మంచిని సమాధి చేస్తారా, ఇది అన్ని తెలిసిన పబ్లిక్‌ రా - నేరం నాది కాదు ఆకలిది - Songs - లోకం తీరు/ News
           
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. 2095 కధనాలు. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు. 2130 General Articles and views 1,942,717; 104 తత్వాలు (Tatvaalu) and views 230,709.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
చివరలో ఉన్న చిత్రం/ వీడియో/ ఆడియో మరువద్దు. 1 min read time.

మనము సత్యనారాయణ స్వామి లేదా ఇంకో పాట నేర్చుకోవాలి అన్న కధనము రాశాము కదా, దానిని 200 మంది పైగా సోషల్ మీడియా గ్రుప్ లో, ఇష్టపడ్డారు, సాక్ష్యం వాట్సాప్ స్టేటస్ లో. ఇలాంటి వి ఎన్నో ఇంకో పక్కన జరుగుతూ ఉంటాయి.

కానీ మన గురువుల లో ఉన్న వారు కూడా, రాక్షస ప్రవ్రుత్తి వదలి, సాత్విక ద్యాసకు, 30 ఏళ్ళ తర్వాత అయినా వస్తే, కాస్త బతుకు మార్చుకోవచ్చు. లేదంటే, దాని ఫలితాలు అనుభవించవచ్చు, చాయిస్ మనదే సుమా.

మనము సినిమా కోసం, పాటల కోసం కాదు, ఇవి చెప్పుకుంటున్నది, సమయం వ్రుధా కాదు. మన బతుకులు మంచి చేసుకోవడానికి, మన తర్వాత తరాలకు మార్గదర్శము గా చేతలలో ఉండడానికి, సత్సంగం కోసం, మాత్రమే.

మనకూ వాక్సుద్ది, ఊపిరితిత్తుల వ్యాయామం, ప్రాణాయామం కూడా కదా? మాత్రు మూర్తి, భాష ఋణం ఇలా కూడా తీర్చుకోవచ్చు, పుణ్యమే కదా? దైవ మంత్రాలతో పాటు గా, సామాన్యుడి మాట పాట భాష కూడా ఉండాలి కదా?

మీ కన్నా, మనది గార్ధబ బండ గొంతు అని మనకు తెలుసు, కనీ గురువుల దీవెనతో ఇదీ సాధన నే కదా? మీలో కొంత మంది, తిప్పి పాడి పంపారు కూడా స్పందనతో, ధన్యవాదములు.

మహా భారతం నడిపిన, క్రిష్ణయ్య, తిరిగింది గొల్ల ఆవుల కాపరులతో కదా? వారితో మంత్రాలు శాస్త్రాలతో నీతి చెపితే, అర్ధం అవుతుందా? కాబట్టి పండితులతో మాట్లాడేటప్పుడు, ఆ సమయానికి తగిన భాష, అదే పామరులతో మాట్లాడేటప్పుడు ఈ సామాన్య భాష ఉండాలి. అది ఇది, రెండు వచ్చి ఉండాలి, అదే స్థితప్రజ్ఞత కదా?

విడిగా చెపితే, అబ్బో నీతి చెప్పారు లే, అంటారు లేదా కొంత మందికే ఎక్కుతుంది. అదే సినిమా అర్ధము అయితే, ఒక రచయిత ఒక గాయకుడు ఒక నటుడు ఒక నటి ఒక దర్శకుడు ఒక నిర్మాత అందులో సభ్యులు, అందరూ మనకన్నా అనుభవజ్ఞులు కూడా, మన మాటలే ఎప్పుడో చెప్పారు పాటగా అంటే, పామరునికి కూడా బాగా ఎక్కుతుంది.

మొన్న తాగుబోతు ఆరోగ్య జాగ్రత్తల పాట, చాలా మంది కి నచ్చింది, అది ఉందని కూడా తెలీదు చాలా మందికి, తాగుబోతులే శభాష్ అని కూడా అన్నారు, సాత్వికులతో పాటుగా, పాట లోనే ఇన్ని తిట్లు రోగాలు వాస్తవాలు చెప్పారా అని ఆశ్చర్యబోయారు.

ఒక మంచి మనసు ఉన్న వ్యక్తి, ఒక మంచి పని తాను చేయలేకపోయినా, ఇతరులు అన్నా చేస్తుంటే, శభాష్ అంటేనే, తనకు తన పిల్లలకు, ఆ మంచి బుద్దులు జ్ఞానం అలవోకగా వస్తాయి. ఇది తెలీని మంద బుద్దులు, మనకెందుకులే అని గమ్ము గా ఉంటారు, తిట్టుకుంటూ.

చూడండి మన జీవితము లో ఎన్నో సంఘటనలు చూస్తుంటాము, 1000 రూపాయలు అప్పు ఎగకొట్టారు అని, సామాన్యుల మీద దౌర్జన్యం చేస్తూ, రోడ్ మీద తిట్లు తన్నులు తో.

అదే కోటి రూపాయలు ఎగకొడితే, 100 మంది దగ్గర దోచితే, జైలు వెళితే, వెన్నుపోటు పొడిస్తే, కేసులు స్టేలు ఉంటే, వంగి వంగి దండం పెట్టి మన ఎమ్మెల్యే గా ఎంపీ గా, గెలిపించి పాదాభివందనం చేస్తాము.

అంటే రాజకీయ పెద్ద దొంగలను, అలాగే దేవాలయాలు దేవుడిని అడ్డం పెట్టుకుని అరాచకాలు చేసే వారిని వదిలి, చిన్న వారిపై ప్రతాపము చూపుతాము, మనకు ఏదో నీతి నియమం ఉన్నట్లు.

మంచి మాటలు చెప్పేవాడు, తాను వాక్సుద్ది తో త్యాగబుద్ది తో ఉండి, పెద్దల సేవ చేస్తూ, కనీసం 5 ఏళ్ళు పై గా దాపరికం లేకుండా అందరికీ చెపుతూ ఉండాలి కదా?

అన్నిటికీ తప్పులు నాయకులవే అధికారులవే అంటాము, అసలు తప్పు, 5 ఏళ్ళకు ఒకసారి అమ్ముడుబోయి ఓటు వేసే, మన ఓటరుది అని మాత్రం ఒప్పుకోము. చదువుకుని కూడా ఓటు వేయని చవటలదని ఒప్పుకోము. యువత తో తప్పక ఓటు వేయించాలి, వారి పేరెంట్స్, కాలేజీ ఉద్యోగం నుంచి పిలిపించి.

పబ్లిక్ ని ఎల్లకాలము మాటలతో, డబ్బులు పంచడము లో మోసము చేయలేము అని మన చంద్రన్న గ్రహించారు. కానీ తీరు మార్చుకోవడము లేదు, పశ్చత్తాపము పడటం లేదు. జగనన్న కూడా, గతం మరచి, వాస్తవం విడిచి, అవే డబ్బులు పంచుతూ, అదే పేర్ల పధకాల పిచ్చితో, అదే అభివ్రుద్ది గా భావింపచేస్తూ, గాలిలో నడుస్తున్నారు.

పబ్లిక్ చాలా తెలివి గా ఉన్నారు. ఇంకొకరికి అవకాశం ఇస్తారేమో, నష్టపోయే కాడికి ఎవరైతే ఏమిలే అని. మరి 3 వ వ్యక్తి పవన్ బీజేపీ, ఒక్క అవకాశం కోసం చూస్తున్నారు. మరి జనం ప్రతి 5 ఏళ్ళకు, ఒక కొత్త నాయకుని ఎన్నుకుంటే తప్పు ఉందా?

1) మంచిని సమాధి చేస్తారా, ఇది మనుషులు చేసే పనియేనా
మనలో పాపం చేయనివాడూ ఎవడో చెప్పండి, ఏ దోషం లేనివాడూ ఎవడో చూపండి 2

కత్తితో ఛేదించనిదీ కరుణతో ఛేదించాలి
కక్షతో కానిదీ క్షమాభిక్షతో సాధించాలి
తెలిసీ తెలియక కాలుజారితే 2 చేయూతనిచ్చి నిలపాలి
మనలో కాలుజారనివరూ ఎవరో చెప్పండి, లోపాలు లేనివారూ ఎవరో చూపండి
||మంచిని సమాధి చేస్తారా||

గుడులలో లింగాలను మింగే, బడా భక్తులు కొందరు
ముసుగులో మోసాలు చేసే, మహా వ్యక్తులు కొందరు
ఆకలి తీరక నేరం చేసే 2 అభాగ్య జీవులు కొందరూ
మనలో నేరం చేయని వాడూ ఎవడో చెప్పండి, ఏ దోషం లేనివాడూ ఎవడో చూపండి
||మంచిని సమాధి చేస్తారా||

తప్పు చేసిన ఈ దోషినీ, ఇప్పుడే శిక్షించాలి
మరుపురాని గుణపాఠం, పదిమందిలో నేర్పించాలి, ఆహా అయితే
ఎన్నడు పాపం చేయనివాడూ 2 ముందుగ రాయి విసరాలి
మీలో పాపం చేయని వాడే ఆ రాయి విసరాలి, ఏ లోపం లేనివాడే ఆ శిక్ష విధించాలి
||మంచిని సమాధి చేస్తారా||

2)
హేయ్‌ పబ్లిక్‌ రా... ఇది అన్ని తెలిసిన పబ్లిక్‌ రా
పబ్లిక్‌ రా... ఇది అన్ని తెలిసిన పబ్లిక్‌ రా

అహ అసలూ తెలుసు... అరె నకిలీ తెలుసు
అసలూ తెలుసు నకిలీ తెలుసు... అందరి గోత్రం తెలుసూ
పబ్లిక్‌ రా... పబ్లిక్‌ రా... ఇది అన్ని తెలిసిన పబ్లిక్‌ రా

చరణం 1 :
మచ్చిక చేస్తే గంగిగోవులా పాలందిస్తుందీ.. 2
ఇది రెచ్చిపోతే, కోడెతాచులా ప్రాణం తీస్తుంది

నమ్మితె జే కొడుతుంది, నచ్చితె జో కొడుతుంది
జే కొడుతుంది జో కొడుతుంది, మనసు విరిగితే మసిచేస్తుంది

పబ్లిక్‌ రా... హహహా, పబ్లిక్‌ రా... ఇది అన్ని తెలిసిన పబ్లిక్‌ రా

చరణం 2 :
కబుర్లు చెప్పీ, కడుపులు నింపే, కాలం పోయిందీ 2
సందేశాలూ, దిగుమతి చేసే, సమయం దాటిందీ
అరె మాటల కన్నా, చేతలు మిన్నా
మాటల కన్నా చేతలు మిన్న... కాదంటే మీ బ్రతుకులు సున్న

పబ్లిక్‌ రా... హహహా, పబ్లిక్‌ రా... ఇది అన్ని తెలిసిన పబ్లిక్‌ రా

చరణం 3 :
అహ, దాచుకోండిరా పెట్టెల నిండా, వెండీ బంగారం 2
కాచేస్తారా, తిండిగింజలను, ఎక్కడిదీ న్యాయం
మా ఆకలిముందు... మా అలజడి ముందు
ఆకలి ముందు అలజడి ముందు... దోపిడి దొరల ఆటలు బందు

పబ్లిక్‌ రా... పబ్లిక్‌ రా... ఇది అన్ని తెలిసిన..పబ్లిక్‌ రా
అహ అసలూ తెలుసు... అరె నకిలి తెలుసు
అసలూ తెలుసు నకిలి తెలుసు... అందరి గోత్రం తెలుసూ
పబ్లిక్‌ రా... పబ్లిక్‌ రా... ఇది అన్ని తెలిసిన..పబ్లిక్‌ రా

Manchini Samadhi, Neram Naadi Kaadu Aakalidi, Song by S. P. Balu
నేరం నాది కాదు ఆకలిది - ఎన్.టి. రామారావు, మంజుల, లత, మురళీమోహన్,  
Author photo Sri, Telugu , 15+ yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 840+ Foreign and local events/ places coverage, 2130 General Articles and views 1,942,717; 104 తత్వాలు (Tatvaalu) and views 230,709
Dt : 17-May-2022, Upd Dt : 17-May-2022, Category : Songs
Views : 580 ( + More Social Media views ), Id : 1394 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags : manchini , samadhi , chestara , telisina , public , neram , akalidi , ntr , manjula
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.

Share
కేసియార్, కేటీయార్ , బాబు , జగన్ , పవన్ కు చెందిన టీవీ, పత్రిక వార్తలు ఇక్కడే, ఒక చోటే చూడొచ్చు
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 11 yrs
No Ads or Spam, free Content