తుపోతున్నారు.

డాక్టర్ మెంటల్ ఫిట్ సర్టిఫికేట్ ఉన్నవారినే, వాదనలకు పిలవాలని, ప్రతి ఒక్కరి దగ్గర, ఒక బౌన్సర్ ని పెట్టాలని, వీలైతే డిబేట్ అయ్యిందాకా కదలకుండా కుర్చీలలో నే కట్టి అయినా ఉంచగలగాలని, 6 అడుగుల దూరములో మధ్యలో బౌన్సర్ ని ఉంచి అందకుండా కూర్చోపెట్టాలని, ముందు గానే వచ్చిన వారితో బాండ్ పేపర్ మీద తామే బాధ్యులమని సంతకాలు తీసుకోవాలని, ఏదైనా అవమానము జరిగితే, ఆసుపత్రి కోర్టు ఖర్చులు మరియు నష్టపరిహారము, బాధ్యత ఆ చానెల్ దే నని, పలువురూ అభిప్రాయపడుతున్నారు.

తెదేపా కు సంబంధము లేకపోతే, కుల ప్రసక్తి మాని, అమర్యాదను చెడ్డ సాంప్రదాయం ను, తెదేపా అధిష్టానం, ఈ చర్యలను ఖండించాలని పలువురూ కోరుతున్నారు. సోషల్ మీడియాలో అప్పుడే, తెదెపా మద్దతు దారులు తగిన శాస్తి జరిగిందని ప్రచారం మొదలు పెట్టారు. ఇది చాలా తప్పు, బీజేపీ నేత తప్పు మాట్లాడి ఉంటే విమర్శలు చేయవచ్చు గాని, ఇలా దాడికి ప్రోత్సహిస్తే, ఇక ఏ నాయకులు బయట తిరగలేరు అని అందరూ భావిస్తున్నారు.

Update on 24th feb - ఛానల్ శ్రీనివాసరావును బహిష్కరించి నట్లు ముందు రోజు చెప్పి, తర్వాత రోజు మరలా డిబేట్ కు పిలవడముతో, రాష్ట్ర బీజేపీ ఛానెల్ ను బహిష్కరించింది.  
Author photo Sri, Telugu , 10 yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 828 Foreign events/ places coverage, 1127 General Articles, 47 Tatvaalu
Dt : 23-Feb-2021, Upd Dt : 23-Feb-2021, Category : Politics
Views : 174 ( + More Social Media views ), Id : 987 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags : live , angry , amaravati , jac , leader , attacked , bjp , leader , sandals , vishnu , ycp , kolikapudi srinivas
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.

Share
NRI , అమెరికాలో లేదా విదేశం లో ఉంటారా, అయినా USA వార్తలూ ఇక్కడే
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 8 yrs
No Ads or Spam, free Content