APLatestNews.com top Banner

Social Media links
మోదీ మొనగాడు రా బుజ్జీ - పేద పెద్ద కుల రిజర్వేషన్ అనే ధైర్యం, మాల్యా సొమ్ము లాక్కు నే దమ్ము , . . - Politics - లోకం తీరు/ News
           
     
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
2 నిమిష చదువు సమయం.

* ఆర్ధికంగా వెనుక పడిన పెద్ద కులాల విద్య, ఉద్యోగాల్లో 10 % రిజర్వేషన్ల ప్రతిపాదన
* దేశము విడిచి పారిపోయిన ఆర్దిక నేరరాజు కూడా విడువ లేదు
* నోట్ల రద్దు * ట్రిపుల్ తలాక్ * సర్జికల్ స్ట్రైక్
* GST * పౌరసత్వ బిల్లు
ప్రధాని మోదీ మొనగాడు రా బుజ్జీ - పేద పెద్ద కుల రిజర్వేషన్ అనే ధైర్యం, మాల్యా సొమ్ము లాక్కు నే దమ్ము , నోట్ల రద్దుతో పెరిగిన కార్డు గీకుడు, తలాక్ , సర్జికల్ స్ట్రైక్ , జీఎస్టీ, . . .

దేశము ను ప్రేమించు మన్నా . . . , వట్టి మాటలు కట్టి పెట్టి, . . . ఈరోజు న ఇంత స్వేచ్ఛ గా హాయిగా తిరుగుతూ ఉన్నాము అంటే మన దేశము ఇచ్చిన భిక్ష, మరువద్దు. బయట దేశాలు చూడండి, నిద్ర లేదు , తిండి లేదు, చదువు లేదు, స్వేచ్ఛ లేదు. ఎప్పుడు ఏమి జరుగుతుందో అని భయం. మేల్కొనాలి , నిజము తెలుసుకోవాలి, నిర్భయము గా మాట్లాడాలి. తెలివిగా ఓటు ఉపయోగించుకోవాలి. వాళ్ళు వేసే బిచ్చానికి, బిడ్డ లాంటి, ఓటు అమ్మొద్దు. లక్షల విలువైన ఓటును వెయ్యికి అమ్మి,, నీ పిల్లలకు పనికొచ్చే బంగారు భవిషత్తును, పాడు చేస్తూ అమ్ముడు పోవాలా?

మన మెప్పుడు ఇలా ఆలోచన చెయ్యాలి అభివ్రుద్ది కావాలి అంటే - మొదట మంచి మానవత్వం ఉన్న మనిషిని , భారతీయుడిని, తెలుగు వాడ్ని, తెలంగాణా/ఆంధ్రా/సీమ వాడిని, భాగ్యనగరం కూకట్పల్లి/బెజవాడ లబ్బిపేట/కడప వైయస్ నగర్ వాడ్ని, ఈ బజార్ వాడిని, ఈ ఇంటి బాధ్యత గల యజమానిని, ఆ తర్వాతే కులము గోత్రము మతము పార్టీ.

కాంగ్రెస్ హయాం లో, నెలకొక స్కాం మన తలకు జండు భాం. ఇప్పుడు, అడపా దడపా, ఎప్పుడో ఒకప్పుడూ, స్కాం అంటారు. నెలకొక స్కాం మంచిదా , ఎడాదికో రెండేళ్ళకో ఒకటి మంచిదా . అదీ నిజము తెలీదు. తప్పులు అందరూ చేస్తారు, జరుగుతాయి, మరి తక్కువ తప్పులు చేసిన వారు ఎవరు?

ప్రధాని మోదీ మొనగాడు రా బుజ్జీ అన్నాడు రాము, సోముతో. సోము ఆశ్చర్యంగా ఎందుకు అలా అన్నావు వివరంగా చెప్పు అన్నాడు.

1). పెద్ద కులాలు అయిన కమ్మ, కాపు, రెడ్డి, బ్రహ్మణ, వెలమ, రాజులు, ఇంకా చాలా కులాలలో, నిరు పేదలు ఎంతో మంది ఉన్నారు. వారిని పట్టిచ్చుకున్న నాధుడు లేడు. అన్ని రాష్ట్రాల , అన్ని పార్టీల నాయకులు, మిగతా కులాల గురించి మాట్లాడుతారు గాని, వీరిని గురించి మాత్రము మాట్లాడరు, మిగతా వాళ్ళకు కోపము వస్తుంది అని.

ఎన్నికలు గాని, ఇంకొ కారణము గాని, మోదీ అస్త్రానికి విల విల లాడి పోతున్నాయి విపక్షాలు. వద్దని చెప్పలేవు, కావాలని చెప్పలేవు, కానీ తప్పవు వారికి సన్నాయి నొక్కులు. వద్దంటే పెద్ద కులాలకు కోపము, కావాలంటే మిగతా వారికి కోపము. కోర్టు లో ఏమి అయినా కూడా, ఇంతవరకు ఎవరూ ఊహించని అనని మాట ఇది, యావత్ దేశము కూడా నిర్ఘాంతపోయింది.

ఆర్ధికంగా వెనుక పడిన పెద్ద కులాల వారికి విద్య, ఉద్యోగాల్లో పది శాతం(10 %) రిజర్వేషన్ల ప్రతిపాదనకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ఆర్ధికంగా వెనుక పడిన అన్ని కులాల లేదా మతాల వారికి విద్య, ఉద్యోగాల్లో రిజర్వేషన్లు సక్రమమే. అప్పుడే, భారతం ఎదుగుతుంది.

2) బాంక్ ల కు ఋణాలు ఎగ్గొట్టి, దేశము విడిచి పారిపోయిన ఆర్దిక నేరరాజు విజయ మాల్యాని కూడా విడువ లేదు. భారత ప్రభుత్వము తరుపున, లండన్ కొర్టులో పోరాడి గెలిచి, వెనక్కి పట్టి తెస్తున్నాడు. చచ్చి న పాము వల్లే ఇప్పుడు మాల్యా, నేను అంతా ఎప్పుడో కడతాను అని అన్నాను అని సన్నాయి నొక్కులు. అంతే గాక, భారత సుప్రీం లో కూడా గెలిచి, భారత్ లొ ఉన్న అన్ని ఆస్తులను కూడా జప్తు చేయబోతున్నాడు.

3) నోట్ల రద్దు, ఎవరూ ఉహించని దెబ్బ, దొంగ నోట్ల చలామణి లేదా దొంగ వ్యాపారం చేసే వారికి. సంవత్సరం ముందే చెప్పారు, టాక్స్ కట్టండి, డబ్బులు బాంక్ లో వెయ్యండి అని. ప్రపంచము అంతా కార్డులు గీకుతుంటే, పేద వాళ్ళు కూడా దర్జాగా వాట్సాప్ వాడుతుంటే జియో పుణ్యమా అని, ఇంకా మనము చినిగిన లేదా దొంగ నోట్లను లెక్క పెడుతున్నాము. 2000 కి కూడా మూడుతుందేమో త్వరలో.

4) ట్రిపుల్ తలాక్ - ఇస్లాం ప్రకారం భర్త 3 సార్లు తలాక్ అంటే, ఇక ఆ వివాహ బంధం రద్దు అయినట్లే. మతవిశ్వాసాలకు సంబంధించిన అంశం కాదని, ఇస్లాంని విశ్వసిస్తూనే, లింగ న్యాయం, లింగ సమానత్వం, మహిళల ప్రతిష్ట, మానవతా దృష్టితో లేవనెత్తిన అంశంగా కేంద్రం లెదా ముస్లిం మహిళా ఆందోళన కారులు భావిస్తున్నారు. అలా చెప్పే ధైర్యం, ముస్లిం మహిళా మద్దతు భారత దెశంలో ఒక్కరికే ఉన్నాయి. ఎప్పుడో ముస్లిం దేశాలు పాకిస్తాన్,బంగ్లాదేష్, ఈజిప్ట్, టర్కీ ,. . . లు కూడా బాన్ చేసాయి.

5) సర్జికల్ స్ట్రైక్ - విదేశం లో నిర్ణీత లక్ష్యాన్ని ఎంచుకొని, దానికి భారీ నష్టం వాటిల్లేలా సైనిక దాడులకు పాల్పడటమే సర్జికల్ స్ట్రైక్. దాడుల వల్ల సమీప ప్రాంతంలోని సామాన్య ప్రజలు, భవనాలు, నివాస సముదాయాలకు వీలైనంత తక్కువ ప్రమాదం సంభవించేలా ఉంటాయి. సైనికాధికారులు మాత్రం సర్జికల్ స్ట్రైక్స్ వల్ల భారత్‌కు ఒక వ్యూహాత్మక ఆధిపత్యం లభించిందని చెబుతున్నారు.

6). వస్తు, సేవల పన్ను (GST జీఎస్టీ) - పలు కేంద్ర, రాష్ట్ర పన్నులను ఏకైక పన్నుగా రూపొందించడం వల్ల రెండు మార్లు ఒకే పన్ను పడడం వంటి సమస్యలను పరిష్కరిస్తుంది, ఒకే జాతీయ మార్కెట్ సాధ్యమవుతుంది. పన్నులోని సరళత వల్ల పరిపాలన, అమలు సులభం అవుతున్నాయి. వినియోగదారుల కు మొత్తం పన్ను భారం అంచనాల మేరకు 25 నుంచి 30 శాతం వరకూ తగ్గడం, రాష్ట్ర సరిహద్దుల్లో పన్ను చెల్లింపుల గురించి, గంటల పాటు నిలుపుదల లేకుండా రవాణా సాగడం, పెద్ద ఎత్తున రాతకోతలు తగ్గుదల వంటి ప్రయోజనాలు.

7). పౌరసత్వ బిల్లు - పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఆఫ్గనిస్తాన్‌ల నుంచి అక్రమంగా వలస వచ్చిన ముస్లిమేతరులకు భారత పౌరసత్వం.

ఇంకా . . .

అవును నిజంగానే, ప్రధాని మోదీ మొనగాళ్ళకు మొనగాడు రా బుజ్జీ అన్నాడు సోము కూడా. ఈ విషయములు దేశము మొత్తానికి చెందినవి కాబట్టి, మన ప్రత్యెక హొదా గురించి తర్వాత మాట్లాడదాము. అయినా మనకు చెయ్యలేదు అని, దేశానికి చేసిన మంచిని కాదనగలమా. హోదా లోగుట్టు 4 ఏళ్ళు కాపురం చేసిన, జగత్ జెట్టీలు ప్రధాని మోదీ కి ముఖ్యమంత్రి బాబు కే ఎరుక, మన మెంత. అయినా ప్రతిపక్షనేత జగన్, కొత్త నేత పవర్ స్టార్ పవన్, ముఖ్యమంత్రి కెసీఆర్, ముఖ్యమంత్రి బాబూ ఉన్నారు గదా, ఈగ వాలనీయరు లే, అని నవ్వుకున్నారు.  
Author photo Sri, Telugu , 10 yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 828 Foreign events/ places coverage, 753 General Articles, 46 Tatvaalu
Dt : 30-Dec-2018, Upd Dt : 12-Apr-2019, Category : Politics
Views : 1441 ( + More Social Media views ), Id : 1 , State : AP/ Telangana (Telugu) , Country : India
Tags : modi , upper cast reservation , vijaya maalya , demonetization , triple talaq , GST , surgical strike , citizenship bill
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
Share
అన్ని పత్రిక, టీవీ, సంక్షిప్త, రేడియో వార్తలు ఇక్కడే, అబ్బో అన్ని లింక్ లు గుర్తు వద్దు
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 8 yrs
No Ads or Spam, free Content