రాజకీయాలలో ఉండే మాకు, ఈ దేవుని మాటలు, ధ్యానం, సాధన మనసుకు ఎక్కుతాయా? ఉపయోగమా? - General - లోకం తీరు/ News
           
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. 1621 కధనాలు. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు. 1656 General Articles, 63 Tatvaalu.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
2 min read time.

ఏవండీ రాజకీయాలలో ఉండే మేము, మీరు పంపినవి అప్పుడప్పుడూ చదువుతాము. సాధారణముగా, మమ్మల్ని అందరూ అది కావాలి, ఇది కావాలని అడుగుతారు. మీరు అసలు ఏమీ అడగకుండానే, మాకే బోధనలు చేస్తున్నారు. ప్రజలకు మాయమాటలు చెప్పే, ప్రజల మాయమాటలు వినే, మాకు, ఈ దేవుని మాటలు, ధ్యానం, సాధన మనసుకు ఎక్కుతాయా? ఉపయోగము ఉందా?

జవాబు - మంచి ప్రశ్న, గురువు గారు, ధన్యవాదములు.

మన వాట్సాప్ స్టేటస్, ప్రతి రోజూ చూడటం మానవద్దు. ఎలా చూడాలో గతము లో మాటలు పంపాము, లేదా ఇతరులను అడిగి తెలుసుకొనవచ్చు. దొంగచాటు గా చూడవద్దు వద్దు సుమా, నీతిగా ధైర్యముగా రీడ్ రిసీప్ట్ తో చూద్దాం. ప్రొఫైల్ ఫోటో కనీసం దేవుడు లేదా ప్రక్రుతి ది అయినా పెట్టి, మనము బాధ్యత గల మనుషులం, అని మిత్రులకు తెలుపుదాం.

ప్రపంచములో, ఎక్కువగా మాయా మోహ భ్రమలలో ఉండేవి, 2 రంగాలు. 1. రాజకీయము 2. సినిమా/ టీవీ రంగుల ప్రపంచం.

ఎంత వేగము గా అంతస్థులు ఆకాశానికి ఎక్కుతారో, అంత వేగముగా పతనము కూడా అవుతారు, వారు లేదా వారి వారసులు, జాగ్రత్త లో లేక పోతే. కాబట్టి, అసలు ఈ ధ్యానం సాధన కావాల్సింది, ఎక్కువ ఈ 2 రంగాలలో ఉన్న వారికే.

ఒకరు మనమే తర్వాత 20 ఏళ్ళు అధికారం అంటారు అనుకుంటారు, ఇంకోరు మనమే టాప్ హీరో హీరోయిన్ అంటారు అనుకుంటారు. అది భ్రమ మాయ అని అందరికీ తెలుసు. కానీ ఆ మాట అనడం అనుకోవడం, వారు లేదా వారి అనుచరులు, మానరు.

ప్రజలలో కొందరికి అంటే మన లాంటి వారికి, పతనము జరిగినా, ఆ బజారుకో పేటకో మాత్రమే తెలుస్తుంది. కానీ ఈ 2 రంగాలలో వారి విషయాలు మాత్రం, ఊరు జిల్లా రాష్ట్రం మొత్తము తెలుస్తుంది.

అందరూ, భగవద్గీత ఆడియో పద్యాలు మనిషి పోయాక పెట్టాలి, అని అనుకుంటున్నారు. అది వాస్తవం కాదు. గీత, విధ్యార్ధి దశలోనే, ప్రతి ఒక్కరు నేర్చుకోవాలి, సాధన చేయాలి.

అలాగే, రాజకీయం మరియు సినిమా వారికి, కూడా, ఈ సాధన పూజ ధ్యానం ఖచ్చితముగా ఉండాలి. అది, వారి మనసును పవిత్రముగా ఉంచి, వారి ఎదుగుదలకు తోడ్పడతుంది. పతనము నుంచి కాపాడుతుంది. తమ వారసుల భవిష్యత్ కు బంగారు బాట వేస్తుంది.

ఈ వారం వార్తలు చూస్తే, అధికార పార్టీ ఎమ్మెల్యే, కరకట్ట ప్రతి పక్షనాయకుని ఇంటి పైకి ధర్నాకు వెళ్ళారు. అవసరమా ఇలాంటి పనులు? అది ఉద్రిక్తతకు దారి తీస్తుంది.

సొంత నియోజకవర్గ జనాలకు సేవ చేసే సమయం లేదు? సొంత జిల్లా అధికారులతో, నవ రత్నాల పధకాలు సోషల్ మీడియాలో పెట్టించడానికి తీరిక లేదు? కాని వీటికి తిట్లు కు దొమ్మీలకు తీరిక ఉంది, కదూ?

అధికార నాయకులు, ప్రతి పక్షాలను తిట్టడాము ఎటూ జరుగుతూనే ఉంది. మరలా ప్రతిపక్షం తిట్టినా కూడా, అలాగే భరించాలి. లేదా, ఇరువైపులా, పద్దతిగా మాట్లాడాలి. అనుచరులు వీరిని చూసి, ఇంకా చెత్త గా సోషల్ మీడియాలో, తిట్టుకుంటూ ఆనందపడుతున్నారు.

కాబట్టి, ఇరు పార్టీ నాయకులు కూడా, తాము పూజ ధ్యానం సాధన చేస్తూ, తమ ఎమ్మెల్యే ఎంపీలు అనుచరులతో కూడా చేపిస్తూ, రోజూ సోషల్ మీడియాలో ఫోటోలు పెట్టిస్తే, ఈ అనవసర గందరగోళం తగ్గుతుంది.

పక్క పార్టీలకు నాయకులను కోవర్టులు గా పంపాలని, అలాగే ఇతర పార్టీ నాయకులను బానిసలు గా తెచ్చుకోవాలన్న, నీతి మాలిన పని, ఇరు పార్టీ నాయకులు కూడా చేయకుండా ఉంటారు, ఈ సాధనలు ఆచరణ లో ఉంటే.  
Author photo Sri, Telugu , 10 yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 828 Foreign events/ places coverage, 1656 General Articles, 63 Tatvaalu
Dt : 19-Sep-2021, Upd Dt : 19-Sep-2021, Category : General
Views : 434 ( + More Social Media views ), Id : 1250 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags : politicians , god , meditation , practice , mind
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.

Share
ఆ టీవీ, ఈ టీవీ, మీ టీవీ, మా టీవీ, వాళ్ళ టీవీ పత్రిక - అన్ని టీవీ, పత్రిక వార్తలు వినోదం ఇక్కడే
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 10 yrs
No Ads or Spam, free Content