Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
చివరలో ఉన్న చిత్రం/ వీడియో/ ఆడియో మరువద్దు. 1 min read time. ఎప్పుడూ దేవుడు, దేశము, మంచి చెడు అంటూ ఎన్ని చెప్పినా, నేటి యువతకు నచ్చే మెచ్చే, ఉత్తమ పాటలు కూడా కొన్ని మనము తలచుకోవాలి, పాడుకోవాలి.
ఎందుకంటే, పెద్దలు అరిషడ్వర్గాల బానిసత్వములో, అర్ధం లేని సంపాదనలో మునిగి ఉంటే, వారి పిల్లలు గుడ్డి ప్రేమ అంటూ, తమ జీవితం ధనం కాలం నాశనం చేసుకుంటూ, ఈ మత్తులోనే ఉంటారు కదా. జాగ్రత్తలు చెప్పలి మనము.
ప్రేమ గుడ్డి ది అన్నారు, పెద్దల విషయములో. మరి యువత విషయములో ఇంకా పరమ గుడ్డిది. ఎందుకంటే బాధ్యత ఉన్నవారికే, అరిషడ్వర్గాలు జయించడం చేతకాక, బురదలో కాలు వేస్తున్నారు, జీవితం పతనం చేసుకుంటున్నారు. ఇంక 15-25 వయస్సు అంటే, ఏది ఆకర్షణో ఏది ప్రేమో కూడా తెలియదు.
నిజముగా ప్రేమ ఉంటే, ఇంటికి తీసుకుని వెళ్ళి పెద్దలను, ప్రేమతో ఒప్పించి మెప్పించి, చేసుకోవాలి, అదీ 18 నిండితే, చేతులో సంపాదన లేదా తగిన ఆస్తి పాస్తులు ఉంటే నే సుమా. లేదంటే ఇద్దరు చదువు భవిష్యత్తు నాశనం, జీవితం రోడ్డున పడటం ఖాయం.
అది దేవుడు పెట్టే పరీక్ష, మనం మోహము లో పడతావా లేక బాధ్యత ఎరుగుతావా అని? నేడు 70 శాతం, ఓడిపోతున్నారు, విడాకులతో జీవచ్చవాలు గా ఉన్నారు, మరలా ఎన్ని అతుకులు అతికినా.
* * *
తమ అలాగే తమ పిల్లల గొంతుల తో, కొన్ని పాటలు అయినా పాడటానికి ప్రయత్నం చేసి, మమ్మానందింపచేసిన ఉత్తమ సాత్విక గురువులకు వందనాలు. మంచికి మొదటి అడుగు ఒకటే పడుతుంది, చిన్న గా అలవాటు పడుతుంది. అది మన పెద్దలు మనకు నేర్పిన, ఆరోగ్య రహస్యం అని మాత్రం మరువద్దు.
150 పైగా పాటల తో సాగుతున్న యజ్ఞాన్ని మీ ఆశీస్సులతో కొనసాగిదాము, విలువలు కూడిన రాతల మాటలుతో సహా. మన ప్రతి పాట వివరణల క్రింద, మన మంచి మాటలు ఎటూ ఉన్నాయి ప్రతి దానితో, కింద దాకా జరిపి చూడండి అన్ని మాటలు.
మనుషులలో సున్నితత్వము, పట్టుదల, జ్ఞాపకశక్తి, సాధన, ఇంకా ఎన్నో తెలుసుకోవడానికి, ఇదొక తేలిక మార్గము. మరి ఇప్పుడైనా ఆడపిల్లల పెద్దలు, వారికి నేర్పుతూ, అబ్బాయిలకు కూడా పాటలు పద్యాలు శ్లోకాలు వచ్చా అని తప్పక అడగాలి.
దానిని బట్టి మన పిల్ల భవిష్యత్తు, అలాగే పిల్లవాడి ఆలోచనా సరళి మనకు అర్ధము అవుతుంది. నేటి పెళ్ళి పెద్దల, అర్ధము లేని విలువ లేని, పెళ్ళి బజారు డాన్సులకన్నా, మన సొంత గొంతు పాటల ప్రయత్నం, కుటుంబ ఆరోగ్యానికి ఉచిత సాధనం.
ఏదో విధముగా వాక్సుద్దిని సాధించాలి. నాదోపాసన అంటే ఇదే, నాభినుంచి నాదం ఓంకారం పలకాలి, అదే ఆరొగ్యానికి మనశ్శాంతికి మూల రహస్యం.
* * *
సంగీత మాంత్రికులు ఇళయరాజా గారి అద్భుత స్రుష్టి, ఈ సినిమా పాటలు కూడా, మీరు గొంతు రాగాలను, బాగా అభివ్రుద్ది చేసుకోవడానికి ఉపయోగం.
ఈ సినిమా కు చాలా ప్రత్యేకతలు ఉన్నాయి. పాటలు సంగీతము మధురం, కధనే ఈ సినిమాకు హీరో. చిన్న కధా నాయకుడు, నాయకి తో కూడా ఈ చిత్రం సూపర్ హిట్ కలెక్షన్లు. తక్కువ పెట్టుబడి, ఎక్కువ రాబడి. తప్పక దర్శకుడు వంశీని అభినందించాలి.
ఆయన సినిమా తీసే పద్దతి, ఒక ప్రత్యేకత కలిగి ఉంటుంది. ప్రతి ఫ్రేం లో కూడా, మీరు జాగ్రత్త గా గమనిస్తే అది అర్ధము అవుతుంది.
లేడీస్ టైలర్ అన్న సినిమాతో రాజేంద్రప్రసాద్ కి కూడా, జీవితాన్ని ఇచ్చారు. ఎందరో నటులకు జీవితము ఇచ్చారు, ఉదాహరణకు క్రిష్ణ భగవాన్, బట్టల సత్తి లాంటి వారు.
వయసులో ఉన్నవారికి అనిపించే అన్ని పదాలు కలగలిపి పెట్టారు ఈ పాటలో - సుమం ప్రతి సుమం సుమం, ప్రేమ మహిమా, నాదు హృదయం. రంగులే రంగులు, అంబరాలంతట - అంటే మన మనస్సు కూడా, అంత మత్తులో ఉంటుంది జాగ్రత్తలు.
ఇంకో పాటలో - రాగాల తీగల్లో వీణా నాదం, కోరింది ప్రణయ వేదం, వేసారు గుండెల్లో రేగే గాయం, పాడింది మధుర గేయం అంటూ రాగాల సంగీతం పలికించారు. ఇంకెందుకు ఆలస్యం మీరూ ఓ సారి ఈ పాటలు ప్రయత్నం చేయండి.
1) తననాననాన..తననాననాన..
సుమం ప్రతి సుమం సుమం..వనం ప్రతి వనం వనం 2
జగం అణువణువున కల కలలం,
భానోదయా..న, చంద్రోదయా..లు!! ||సుమం ప్రతి||
హహా..ఆ ఆహహహహా, ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ
వేణువా.. వీణియ, ఏ..విటి నా..దము?? 2
అచంచలం, సుఖం, మధుర మధురం
మయం, బృదం, తరం, గిరిజ సురతం
ఈ వేళ నా...లో రాగోల్లసా.లు 2
కాదు మనసా..ఆ ఆ. ప్రేమ మహిమా.. నాదు హృదయం..
భానోదయా..న..చంద్రోదయా..లు!! ||సుమం ప్రతి||
హా తారర తార..తారర తారర తార..
రంగులే.. రంగులు, అంబరా..లంతట 2
సగం, నిజం, సగం, వరము అమరం..
వరం, వరం, వరం, చెలియ ప్రణయం..
ఆ వేగమే..దీ, నాలోన లే..దు 2
ప్రేమమయమూ..ఆ ఆ..ప్రేమమయమూ.. నాదు హృదయం..
భానోదయా..న..చంద్రోదయా..లు!! ||సుమం ప్రతి||
Sumam prati sumam, Singer : SP Balu, Janaki, Lyrics : Athreya
2) మాటరాని మౌనమిది..మౌనవీణ గానమిది 2
గానమిది..నీ ధ్యానమిది, ధ్యానములో నా ప్రాణమిది
ప్రాణమైన మూగ గుండె రాగమిది..||మాటరాని మౌనమిది||
ముత్యాల పాటల్లో కోయిలమ్మా..ముద్దారబోసేది ఎప్పుడమ్మా
ఆ పాల నవ్వులో వెన్నెలమ్మా..దీపాలు పెట్టేది ఎన్నడమ్మా
ఈ మౌన రాగాల ప్రే.మా.వేశం..ఏనాడో ఒకరి సొంతం
ఆకాశ దీపాలు జా.బిలి కోసం..నీకే.లా ఇంత పంతం..
నింగి నే.లా, కూడే వే.ళ, నీకు నాకు దూరాలేల
అందరాని కొమ్మ ఇది..కొమ్మచాటు అందమిది
మాటరాని మౌనమిది..మౌనవీణ గానమిది
ఛైత్రాన కూసేను కోయిలమ్మా..గ్రీష్మాని కాపాట ఎందుకమ్మా
రేయంతా నవ్వేను వెన్నెలమ్మా..నీరెండ కానవ్వు దేనికమ్మా
రాగాల తీగల్లో వీణా నాదం..కోరింది ప్రణయ వేదం
వేసారు గుండెల్లో రేగే గాయం..పాడింది మధుర గేయం..
ఆకాశా.న, తారా.. తీరం, అంతే లేని ఎంతో దూరం
మాటరాని మౌనమిది..మౌనవీణ గానమిది
అందరాని కొమ్మ ఇది..కొమ్మచాటు అందమిది
దూరమిది..జత కూడనిది..
చూడనిది..మది పాడనిది
మాటరాని మౌనమిది..మౌనవీణ గానమిది
అందరాని కొమ్మ ఇది..కొమ్మచాటు అందమిది
Maata raani mounamidi; Singer : Balu, Janaki; Lyrics : Athreya
Maharshi Movie 1988, Director Vamsi, Music: Ilayaraja, Shantipriya
మీరూ పాడే ప్రయత్నం చేయాలి, శ్వాస వ్యాయామం కు, ఆరోగ్యం కు, వాక్సుద్ది కి, ఉచిత మనశ్శాంతికి. పూర్తి పాటలు మాటలు వీడియోలు లింక్ లోపల చూడగలరు.
Sri, Telugu , 10 yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 828 Foreign events/ places coverage, 1797 General Articles and views 1,387,132; 94 తత్వాలు (Tatvaalu) and views 184,263 Dt : 11-Aug-2022, Upd Dt : 11-Aug-2022, Category : Songs
Views : 311
( + More Social Media views ), Id : 1491 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags :
maharshi ,
raghava ,
vamsi ,
ilayaraja ,
sumam ,
prati ,
mata ,
rani ,
mounamidi ,
Shantipriya Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది. ఆ టీవీ, ఈ టీవీ, మీ టీవీ, మా టీవీ, వాళ్ళ టీవీ పత్రిక - అన్ని టీవీ, పత్రిక వార్తలు వినోదం ఇక్కడే
Facebook Comments