APLatestNews.com top Banner

Social Media links
ప్రభుత్వ సిబ్బంది త్యాగాలు, సోషల్ మీడియా లో - ప్రజలకు లాభం? సిబ్బందిని సమర్దిస్తున్నారా లేక ప్రజలనా? - General - లోకం తీరు/ News
           
     
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
2 నిమిష చదువు సమయం.

ఒక బాధ్యత గల పౌరుని ప్రశ్న మాకు, ఏవండీ మీ ఆర్టికల్ చదివాను. మీరు చెప్పినది, కరక్టే ప్రజాస్వామ్యం లో ప్రజలే దేవుళ్ళు. వారి టాక్స్ ల తోనే అధికారులు జీతాలు, సౌకర్యాలు, ఈ అధికారం కూడా. చాలా మందికి అది గుర్తు ఉంటుంది. కానీ చాలా మంది అది మరచిపోతారు ఉద్యోగము రాంగాల్నే లేదా హోదా పెరగగానే. నాకు అర్ధం కాని, చిన్న లాజిక్ ఏమిటి అంటే, మీరు వారి దగ్గర పని చేసే సిబ్బంది త్యాగాలు కష్టాలు గురించి, సోషల్ మీడియాల లో చెప్పమంటున్నారు. దాని వలన మనకు అంటే ప్రజలకు వచ్చే, లాభం ఏముంది? మీరు వారిని వారి సిబ్బందిని సమర్దిస్తున్నారా లేక ప్రజలనా?

ధన్యవాదాలు, నమస్కారం, మీకు కూడా బాధ్యత గల పౌరులు గా. ఇలా ప్రతి ఒకరు, ప్రభుత్వ అధికారులు ను కూడా ప్రశ్నిస్తే, వారూ పద్ధతి మార్చుకుంటారు. ఇద్దరు నూ సమర్దించాము కదా, అది ఎలాగో చూడండి.

దేశమును ప్రేమించుమన్నా, మంచి అన్నది పెంచుమన్నా, వట్టి మాటలు కట్టి పెట్టోయ్, గట్టి మేలు తలపెట్టవోయ్, అని వినే ఉంటారు ఇది గురజాడ వారి గేయము. అలా ప్రతి వ్యక్తి మరియు అధికారులు కూడా ఉండాలి. అప్పుడే మన ఊరు, జిల్లా, రాష్ట్రం బాగుపడుతుంది.

ఇప్పుడు మీ ప్రశ్న కు జవాబు, మొదటి ప్రశ్న లో నే చాలా అర్థం ఉంది, మంచి మనసు పెట్టి ఆలోచన చేస్తే.

మన అమ్మ ను, నాకెందుకు అన్నం పెట్టవు నీకు బాధ్యత లేదా అని గట్టిగా గద్దిస్తే, నాలుగు తన్నుతుంది లేదా కోపంగా అయిష్టంగా తిట్టుకుంటూ పెట్టవచ్చు. అదే అమ్మను, ఇంకో రకముగా నేను నీ బిడ్డను కదమ్మా, నా ఆకలి బాధ్యత నీదే కదమ్మా అంటే, సంతోషముగా దగ్గరకు తీసుకుని, నవ్వుతూ ప్రేమ గా, అన్నం పెడుతుంది. రెండు ప్రశ్నలు అర్థం ఒకటే, జవాబు కూడా ఒకటే, కేవలము అడిగే విధానం మార్పు.

మొదటి పద్దతి లో, మన రాజకీయ నాయకులు గట్టిగా దుమ్ము దులిపి అడుగుతారు ఎన్నికల లేదా వారికి కావలసిన సమయంలో, అధికారులు కూడా విధిలేక వారి మాట వింటారు, తల వంచుతారు. కానీ సంస్కారం గల జర్నలిస్టులు లేదా ప్రజలు, సౌమ్యంగా మర్యాదగా, రెండవ పద్ధతి లో అడుగుతారు. మంచి మనసున్న అధికారులు, ఆ మాటలు విని సంతోషంగా, జవాబు చెప్పి, తమ బాధ్యత సక్రమంగా నిర్వహిస్తారు.

ఉదాహరణకు డీఎస్పీ గారిని మనము ఇలా అడిగితే - మీ దగ్గర పని చేసే, వందమంది పోలీసులు, ఎస్సై, సీఐ ల కష్టం శ్రమ త్యాగం గురించి, మీరు ఎందుకు పబ్లిక్ గా, మీ ప్రభుత్వ లేదా వ్యక్తి గత, సోషల్ మీడియాలో పెట్టరు? వారు చేసిన పాపం ఏమిటి? వారి కష్టం ను, మీరు గుర్తించరా? రోజుకు ఓ పది ఫోటోలు పెడితే, ఇబ్బంది ఏమిటి? తండ్రి లాంటి, మీరు కాకపోతే, ఇంక ఎవరు వారికి గుర్తింపు ఇస్తారు? ఎస్పీ గారు చేసినట్లు, మీరెందుకు చేయరు, అని అడిగితే అర్థం ఏమిటి? ఇప్పుడు ఆయన మంచివారు అయితే జవాబు చెప్పాల్సింది, జర్నలిస్టుల కా లేక తన సొంత బాధ్యత ఆత్మాభిమానము గల సిబ్బంది కా?

వారి సిబ్బంది కష్టపడి పనిచేస్తున్నారు అంటే, అది గర్వంగా డీఎస్పీ గారు సోషల్ మీడియాలో చెపుతుంటే, ప్రజలకు పనులు అవసరాలు తీరుతున్నట్లే గదా? అది ప్రజలకు ఉపయోగమే కదా? ప్రజలు, ఇంకా ధైర్యంగా ఎక్కువ అడుగుతారు కదా?

డీఎస్పీ గారు, తన వందమంది సిబ్బంది ని ప్రేమిస్తూ, గౌరవిస్తూ, ప్రోత్సాహం చేస్తూ ఉంటే, ఇప్పుడు ఆయన జవాబు చెప్పాల్సింది, ముందుగా తన సిబ్బందికి. ఎందుకు ఆ మంచిపని చేయడం లేదో చెప్పాలి, అంతేనా? గమ్ముగా ఉంటే, ఆయన అవమానిస్తుంది తన నాయకత్వములో పని చేస్తున్న సిబ్బందిని మరియు ప్రజలను, ప్రభుత్వాన్ని, తన ఉద్యోగాన్ని.

అలాగే, కలెక్టర్ గారు, ఆర్డీవో, ఆరోగ్య అధికారులు, తహసీల్దార్ లు, ఎంపీడీవో, ఎండీవో, సెక్రటరీ లు, మరియు ఇతర అధికారులు కూడా అదే విధముగా చెయ్యాలి కదా? వారి సిబ్బంది ని, తమ బాధ్యత ను, మరియు ప్రజలను గౌరవిస్తూ, ఉన్నారో లేదో రాబోయే రోజుల్లో చూద్దాం. కాబట్టే, ప్రజలకు ఉపయోగపడే విషయాన్ని, వాళ్ళ సిబ్బంది త్యాగం తో ముడి పెట్టి అడిగి, వారి మంచి మనసు ను, కదిలించే ప్రయత్నం చేస్తున్నాము.

ఇవి ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, ఎంపీ, జిల్లా మంత్రి గారు, ముఖ్యమంత్రి, ఇతర రాజకీయ నాయకుల కు కూడా వెళుతున్నాయి, వాట్సాప్, ఫేస్బుక్, త్విట్టర్ ద్వారా. ప్రజలకు ఇంటర్నెట్ లో గూగుల్ వెతుకులాట (సెర్చ్) లో, ఈరోజు లేదా రాబోయే రోజుల్లో కనపడతాయి.

మన అధికారులు, తమ బాధ్యత ను, చిత్తశుద్ది తో అంతఃకరణతో ఆచరిస్తూ, మన ప్రధాని మోడీ, మన ప్రియతమ ముఖ్యమంత్రి జగన్, చీఫ్ సెక్రెటరీ ఆశయాలను, ప్రజలలోకి తీసుకుని వెళతారు అని ఆశిద్దాం.

బాధ్యత గల పౌరులు గా, మీకు శిరస్సు వంచి నమస్కారం చేస్తున్నాము.  
Author photo Sri, Telugu , 10 yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 828 Foreign events/ places coverage, 793 General Articles, 46 Tatvaalu
Dt : 05-May-2020, Upd Dt : 05-May-2020, Category : General
Views : 171 ( + More Social Media views ), Id : 533 , City/ Town/ Village : Ongole , State : AP , Country : India
Tags : reporting to public , but prakasam collector and other officials , ongole rdo , chirala , vetapalem , tahsildar , municipal commissioner , mdo , mpdo , secretary
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
Share
కేసియార్, కేటీయార్ , బాబు , జగన్ , పవన్ కు చెందిన టీవీ, పత్రిక వార్తలు ఇక్కడే, ఒక చోటే చూడొచ్చు
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 8 yrs
No Ads or Spam, free Content