దత్తపుత్రుడంటే మరి జగన్ సీబీఐ దత్తపుత్రుడని, బి-టీమ్‌ చర్లపల్లి షటిల్‌ టీమ్‌ - పవన్ ఘాటు జవాబు - Politics - లోకం తీరు/ News
           
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. 1691 కధనాలు. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు. 1726 General Articles, 86 Tatvaalu.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
2 min read time.

దత్తపుత్రుడంటే మరి జగన్ సీబీఐ దత్తపుత్రుడని, బి-టీమ్‌ అంటే చర్లపల్లి షటిల్‌ టీమ్‌ అంటాం - పవన్ ఘాటు జవాబు

చూడండి కష్టపడి సొంత ప్రాంతీయ పార్టీలు ఉన్న మన పిల్లలు, 3 వ అబ్బాయి జగనన్న, 4 వ అబ్బాయి పవనన్న ఎలా మాటలు అనుకుంటున్నారో.

కరెంట్ కోత, పన్నుల పెంపు, రైతుల గోడు, ఉచిత మంచి విద్య, మంచి కరోనా ఆసుపత్రులు, ఆదాయం ఎలా పెంచాలి, ఇవన్ని వదిలేసి, పవనన్న ను అలా అనడం ఎందుకు? ఈ బురద చల్లడం వలన, నష్టం జగనన్నకే.

చంద్రన్న ను పక్కన పెట్టి, పవనన్న ను మాత్రమే ప్రేమించడం? ఎంతైనా, సొంత పార్టీలు పెట్టుకున్నారు అన్న వాత్సల్యము తో నేమో.

మన మంచి పనులతో జనం మెచ్చాలి. మన నోటి అహంకారముతో, జనం మనల్ని చంద్రన్న లా, ఓ 50 దిగువ కి తుంచకూడదు. అధికారములో ఉంటే, అణిగి మణిగి ఉంటేనే, మనకు గౌరవము. గతము లో రాజన్న బాట అదే.

పెద్దబ్బాయి బీజేపీ వీరన్న, స్పష్టముగా చెప్పారు, మా సీయెం అభ్యర్ధి పవన్, అందుకు ఒప్పుకున్న వారే, మాకు మద్దతు ఇస్తారు అని.

దానికి 2 వ అబ్బాయి, చంద్రన్న ఎటూ ఆరు నూరు అయినా ఒప్పుకోరు. కనీసం 2014 లో నాకు పవన్ మద్దతు ఇచ్చారు అని, నేను కూడా పవన్ కి మద్దతు ఇచ్చి, రుణం క్రుతజ్ఞత తీర్చుకుంటాను అని అనలేరు. తమ పిల్లలు మాత్రమే ముఖ్యమంత్రి కావాలి కాని, ఇతరుల పిల్లలు కాకూడదు.

ఎందుకంటే, పక్కదోవలో అయినా, ఇతరులను కూల్చి అయినా, తొందరగా పైకి రావాలి అనే ఉత్తమ మనస్తత్వం చంద్రన్నకు మొదటి నుంచి ఉంది, అదే పచ్చ మీడియా జనాలు మెచ్చుతుంది కాబట్టి అంటారు ఆయన అభిమానులు. ఇది నాని జూ ఎంటీయార్ లాంటి, అన్న రామన్న అభిమానులకు నచ్చదు.

ఇంక దత్త పుత్రుడు అన్న అనవసర మాటలు ఎందుకు? ఇంట్లో వారి గురించి, కుటుంబ మనుషుల గురించి, మనకు ఎందుకు? జ్ఞానం ఉన్న వారు, ఎవరు అవి మాట్లాడరు. రాష్ట్రానికి చెయ్యాల్సిన మంచి, లేదా జరుగుతున్న చెడు మాట్లాడకుండా, ఇవి ఎందుకు?

మనల్ని కూడా, కేసుల పుత్రుడు, జైలు పక్షి, అవినీతి అనకొండ, వెన్నుపోటు పుత్రుడు, స్టేల దత్త పుత్రుడు, మాగాణి భక్షకుడు, సొంత పార్టీ లేని బిడ్డ, కాంగ్రెస్ బీ టీం, ఊళ్ళో సొమ్ముతో వంశ పధక పేర్ల మిత్రుడు, అని ఇతరులు అంటే, మనకు మనసు బాధ కలగాదా?

కేవలం జనానికి ఉపయోగపడేవే విమర్శలు చేసుకుందాము. మన మంచో చెడో చేసుకుంటూ ముందుకు పోతుంటే, మన దైవ ఫలితాలు మనకు ఎటూ వస్తాయి.

నేటి జనానికి కావాల్సింది ఇలాంటి ఉత్తమ లక్షణాలు - అబద్దాలు, చేయిచాపడం, అవసర అవకాశ వర్గ బంధం, అత్త సొమ్ము అల్లుడు ఉచిత పంపకం, ప్రజల పన్నుల పధకాలకు కుటుంబ పేర్లు పెట్టు కునే నీతి మంతులు, మంత్రులతో ఎమ్మెల్యేలతో కాళ్ళ మొక్కించుకునే వారు, కేసులు జైలు ఉన్నవారు, స్టే లు ఉండి వ్యవస్థలను మానేజ్ చేసేవారు, సింగపూర్ కి దుబాయ్ తాకట్టు పెట్టెవారు, అమాంతం ఆస్థి పెంచుకునే వారు, 3 పంటల పొలాలను కాంక్రీట్ చేసేవారు, 200 కోట్లు పైన ఆస్తులు ఉండే వారు, అప్పులతో పప్పుకూడు, కుటుంబ బానిసత్వం పెంచేవారు.

జనానికి కొత్త సీయెం లు వద్దు. పాత వారు అయితే, అప్పులు ఎక్కువ చేయొచ్చు, స్థలాలు తాకట్టు లీజు అమ్మవచ్చు, స్వార్ధ బినామీలకు.

ఈ లక్షణాలు ఏ కోశాన, పవనన్న కు లేవు. పవనన్న కు ఉందేమో తెలియాలి అంటే, అధికారానికి రావాలి.

మనము కొత్తవారికి సీయెం సీటు ఇవ్వము, ఎందుకంటే తరతరాల కుటుంబ బానిసత్వం పోకూడదు అని.

మరి ఎందుకు ఈ గొడవలు, ప్రజలకు పనికి వచ్చే విషయాల మీద మాత్రమే విమర్శలు చేసుకుందాము.

పవనన్నా, మనకు స్థానికముగా గట్టి నాయకులు కావాలి, మరి దానిపై కూడా ద్రుష్టి పెట్టండి. స్థానిక గట్టి నాయకుల ఫోటోలు, స్థానికి పట్టణ గ్రామ సోషల్ మీడియాలో పెట్టించండి.

వార్త -

నన్ను సీబీఎన్‌ దత్తపుత్రుడంటే.. జగన్‌ను సీబీఐ దత్తపుత్రుడని అంటాం.. జనసేనను తెదేపా బి-టీమ్‌ అంటే.. వైకాపాను చర్లపల్లి షటిల్‌ టీమ్‌ అంటాం అని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ వ్యాఖ్యానించారు.

ఈ మేరకు వైకాపా వాళ్ల కంటే ఎక్కువ తిట్లు తనకూ వచ్చని చెప్పారు. 16 నెలలు జైల్లో కూర్చుని వచ్చిన మీరా మాకు నీతులు చెప్పేదని పవన్‌ ఎద్దేవా చేశారు.

శ్రీ సత్యసాయి జిల్లా కొత్తచెరువులో కౌలు రైతుల భరోసా యాత్ర ను పవన్‌ ప్రారంభించారు. పరామర్శకు వస్తున్నానని తెలిసి రైతు కుటుంబాలకు ముందే పరిహారం ఇస్తున్నారని చెప్పారు.

If Jagan call as adopted son, then we call CBI adopted son, B-Team means Charlapalli Shuttle Team - Pawan Answer  
Author photo Sri, Telugu , 10 yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 828 Foreign events/ places coverage, 1726 General Articles, 86 Tatvaalu
Dt : 12-Apr-2022, Upd Dt : 12-Apr-2022, Category : Politics
Views : 559 ( + More Social Media views ), Id : 1339 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags : jagan , datta putrudu , adopted son , cbi , bteam , charlapalli , shuttle , team , pawan , cbn , chandranna , veeranna
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.

Share
తెలుగు మీడియాను నమ్మరా, ఆంగ్ల హిందీ మీడియాను నమ్ముతారా? పర్లేదు, వాటినీ ఇక్కడే చూడొచ్చు
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 10 yrs
No Ads or Spam, free Content