గెలుపు గెలుపే, అందరి కష్టాన్ని, మంచి మనసు తో అభినందించాలి, ఆశీర్వదించాలి - Politics - లోకం తీరు/ News
           
     
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. 1195 కధనాలు. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు. 1225 General Articles, 47 Tatvaalu.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
2 min read time.

రాష్ట్రం మొత్తం లో అఖండ విజయానికి బాటవేసిన, వైసీపీ నాయక మణి రత్నాల కు, ఆణిముత్యాలైన కార్యకర్తలు కు, అవమానాలు కష్టాలు ఎదుర్కొని ధీరత్వము తో వీరత్వంగా ప్రజల గుండెల్లో నిలబడి న అధిష్ఠానం కు, మన ప్రియతం ముఖ్యమంత్రి జగనన్న కు శుభాకాంక్షలు.

దూరంగా ఉండి మాటలతో మభ్యపెట్టకుండా, కష్టపడి ప్రజల మధ్యలో తిరుగుతూ, స్ధానికంగా ఉంటూ, ప్రజలతో మమేకం అయితే నే గెలుపు వరిస్తుంది, అని మరోసారి నిరూపించారు.

జగనన్న ఆకాంక్ష ను నిలబెట్టి, అధి నాయకుడు ప్రజల మధ్యలో తిరగాల్సిన పని లేకుండా నే, కార్యకర్తలు గా మేము ఉన్నామని, అకుంఠిత పట్టుదల దీక్ష తో పనిచేసి గెలిపించి, జగనన్న కు ధైర్యం చెప్పారు.

ముందు చూపుతో, రాజకీయ మంత్రాంగం తో కష్టపడి, టీం వర్క్ చేసి, రావాల్సిన ఫలితం, ప్రజల నుంచి, ఏకపక్ష గా అఖండ విజయం పొందగలిగారు.

రాష్ట్రంలోని 12 కార్పొరేషన్లకు గానూ, ఏలూరు ఫలితం వెలువడాల్సి ఉండగా, కౌంటింగ్ పూర్తయిన మొత్తం 11 కార్పొరేషన్ల నూ అధికార పార్టీనే గెలుచుకుంది. అలాగే మొత్తం 75 మున్సిపాలిటీలకు గానూ, 74 చోట్ల ఫ్యాను గాలి వీయగా, తాడిపత్రి టీడీపీ ఖాతాలోకి వెళ్లింది. సీఎం జగన్ మాత్రం, వైసీపీ గెలుపు క్రెడిట్, ప్రజలకు, దేవుడికి దక్కుతుందన్నారు.

మంచైనా చెడు అయినా, గెలుపు గెలుపే, అందరి కష్టాన్ని, మంచి మనసు తో అభినందించాలి, ఆశీర్వదించాలి.

ప్రజలు తమ ఆలోచన అభిరుచులు కు పట్టం కట్టారు. అందుకే మా నినాదం, తప్పు ఎప్పుడూ నాయకులు ది కాదు, వారిని ఎన్నుకున్న ప్రజలదే.

విజయ సాయి, సజ్జల, అలాగే ప్రకాశం లో బాలినేని, చీరాలలో కరణం పట్టును నిలుపుకుని, అఖండ విజయం సాధించారు.

2 ఏళ్ళ తర్వాత కూడా, ప్రజలు జగనన్న పక్షానే ఉన్నారు అని మరోసారి నిరూపించారు. కంగ్రాట్స్.

ఇంకా ఎక్కువ కష్టపడి, జగనన్న పేరు నిలపాలి. 2024 ను ఆశలను పెంచాలి.

అలాగే జగనన్న తో చెప్పి, గత పాలకుల సమయంలో ప్రకాశం జిల్లా కు, అలాగే చీరాల కు జరిగిన అన్యాయం వివరించి, ప్రకాశం కు చీరాల ప్రాంతానికి ధర్మ బద్దంగా రావాల్సిన ఫలాలను అభివృద్ధి ని రప్పించాలి.

చీరాల చుట్టుపక్కల జగనన్న ఖ్యాతిని, స్ధిరంగా ప్రజల హృదయాలలో నిలపాలని, ప్రజలు సవినయంగా కోరుతున్నారు.  
Author photo Sri, Telugu , 10 yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 828 Foreign events/ places coverage, 1225 General Articles, 47 Tatvaalu
Dt : 15-Mar-2021, Upd Dt : 15-Mar-2021, Category : Politics
Views : 193 ( + More Social Media views ), Id : 1033 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags : jagan , ysrcp , winning , hard work , appreciate , bless , good mind , vijay sai , balineni , sajjala , chirala
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.

Share
ఆ టీవీ, ఈ టీవీ, మీ టీవీ, మా టీవీ, వాళ్ళ టీవీ పత్రిక - అన్ని టీవీ, పత్రిక వార్తలు వినోదం ఇక్కడే
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 8 yrs
No Ads or Spam, free Content