మతం మారడం, తల్లి ని మార్చడమే? సంస్క్రుతిని సంస్కారం ను ఎంత నిర్లక్ష్యము చేస్తే, అంత బానిసలుగా? - General - లోకం తీరు/ News
           
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. 2104 కధనాలు. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు. 2139 General Articles and views 2,047,582; 104 తత్వాలు (Tatvaalu) and views 235,570.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
1 min read time.

మతం మారడం అంటే, విశ్వసనీయత ఓర్పు సహనం క్రుతజ్ఞతలు బాధ్యత లేకుండా, కన్న తల్లి ని మార్చడం తో సమానం అంటారు, అనుభవం గల పెద్దలు.

ప్రతి మతము లో నూ, లోపాలు ఉండవచ్చు, కానీ తక్కువ లోపాలు కలిగి, సుదీర్ఘ కాలం మన్నిక అయినది, పూర్వీకులు రాసిన ఉత్తమ గ్రంధాలు ఉన్న మతము ఏమిటి?

పేదరాలని, నీతి గా సంస్కారం గా జీవించమని, గాలి మేడలు వద్దు నేల మీద నడవమని, తాను కష్టాలు పడుతూ, మనల్ని కూడా పడమని, చక్కని భవిష్యత్ జీవిత పాఠాలు నేర్పే, కన్న తల్లి ని వదిలి, ఇంకో ధనమున్న పెంపుడు తల్లి, పిన్ని దగ్గరకు వెళతామా? ఆ ధనవంతులకు, వారికి తగ్గ కష్టాలు బాధలు, వారికి ఉండావా?

బీదలు కష్టాలు బాధలు లేని మతం, ప్రపంచంలో ఎక్కడైనా ఉందా? ఇతర గ్రహాలకు కూడా, తుఫానులు విస్పోటనాలు తప్పడం లేదే?

పాశ్చాత్య దేశాల్లో లేదా ఇతర మతాల లో, రోడ్డు వెంట గుడారాల లో, దీనంగా చేయి చాపుతూ బతికే వారు లేరా? కుల జాతి వివక్షత, తెగలు రకాలు, హెచ్చు తగ్గులు, జాతి పోరాటాలు, వారిలో లేవా?

వారి దేశం అప్పుల్లో మునిగి లేదా? వారి దేశం, ఇతరుల పై దండయాత్రలు చేసి, జనాన్ని చంపి చెరచి, నిర్దయగా నిరంకుశత్వముగా దోచుకోలేదా? బలవంతపు మత మార్పిడి చేయలేదా? వారి మత జ్ఞానం వారిని ఆపిందా? ఆత్మ జ్ఞానం ఇచ్చిందా?

వారు, వారి దేశ బీదలకు, అలాగే ఆర్ధిక వ్యవస్థకు సహాయం చేయకుండా, నీకెందుకు ప్రత్యేకముగా చేస్తున్నారో, ఇక్కడకు ధనము ఎందుకు పంపుతున్నారో, ఆలోచన చేయమా? కేవలము అర్ధం లేని ఉపయోగం లేని మతమార్పిడికే. మరి అందరినీ, వారి దేశ వీసాలు ఇప్పించి, వారి దేశానికి తీసుకుని వెళ్ళి, మంచి ఉద్యోగాలు ఇల్లు సౌకర్యాలు ఇప్పించరే?

ధనమిచ్చి లేదా అవసరము తీర్చి లేదా భయముతో బెదిరించి, మా దేవుని దయచేసి నమ్మండి అనే పద్దతి కూడా, ఒక పద్దతి సంస్కారము ఏనా? బీదల లేదా అవకాశ వాదుల పరిస్థితి తో, ఎదిగే మతము కూడా ఒక మతమేనా?

పదవ తరగతి సోషల్ చదివిన వారిని అడగండి, ప్రపంచములో అన్ని మతాలు దేశాలు, మన దేశ సంపదకై, ఆరాట పడి, వెతుక్కుంటూ వచ్చి, మన లేదా ఇతర దేశ జనాలపై, ఎన్నో దాష్టికాలు చేశారు.

ఇతర మతాల లో, షియా సున్నీ భాయ్ భాయ్ అనరే? తెలుపు నలుపు భాయ్ భాయ్ అనరే? వారు అన్నదమ్ములు గా సఖ్యత గా ఉండరే? వీసాలు ఎందుకు, అందరూ సమానమైనప్పుడు? ఆచరణ లో చూపరే? అని అందరూ అంటుంటారు.

మరి వారి మతాలు గొప్పవైతే, ఇతరుల మీద దాడులు, మారణ కాండ హింస ఎందుకు? వారు మానసిక శారీరక సుఖ సంతోషాలతో తులతూగుతూ ఉంటే, అవి అవసరమా?

టెలిస్కోప్ లేనప్పుడే, మన దేశ పండితులు, నవ గ్రహాల గమనాన్ని లెక్కించారు కదా? వారి మత విజ్ఞానం ఏమైంది? ప్రపంచములో ఎక్కడ తవ్విన గానీ, హైందవ సంస్క్రుతి మాత్రమే బయట పడుతుంది. మరి ఇతర మతాలవి బయటపడవే?

మరి ఇప్పుడు, మనము మన సంస్కారం ఆచారం ను విడిచి, బద్దకము తో నిర్లక్ష్యము తో ఉన్నాము కాబట్టే, బంధాలు విలువలు సాంప్రదాయం వదిలి, నగరాలు విదేశాలు కు తిండి కోసం, పొట్ట చేతపట్టుకుని పరుగులు తీస్తూ, అదే గొప్ప జీవితమని, భ్రమలో బతికేస్తున్నాము.

మనము మన సంస్క్రుతిని సంస్కారం ను ఎంత నిర్లక్ష్యము చేస్తే, అంత బానిసలుగా ఇతరుల ముందు తలదించుకుని ఉంటాము. ఏ కాలము లో అయినా, నీతి సూత్రమిదే.

ఒకరు అడిగారు, మీరు బాగా శాస్త్ర సహిత మాటలు చెపుతున్నారు కదా, ఎవరి నైనా మతము మార్చారా అని?

ప్రాణము పోయినా, ఆ తప్పుడు పని చేయము. ఇతరులు వాస్తవాన్ని గ్రహించి ఆత్మ జ్ఞానము తో, తమంతట తాము రావాలి అంతే గాని, మనము ఆ పాపపు పని చేయము.

మన హైందవులను, కర్తవ్యాన్ని భోదించి గతాన్ని గుర్తు చేసి నిద్ర లేపడమనే పని తోనే, జీవితము మొత్తము సరిపోతుంది, మనకు ఇతరులను మార్చే ఓపిక సమయం లేదు అని నవ్వుతూ అనుకున్నాము.  
Author photo Sri, Telugu , 15+ yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 840+ Foreign and local events/ places coverage, 2139 General Articles and views 2,047,582; 104 తత్వాలు (Tatvaalu) and views 235,570
Dt : 25-Jul-2021, Upd Dt : 25-Jul-2021, Category : General
Views : 837 ( + More Social Media views ), Id : 1227 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags : change , religion , mother , neglected , culture , enslaved , hindu , haindava
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.

Share
కేవలం ఒక మీడియా వార్త నే నమ్మలేము, ఒకే చోట అందరి వార్తలను ఇక్కడ చూసి, నిజాలు పోల్చుకోగలము
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 11 yrs
No Ads or Spam, free Content