పంచాయితీ ఆదాయం పోతున్నా అధికారులు కదలరు, ప్రజలకు అసౌకర్యమైనా పోలీసులు మెదలరు - Request - లోకం తీరు/ News
           
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. 1495 కధనాలు. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు. 1530 General Articles, 51 Tatvaalu.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
చివరలో ఉన్న చిత్రం/ వీడియో/ ఆడియో మరువద్దు. 2 min read time.

ప్రకాశం జిల్లా వేటపాలెం మండలం కొత్త పేట గ్రామం, రావి సుబ్బారాయుడు కళ్యాణ మండపం ఎదురు ప్రధాన రోడ్డు లో, కూతవేటు దూరంలో చీరాల డీఎస్పీ మరియు చీరాల 2 వ పోలీసు స్టేషన్, అరమైలు దూరంలో పంచాయతీ ఆఫీసు ఉన్నా కూడా, ధైర్యముగా కబ్జా షాపులు, రోడ్ పార్కింగ్. మనము బీదవారి షాపుల గురించి మాట్లాడడం లేదు, కేవలం ధనికులవి మాత్రమే.

ఏళ్లుగా లక్షల పంచాయతీ కబ్జా షాపు ల ఆదాయం పోతున్నా, మా నెల జీతాలు వస్తుంది చాలు లే, పంచాయతీ అలాగే ప్రభుత్వ ఆదాయం పోతే నష్టం ఏముంది అనుకునే, ఉత్తమ బాధ్యత గల సీనియర్ అధికారులు.

ప్రజలకు ఇబ్బందులు కలుగుతూ ఉన్నా, రోజూ చూస్తూ కూడా ప్రజా కంప్లైంట్స్ లేనిదే, రోడ్డు మీద రోజూ మనం తిరిగే చోట కూడా, ప్రజా ఇబ్బంది అసౌకర్యం ను ఆపని, 2 టౌన్ ఉత్తమ బాధ్యత గల పోలీసులు.

రోడ్డు కు అడ్డంగా బండ్లు ఆపి, ప్రజలకు ఇబ్బంది కల్గిస్తున్నా, ఆడవాళ్ళు తలవంచి సిగ్గుతో నడుస్తూ ఉన్నా, అడ్డంగా ఉన్న బండ్లు తో ఏదైనా ప్రమాదం జరగవచ్చు అన్న ముందు చూపు, అగంతకుల బండ్లు ఇతరుల ఇళ్ళు ముందు ఉండరాదని ముందు జాగ్రత్తలు, ఉత్తమ పోలీసుల కు పట్టదు.

ప్రభుత్వ పోరంబోకు కబ్జా స్ధలం లో షాపు కు, పంచాయతీ అనుమతి ఇచ్చిన పార్కింగ్ లోనే, బండ్లు పార్కింగ్ చేయండి, రోడ్డు మీద తిరిగే మనుషులు కు మరియు బండ్లు కు అడ్డంగా వద్దు అని, తమంతట తాము అధికారులూ చెప్పరు.

కబ్జా షాప్ తీయమని మనం ఎవరమూ చెప్పము, అది అధికారులు ఇష్టం. కానీ దాని అద్దెలో సగం అయినా పంచాయతీ కి వచ్చిన కూడా, పంచాయతీ ఆదాయం పెరుగుతుంది కదా? వీఆరెస్ కాలేజీ ఎదురు, 2 వ పోలీసు స్టేషన్ ఎదురు, ఇలా అన్ని కబ్జా షాపులకు పన్నులు వేస్తే వసూలు చేస్తే, పదేళ్ళు గా లక్షలు వచ్చే ఆదాయం ఎందుకు వదులుకుంటుంది, పంచాయతీ ప్రభుత్వం అని ప్రజలు విస్తుపోతున్నారు.

ఈ షాపు లేదా ఇలాంటి షాపు ల వారికి, ఎంత ధనం పన్నులు గా లేదా లంచం గా తీసుకుని, అనుమతి ఇచ్చారో పబ్లిక్ గా చెపితే, ఇతర ఇళ్ళు ప్రజలు కూడా, అలాగే పన్నులు కట్టి, తమ ఇంటి ఎదుట ప్రభుత్వ స్ధలం ను, తమ సొంత అవసరాలకు ఆదాయం కు, మిద్దే ధనవంతులు కూడా వాడుకుంటారు, అని ప్రజలు సవినయంగా కోరుతున్నారు.

పంచాయతీ అలాగే పోలీసులు, ఒకే విధానం, పంచాయతీ పరిధిలో ని, అందరూ ప్రజలకు, అలాగే ఊరు జిల్లా రాష్ట్రం మొత్తం, ఈ సదవకాశాన్ని కల్పించాలని కోరుతున్నారు.

సాయి బాలాజీ మరియు ఇతర అపార్ట్మెంట్ ల కు కేటాయించిన పార్కింగ్ స్ధలం లోనే, వారి నివాసస్ధులు బంధువులు స్నేహితులు, పార్కింగ్ వాడాలని, ఇతరుల ఇళ్ళు వద్ద పార్కింగ్ చేసి, ఎవరి బండో తెలియని పరిస్థితి లో, అగంతకుల కు దోపిడి దొంగలకు, అవకాశం ఇవ్వవద్దు అని ప్రజలు విన్నవిస్తున్నారు.

అలాగే రావి సుబ్బారాయుడు కళ్యాణ మండపం లో జరిగే పెళ్ళిళ్ళు కు, తగిన పార్కింగ్ చూపించి, బజారు ప్రజల ఇళ్ళు ముందు బండ్లు అడ్డంగా లేకుండా, అగంతకుల కు దొంగలు కు అవకాశం ఇవ్వకుండా, ముందు జాగ్రత్తలు తీసుకోవాలి ప్రజలు కోరుతున్నారు.

పెళ్ళిళ్ళ మైకులు మేళాల హోరుతో, స్ధానిక ప్రజల చెవులు చిల్లులు పడకుండా ఆరొగ్యం దెబ్బతినకుండా, తగిన సౌండ్ స్ధాయి, తగిన సమయం ఇచ్చి, ప్రజల నిద్ర ను మానసిక స్ధైర్యం ను, కాపాడవలసినదిగా కోరుతున్నారు.

ఇవి పంచాయతీ మరియు పోలీసు వారు, మైకులలో అందరికీ చెపుతూ, ముందు జాగ్రత్తలు చూపాలని నేర్పాలని పలువురు కోరుతున్నారు. ఇతరుల లేదా ఖాళీ ఇళ్ళు ముందు, అగంతకుల బండ్లు నిలపరాదు.

హాస్టల్ నడుపుతూ గదికి ఇద్దరు పిల్లలకు కనీసం అద్దెకు ఇస్తున్నారు. మరి వారు అందరూ, లీగల్ విద్యార్ధులేనా, తీవ్రవాదులు, తప్పుడు వారు కాదు అన్నది రిజిస్టర్ ఉందా, వివరాలు అడ్డ్రెస్స్ ఫోన్ నంబర్తో. ఎందుకంటే, అద్దెకు ఉన్న ఆమె చెత్త వేయద్దు, ఇటు వైపు సందులో అంటే, ఆమెను అగౌరవముగా చూస్తున్నారు. ఆ ఇంట్లో ఎవరిని పలకరించాలి చెత్త లేదా బండ్ల గురించి అడగాలి అంటే, ఆమె భయపడుతూ ఉన్నది. రెపు ఎదైనా దొంగతనమో ఇంకోటో జరిగితే, అద్దె పిల్లలు వెళ్ళిపోతే, ఎవరి బాధ్యులు?

ధన్యవాదాలు. ప్రజల మాన ధన రక్షణ మానసిక శాంతి కై, అధికారులు పోలీసులు సహాయం చేయాలని మా విన్నపము.

ఏళ్ళు గా పోలీసులకు, పంచాయితీ అధికారులకు ఇవి సంబంధం లేదా?

1. కబ్జా షాపుతో, సొంత ఇంటిముందు ఖాళీ లేక తమ కారు కోసం పక్క ఇంటి వారి స్థలం వాడుతున్న షాపు స్థల యజమాని మరియు వారి బంధువులు.

2. అపార్ట్మెంట్ లో స్థలము లేక, ఎదురింటి స్థలములో కార్లు పెడుతున్న, నివాసులు మరియు వారి బంధువులు

3. కబ్జా షాపుతో సొంత ఇంటి షాపు ముందు పార్కింగ్ ఖాళీ లేక కస్టమర్లు రోడ్ మీద, పక్క ఇళ్ళ
దగ్గర అడ్డముగా కార్లు బండ్లు

4. కల్యాణ మండపం పెళ్ళి అప్పుడు, వారికి పార్కింగ్ పంచాయితీ కేటాఇంచక, పోలీసులు పట్టించుకోక, అతిధులకు దోవ లేక రోడ్ బారుకు, ఇతరుల ఇళ్ళ ముందు కార్లు. రాత్రి అయినా పగలు అయినా, ఇవి దొరలవో దొంగల వో తెలిసే దెలా?

వాట్సాప్ స్టేటస్ లో ఫోటో సాక్షం చూడండి.

- - -

Update Apr 20, 2021

గతంలో మనం వేటపాలెం మండలం కొత్త పేట పంచాయతీ లో,

ప్రభుత్వ స్ధలం లో, కబ్జా షాప్ ల నిర్వహణ కు అలాగే రోడ్డు మీద పార్కింగ్ అనుమతి కి, పంచాయతీ పన్ను ఎంత తీసుకుంటుంది? అని సజీవ సాక్ష్యం తో అధికారులు కు విన్నవించాము.

ఇతరులకు కూడా, కబ్జా షాప్ తో రోడ్డు మీద పార్కింగ్, సమాన అవకాశాలు కు, ఎంత పన్నులు కట్టాలి? దయచేసి చెప్పమని కోరాము.

చీరాల ఎమ్మెల్యే లేదా జిల్లా మంత్రి లేదా చీరాల డీఎస్పీ అనుమతి, కావాలా అని అడిగాము.

ఇంకా జవాబు రాలేదు. కలెక్టర్ గారు, జిల్లా పంచాయతీ అధికారులు, జిల్లా మంత్రి, చీరాల ఎమ్మెల్యే కూడా గమ్ముగా ఉన్నారు, అవినీతి ని కబ్జా ను ప్రోత్సాహం చేస్తూ.

జగనన్న మచ్చ లేని పాలనలో, ఇలాంటి అక్రమాలు మచ్చ తెస్తున్నాయి అని పార్టీ శ్రేణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

చూడండి ఈరోజు ఇప్పుడు కూడా, ఇంకా రోడ్డు మీద నడిచే వారికి ఇబ్బందులు కలిగిస్తున్నా ఇప్పుడు కూడా, డీఎస్పీ సీఐ లు, అర కిలోమీటరు దూరంలో ఉండి కూడా, పట్టించుకోకుండా ఉన్నారు.

ఇప్పుడు అయినా పంచాయతీ అధికారులు కబ్జా షాప్ కు తగిన పార్కింగ్ చూపించి, రోడ్డు న నడిచే మహిళలు, పిల్లలు, వాహనాలు కు ప్రమాదం లేకుండా చూడాలని పలువురు కోరుతున్నారు.

Update Apr 23, 2021

ఏవండీ వేటపాలెం కొత్త పేట కబ్జా షాప్ పన్ను ఎంత, అలాగే వారికి సూచించిన పార్కింగ్ మరియు చెత్త డంపింగ్ స్ధలం గురించి వివరంగా చెప్పగలరు, ఏదైనా పురోభివృద్ధి ఉందా?

మీకు ఇతర నాయక అధికార ఇబ్బందులు, ఏమైనా ఉంటే దయచేసి చెప్పగలరు.

గమ్ముగా ఉండే కొద్దీ, పెద్ద నాయకులు పై అధికారులు అధిష్టానం ముందు, మనల్ని మనమే అవినీతి సమర్ధన కారులు గా, చిన్న వాటికి కూడా , ముద్ర వేసుకోవడం జరుగుతుంది, దైవ పాపం తో పాటుగా.

గుర్తు చేస్తూనే ఉంటాము, ఇంకో 3 ఏళ్ళు అయినా, మీకు పుణ్యం రావడం కోసం, అవినీతి మచ్చ తొలగించి, వారసుల బంగారు భవిష్యత్తు అభివృద్ధి బాటకై.

మనలో మాట.  
4 photos available. Please scroll through carousel by click/ touch left(<) and right(>) arrows.

Author photo Sri, Telugu , 10 yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 828 Foreign events/ places coverage, 1530 General Articles, 51 Tatvaalu
Dt : 30-Mar-2021, Upd Dt : 20-Apr-2021, Category : Request
Views : 497 ( + More Social Media views ), Id : 1061 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags : officials , panchayat , revenue , lost , police , chirala , vetapalem , inconvenient , public
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.

Share
కేవలం ఒక మీడియా వార్త నే నమ్మలేము, ఒకే చోట అందరి వార్తలను ఇక్కడ చూసి, నిజాలు పోల్చుకోగలము
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 10 yrs
No Ads or Spam, free Content