APLatestNews.com top Banner

Social Media links
గీతా జయంతి - సుఖ దుఃఖము ను, సమంగా చూడటం. తామరాకు మీద నీటిబొట్టు లా - Devotional - లోకం తీరు/ News
           
     
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. 920 కధనాలు. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
1 నిమిష చదువు సమయం.

గీతా జయంతి, అంటే భగవద్గీత పుట్టినరోజు, అంటే భగవంతుడు శ్రీకృష్ణుడు, అర్జునుని కి గీతను బోధించిన రోజు.

ఇది మత గ్రంధము కాదు, మన మనసు ను అదుపులోకి తెచ్చే, మహ గ్రంధం. మనసు ప్రతి మనిషి కీ ఉంటుంది కదా, ఏ మతమైనా? కాబట్టే మనుషులందరికీ కావలసిన మనుష్య గ్రంధం.

వైరాగ్యం తో మునిలా కూర్చోమని చెప్పదు అన్ని వదలి. ఏ పని చేసినా ఎక్కడ ఉన్నా, ప్రయత్నం చేయి, ఫలితం పరమాత్మ కు అర్పించు అంటుంది. అర్జునుడిని యుద్ధం చేయమనే చెప్పినది, క్షత్రియ ధర్మం ప్రకారం. వదలి పారిపోయి తపస్సు చేయమనలేదు.

కొంతమంది చనిపోయిన తర్వాత, ఆ కార్యక్రమం దగ్గర పెడతారు భగద్గీతను, అది పద్దతి కాదు. నిర్జీవి, గీత విని కర్తవ్యాన్ని చేయలేవు. గీత బతికి శక్తి ఉన్న మనుషులు మంచి దోవ కోసం, తమ ధర్మం ను తాము ఏకాగ్రతతో స్వార్ధము లేకుండా ఆచరించుటకు.

పిల్లల కు చిన్నప్పుడు నుంచి నేర్పిన, వారికి ఏకాగ్రత కుదిరి, ఆరోగ్యం గా ఉండి, బాగా చదివి, ఫస్ట్ మార్కులు తెస్తారు. వాక్కు శుద్ధి జరిగి, మంచి మాటలు వస్తాయి. ఆత్మ బలం పెరిగి, జీవితంలో ఒడిదుడుకులు ఎదుర్కొంటారు. రోజు కు ఒక పద్యం మొదలు పెట్టండి, ఫలితాలు చూడండి.

ఇక్కడ ఉన్నవి అన్ని చదివి ఉంటే, ప్రతి దాంట్లో గీత నే ఉదాహరణగా చూస్తారు కదా. ఈరోజు అమెరికా లో ఉండి కూడా, వంద చెడుదోవలు ఉన్నా కూడా, ఒక్క చెడు అలవాటు లేదు అంటే, అది గీతా మహిమే, తామరాకు మీద నీటిబొట్టు లా ఉండగలగటమే. నేల నిద్ర, శాఖాహారం, ప్రదక్షిణలు, దైవ చింతన, యోగా సనం, ధ్యానం, ఇంకా ఎన్నో . . . కేవలం గీత ను అర్ధము చేసుకుని ఆచరించడము వలనే. అంటే సుఖ దుఃఖము ను, సమంగా చూడటం.

ఎన్నో కుటుంబాలకు, మంచి మాటలతో మంచి దోవ చూపించే ప్రయత్నం చేసి, గంటలు గంటలు రూపాయి వారి వద్దనుండి తీసుకోకుండా, పొగడ్తలు కానీ తెగడ్తలు కానీ సమంగా కృష్ణార్పణం అంటున్నాము. అదీ భగవద్గీత భిక్షే.

ఎన్ని కష్టాలు అవమానాలు బాధలు వచ్చినా, నష్టపోయినా ధర్మం వైపే ఉండి, ఉన్న దాంతో సర్దుబాటు చేసుకునే, గుణం కలిగింది భగవద్గీత వలనే.  
Author photo Sri, Telugu , 10 yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 828 Foreign events/ places coverage, 948 General Articles, 46 Tatvaalu
Dt : 08-Dec-2019, Upd Dt : 08-Dec-2019, Category : Devotional
Views : 284 ( + More Social Media views ), Id : 247 , State : AP/ Telangana (Telugu) , Country : India
Tags : geeta , gita , bhagavadgita
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
Share
కేసియార్, కేటీయార్ , బాబు , జగన్ , పవన్ కు చెందిన టీవీ, పత్రిక వార్తలు ఇక్కడే, ఒక చోటే చూడొచ్చు
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 8 yrs
No Ads or Spam, free Content