పరిమిత కుటుంబం, ఇల్లు, సామాను, ప్రపంచ వ్యామోహము, సాధ్య పడదా? అంతర్ముఖ మధనం? - General - లోకం తీరు/ News
           
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. 2085 కధనాలు. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు. 2120 General Articles and views 1,882,832; 104 తత్వాలు (Tatvaalu) and views 226,447.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
1 min read time.

చిన్న కుటుంబం చింతలు లేని కుటుంబం అంటారు, తెలుసు కదా?

అంటే, దేవుడు ఇస్తున్నాడు అని ఖాళీగా ఉన్నామని, ఓ 4 గురిని కని, ఊరి మీద వేస్తే సరిపోతుందా?

వారికి కూడు గూడు గుడ్డ సమకూర్చాలి, అంతకన్నా కష్టమైన నీతి సంస్కారం క్రుతజ్ఞతలు బాధ్యత నేర్పించాలి.

ఇద్దరూ ఉద్యోగాలు చేస్తూ లేదా టీవీ సీరియల్లో సినిమాల్లో బాహ్య ప్రపంచ మాయలో, తలమునకలయ్యే వారికి, ఇవన్నీ సాధ్యమా?

సాధ్యమైతే, ఇన్నాళ్ళు కని పెంచి, కోట్లు ఉన్న ముదుసలి తల్లి దండ్రులు, దిక్కు లేని అనాధలు గా ఒంటరిగా ఎందుకు ఉంటున్నారు?

రోగ నిరోధక శక్తి లేక, కరోనా తో ఇంత మంది ఎందుకు పోతున్నారు? అంటే పరిమిత సంస్కార కుటుంబం మంచిది కదా?

మరి పరిమిత ఇళ్ళు అలాగే, ఇంటి సామాను కూడా మంచిది, అని అనుకోరా? ఇల్లు 2-4 అంతస్తులు ఉండి, 4-10 గదులు ఉంటే, అందులో ఒంటరిగా నివాసం ఉంటే? వారికి ఒద్దిక కలివిడి ఉంటుందా?

ఆఖరికి జీవిత భాగస్వాములు కూడా, 2 గదుల్లో, 2 మంచాలలో కాలం, అద్దె సహజీవనం గా గడుపుతున్నారు.

మనసులు దూరం, అలాగే చాటు తనం పెరిగి, యాంత్రిక జీవనముతో, పెద్దల మరియు పిల్లల సంస్కారం కూడా తగ్గిపోదా?

ఎవరైనా ఇది పట్టించుకుంటారా, జాగ్రత్త లో ఉంటారా? ఉండలేరు, ఉండరు, బాహ్య మోహం వ్యామోహం అలాటింది.

ఎంత పెద్దింట్లో ఉంటే, అంత గొప్ప. ఎంత అప్పు ఉంటే అంత గొప్ప.

రేపు ఏదన్న అనుకోనిది జరిగితే, ప్రపంచ జనాన్ని ఆన్లైన్ లో చేయి చాపి, గో ఫండ్ లాంటి వాటి ద్వారా, మన వాళ్ళు నిర్లజ్జగా దేహీ దేహీ అని అడుక్కోవచ్చు. ఒకవేళ అకాల మరణము తో అప్పుతో పోతే, మనమూ పాపం మూట గట్టుకోవచ్చు.

అత్యాశలతో, మాకు స్వయంగా బతకడం నేర్పకుండా నే, సంపాదించే ఆ బాధ్యత సంస్కారం లేని మనిషి పోయారు, ఇన్నాళ్ళు మీ అందరినీ దేనికీ పిలవకపోయినా తలవకపోయినా, ఇప్పుడు మాత్రం, మీరంతా మా ఇంటి వంశ యజమానులై, తలా ఒక చెయ్యి వేసి, మమ్మల్ని మా పిల్లలను మా కుటుంబాన్ని నడపండి, అని అడగడం భావ్యమా?

ఏమీ లేని బీదవాడు అడిగితే, అంటే ఆదాయం లేదా సొంత ఇల్లు లేని వారు, తప్పులేదు. కానీ మన మితిమీరిన కోరికల సౌకర్యాల వలన, అడిగితే?

అంత నీతి నిజాయితీ, మంచి మనసులు, మంచితనము, సంస్కారం, ఒద్దిక ఉన్నట్లే గదా?

అవతల తినడానికి ఉండటానికి కూడా గతి లేని మనుషులను చూసి, మనకు అంత ఎక్కువ సౌకర్యాలు, కార్లు భోగాలు బరువు అప్పులు, అవసరమా?

కరోనా వస్తే, 6 అడుగుల గొయ్యలోకి కూడా, మన సొంత వారు వచ్చి, నెట్టడం లేదేమి?

సామాను ఎక్కువ అయితే, ఎంత పెద్ద ఇల్లు అయినా ఇరుకు అవుతుంది, మోయలేము, చిమ్మలేము, శుభ్రం చేయలేము. అందుకే అంటారు, మోయగలిగినవి మాత్రమే, పెట్టు కోండి అని, బరువు బాధ్యతలు సామాను అయినా.

సోఫా మనము మోయగలమా? కుర్చీలో నిఠారుగా గట్టిగా కూర్చుంటే ఆరోగ్యం ఎంత? సోఫాలో మెత్తగా జారిగిలపడి కూర్చుంటే, మన ఒంటికి సుఖముతో కూడిన రోగము కాదా?

40 ఇంచ్ ల టీవీతో, కళ్ళ జోడు 5 ఏళ్ళ కే వస్తుంటే, 60 70 ఇంచ్ ల టీవీతో, 2 ఏళ్ళకే చూపు కోల్పోవడం తగ్గడం, మనము చేస్తున్న సాంకేతిక అతి తెలివి, కదూ?

చక్కెర తీపి, కానీ రోగము.

అంటే తక్కువ సామాను ఉత్తమము, మేము ఇల్లు మారితే, 2 చిన్న కార్ ట్రక్ లకు లేదా చిన్ని వాన్ కు సరిపోతుంది, 20 ఏళ్ళ జీవితము.

అంటే, కుటుంబం తో పాటు గా, సామాను కూడా మితముగా, మోయగలిగినవి మాత్రమే ఉండాలి.

మరి ఇవన్నీ పరిమితము అయినప్పుడు, అసలు ముఖ్యమైనది, బాహ్య ప్రపంచ మాయల ఆలోచనల నుంచి కూడా, పరిమితము గా ఉండాలి కదా?

మరి మనము బయట ప్రపంచ వ్యామోహములో మునుగుతూ తేలుతూ ఉంటే, వాటిని వాటి ఫలితాలను మోయగలమా? భరించ గలమా?

కాబట్టి, మితముగా ప్రపంచముతో కలవాలి. అంతర్గత ధ్యానం లో, మన లోపాలు తెలుసుకోవాలి.

బయటి మాయలు ఆలోచనలు పరిమితం చేయాలి, అంతర్ముఖ మధనం ఎక్కువ చెయ్యాలి సుమా. పరిమితము దాటినది ఏదీ బాగుపడి నట్లు, చరిత్ర లో లేదు సుమా. కనీసము, 30 ఏళ్ళ తర్వాత అయినా, జాగ్రత్తలు లేకపోతే ఎలా?  
Author photo Sri, Telugu , 15+ yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 840+ Foreign and local events/ places coverage, 2120 General Articles and views 1,882,832; 104 తత్వాలు (Tatvaalu) and views 226,447
Dt : 25-Jul-2021, Upd Dt : 25-Jul-2021, Category : General
Views : 742 ( + More Social Media views ), Id : 1229 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags : limited , family , house , luggage , world , illusion , inside , meditate , dhyanam
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.

Share
కేసియార్, కేటీయార్ , బాబు , జగన్ , పవన్ కు చెందిన టీవీ, పత్రిక వార్తలు ఇక్కడే, ఒక చోటే చూడొచ్చు
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 11 yrs
No Ads or Spam, free Content