స్నేహమేరా జీవితం, బంధం అనుబంధం, అని సినిమా నటన పాడుకుందాం - General - లోకం తీరు/ News
           
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. 2083 కధనాలు. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు. 2118 General Articles and views 1,880,205; 104 తత్వాలు (Tatvaalu) and views 226,145.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
2 min read time.

గత ఐదు ఏళ్లుగా లేదా వచ్చే ఐదేళ్లలో, ఏ ఇతర దొంగలు దగ్గరకు, ముత్యాల దొంగలు, చుట్టంగా లేదా స్నేహితులు గా వెళితే ఎలా ఉంటుందో, సరదా సంభాషణలు చూడండి. నేడు ఎక్కడ చూసినా, అలాగే ఉంది, ఒకరిని అనడానికి ఏమీ లేదు.

* పిన్ని లేదా అత్తా లేదా అక్క లేదా వదినా, మీకు తెలుసు కదా

* మా అమ్మ ను 2014 లో ముదుసలి అయింది, ఎప్పుడు పోతుందో తెలీదు, మాకు వద్దు అని వదిలేసాం, కనికరం లేకుండా, ఇప్పుడు కొంపముంచి మమ్మల్ని ఇంటికి రావద్దు అంటావా?

బంధానికి విలువ, నీకు తెలీదా? మేము వదిలేసి న ఆమె కు, కూతురు గా మమ్మల్ని ఇంట్లో పెట్టుకుని బంధాలు గౌరవించవా?

ఒట్టి పోయిన గొడ్డు ను ఆవును వదులుకోమా? అమ్ముకోమా? అందుకే మేం అమ్మను వదిలేశాం. అన్న లేకుండా, అమ్మ ఇచ్చిన స్ధలం ను, 20 మందికి అమ్మేశాం. తప్పా, న్యాయం మీరే చెప్పండి?

* అదేమిటి నవ మాసాలు మోసిన తల్లిని వదిలేసింది, కూడా బంధాల విలువ చెపుతుంది, అని నేనెందుకు అంటాను. అలాంటి తప్పుడు మాటలు నా నోటి వెంట రావు, మా అమ్మ నాన్న పెంపక సంస్కారం అది.

నేను మా అమ్మ ను అత్తను ఆయనను అలాగే, రాచి రంపాన పెడుతున్నాను, కొంతమందిని వదిలేసాను. నేనూ నోరు లేని ఎందరినో, ధనం కోసం, మోసం ద్రోహం చేసాము.

మీకు మాకు, బంధాల విలువ గురించి, అనవసర మాటలు ఎందుకు, దొంగలం దొంగలం హాయిగా నటిస్తూ, పరస్పర మోసం చేసుకుంటూ, కలసి ఇలాగే తరాలు నడుద్దాం.

భవిష్యత్తు లో మన పిల్లలు మనల్ని అలాగే చేయాలి, వారికి ఇవి అనుభవ పాఠాలు కావాలి.

* కరోనా కష్ట సమయంలో వచ్చారు, సభ్యత సంస్కారం లేకుండా, మాస్కులు లేకుండా 6 అడుగులు దూరం పాటించకుండా, ప్రాణాలు పోతాయని మీకు భయం లేదు, మాలో ఒకరు పోతారని మాకూ భయం లేదు, ఖర్చు భూభారం తగ్గిదాం, తప్పు ఏముంది. ప్రభుత్వం పోలీసులు పెద్దలు, ఎవరి మాట మేము లెక్క చేయము, మీరు అంతే. ఏమిటో, మన స్వభావాలు ఒకటే.

మనకు ముదుసలి లేదా నీతి బంధాలు వద్దు, చికెన్ కూర చేసేదా కోడిగుడ్డు అట్టు పోసేదా? చెప్పు చిట్టితల్లి.

* మంచి దానివి తల్లి, అందరూ మన లాగా, నీతిమాలి కృతజ్ఞతలు లేని హీనమైన బతుకు బతుకుతూ, వంశాలను పెంచి, ఇలాంటి కరోనా గురువు లను వందలమంది ని ఆహ్వానిద్దాం.

మా ఆయన మీ ఆయన కూడా, చవటలు లాగా, మోసం కు ఎప్పుడూ చాటున మద్దతు ఇస్తారు, బయటకు మంచిగా నటిస్తు, డబ్బు పిచ్చి లేని వాడు ఎవడు ఉంటారు.

* మా అన్న నీతి నియమాలు అంటూ, ముదుసలి అమ్మ కు, కోటి తగలేసాడు, మాకిస్తే వడ్డీ ఇస్తామని, ఎప్పుడో అసలు నొక్కేసే వాళ్ళం.

ఎట్టా బతుకుతాడో, మంచి మర్యాద తెలీదు, లోక జ్ఞానం లేదు, ఉత్త ధన పిచ్చి మా అన్నకు, పెద్దలు అంటే అసలు గౌరవం లేదు, మొఖాన తప్పులు ఇలా కడగవచ్చా?

చాటుగా వెన్నుపోటు పొడవడం కూడా, మనలాగా తెలీదు, ఇంత వయస్సు వచ్చి. ఎప్పుడు నేర్చుకోవాలి, ఎవరు నేర్పాలి?

ఇప్పుడు ఇరవై ఏళ్ల వయస్సు కే, మోసం కుట్ర నటన, నేర్చుకోవాలి కదా.

* నిజమేనమ్మా నాకు తలనొప్పి మీ అన్నతో, నీతులు చెపుతాడు. పవిత్రంగా ఉండు, మోసం కుట్ర చాటు లేకుండా ఉండమంటాడు, ఛీ ఏం మాటలు అవి. నాకు అసలు నచ్చవు, ఒళ్ళు మంట. అందుకే అసలు ఫోన్ ఎత్తను.

మోసం దగా కుట్ర లేకుండా, ఇంత ఆస్తి ఎలా సంపాదించడం కుదురుద్ది? నేను కూడా, ముదుసలి వారికి, ఖర్చు ఎక్కువ పెట్టను, ఇంట్లో ఉంచుకోను.

ఊళ్ళో లేదా దగ్గర ఆసుపత్రిలో వేసిన, ఉంటే ఉంటారు పోతే పోతారు. వాళ్ళ మీద ఖర్చు కన్నా, వడ్డీ వ్యాపారం లాభం ఉత్తమం. నాలుగు రాళ్లు సంపాదించవచ్చు, నలుగురు ని మోసం చేసి.

* అందుకే మనం మనం బంధువులం స్నేహితులం, ఇలాగే మన పిల్లలు ఐకమత్యంగా ఉండాలి,

వీలైనంత పాపం పెంచాలి. రాక్షసులు రాక్షసులు ఎప్పుడూ బంధువులే, ఎవరూ విడదీయలేరు.

స్నేహమేరా జీవితం, బంధం అనుబంధం, అని సినిమా నటన పాడుకుందాం.  
Author photo Sri, Telugu , 15+ yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 840+ Foreign and local events/ places coverage, 2118 General Articles and views 1,880,205; 104 తత్వాలు (Tatvaalu) and views 226,145
Dt : 03-May-2021, Upd Dt : 03-May-2021, Category : General
Views : 767 ( + More Social Media views ), Id : 1147 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags : friendship , life , relation , bond , attachment , sing , song , movie , acting , sister , aunt
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.

Share
కేవలం ఒక మీడియా వార్త నే నమ్మలేము, ఒకే చోట అందరి వార్తలను ఇక్కడ చూసి, నిజాలు పోల్చుకోగలము
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 11 yrs
No Ads or Spam, free Content