తాతల నుంచి, గుంటూరు పెద్దాసుపత్రి, ఇదే అభివ్రుద్ది? ఊరు నుంచి, గంట లో, జగనన్న స్పెషాలిటీ ఆసుపత్రి? - Politics - లోకం తీరు/ News
           
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. 2073 కధనాలు. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు. 2108 General Articles and views 1,865,372; 104 తత్వాలు (Tatvaalu) and views 224,884.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
1 min read time.

తాతల నుంచి, గుంటూరు పెద్దాసుపత్రి కే, ఇదేనా అభివ్రుద్ది? ఊరు నుంచి, గంట లో, జగనన్న స్పెషాలిటీ ఆసుపత్రి?

నాయకుల కు, అధికారులు కు, ప్రజలకు, మిత్రులు కు, పెద్దలు కు అందరికీ, పేరు పేరు నా, భారత స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు. అందరం సంపూర్ణ ఆరోగ్యం తో ఉండాలి.

మన దేశంలో ఉన్న స్వేచ్ఛ, ప్రపంచంలో ఏ దేశంలో లోనూ లేదు. దానికి రుణపడి ఉండాలి. దానికోసం ఎంతమంది ప్రాణాలు కోల్పోయారో చరిత్ర చదివాము, కానీ గుర్తుకు రాదు. తెల్లవాళ్ళను తరిమితే, నల్లవాళ్ళ మైన మన పాలనలో బాగుపడుతాం అనుకున్నాం. కానీ మాటలలో తప్ప, చేతలలో లేదు.

ఎన్టీఆర్, రాజన్న, రోశయ్య, చంద్రబాబు గార్ల కాలం నుంచి కూడా, బహుశా మా తాతల కాలం నుంచి, చీరాల పర్చూరు వేటపాలెం కారంచేడు మండల ప్రజలు, మీ ఊళ్ళో ను ఇదే పరిస్థితి పరిస్థితి మిత్రమా, గుంటూరు పెద్దాసుపత్రి కే తీసుకుని వెళ్ళండి అంటారు అత్యవసర కేసుల్లో. ఇప్పుడు జగనన్న పాలనలో కూడా అదే మాట, అదే బాట. ఇదే కదా, ఇన్నేళ్ళ అభివ్రుద్ధి? వందలాది మంది, దోవలోనే ప్రాణాలు వదిలారు.

ఇప్పుడు అయినా, మంత్రి వర్యులు బాలినేని గారు, ప్రకాశం కలెక్టరు భాస్కర్ గారు పెద్ద మనసు తో, మాకు అంటే చీరాలకు, నిమ్స్ లేదా కనీసం ఒంగోలు రిమ్స్ స్ధాయిలో, ఆసుపత్రి మంజూరు చేసి కట్టించి లేదా ఉన్న దాన్ని అభివృద్ధి చేయించి, వేల ప్రాణాలు ను కాపాడాలని వేడుకుంటున్నాము. ప్రతి ఊరు నుంచి, గంట దూరంలో అందరికీ, జగనన్న సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి ఉండాలి.

అన్ని విషయాలలో చిత్తశుద్ధి తో పనిచేస్తే, మనమే నంబర్ వన్. కానీ చేయము, బాధ్యత గా ఓటు వేయము ధనముకు కులముకు వర్గమునకు అమ్ముడు పోతాము, బాధ్యత గా ఉద్యోగ ధర్మం నిర్వర్తించము, ఎమ్మెల్యే ఎంపీ గా ఇచ్చిన మాట చేసిన ప్రమాణం పాటించము. కానీ దానికి తగిన శిక్ష, దేవుడు తర్వాత రోజుల లో మనకు గానీ, సంతానం కి గానీ తప్పక ఇస్తున్నారు. ఎన్నో ఉదాహరణలు చూసాము, ఇప్పుడూ కళ్ళ ఎదురుగా ఉన్నాయి.

మనం మన సొంత ఇంట్లో చేసే తప్పులు కే, ఓ కేజీ పాపం వస్తే, అధికారిగా మరియు నాయకులు గా, ఇంత మంది జనం కు చేసే, పాపం అశ్రద్ధకు నిర్లక్ష్యం కు, ఎన్ని కేజీల పాపం వస్తుందో ఆలోచన చెయ్యండి? చివర శిక్ష లో, మన అందరమూ జవాబు దారులమే, శిక్షలు కు పాత్రులమే మిత్రమా. ధన్యవాదాలు.  
Author photo Sri, Telugu , 15+ yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 840+ Foreign and local events/ places coverage, 2108 General Articles and views 1,865,372; 104 తత్వాలు (Tatvaalu) and views 224,884
Dt : 14-Aug-2020, Upd Dt : 14-Aug-2020, Category : Politics
Views : 857 ( + More Social Media views ), Id : 650 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags : grandparents , guntur , ggh , development , jagan , super specialty hospital , chirala
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.

Share
కేసియార్, కేటీయార్ , బాబు , జగన్ , పవన్ కు చెందిన టీవీ, పత్రిక వార్తలు ఇక్కడే, ఒక చోటే చూడొచ్చు
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 11 yrs
No Ads or Spam, free Content