మంచి 3 ప్రశ్నలు పనులు కు, మన సమాధానం మౌనం అయితే, మనం ధర్మంను కాపాడటం ఆచరించడం లేదా? - General - లోకం తీరు/ News
           
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. 2073 కధనాలు. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు. 2108 General Articles and views 1,864,111; 104 తత్వాలు (Tatvaalu) and views 224,750.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
1 min read time.

*మంచి మాటలు ప్రశ్నలు పనులు కు, మన సమాధానం స్పందన మౌనం అయితే, మనం ధర్మం ను కాపాడటం లేదు, మెచ్చడంలేదు, ఆచరించడం లేదు, అంతేనా?*

కనీసం మాకు రాదు అని కూడా చెప్పలేము, ధైర్యముగా తప్పు ఒప్పుకోలేని వాడు, ఏనాటికైనా తనకు తాను మరియు దైవానికి దూరము.

ఎందుకంటే మనం అధర్మం లో ఉన్నప్పుడు, ధర్మం రుచి గా ఉండదు, సహించదు. ఎవరికి వారే స్వయముగా గోతులు తవ్వుకునే, ఉపయోగము లేని బిజీ బిజీ జీవితములో, అర్ధంలేని సంపాదనలో, మన లోకి చూసుకుని, మనకు మనమే సరిచేసుకునే సదవకాశం ఇది.

30 ఏళ్ళ పైగా జీవితము లో మనము నేర్చుకుంది ఏమిటి? వేదాంతం శివ విష్ణు తత్వాలు? దేవుని తత్వం అర్ధం అయ్యింది ఏమిటి? అరిషడ్వర్గాల బానిసత్వం దాటడం ఎలా? భవిష్యత్ కష్టాలు ఎలా ఆపగలము, తట్టుకోగలము? నష్టం జరిగాక, ఆకులు పట్టుకుని లాభం ఏమిటి?

మరి సంస్కారముతో మనస్సు కదలాలి, నోరు తెరవాలి, వేళ్ళు రాయాలి, గొంతు పలకాలి, మిత్రమా. ఉచితమే కదా, రూపాయి ఖర్చు లేదు కదా? ఇదీ దైవానికి మానసిక నైవేద్యమేకదా?

ఆప్యాయముగా భుజం తట్టి లేపినప్పుడు నిద్ర లేవకపోతే, తర్వాత తట్టెవారే కరవౌతారు. మనకు నిద్ర లెగిచే ఆలోచన చేసే సరిదిద్దే వయస్సే దాటిపోతుంది. కాలం మనకు ఎదురు తిరిగాక, మనము ఏమీ చేయలేము, మనల్ని కాపాడే వారు ఉండరు, ఎందుకంటే మనము ఇన్నాళ్ళు కదలలేదు మెదలలేదు అవసరం అవకాశం లేకుండా. మనసు నైవేద్యంగా, భగవంతుని అలాగే ఆయన బిడ్డలను, పలుకరించలేదు నిస్వార్ధముగా.

అంటే భవిష్యత్తు లో మన పతనం మొదలు అయినప్పుడు కూడా, చుట్టూ పక్కల అందరూ, దేవుడు కూడా మౌనంతో నే మనల్ని గౌరవిస్తారు. అప్పుడు తట్టుకోలేక కన్నీరు మున్నీరుగా ఏడ్చినా ప్రయోజనం శూన్యం.

ఈ 3 ప్రశ్నలు కు మనం సొంతం గా గొంతు (నాలుక పై మాట) తో లేదా తెలుగు రాత (మనసు హృదయం) తో జవాబు చెప్పలేకపోతే, మన వయస్సు హోదా ఐశ్వర్యం సంస్కారం ఆధ్యాత్మికత అనుభవం, మన పెంపకం, మన అరిషడ్ వర్గాల సాధన, మన దైవ పూజ, అన్ని అర్థం లేనివి.

వాట్సాప్ స్టేటస్ లో చూసారా, ఒక సాత్వికురాలు అడుగుతున్నారు - ఇన్ని గంటలు అయినా, ఒకరూ జవాబు చెప్పే ధైర్యం చేయలేదు అని. మనము అంతేనా? ఇప్పుడు కూడా, దేవునికి దగ్గర కామా?

మనకు పంచభూతాల శిక్ష ఏనాడైనా తప్పదు, ఎందుకంటే ప్రాపంచిక సుఖాల బానిసత్వం లో మాయలో పూర్తిగా మునిగి ఉన్నాం.

ఒప్పు అయినా తప్పు అయినా జవాబు రాసి, మన మానసిక స్ధితిని ఆత్మ జ్ఞానం తో ఒప్పుకుని , సరైన జవాబు నేర్చుకోవాలి, కాలం శిక్ష కు దూరంగా ఉండాలి, మన మరియు మన పిల్లల పతనం ఆపాలి, ఆత్మ బంధువులారా.

తినగ తినగ వేము తీయగా, సాధనమున సమకూరు ధరణి విద్య లెల్ల. ఈ లోక ఆత్మ జ్ఞానం, ప్రపంచంలో ఏ బడి కాలేజీ యూనివర్సిటీ, కోట్లు ఇచ్చినా చెప్పదు. ప్రాపంచిక అహంకారం వీడి ప్రతి ఒక్కరూ ప్రయత్నం చేయాలి, ఎందుకంటే కర్మ ఫలము వ్యక్తికి సంబందించినది.

1. రూపాయి ఖర్చు లేకుండా, ఇంట్లో( గుడిలో), మనం సాత్విక ఆచరణ భక్తులైతే, రోజూ మనం దేవుని కి సమర్పించే, సొంత శారీరక మరియు మానసిక నైవేద్యం ఏమిటి, ఎన్ని? వరుసగా ఉదాహరణ లతో రాయగలరు.

2. పాము అంటే భయమా లేక పులి అంటే నా? ఏది మనశ్శాంతి లేకుండా చేస్తుంది? దేనిని ముందు వదిలించుకోవాలి? ఎందుకు అలా?

3. మనము త్రికరణ శుద్ధి గా ఎలాంటి లక్షణాలు ఉన్న వారిని వాటిని గౌరవిస్తూ అండగా ఉంటాము, ఉన్నాము? పాము, పులి, ఆవు. ఉదాహరణతో చెప్పగలరా? ముందు మనము ఆచరిస్తున్న లక్షణం ఏమిటి వాటిలో?

సాత్వికత ఆధ్యాత్మికత దైవ పూజ ఉంటే, ఆచరణలో ఇంట్లో వారికి సంస్కారం నేర్పిన లేదా నేర్పుతూ ఉంటే తప్పక జవాబు చెప్పగలరు?

మరి వీటికి జవాబులు చెప్పలేకపోతే, ఇంకెవరితో ఎప్పుడు కూడా, నీతి నిజాయితీ ఇతరులు సరిగ్గా చేయడం లేదు అని విమర్శించే హక్కు మనకు ఉండదు, ఎందుకంటే ముందు మనలోనే నిజాయితీ నీతి లేదు అని మనమే ఒప్పుకుంటున్నాము కదా.

if our answer is silence for Good questions deeds, are we not practicing protecting dharma  
Author photo Sri, Telugu , 15+ yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 840+ Foreign and local events/ places coverage, 2108 General Articles and views 1,864,111; 104 తత్వాలు (Tatvaalu) and views 224,750
Dt : 28-Jun-2022, Upd Dt : 28-Jun-2022, Category : General
Views : 529 ( + More Social Media views ), Id : 1444 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags : answer , silence , good , words , questions , deeds , practicing , protecting , dharma
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.

Share
అన్నీ వార్తలే, నాకు నచ్చిన వార్తా వీడియో లు కొన్ని ఎంచుకోని, పని చేస్తూ ఇక్కడే వినొచ్చు చూడొచ్చు
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 11 yrs
No Ads or Spam, free Content