చేసిన మేలు, జీవితాంతం మరువకూడదు, అన్ని ఉన్న వారికి, దైవాన్ని వారి బాగు కోరుతూ - General - లోకం తీరు/ News
           
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. 2082 కధనాలు. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు. 2117 General Articles and views 1,878,404; 104 తత్వాలు (Tatvaalu) and views 225,992.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
1 min read time.

ఏవండీ, మహిళా మండలి అధినేత్రి, గౌరవనీయులు పద్మావతమ్మ గారి నంబరే నా, ఇది?

అమ్మకు, మా నమస్కారాలు తెలియజేయండి. వారికి, దేవుడు ఆయురారోగ్యాలు ఇవ్వాలి, చల్లగా చూడాలి.

మా చిన్నప్పుడు, అక్కడ మేడ మీద కాన్వెంట్ కు వెళుతూ, అమ్మ గారిని, రోజూ చూసేవాళ్ళం. నిండైన మనిషి, మంచి తనం, హుందా ఠీవి నడక, మర్యాద మాట పలుకు, అందరినీ గౌరవించడం, అన్ని చూసాం ఆనాడు. మాజీ మంత్రి వర్యులు కూడా.

మా నాన్న గారితో చెపుతారేమో అని, భయం భయము గా, వారికి కనపడకుండా కాన్వెంట్ నుంచి, అటు ఇటు తిరిగి, మా ఇంటికి వెళ్ళే వాళ్ళము స్టేషన్ వైపు. ఒక వైపు ఆఫీసు, ఇంకొ వైపు వారి ఇల్లు, బయట కారు. మనల్ని గుర్తు పెట్టుకోకపోవచ్చు పిల్లలు అని, కానీ మన భయం మనది, అప్పుడు. వారి అబ్బాయిని కూడా, ఇంటర్ లో కలసినట్టు గుర్తు.

ఆ రోజుల్లో, మహిళలకు రేషన్ షాప్ లు, సూపర్ బజార్, కరెంట్ బిల్లులు, నిర్వాహణతో ఉద్యోగాలు కల్పించేవారు. ఆ తర్వాత, పెద్దల ఆశ్రమము, కుటుంబ కౌన్సిల్లింగ్, ఇతర సేవలు కూడా పెట్టారని విన్నాము. Link.

నాన్న గారు కూడా, ఎప్పుడూ అక్క గారు అక్క గారు అంటూ, ఎంతో అభిమానంగా పిలిచేవారు. పట్టణ షాపుల ప్రెసిడెంట్ గా, ఎప్పుడూ అక్క గారితో పని ఉంటుంది. వారు కూడా అంతే అభిమానంగా చూసేవారు.

మా వాళ్ళ కు, రికమండేషన్ ఉత్తరం కూడా రాసిచ్చారు, గుంటూరు కాలేజీ (జేకేసీ రమేష్ గారు అనుకుంట) కి, అలాగే ఉమ్మడి ఆంధ్రా హైదరాబాద్ విద్యా మంత్రి (కడియం) గారికి ఆనాడు. అవి మనము వాడినా వాడక పోయినా, వారు ఆదరించి ఇచ్చారు అన్నది ముఖ్యము ఇక్కడ, వారు చూపిన అభిమానము ముఖ్యము.

వారు ఎలా ఉన్నారు? ఆరోగ్యం గా ఉన్నారా? అందరినీ ఎప్పుడూ అడుగుతాము, కానీ కాంటాక్ట్ నంబర్ తెలీదు, ఎక్కడ ఉన్నారో కూడా తెలీదు.

ఇప్పుడు తెలిసిన వారు, ఇక్కడే ఉన్నారు ఆరోగ్యముగా, ఆఫీసు కు వెళుతూ అని మంచి శుభ వార్త చెప్పి, ఈ నంబర్ ఇచ్చారు.

ఫోన్ లో వారితో మాట్లాడటానికి, కృతజ్ఞతలు తెలపడానికి, మర్యాద పూర్వకంగా పలకరించడానికి, ఓ 5 నిమిషాలు చాలు, ఎప్పుడు ఖాళీగా ఉంటారు? ఉదయం 9 లోపు లేదా సాయంత్రం 7 తర్వాత? దయచేసి చెప్పగలరు, ఒక్కసారి మాట్లాడించగలరు. లేదా ఈ సమాచారము అందించ గలరు.

మనకు చేసిన మేలు, మనం జీవితాంతం మరువకూడదు, ఇది నాన్న గారి ఆనాటి మాట. అన్ని ఉన్న పెద్ద వాళ్ళ కు, మనం తిరిగి ఏమి చేయలేకపోయినా, దైవాన్ని వారి బాగు కోరుతూ, కనీసం కృతజ్ఞతతో పలకరింపు, అయినా చేయాలి.

అలాగే మనం నిస్వార్థంగా చేసే, ప్రతి మంచే, మనకు చివరలో అండ. అదే మన వెంట, దేవుని దగ్గరకు నడిపించేది తరగని పుణ్యం తో.

ధన్యవాదములు, నమస్కారములు అమ్మగారికి.
ఓ అభిమాని

30-40 ఏళ్ళు లేదా ఎన్నేళ్ళు అయినా కూడా, మాట సాయం అయినా, మరువకూడదు. పుట్టగతులు ఉండవు అలా మరచిపోయి వారికి సుమా. పైది చదివి తే అర్థం అయింది కదూ.

update : Dec 4th, 2020

మహిళా మండలి సూపరింటెండెంట్ గారికి నమస్కరించి వ్రాయునది,

మన మేడం గారు చేస్తున్న సేవలకు ఎక్కువ ప్రచారము రావడానికి, ఇంత వరకు ప్రయత్నము కూడా చేసినట్టు లేదు. ఇది, సంస్థ కోసము తప్పని సరి. గతములో ఒక వెబ్సైట్ పెట్టి, 4 ఫోటోలు పెడితే చాలు. కానీ ఇప్పుడు ఏ సంస్థ అయినా, ప్రతి వారము చేసే పనులు, అందరికీ తెలిసేటట్టు చేస్తున్నారు.

దానివలన, ప్రజలలో అధికారులలో ఎక్కువ నమ్మకము, గౌరవము విలువ పెరుగుతుంది. కొత్త ఉద్యోగులు రావడానికి, ఉన్న ఉద్యోగులు గర్వముగా చెప్పుకోవడానికి, ఇది ఉపయోగము.

https://www.facebook.com/vasavyamahilamandali/
https://www.facebook.com/chaithanyamahilamandali/

మీకు ఇతర మహిళా మండలిల లింక్ లు పంపుతున్నాను, వారు చేస్తున్న విధానం చూసైనా, అదే పద్దతిలో మన సంస్థ పురోగతికి, ఎక్కువగా పాటు పడవచ్చును. ఫేస్బుక్ ట్విట్టర్ పేజీలు ఉచితము, 10 వ తరగతి పిల్లలు వాడుతున్నారు, మనము మన సిబ్బంది, 10 నిమిషాలు కేటాయించి, సమాచారము పెట్టగలము.

మన సంస్థలో జరిగే సేవా కార్యక్రమాలు అన్ని, అక్కడ ఫొటోలు వీడియోల రూపములో పెట్టవచ్చు. ఉదాహరణకు,

* వ్రుద్దుల ఆశ్రమం లో జరిగే యోగా, మెడికల్ చెకప్ ఫోటోలు వీడియో
* కరంట్ బిల్లు లకు వచ్చే జనము క్యూ, లైబ్రరి, సూపర్ బజార్, హెల్త్ సెంటర్
* కౌన్సిల్లింగ్ కు వచ్చే ప్రజలు
* ప్రతి వారము మీటింగ్ విషయాలు

ఇలా ఏదో ఒకటి, మన సంస్థ గురించి పెడుతూ ఉంటే, బాగుంటుంది. ప్రజలలో ఎక్కువ అభిమానం ప్రేమ పెరుగుతుంది అని ఆశ. మన సంస్థ కు మంచి చేసే వాళ్ళలో, మనమూ ముందు ఉండాలి సుమా.

మన వెబ్సైట్ లో కూడా, హోం పేజీకి, కీ వర్డ్స్ సరిగ్గ పెట్టలేదు, గూగుల్ సెర్చ్ లో రావడం లేదు, చీరాల మహిళా మండలి అని కొడితే.

ధన్యవాదాములు  
Author photo Sri, Telugu , 15+ yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 840+ Foreign and local events/ places coverage, 2117 General Articles and views 1,878,404; 104 తత్వాలు (Tatvaalu) and views 225,992
Dt : 25-Nov-2020, Upd Dt : 25-Nov-2020, Category : General
Views : 909 ( + More Social Media views ), Id : 825 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags : good , done , forget , rest of life , helper , pray , god , blessings , mahila mandali , chirala , padmavati jagarlamudi
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.

Share
NRI , అమెరికాలో లేదా విదేశం లో ఉంటారా, అయినా USA వార్తలూ ఇక్కడే
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 11 yrs
No Ads or Spam, free Content