విజయ్, సజ్జల, వేమిరెడ్డి, వైవీ లను వదిలి, బాలినేని ని మాత్రమే తప్పు ఏమిటి? అభివ్రుద్ది విషయములో? - Politics - లోకం తీరు/ News
           
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. 2082 కధనాలు. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు. 2117 General Articles and views 1,878,730; 104 తత్వాలు (Tatvaalu) and views 226,021.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
2 min read time.

ఏవండి, మీరు విజయ్ సాయి, సజ్జల, వేమిరెడ్డి, వైవీ లను వదిలి, బాలినేని వాసన్న ను మాత్రమే తప్పు పడతారు ఏమిటి, చీరాల లేదా జిల్లా అభివ్రుద్ది విషయములో?

రేపు 2021 జనవరి నుంచి మే లోపల, జిల్లా ల విభజన తర్వాత, వీరందరికి జగనన్న మీద, ఎంత నిజమైన క్రుతజ్ఞత ప్రేమ ఉందో, నిరూపణ అవుతుంది.

ఎక్కువ బాధ్యత, రాష్ట్ర విద్యుత్ అటవీ ఇంధన శాఖా మంత్రి, ప్రకాశం జిల్లా బాలినేని గారి మీద ఉంది కాబట్టే, మిగతా అందరికన్నా.

ఈ కింది వివరము చూడండి, అప్పుడు చెప్పండి తప్పు ఉంటే. మేము సరి చేసుకుంటాము, వాసన్న బాధ్యత అని అనము.

ఇంత మంది, జగనన్న క్షేమము కోరేవారు ఉండి, సంవత్సరముగా ఒంగోల్ కార్పొరేషన్ లో మరియు కలెక్టరేట్ లో, సోషల్ మీడియాలో, జగన్న పధకాలు మరియు తమ పనుల ఫోటోలు పెట్టించుకోలేక పోయారు అంటే, అది ఎవరికి అవమానం? ఇది జగన్న కు చెప్పే వారు ఉన్నారా? అంటే, జిల్లాలో జగనన్న విలువ తగ్గిస్తుంది, వీరంతా కదా?

పార్టీ పెద్దలు అందరు కూడా, జగనన్న 151 సీట్లు తెచ్చినా, చీరాలలో ఘోరముగా ఓడారు, అన్న విషయము మరుస్తున్నారు. ప్రజలు, అద్దంకి నుంచి వచ్చిన తెదేపా కరణం గారి చేతిలో, వైకాపలో అప్పటికే పార్టీ మారి ఉన్న ఆమంచి ని ఓడించారు. అంటే, జగనన్న గాలి పనిచేయలేదు. అంటే, వైసీపీ ఎక్కువ అభివ్రుద్ది తెచ్చి, మేము చంద్రన్న కన్నా, మేలు అని నిరుపించి, మరలా ఓటుకి వెళ్ళాలి 2024 లో.

అంటే, పై పార్టీ పెద్దలు అందరి బాధ్యత ఉంది కదా, జగనన్నను మరలా గెలిపించడములో. అంటే అభివ్రుద్ది పనులు తేవాలి, చీరాల జిల్లా, హార్బర్, చేనేత పార్క్, సూపర్ స్పెషాలిటి ఆసుపత్రి లాంటివి, సంవత్సరము గా ఒక్కటైనా తెచ్చారా? లేదు.

జిల్లాలో రెండో పెద్ద ఊరు మరియు ఆదాయ వనరు, చీరాలను వదులుకోవడము అంటే, జిల్లా నాయకుల అసమర్ధత కాదా?

చేతికి వెన్నెముక లేని, మన మనసున్న జగనన్న చీరాల అభివ్రుద్ది వద్దు అంటారా, వీరు విడమర్చి చెపితే?

* విజయ్ సాయి గారి ని విశాఖకు పరిమితము చేసారు, చేతులు కట్టేసారు, ఇటు సంబంధము లేకుండా, మీరు వినలేదా? అయినా కూడా, ఆమంచి కి, అండగా ఉన్నప్పుడు, ఏమీ తేలేని చాతగాని అనుచరుడుగా మిగల్చకూడదు. రోశయ్య గారు అదే పని చేసారు, పెద్ద అభివ్రుద్ది తేకుండా. జగనన్న కు నష్టము చేయకూడదు. కనీసము ఒక్కటి అయినా, ఆయన ప్రయత్నము చేయవచ్చును.

* సజ్జల - వారికి ఉన్న 100 పనులతో బిజీ గా ఉండి, జిల్లా భారం బాలినేని మీదే, పెట్టారని అంటున్నారు. కాబట్టి ఇక్కడ ఇబ్బందులు ఆయన పట్టించుకోవడము లేదు. గుడ్డిగా, బాలినేని మాటలు వింటున్నారు, జగనన్న కు నష్టం చేస్తున్నారు. ఆయన పూర్తి సమయాన్ని వెచ్చించి, జిల్లా అభివ్రుద్ది సమస్యల గురించి చర్చించాలి.

* వేమిరెడ్డి - నెల్లూర్ నుంచి రాజ్య సభ ఎంపీ గారికి, అంత పట్టు, ఓపిక, కష్టం కాబట్టి ఆయనా ప్రేక్షక పాత్ర వహించి, సజ్జల లేదా బాలినేని గారికి వదిలేస్తున్నారేమో అంటున్నారు. లోక్సభ ఎంపీలనే ఎమ్మెల్యేలు మంత్రులు, లెక్క చేయడము లేదు.

*వైవీ సుబ్బారెడ్ది - టీటీడీ పదవి చేతిలో పెట్టి, తిరుపతి లో కట్టేసారు, ప్రకాశం జిల్లా లో వేలు పెట్టకుండా, రెండో అధికార వ్యవస్థ, అభిమానులు పెరగకుండా. బాబాయి గా, ఒకసారి వెళ్ళి లేదా ఫోన్లో, కనీసము జిల్లాలో జరిగేది చెప్పి, బాలినేని పట్టించుకోవడము లేదు, మన పరువు పోతున్నది అక్కడ మరియు ఒంగోల్ లో కూడా. చీరాలకు ఏదో ఒకటి ఇవ్వు, చంద్రన్న కన్న మనమే గొప్ప అని చెప్పు, మనము గెలవాలి అని చెప్పే ధైర్యం ఈయనకే ఉంది.

* బాలినేని వాసన్న - ఇప్పుడు చెప్పండి, పై వాళ్ళు అందరికి, పాక్షిక బాధ్యత మాత్రమే. ఎప్పుడో ఒకసారి జగనన్నను కలుస్తారు. పూర్తి బాధ్యత, రోజూ జగనన్నను కలిసి, అన్ని చెప్పి చేయించేది కేవలము వాసన్నే కదా? జగనన్నను తప్పు దోవ పట్టిస్తున్నది, ఉన్న విషయాలు చెప్పకుండా వాసన్నే కదా? జిల్లాలో తెదేపా ఎమ్మెల్యేలను తెస్తుంది, వాసన్నే కదా? చీరాల రగులుతుంది వాసన్న కరణం గారిని తెచ్చిన, తర్వాతే కదా? ఆ తర్వాత ఒక్క పధకము లేదు, చీరాలకు కదా? పర్చూరు, అద్దంకి ఎమ్మెల్యేలను తేలేకపోయింది వాసన్నే గదా?

ఇక్కడ తప్పు పడుతున్నారు అనోద్దు దయచేసి, మాకు వాసన్న అంటే ఇష్టమే. జగనన్న ఖ్యాతి పెంచమంటున్నాము, తప్పులు సరి చేయమని కోరుతున్నాము.

భవిష్యత్ లో వాళ్ళ వారసుడి మంచి కోసము, మంచి పనులు చేయమని మాత్రమే, చెపుతున్నాము.

ఆయనకు, వ్యతిరేకము వెళ్ళడము లేదు, సరైన దోవ ఇది జగనన్నకు అని, మంచి దోవ చూపుతున్నాము, చీరాలలో మరియు ప్రకాశం అభివ్రుద్ది లో నిలబడటానికి.  
Author photo Sri, Telugu , 15+ yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 840+ Foreign and local events/ places coverage, 2117 General Articles and views 1,878,730; 104 తత్వాలు (Tatvaalu) and views 226,021
Dt : 07-Nov-2020, Upd Dt : 07-Nov-2020, Category : Politics
Views : 791 ( + More Social Media views ), Id : 798 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags : vijay , sajjala , vemireddy , yv , wrong , balineni , development , chirala , ongole , prakasam , collector , jagan , amanchi , karanam
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.

Share
NRI , అమెరికాలో లేదా విదేశం లో ఉంటారా, అయినా USA వార్తలూ ఇక్కడే
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 11 yrs
No Ads or Spam, free Content