Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
1 min read time.
మా పిల్లలు వీరన్న, చంద్రన్న, జగనన్న, పవనన్న కు వ్యతిరేకముగా కుట్రలు చేస్తే, తప్పు కదా. మనము ఆపే దైవ ప్రయత్నం చేయాలి సుమా. మనసులు మార్చాలి, మనిషిని కాదు.
పదవి పోతే లేదా ఏదైనా కష్టాలు వస్తే, మనసున్న క్రుతజ్ఞతలు ఉన్న మనుషులు, ఎవరైనా ఏమి చేస్తారు? ఏమి తప్పులు చేసాము, ఎందుకు ఇలా జరిగింది, మన దోవను ఇప్పుడు ఎలా మార్చుకుందాము మంచికోసం, అని ఆలోచన చెయ్యాలి, పశ్చాత్తాప పడాలి.
తన తప్పులు సరిదిద్దు కోవాలి. ఇప్పటి వరకు అవకాశం ఇచ్చిన వారికి, విధేయులై ఉండాలి, క్రుతజ్ఞతలు చూపాలి.
అందుకే మనకు పాత సామెత, ఎక్కడైనా బావే గానీ, వంగ తోటలో మాత్రం కాదు అని. అంటే, జాగ్రత్త గా ఉండాలి. బంధువు అని, నెత్తిన ఎక్కించుకుని, మన పతనము మనమే పొందకూడదు.
అది గమనించి, జగనన్న మన ప్రకాశం జిల్లా మంత్రి వాసన్నను, పక్కన పెట్టారు, నచ్చ చెప్పారు, సరి చేసుకునే సమయం ఇచ్చారు. ఎన్నికలకు, నిజమైన వైసీపీ కార్యకర్తలకు అండగా ఉండమన్నారు.
ఓ పక్క పెట్రోలు ధరలు పెరిగి, జనం అల్లాడుతున్నారు. లంకలో తిండి తిప్పలకు, నా నా పాట్లు పడతున్నారు. కానీ పదవి పోయిన నాయకులకు అది పట్టదు. తమ అధికారం ఐశ్వర్యం పలుకుబడి జన సందోహము చూపించుకోవాలని తపన.
ప్రకాశం జిల్లా ఎప్పటికీ వెనుకబడి ఉంటానికి కారణము, ఇలాంటి ఉత్తుత్తి నాయకులే ప్రధాన సమస్య. పైకి కనపడేది నిదానం సౌమ్యత వేరు, లోన నటన కుట్ర పూరిత ఆలోచనలు వేరు. తన అనుచరుడు గుప్త, వివరము గా చెప్పారు కదా.
మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి అనుచరగణం, సోమవారం భారీ ర్యాలీ చేసింది. తొలిసారిగా సోమవారం హైదరాబాద్ నుండి వాసన్న, ఒంగోలు వస్తున్న సందర్భంగా ఆయనకు, ఆయన అనుచరులు, అలాగే చీరాల ఎమ్మెల్యే కరణం, బ్రహ్మరథం పట్టారు.
ఎవండోయ్ ఎందుకు ఈ రాలీ, ఏమి సాధించారని అంటారా?
రామాయపట్నం పోర్టు, కొత్తపట్నం షిప్పింగ్ హార్బర్, అలాగే చీరాల జిల్లా లేదా శాఖలు ఇచ్చి హార్బర్ తెచ్చినందుకు అనుకునేరు సుమా, పోనీ జిల్లా అధికారులతో సోషల్ మీడియా సమాచారం పెట్టించే చొరవ ఉన్నందుకా?
అబ్బే అభివ్రుద్ది గురించి, అస్సలు మనకు పట్టదు. అభివ్రుద్ది చేస్తే, జనము మనకు ఓట్లు వేయరు, అబద్దాలు కొనసాగవు. జిల్లా బీద స్వరూపము మారకూడదు, మన ఆటలు సాగవు కదా.
పదవి ఉన్నా లేకపోయినా బాలినేని, జిల్లాలో కింగ్ మేకర్ అని అర్థం వచ్చేలా వైసీపీ నేతలు, కార్యకర్తలు, ఆయన అభిమానులు బొల్లాపల్లి టోల్ ప్లాజా వద్ద నుండి స్వాగత ఏర్పాట్లు చేశారు. 500 నుంచి 1000 వాహనాల్లో వారు ఆయనకు ఎదురేగారు.
పూల వర్షం కురిపిస్తూ ఒంగోలు దాకా తీసుకువచ్చారు. చీరాల తెదేపా నుంచి దూకిన ఎమ్మెల్యే కరణం బలరాం, పర్చూరు నియోజకవర్గ వైసీపీ ఇన్ ఛార్జి రావి రామనాథం బాబులు మాత్రమే జత కలిశారు.
ఒక్కమాటలో చెప్పాలంటే బాలినేని బలాన్ని, ముఖ్యమంత్రి జగన్ కు చాటిచెప్పడమే, ధ్యేయంగా ఈ ఘన స్వాగత కార్యక్రమం జరిగింది.
మరి ఇది జగనన్నకు అనుకులము గానా? లేక బెదిరించడానికా తెలియరాలేదు. జగనన్న ముందు కుప్పిగంతులు వేస్తూ ఉంటే, భవిష్యత్ ఇంకా కష్టం గా ఉంటుంది అని అభిమానుల ఆలోచన.
మాజీ మంత్రి తెదేపా గోడ దూకిన మంత్రి సిద్దా కనపడలేదు. జిల్లాలో 8 మంది ఎమ్మెల్యేలు ఉంటే, మరి ఎవరూ తోడు గా రాలేదు. అది అందరిలో తల దించుకునే విషయం, కనీసం ఓ 5 మంది వైసీపీ ఎమ్మెల్యేలు అన్నా ఉండాలి కదా, రాలీ లో?
ఇలాంటివి ఎన్ని, మన జగనన్న చూసి ఉండరు. చూద్దాము, కాలం ఇంకెన్ని విచిత్రాలు చూపిస్తుందో.
ఇంతకన్నా పెద్ద రాలీలే చేసి, జనానికి పసుపు కుంకుమ పంచిన, చంద్రన్న కధ చూసాము కదా అని జగనన్న అభిమానులు అచ్చెరువు చెందుతున్నారు.
Laying pranks in front of Jagan, former minister Balineni cars rally, a huge force demonstration
Sri, Telugu ,
15+ yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 840+ Foreign and local events/ places coverage, 2254 General Articles and views 2,547,581; 104 తత్వాలు (Tatvaalu) and views 272,747
Dt : 18-Apr-2022, Upd Dt : 18-Apr-2022, Category : Politics
Views : 689
( + More Social Media views ), Id : 1355
, State : Andhra/ Telangana (Telugu)
, Country : India
Tags :
pranks ,
jagan ,
minister ,
balineni ,
cars ,
rally ,
force ,
demonstration ,
karanam ,
chirala ,
parchuru ,
ravi
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో.
అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.
అన్నీ వార్తలే, నాకు నచ్చిన వార్తా వీడియో లు కొన్ని ఎంచుకోని, పని చేస్తూ ఇక్కడే వినొచ్చు చూడొచ్చు
Facebook Comments