Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
1 min read time. చూడండి ఈ ఫేస్బుక్ వీడియో, ఒక బాధ్యత గల పౌరురాలు, మన లాగ ఇంట్లో ఊరక కూర్చోకుండా, ప్రభుత్వాన్ని విమర్శించ కుండా, మద్యం కోసం లైన్లు లో దగ్గర దగ్గరగా నిలబడి, కరోనాకు బలి అవుదామని ఆత్రముగ ఉన్న, అమాయక చక్రవర్తులను, ఎలా ప్రశ్నించారో, కడిగారో, జీవితము విలువ చెప్పారో. ధన్యవాదములు వారికి.
మేమంతా, మీకు తిండి లేదు అని సహాయం చేస్తూ ఉంటే, మీరు ఇలా మద్యం కోసం, ఆనుకుని లైన్ లో నిల్చుంటారా అని? మద్యము అవసరమా? ముఖ్యమా? అని , వైజాగ్ లో నిలదీసారు. ఎదురు వాళ్ళు ఏదో చేయాలి అనే ముందు, మనమేం చేసామో చెప్పాలి కదా ఎవరికి వారు?
మేము మంచి పోలీసులు, అధికారులు కు బహిరంగంగా, అభినందనలు తెలియజేసాం, మార్గాలు సూచించాం. మరి బాధ్యత గల పౌరులు గా, మీరేం చేశారో, ఎవరికి వారు ఆత్మ విమర్శలు చేసుకోవచ్చు.
ప్రతి దానికి ప్రభుత్వం ని విమర్శించడం కాదు చేయాలసింది, ముందు మనము, మన కుటుంబము బాధ్యత గా ఉండాలి కదా.
మనము, మన పిల్లలు, మన బంధువులు, మన స్నేహితులు ఇలా రోడ్లు మీదకు, తమ సొంత భార్యా పిల్లలు మీద కరుణ జాలి దయ ఉంటే, వస్తామా? కరోనాకు బలి అవుతామా? బయట అందరూ మారాలి, కానీ మనం మాత్రము మారమా? అసలే కరోనా తో పోలీసులు డాక్టర్లు సతమతమవుతుంటే, మరల దీనికై జనం బయటకు రావాలా? మనం బయటకు రాకపోతే షాపుకు వెళ్ళకపోతే, వాళ్ళు షాపు తీసి ఏమి చేయగలరు ఎవరికి అమ్మగలరు?
చెత్త సినిమా తీసిన పదిమంది ని తప్పు పడతాం, కానీ అదే చెత్త సినిమా కు వెళ్ళే, లక్ష మందిని మాత్రం ఏమీ అనము కదూ? ఎందుకంటే ఆ వెళ్ళే వారిలో, మన పిల్లలు బంధువులు ఉంటారు. మన వాళ్ళ ను ఆపలేని మరియు సరి చేయలేని, అసమర్థత మనది.
వాళ్ళు సినిమా తీయడం, వీళ్ళు మందు అమ్మడం మానాలి, ప్రభుత్వం నిషేదించాలి ఆపాలి, అంతే గానీ మేము వెళ్ళకుండా ఆగము, ఎవరినీ ఆపము. ఇదేనా మన నీతి నిజాయితీ నిబద్ధత? ఆలోచన చేయండి, బాధ్యత గల పౌరులు గా ఉందాం.
ఇంట్లో కత్తి, కత్తిపీట ఉంటే, చెడుగా వాడే వాడిది తప్పు కాదా? దానిని కూడా ప్రభుత్వం నిషేదించాలా? ప్రభుత్వం ని తప్పు పడితే, మనల్ని మనం తప్పు పడతం కాదా? ప్రభుత్వం అంటే, ప్రజలు కాదా? ఓటు వేసేటప్పుడు లేదేమి ఈ బాధ్యత?
మందులు షాపులు తీయడం, జగనన్న తప్పు అయితే, ఎన్టీఆర్ మధ్య నిషేధం తొలగించడం చంద్రన్న తప్పు. కానీ, వారిద్దరూ ది తప్పు కాదు. పోలీసులు వద్దు అని మొత్తుకున్నా, ప్రాణాలు ను కుటుంబము ను పణంగా పెట్టి, బయటకు పరుగులు తీసే, మనది మాత్రం తప్పు కాదా సోదరా.
Video
Sri, Telugu , 15+ yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 840+ Foreign and local events/ places coverage, 2109 General Articles and views 1,867,284; 104 తత్వాలు (Tatvaalu) and views 225,042 Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది. అన్నీ వార్తలే, నాకు నచ్చిన వార్తా వీడియో లు కొన్ని ఎంచుకోని, పని చేస్తూ ఇక్కడే వినొచ్చు చూడొచ్చు
Facebook Comments