చైతన్యం, అర్ధం, ప్రత్యక్ష డిబేట్ ధైర్యం లేని, తెలుగు ప్రవాస తేజ, విదేశీ విజ్ఞాన వ్యాపార ఎన్నికలు - America/ NRI
           
మిగతా వార్తలనూ విషయాలను చదవగలరు. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు. 2118 General Articles and views 1,880,547; 104 తత్వాలు (Tatvaalu) and views 226,169.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
చివరలో ఉన్న చిత్రం/ వీడియో/ ఆడియో మరువద్దు. 2 min read time.

చిన్న అనుమానం, దయచేసి తీర్చగలరు మీ అనుభవం తో, రాబోయే ఆర్టికల్ కు జ్ఞానం ఉండాలి కదా. ఇంకే మైనా ప్రశ్నలు, సరి కొత్త విధానం ఉంటే, దయచేసి చెప్పగలరు.

ప్రవాస తెలుగు వారు అంటే, మన కన్నా ఎక్కువ చదువుకుని, నీతి నియమాలతో ఎన్నికలు ఎదుర్కొని, ఉన్నది ఉన్నట్లు నిర్మొహమాటముగా మాట్లాడే, ధైర్యముగా అన్యాయాన్ని ఎదిరించే ఉత్తములు, బానిసత్వం దాసోహం అంటే తెలియని వీరులు, అని అనుకుంటున్నారా?

గూడుపుఠానీ గా కుమ్ముక్కు అయ్యి ఏకగ్రీవ ఎన్నికలు గా బయటకు చూపించి, తమ తప్పులు బయటకు రాకుండా కాపాడు కోరు, అమెరికాలో చదువుకున్న ఉత్తములు అనుకుంటున్నారా? తూచ్, ఎక్కడ అయినా, తెలుగు అప్రజాస్వామ్యమే ఏలుతుంది, వర్గం అవకాసం అవసరం ను బట్టి. మన తెలుగు తేజాలు ఎక్కడ ఉన్నా, మన అసాంప్రదాయ పక్కదోవలు అక్రమ పద్దతులు తూచ తప్పక పాటిస్తారు.

ఎంత మాట, అంతరిక్షానికి వెళ్ళినా, మన తెలుగు బుద్దులు సంస్క్రుతి మారదు గాక మారదు సుమీ. మీకు తెలిసిన 4 వేరు వేరు ప్రవాస తెలుగు వారిని, ఈ ప్రశ్నలు అడిగి జవాబు తెలుసుకోండి. link.

తెలుగు సంఘాల కొన్ని ఫోటోలు/ వీడియోలు చూడండి - TANA Meet Greet, CATS ugadi, GWTCS ugadi, NATS Students srmab, BATA Ugadi, TATA Dussera.

మరి కోవిడ్ నిబంధనలు అనుసరించి, ఆన్లైన్ లోనే ప్రచారం నిర్వహిస్తున్నారా, రాష్ట్రాలు తిరిగి కోవిడ్ పంచకుండా పెంచకుండా? చూద్దాము, బాధ్యత తెలివి గల వారు కదా మన కన్నా, ముందు చూపుతోనే ఉంటారు .

1). అమెరికా (లేదా ఎక్కడ అయినా విదేశాల్లో) ఏ తెలుగు సంఘ ఎన్నికల్లో అయినా, ఓటు హక్కు ఎవరికి ఉంటుంది, ఎవరికి ఉండాలి న్యాయ బద్దముగా?

సహాయం ఎవరికైనా చేయవచ్చు. ఏ తెలుగు వారైనా పొందవచ్చు, అమెరికా ప్రభుత్వం చేస్తున్నట్లుగా, దానికి ఓటు హక్కుకి సంబంధము లేదు.

అమెరికాలో కేవలము, పౌరునికే ఓటు హక్కు అని మన అందరికీ తెలుసు. ఇతరులకు ఉండదు, అయినా ఇతరులకు అన్ని సౌకర్యాలు ఉంటాయి, అందుతాయి. మరి తెలుగు సంఘాలు, ఆ మంచి పద్దతి పాటిస్తున్నాయా?

తమ అనుకూల మెంబర్ల సంఖ్య కోసం, తమ వారి గెలుపు కోసం, పాత కాలపు తప్పుడు పద్దతులు అవలంబిస్తున్నాయా?

ఓసీఐ కార్డు ఉన్నా లేకపోయినా, అమెరికా తెలుగు పౌరులకు, ఇండియాలో ఓటు హక్కు, ఏవిధముగా కూడా ఉండదని అందరికీ తెలుసు, మరి దానిని ఇక్కడ పాటిస్తున్నామా? సంఖ్యా బలం కోసం, అవసరం కోసం, తెలుగు నేల మీద ప్రచారం గొప్పల కోసం, గేట్లు బార్లా తెరుస్తున్నామా?

1. అమెరికా తెలుగు పౌరుడు మరియు వారి పిల్లలు, అందరూ అమెరికా పౌరులు అయి ఉండాలి. స్థానికంగా కనీసం 8 నెలలు సంవత్సరానికి నివసించే బాధ్యత గల వారు మాత్రమే ఉండాలి అన్న, స్థానిక పౌర నిబంధన లాంటిది ఏదైనా ఉందా?

2. పచ్చ కార్డు - అమెరికా ఎన్నికల్లో ఓటు హక్కు లేకపోయినా, ప్రవాస తెలుగు వారికి ఓటు హక్కు మాత్రం ఇస్తాము, మా సంఖ్యా బలం కోసం. పాక్షికముగా నివాసం ఉన్నా, ఓటు ఒకేనా?

కేవలము ఇక్కడ ధనం ఖర్చు పెట్టి, పదవి ప్రచారం పొంది, తెలుగు నేలపై లీడర్ లా బిల్డప్ ఇచ్చి, రాజకీయ నాయకులను కలిసి ఫోటోలు దిగుతూ, మరలా తెలుగు రాష్ట్రములో బంధువులు లేదా తమ ఎన్నికల్లో పాల్గొనే వారికి లేదా సొంత ప్రచారానికి, ఆర్భాటానికి నాయకుల అండకు, రాచ మార్గం ఏర్పరుస్తున్నామా, తెలుగు సంఘాలను అడ్డుపెట్టుకుని?

కొంతమంది ధనము కూడా, అటూ ఇటూ మారుస్తున్నారు, అక్రమ పద్దతిలో అంటున్నారు.

3. ఏ ఉద్యోగ లేదా ఇతర వీసా అయినా ఓకేనా, మనకు మన అనుకూల గుంపు గెలవడానికి, ఓటు సంఖ్యకు కావాలి అంతేగా?

4. విద్యార్థులు విజిటర్ అయినా ఓకేనా, మనకు మన అనుకూల గుంపు గెలవడానికి, ఓటు సంఖ్యకు కావాలి అంతేగా?

వీరిలో ఎవరికి తెలుగు సంఘాల ఎన్నికల్లో ఓటు హక్కు ఉండాలి, ఎవరికి ఉంది?

2). అమెరికా గడ్డ పై జరిగే ఎన్నికల్లో పాల్గొన్న విధముగా, అమెరికా తెలుగు సంఘ ప్రెసిడెంట్ మరియు వైస్ ప్రెసిడెంట్ అభ్యర్ధులు, అమెరికా తెలుగు పౌరులై ఉండి, ధైర్యంగా నీతి గా, ఒకచోట ముఖాముఖి వాదన డిబేట్, ఎందుకు చేయరు? లేక వీరు తెలుగు నేల పరపతి, అధికారం హోదా గౌరవం లేదా ఎన్నికల కోసము నటించే, పచ్చ కార్డు అభ్యర్ధులా?

ఆరోపణలు, సమాధానాలు ప్రత్యక్షంగా చూసి, ఓటు వేయలేని దైన్య స్ధితిలో చదువుకున్న, ప్రవాస తెలుగు సమాజం ఉందా? లేదా తప్పుడు నాయకులకు భయమా?

అక్కడ కూడా, నోరెత్తి అడిగే, ప్రవాస చదువుకున్న, తెలుగు ఓటరు లేడా? ఎక్కడైనా, దాసోహము బానిసత్వమేనా? గుంపు కుట్ర మోస రాజకీయాలేనా?

నిజమైన తెలుగు సేవకు, చాటు దాపరికం అవసరమా? అంటే అమెరికాలో ఉంటూ, ఇన్నాళ్ళు మోసము తో గెలిచినా, నీతి న్యాయ బద్ద ప్రత్యక్ష ఎన్నికలకు 2021 లో కూడా, సిద్దం గా లేరా మన తెలుగు ప్రవాస తేజాలు? మార్పు కోరే, మంచి వారు లేరా?

మనల్ని మన ఊరు వారు అడిగితే, నీతివంతమైన ఎన్నికలా మీ తెలుగు సంఘము వి అంటే, ఎక్కడ అయినా, మా తక్కువ దొంగ బానిస బుద్దులు మారవు అందామా? మన తెలుగు నేలపై ఉన్న వారికి, ఆదర్శము గా ఉండమా, అగ్ర రాజ్యములో లేదా ఇంకో దేశములో?

3). అమెరికా తెలుగు సంఘ ప్రెసిడెంట్ మరియు వైస్ ప్రెసిడెంట్ అభ్యర్ధులు గా పోటీ చేసే వారు, మాకు ఇప్పుడు ఎటువంటి వ్యాపారలు లేవు, ఉద్యోగాలు లేవు, పూర్తి ఖాళీగా ఉన్నాము సభ్యులకోసం అనగలరా?

వాటి కోసం, సొంత అవసరాల వ్యాపార ప్రచారం స్వార్ధం కోసం, ఈ పదవి వాడము అని ప్రమాణం చేస్తారా?

ఏ తెలుగు రాజకీయ పార్టీ కి తొత్తు గా కోవర్ట్ గా, మా ఫేస్బుకు లో ఫోటోలు లేవు, గత చరిత్ర లేదు భవిష్యత్ చరిత్ర లో ఉండదు. తెలుగు సంఘ పదవి దిగిన తర్వాత కూడా, కనీసం 5 ఏళ్ళ దాకా. ఏ తెలుగు నేల పార్టీ లో సీటు అడగము, పదవి పొందము భవిష్యత్ లో, అని ప్రమాణము చేస్తారా?

తమకు లేదా తమ బంధువులకు ప్రత్యక్షముగా పరోక్షముగా, తెలుగు నేల పై రాజకీయ పార్టీలకు సంబంధము లేదా?

గత సంపాదనతో మాత్రమే బతుకుతున్నాము, ఇంక సంపాదించాలి అన్న యావ లేదు, అని గట్టిగా చెప్ప గలరా?

4). నాయకులు పోటీ పడుతుంది, సేవలోనా? పదవులలోనా? గుంపు ముఠా చీలిక రాజకీయాల లోనా? ధనము హోదా అధికారం గాడ్ ఫాదర్ ల లోనా? తెలుగు రాజకీయాలలో భాగస్వామ్యాని కా?

* మేము ప్రవాస తెలుగు వారి సేవకు కట్టుబడి, 24 గంటలు, దొరుకుతామని గెలిచిన తర్వాత కూడా అని ప్రమాణము చేస్తారా? అందుబాటులో ఉంటారా? దేశం నలుమూలలా ప్రయాణం చేసే ఆరోగ్యము ఓపిక ఉందా?

* ఇంత చదువుకుని కూడా, అమెరికా గడ్డ పై కూడా, మనము మారమా? తామే డబ్బు కట్టి అమెరికా పౌరులు కాని తాత్కాలిక సభ్యులను చేర్చడం, బాలెట్ కలెక్షన్ అనే అనాగరిక నీచ సంస్క్రుతి అలాగే, చిరునామా లో లేని వారి, ఓటు కి విలువ ఇంకా ఉంటుందా?

సంస్కరణలు మొదలు అయ్యాయా? ఎప్పుడూ ఖాళీగా ఉంటూ, అందరికీ అందుబాటులో ఉండే, వ్యాపార అధికార కాంక్ష లేని నిస్వార్ధ నాయకులు గా రారా?

* తమ వ్యాపారాల అవసరాల అవకాశాల వర్గాల కోసమేనా ఎన్నికలు? తెలుగు నేల పై కుట్రలు మోసాలు, ఓట్లు కొనడము, దొంగ చిరునామా, దొంగ ఓట్లు, అన్ని మన పద్దతులు కూడా, ఇక్కడ ఇప్పుడు కూడా అనాగరికముగా అమలు చేస్తూ, గాడ్ ఫాదర్, రాజకీయ పార్టీ బంధం, కోవర్ట్ సంస్క్రుతిని కొనసాగిస్తున్నామా?

అని తెలుగు ప్రవాస విజ్ఞులు ఆశ్చర్య పోతున్నారు, ఇకనైనా మంచి రోజులు వస్తాయి అని ఎదురు చూస్తున్నారు.

దయచేసి మీకు ఎవరికైన, మన తానా కొత్త తెలుగు వెలుగు నేతలు, నరేన్ నిరంజన్ అలాగే శ్రీనివాస్ గార్లు తెలిస్తే, చాటుగా 3 ముఠాలు గా ఆరోపణలు చేసుకోకుండా, ముఖా ముఖి నేరు వాదనలు, మిగతా తెలుగు సంఘాల కన్నా, మొదటగా మనమే మొదలు పెట్టి, చరిత్ర స్రుష్టించి, అలాగే మన కధనం లో చెప్పిన మార్పులు తెచ్చి, ఇవి ఉత్తుత్తి ఎన్నికలు కాదు, నిజమైన నిర్ణయాత్మక మార్పులు చేర్పులు ఒక్క తానా మాత్రమే తేగలదు అని నిరూపించాలి అని చెప్పగలరు.

నాయకులే గట్టిగా వాదనలు చేసి గెలిస్తే, మిగతా సభ్యులు కూడా గెలిచినట్లే కదా. అలాగే కరోనా గురువు ను గౌరవించి, ఆన్లైన్ ప్రచారము తో ముగిస్తే, అందరికీ ఆరోగ్యం గా ఉంటుంది, అనవసర ఖర్చు ప్రయాణము ఉండదని వివరించగలరు. తప్పులు గతములో అందరమూ చేస్తాము, సరి చేసుకోని ముందుకు పోవడం, విజ్ఞుల లక్షణం.

మిగతా సంఘాలు మనల్ని చూసి, తమ పంధా మార్చుకోవాలని దయచేసి వివరముగా చెప్పగలరు.  
Author photo Sri, Telugu , 15+ yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 840+ Foreign and local events/ places coverage, 2118 General Articles and views 1,880,547; 104 తత్వాలు (Tatvaalu) and views 226,169
Dt : 29-Mar-2021, Upd Dt : 29-Mar-2021, Category : America
Views : 1141 ( + More Social Media views ), Id : 1058 , Country : USA
Tags : meaningless , unintelligent , direct , face to face , debate , foreign , knowledge , business , usa , telugu , society , elections , tana , nats , ata

Share
తెలుగు మీడియాను నమ్మరా, ఆంగ్ల హిందీ మీడియాను నమ్ముతారా? పర్లేదు, వాటినీ ఇక్కడే చూడొచ్చు
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 11 yrs
No Ads or Spam, free Content