ఇది కధ? అరిషడ్వర్గాల అష్టవ్యసనాల బానిసత్వం? గుణం ముఖ్యమా? తప్పు ఎవరిది? పూజ ఫలితం? - General - లోకం తీరు/ News
           
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. 2073 కధనాలు. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు. 2108 General Articles and views 1,865,296; 104 తత్వాలు (Tatvaalu) and views 224,877.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
1 min read time.

*ఇది కధ కాదా? అరిషడ్వర్గాల అష్టవ్యసనాల బానిసత్వం లేదా? గుణం ముఖ్యమా? తప్పు ఎవరిది? పూజ ఫలితం?*

*Is this a story? Is there no slavery of Ashtavyasan Arishadvarg? Does Quality Matter? Whose fault is it? Result of Pooja?*

అరిషడ్వర్గాల అష్టవ్యసనాల బానిసత్వం నేటి లోకం తీరు, శాపం పాపం కొడుకు/ మామయ్య/ అత్త/ కోడలు/ కూతురు/ అల్లుడు?

స్వార్ధం తో ఊరూరా తిరిగి, ఆత్మాభిమానము ధైర్యం స్వయంక్రుషితో పైకి వచ్చే నమ్మకం లేని తమ వంశ ఎదుగుదల కోసం, ఏరి కోరి ఆశ చూపించి పీడించి ఎంతో తీసుకుని చేసుకున్న, తమ కన్నా గుణ రహిత వంశం అని తెలిసి కూడా, మిగతా సంబంధాలలో కన్నా అన్ని విషయాలు ఎక్కువ ఉన్న, ధన చదువు కనక కోడలు కు, ప్రయాణ వివరాలు అప్ప అలాగే నచ్చ చెప్పి, సెలవు అనుమతి తీసుకుంది.

ధనముతో రక్తం తాగే పులి అయినా, ఆస్తుల అధికార మదముతో పశువులను కొని ఆడుకునే ఆడించుకునే వంశమైనా, కొన్నిసార్లు ఓ అడుగు వెనక్కు వేయాలి లే, పర్లేదు, అమ్ముడుబోయిన సేవకుల కైనా ఓరోజు ఆదివారం సెలవు లాగా ఇద్దామనుకుంది కోడలు. ధన దేవోభవ, గుణం వద్దులే బావా, అన్న తమ ఇరువంశాల బంధువుల నినాదం గుర్తుకు వచ్చి గర్వపడింది.

ఆట విడుపుకు ఊపిరి పీల్చుకుని, హాయిగా ఊరేగి రమ్మని, కోడలు తరపు పుట్టింటి వారు అండ వస్తారు, తోడు ఉంటారులే ఒక్కరోజు కు, అని కోడలు దయతలచి జాలితో వరమిస్తే చెపితే నమ్మి, పాపం వయస్సు మళ్ళిన పిచ్చి అత్త, ఒంట్లో బాగోని మరియు గతించిన బంధువుల ఊరు, పలకరింపుకు వెళ్ళింది, ఇంకొక బంధువును తోడు తీసుకుని.

ఈ ప్రయాణం లో తన మంచి స్వార్ధం కూడా ఉంది, (గతములో తన అత్త మామలకు దిన దిన భయంకర శాంతి ఇచ్చినట్లుగా) ఇంట్లో సూటి పోటి మాటలతో అవమానలతో ఈసడింపులతో, తలనొప్పి గుండె పోటు రక్తపోటు తగ్గించడానికి కూడా, మనశ్శాంతి గా ఉండటానికి కూడా, కొన్ని రోజులు బయట గడిపి రావచ్చును కదా?

గతించిన మామ అద్రుష్టవంతుడు అని, కప్పల తిప్పలు తప్పించుకున్నారు అని, మురిసిపోయేది. లేకపోతే మామ కూడా అత్త లాగే, ఏదో ఒక యాత్ర గుడిలోనో లేదా బంధువుల ఇళ్ళలో, రోజుల తరబడి జాగారం చేయాల్సి వచ్చేది, తలదాచుకోవలసి వచ్చేది అని బాధపడింది.

అందుకే పోయినోళ్ళు అందరూ మంచోళ్ళు, ఉన్నోళ్ళు పోయినోళ్ళ తీపి గురుతులు, కష్టాలకు నష్టాలకు పాపాల ఫలితాలకు వారసులు అన్నారు ఖర్మ ఫలితాల విలువ తెలిసిన పెద్దలు.

ఇంతలో ఏమైందో ఏమో, తోడు ఉండడానికి ఎవరు రాలేదో, రాజు తలచుకుంటే కొరడా దెబ్బలకు కొరవా అన్నట్లు, కోడలు అనుగ్రహముతో, మరలా అత్తకు ఫోన్ చేసి, మధ్య స్టేషన్ లో నే రైలు దిగి వెంటనే, తొందరగా వెనక్కు రమ్మంది, ఒంట్లో బాగోకపోతే నాకు ఎవరు వండి పెడతారు, కొత్తగా పెట్టిన వందే భారత్ రైల్ లో వచ్చేవారం వెళ్ళవచ్చులే అని మందలించింది, ఆజ్ఞాపించింది, హెచ్చరించింది.

అంతే కాదు, కోడలు తరపు పుట్టింటి వారు కూడా సగౌరవముతో ఆ పూటలోనే, అత్తకు రెండు మూడు సార్లు ఫోన్ చేసి, కమ్మటి పచ్చి గడ్డి పెట్టారు. సంతలో కొన్న వారి సేవకు 24 గంటలు తోడు లేకుండా, మంచి రేటుకు గొడ్డును అమ్ముకున్న వాళ్ళు, తమ సేవా బాధ్యత మరచి, మా పిల్లను ఒంటరిగా విడిచి, ఎలా విహారానికి వెళతావు అని కర్తవ్యబోధ చేసారు.

అత్త ఆశ్చర్య పోయింది, 25 ఏళ్ళ క్రితం గురు భక్తితో, సేవాతత్పరత దైవ భక్తి భావనతో, తను చేసిన మంచి పనులు అన్ని గుర్తు వచ్చాయి, తన అత్త మామలను, ఇంత కన్నా తక్కువ స్థాయిలోనే శాంత పరిచానే, నాకు వడ్డీ తో సహా మరింత ఎక్కువ ఫలితాలు వస్తున్నాయని, ముచ్చట పడింది. అత్త ఒకనాటి/ ఒకింటి కోడలే అన్న సామెత గుర్తుకు వచ్చి, భారంగా ఆనంద భాష్పాలుతో నిట్టూర్పు విడిచింది.

తన అత్తకు తనకు మధ్య ఆనాడు, మామ ఎలా నలిగిపోయింది, ఆడంబరాలు అవసరాలు అవకాశాలకు, చవటకు మల్లే ఆత్మాభిమానం చంపుకుని, ఎలా అడుగులకు మడుగులు వత్తుతూ, చివరకు తట్టుకోలేక దుర్వ్యసనాలకు బానిస అయ్యింది, గుర్తు వచ్చింది. ఈనాడు తన కొడుకు కూడా, వారసత్వం కొనసాగించడాన్ని చూసి మురిసిపోయింది.

నేను రైలు దిగి రాను, కొనసాగిస్తాను, వారిని పలకరించి వస్తాను అని ఖరాఖండిగా, అన్ని ఫోన్లకు జవాబు చెప్పింది. ఇక భరించలేను అనుకుంది, ఒకరు కాదు, అందరూ ఫోన్ చేసి చెప్పడం, తట్టుకోలేకపోతుంది. మనము ఇతరులను బాధ పెట్టడం తేలికే, కానీ అదే బాధ మనము తట్టుకోలేము కదా. కొడుక్కి ఫోనె చేసి, పూటలో జరిగిన కూటములు కుట్రల గురించి, సంగీత శ్రావ్యమైన పాట ను వినిపించింది.

చెవులు చిల్లులు పడే రక్తం ధారలు కారే, గుండే బద్దలు అయ్యే, ఆ అమ్ముకున్న అమ్మ మధుర గానం విన్నా కూడా, శిల అయిన కొడుకు ఎప్పుడులా మౌనం, ధన మద దాసుడై, ఘనమైన అత్త గారి ఇంటి పెంపుడు కుక్క లా, భార్య చేతిలో మర కీలు బొమ్మలా, చిన్నప్పటి నుంచి క్రుతజ్ఞత విశ్వసనీయత తన మన లేని తప్పుడు నిర్లక్ష్య బద్దక పెంపకంతో, అమ్ముడుబోయిన బానిస పశువులా, ఆత్మ ద్రోహిలా, దొరికిన దొంగలా, ఫలితాల శిక్షలా, అన్ని ముసుకుని కూర్చున్నాడు.

ఇప్పుడు నాలా మరియు గతములో నాన్నలా సర్దుకోమని ప్రేమగా హితవు, మనసు విలువ జీతం జీవం లేని సేవకురాలిగా, ఇక్కడే ఉండి తరించి ముక్తి పొందమని, చేతులు పట్టుకుని అభ్యర్ధన. లేదంటే ఇంట్లో తనకు అన్నం బిచ్చం గా అయినా బొచ్చెలో పడదని భయం తో వణుకుతున్నాడు. ఎదురుగా పేపర్లో గ్రుహ హింస కేసులు, చేతుల్లో నుంచి ధన ప్రవాహం, నలుగురిలో పరువు తక్కువ తనం, గుర్తుకు వచ్చి, పరవశించి పోయాడు.

ఇన్నాళ్ళు తన హయాముగా నడిచిన ఇంట్లో, ఓ వెలుగు వెలిగిన అత్త, సేవకురాలి గా అవమానాలు సూటిపోటీ మాటలతో పడలేనని ఉండనని, కొడుకు నివాసం ఉన్న, తన సొంత ఇల్లు తప్పనిసరి పరిస్తితిలో వదలి, ఒంటరిగా అనాధగా, పిల్లల మనుమల ముద్దు మురిపాలు లేకుండా, పెళ్ళి పెటాకులు లేని ఒంటరి మనిషిలా, పిల్లలు చీదరించుకుని వెలివేసిన నిష్ప్రయోజనమైన ఓడిపోయిన జీవితములా, అద్దెకు వేరు కాపురం పెట్టింది.

ఒంటరి మామ అయినా ఇంతే. రేపు కొడుకు మరియు కోడలు, మనుమలు, మనుమరాళ్ళ పరిస్తితి ఇంతకన్నా దారుణం. వీరి పూజకు గురు దైవ భక్తికి ఫలితం ఉందా? అందుకే మన చుట్టూ ఉండే, మానవత్వ దైవ లక్షణాలు గల ఉత్తములను మనము వెతుక్కోవాలి, వారి నీడలో ఉండాలి.

నేడు బుద్దిగా కోడలే, వీలైతే బద్దకం వీడి అన్ని పనులు చేసుకుంటుంది లేదా హోటేల్ నుంచి గడ్డి ఘనముగా ధనం విసిరి తెప్పించుకుంటుంది.

వారు మాత్రం ఎవరూ తగ్గరు, తమ కున్న బలం బలగం బంధుత్వం స్నేహితం మనస్తత్వం మానవత్వం గురుసేవ దైవభక్తి అలాంటిది.

మరి ఇందులో తప్పు ఎవరిది? ఎవరి పెంపకలోపం, అటువైపా, ఇటువైపా? వీరు ఎవరి మంచి మాటైనా వింటారా? వీరికి గురు దైవ భక్తి ఉందా? వీరు భవిష్యత్ అంచనా వేయగలరా? వీరి ఆలనా పాలన లో పెరిగి పెద్ద అయిన, పిల్లల మానసిక సంస్కార మానవత్వం పరిస్తితి ఏమిటి? పశ్చాత్తాపం ఎవరు పడాలి, ఎందుకు పడాలి, ఎవరు మారాలి? మార్పులు ఉంటాయా? ఉంటే, కలియుగ పాపం 3 పాదాలతో, 80% బలము తో ఎందుకు పెరుగుతూ విచ్చలవిడిగా ఎదుగుతుంది?

మన కూతురు/ కొడుకు కూడా ఇంకో ఇంటి కోడలే/ అల్లుడే. కాబట్టి ఎటు తిప్పినా, కధ ఒకటే. అరిషడ్ వర్గాల అష్ట వ్యసనాల బానిసలు కు తిప్పలు తప్పవు. కళ్ళు తెరవండి, తప్పులు ఒప్పుకుని చెంపలు వేసుకుని, ఆత్మ విమర్శతో ఆత్మ జ్ఞానం పొందండి లేదా ఇంట్లో వారిచే ఘనమైన శారీరక మానసిక శిక్షణ పొందండి. నిర్ణయం మనదే, ఫలితాలు మనకే.

మంచివారి సుతి మెత్తని, చాటు మంచి మాటలను ముందు జాగ్రత్తలను, బాగుగా ఆలోచన చేసి, 10 ఏళ్ళు పైగా సరి చేసుకోకుండా, గేళి చేసిన వారందరికీ, ఆ తర్వాత ఖర్మ ఫలితం మొదలు అవగానే, ఇంట్లో వారూ ఊరంతా తెలిసేలా గేళి చేస్తున్నారు చేస్తారు. మన కర్మ అలాగే ఖర్మ విడువదు. దేవుని కి సంబంధం లేదు, మన అహంకార ఫలితం. అందుకే నిస్వార్థంగా మనం ఏది పంచుతామో పెంచుతామో అదే వెనక్కు వస్తుంది.  
Author photo Sri, Telugu , 15+ yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 840+ Foreign and local events/ places coverage, 2108 General Articles and views 1,865,296; 104 తత్వాలు (Tatvaalu) and views 224,877
Dt : 17-Jan-2023, Upd Dt : 17-Jan-2023, Category : General
Views : 571 ( + More Social Media views ), Id : 1695 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags : story , arishadvarg , slavery , quality , gunam , fault , pooja , result , atta , kodalu , aunt , daughter
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.

Share
కేవలం ఒక మీడియా వార్త నే నమ్మలేము, ఒకే చోట అందరి వార్తలను ఇక్కడ చూసి, నిజాలు పోల్చుకోగలము
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 11 yrs
No Ads or Spam, free Content