జనసేన కాపు వర్గం ది అయితే, మరి తెదేపా కమ్మ, వైకాపా రెడ్డి వర్గం ది అందామా? సందేహం? - Politics - లోకం తీరు/ News
           
     
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. 1201 కధనాలు. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు. 1231 General Articles, 47 Tatvaalu.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
1 min read time.

వాట్సప్ స్టేటస్ లో మంచి మాటలు ఒకరోజు మాత్రమే ఉంటాయి, పాతవి పోతూ ఉంటాయి. సాత్వికత కు నిరంతర సాధన మననం ముఖ్యం, మరువద్దు.

మరి ఒకరి పై ఇంకొకరు, ఆరోపణలు ఎందుకు? కొత్త పిల్లలు ఏదైనా కొత్త పని చేస్తుంటే, మన ఆహ్వానించి ఆదరించి అండగా నిలవాలి. అండ లేకపోయినా, వారి దోవన వారిని ఎదగ నివ్వాలి. అంతే గాని, అనవసరపు మాటలతో వారిని నిందించి, వారిని తగ్గించి, మనమే ఎదగాలి అనుకోవడం మూర్ఖత్వం.

పవన్ కు బీజేపీ సోము మరియు అన్ని చిరంజీవి అండ, ఈ మధ్య కొందరు కాపు నాయకులు కలిసారు, అన్న వార్తలు బయటకు రా గానే, అప్పుడే కొన్ని ఓర్వలేని గొంతులు పేపర్లు, సన్నాయి నొక్కులు మొదలు పెట్టాయి.

మనకు అమెరికా లాగా, 5 ఏళ్ల కో పదేళ్ళు కో, కొత్త స్వచ్ఛమైన నాయకులు వద్దు, కానీ అమెరికా అంత అభివ్రుద్ది కావాలి, ఎలా మరి? కొత్త ఆలోచనలు, కొత్త నాయకులు రాకూడదు, అంతేనా? కొత్త వర్గాలు రాకూడదు, కాపు, బ్రాహ్మణ, రాజులు, యాదవ, ఇతర వర్గాలు, బీసీ, ఎస్సీ, ఎస్టీ వర్గాల నాయకులు, అంబేద్కర్ లాగా పెద్ద నాయకులు, ముఖ్యమంత్రి కాకూడదా? ఆ అద్రుష్టం దక్కనీయమా? మరి మిగతా వారికి కుల వర్గ ముద్ర ఎందుకు?

ఇప్పుడు వరకు అసలు అధికారంలో లేని కొత్త మూడో వర్గం వస్తే, ఉలిక్కిపడి దానిని కూల్చడానికి, మొగ్గలోనే తుంచడానికి, జనం కళ్ళు మూయడానికి మాయ చేయడానికి, కుల వర్గ ముద్ర, వేద్దామా? మరి ఇప్పుడు వరకూ అధికారం లో ఉన్న, మన రెండూ వర్గాలు, కుల వర్గాల కు అతీతమా? అని ప్రజలు విస్తుపోతున్నారు.

మూడో వర్గం వస్తే కదా, నాలుగో ఐదో ఆరో వర్గం మరియు ఇతర వర్గాలు ముందుకు వచ్చేది ధైర్యంగా. అంటే మనందరి ఆలోచన లే వంకర తప్పు ధోరణి, బురద గుంట లో నుంచి, ఇన్నాళ్ళ మురికి వాసన కంపు వదిలి బయటకు రాలేము, వాస్తవం చూడము, అని అందరూ ఎగతాళి గా నవ్వుతూ ఉన్నారు.

మూస పద్దతిలో ఇరు కుటుంబం లు మాత్రమే ఉండాలా? పోనీ ఆ వర్గాల్లో కూడా, ఇంకో కుటుంబం ఆలోచనలు నాయకత్వం కు పనికిరావా? అలాంటప్పుడు, అది ప్రజాస్వామ్యం అవుతుందా? ఆ ఇద్దరు మనల్ని వదిలి వెళ్ళినా, మరలా వారి కుమారులే వారసులు గా ఉండాలా, రాచరికపు వ్యవస్థ లా? ఇంక మనము రాసుకున్న రాజ్యాంగానికి అర్ధము ఏముంది?

మన స్వార్ధ బుద్దులకు సరిపోయే విధముగా, మనకు ఓ పార్టీ అన్నా నాయకులు అన్నా, ఒక స్టాండర్డ్ ఉండాలి ఇలా - ఒక వెన్నుపోటు, కొన్ని కేసులు, కోట్ల రూపాయల ఆస్తులు, స్టేలు ఉండాలి, ఇతర రాష్ట్రాలు లో దేశంలో వ్యాపారాలు ఉండాలి, తండ్రులు తాతలు మామలు నాయకులు అయి ఉండాలి. రాష్ట్రం తాకట్టు పెట్టి అప్పులు తెచ్చి వారి పేర్లతో ప్రచారం చేసుకోవాలి. ఇదేనా మంచి నాయకులు కు కొలమానం? అంటే మన లోన ఉన్న, నీతి మంచి అదేనా?

మరి మన బడుగు బలహీన వర్గాల, కొత్త పిల్లలు ఉద్యోగాలు వ్యాపారాలు చేయగలరా, మనకూ గత చరిత్ర గత ఆస్తులు ఉండాలి కదా? అందరికీ అది సాధ్యపడుతుందా? బీద వారినుంచి, మంచి నాయకులను సహించలేమా?

మరి 20 ఏళ్ళు గా, ఇప్పుడు వరకు ఉన్న నాయకులు అంతా, రాష్ట్రం అప్పులు పెంచుతూ, నిస్సిగ్గుగా తమ పేర్లు తో ప్రచారం చేసుకుంటూ, తమ ఆస్ధులు పెంచుకున్నారే కానీ, జనం కోసం రాష్ట్రం కోసం, ఏమైనా పోగొట్టుకున్నారా? త్యాగం చేశారా?

ఒక ఎన్టీఆర్, ఒక కేజ్రీవాల్, ఒక మోదీ, ఒక యోగీ లాగా మనకు కొత్త తరం, కొత్త వర్గం, కొత్త కుటుంబం, కొత్త ఆలోచనలు, మార్పులు వద్దా?

** సొంతం గా పార్టీ పెట్టుకుని, కింద నుంచి తేవడం ఎంత కష్టమో, చంద్రన్న కు తెలుసా? ఇప్పుడు ఎన్టీఆర్ వారసుల కు తెదేపా ను ఇచ్చి, సొంత పార్టీ పెట్టి, సొంతం గా గెలవగలరా? ఆయన వలన అవుతుందా?

మామ ఎన్టీఆర్ అన్ని నిర్మాణం చేసి, ఇచ్చిన వ్యవస్థ ను, పువ్వుల లో అందుకుని, ఇతర కొత్త పార్టీలు ను, తెదేపా వారు ఎగతాళి చేస్తారు, కొత్త పార్టీలు నిలవవని, అమ్ముడు పోతాయని.

మీరు నిలవగలరా? మీలా లాక్కోవాలా? ఇంత వ్యవస్థ ఉండి ఇంత అనుభవం ఉండి, జనం ఎందుకు ఛీత్కారం చేసి, 23 ఎందుకు ఇచ్చారు?

తెదేపాలో ఉత్సవ విగ్రహాలు గా, ఎంతమంది ఇతర కులాలు వర్గాలు ఉన్నా, అధికారం ఎవరి చేతుల్లో ఉందో ప్రజలందరికీ తెలుసు. పచ్చ మీడియాలో చంద్రన్న, లోకేష్, దేవినేని, కేశినేని, సుజనా లాంటి పేర్లు మాత్రమే ఎక్కువ ఉంటాయి, వారి చేతిలో నే అధికార చక్రం ఉందనేది కాదనలేని నగ్న సత్యం.

విశ్వాసము తో ఇన్నాళ్ళు మనకు సేవచేసిన మన పార్టీ వారు - యనమల, అచ్చెం నాయుడిని లేదా మన వర్గం దేవినేనిని, చంద్రన్న వారసులు గా ప్రకటిద్దామా? సీయెం సీటు ఇద్దామా? అబ్బే కుదరదు కదూ?

సింగపుర్ లాంటి అభివ్రుద్ది కావాలి, కానీ సింగపుర్ లాంటి, వారసత్వం లేని నాయకత్వం వద్దు, కదూ?

10 ఎళ్ళు సీయెం గా చేసినా, ఎన్టీఆర్ పేరు చెప్పుకుని ఇంకా బతుకు తున్నారు, సొంతం గా ఇమేజ్ ఈరోజు కీ లేదు అంటే, అవమానం కాదా? అలాంటి వారు, నాయకులా, యువతరానికి ఆదర్శమా?

2019 ఎన్నికల ముందు, వైసీపీ నాయకులు, తెదేపాలో ఉన్న, కుల వర్గ నాయకుల అధికారుల చాంతాడు అంత లిస్టు, అందరికీ పంపలేదా? నిర్భయంగా తెదేపాలో ఉన్న కుల జాడ్యం ఎత్తి చూపలేదా? అని జన అభిప్రాయం.

కానీ పైకి, అన్ని కులాలు వర్గాలు కు ప్రాతినిధ్యం అధికారం ఉంది అని అనుకుందాం. సరేనా?

** వైసీపీ, కష్టపడి మైళ్ళు నడిచి, జగన్ కట్టుకున్న సొంత సామ్రాజ్యం. కానీ వారసత్వ ఛాయలు ఉన్నాయి, వాడుకుంటున్న పేరు, రాజన్న. ఆయన కొడుకు గా జనం ఆదరించారు, అంటే తండ్రి పేరు చెప్పుకునే, ఓట్లు సంపాదించారు, అంటే కుటుంబం వారసత్వ ఆలోచన లు కొనసాగిస్తున్నట్లుగా, ఒప్పుకున్నారు.

ఇక్కడ ఈ పార్టీ లో కూడా పేరుకు, అన్ని కులాలు వర్గాలు ఉన్నా, చంద్రన్న లాగా నే, కుల కార్పొరేషన్ లు పోషిస్తూ ఉన్నా, ముఖ్య అధికారం రెడ్లు వర్గం దే అని, చిన్న పిల్ల లకు కూడా తెలుసు. సాక్షి మీడియా లో ప్రభుత్వ, పార్టీ పాలసీలు చెప్పే ప్రధాన అధికార వ్యక్తులు, విజయసాయి సజ్జల వైవీ సుబ్బారెడ్డి మాత్రమే కదా? మిగతా పెద్దలు బాలినేని, ఇంకా ఇతరులు కూడా, ఏ వర్గమో ప్రత్యేకంగా అనుకోవాలా?

తెదేపా వారు కూడా 2020 లో జగనన్న ప్రభుత్వం లో ఉన్న, రెడ్డి వర్గ నాయకుల అధికారుల, చాంతాడు లిస్టు అందరికీ ఫార్వార్డ్ చేస్తున్నారు కదా, అని జనం అనుకుంటున్నారు.

దళితులకు సీయెం పదవి ఇస్తారా? పధకాలకు తమ పేర్లు మాని, బడుగు బలహీన వర్గాల పేర్లు పెడతారా? ఇతర వర్గాలను, పవర్ సెంటర్ చేస్తారా?

** అంటే తెదేపా వారే స్వయంగా, వైసీపీ ఉంటే రెడ్డి వర్గ రాజ్యం అని, వైసీపీ వారే స్వయంగా తెదేపా ఉంటే కమ్మ వర్గ రాజ్యం అని స్టేట్మెంట్ లు ఇస్తూ, ప్రజలను గందరగోళం లో పడవేస్తూ, అనుకోకుండా అసలు వాస్తవం ఒప్పుకుంటున్నారు.

వీరు వారిని రౌడీలు గూండాలు వెన్నపోటు దోచుకుంటున్నారు అని అంటారు, అలాగే వారు వీరిని అవే మాటలు అంటారు. ఈ పార్టీ లో నుంచి ఆ పార్టీ లోకి, అటు నుంచి ఇటు దూకుళ్ళు మామూలే, ఎందుకటే ఇద్దరు తప్పుడు వారే, అని వారు ఒప్పుకున్నారు కాబట్టి.

** మరి కొత్త వర్గాలు వస్తే, వారికి కులం వర్గం మతం ఆపాదిస్తారు, ఎదగ నీయరు, అణిచేస్తారు, అంతేనా? కాబట్టి, విజ్ఞతతో వాస్తవం గ్రహించి, మనం మన భవిష్యత్తు నాయకులు ను, ఎన్నుకోవాలి.

తెదేపా ప్రభుత్వం లో నష్టపోయిన కమ్మ వర్గాలు ఉన్నాయి. వైకాపా ప్రభుత్వం లో నష్టపోయిన రెడ్డి వర్గాల సోదరులు ఉన్నారు. అప్పుడు ఇప్పుడు బీద వారు, ఇరు వర్గాలలో ఉన్నారు. కాబట్టి వర్గం కులం, కూడు పెట్టదు.

ఇక్కడ కులం వర్గం అనే కన్నా, ధనం అధికారం అవసరం అవకాశ వాదం, మాత్రమే ముఖ్యం.

కాబట్టి, రాబోయే కొత్త వర్గాలు గురించి వ్యర్థ తప్పుడు ప్రచారం, వద్దు, అలాగే నమ్మవద్దు. ఎందుకంటే ఇప్పుడు ఉన్న వర్గాలు, ఆ నీతి చెప్పే స్ధాయిలో లేవు కాబట్టి, అని అందరి భావన.

మనకు స్వచ్ఛమైన కొత్త పాలన అందించే, అప్పులు తగ్గించే, అభివ్రుద్ది ని చూపించే, కొత్త నాయకులు కావాలి, తెలుగు వారి రాత మార్చే రోజులు రావాలని దేవుని కోరుకుందాం.  
Author photo Sri, Telugu , 10 yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 828 Foreign events/ places coverage, 1231 General Articles, 47 Tatvaalu
Dt : 30-Jan-2021, Upd Dt : 30-Jan-2021, Category : Politics
Views : 246 ( + More Social Media views ), Id : 949 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags : janasena , kapu , tdp , kamma , ysrcp , reddy , category , doubt , example , pawan , chandranna , jagan
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.

Share
కేసియార్, కేటీయార్ , బాబు , జగన్ , పవన్ కు చెందిన టీవీ, పత్రిక వార్తలు ఇక్కడే, ఒక చోటే చూడొచ్చు
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 8 yrs
No Ads or Spam, free Content