Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
చివరలో ఉన్న చిత్రం/ వీడియో/ ఆడియో మరువద్దు. 1 min read time. త్వరలోనే మన జిల్లా నాయకులు, మంత్రులు లేదా పెద్ద నాయకులు, ఏ పార్టీ అయినా సరే, ప్రకాశం జిల్లా కలెక్టరు గారు మరియు జిల్లా ఇతర అధికారులు తో, సోషల్ మీడియా అంటే ఫేస్బుక్, ట్విట్టర్ లో, ప్రభుత్వ పధకాలు మరియు హాజరైన ప్రజా నాయకులు పేర్లు పెట్టించగలిగితే, కనీసం ఇప్పుడు అయినా, అంటే జగనన్న పాలన సంవత్సరం తర్వాత అయినా, వారిని మరియు వారి ధైర్యం ను మరియు ప్రజల యందు చిత్తశుద్ధి ని బాధ్యత ను పొగుడుతూ, మేము ఆర్టికల్ రాస్తాము, ఎవరైనా రాయాలి తప్పదు.
ప్రతి పక్ష నాయకులు కు కూడా, ప్రజల మీద బాధ్యత ఉంది కదా, మరలా అధికారము లోకి రావాలి అంటే. ప్రభుత్వ పధకాల ప్రచార సమాచారం, నేరుగా అధికారులు నుంచి జనం కు చేర్చడం, అది ఏ జిల్లా అయినా కూడా. మేము అధికారములో లేకపోయినా, సమచార వ్యవస్థను పటిష్టము చేసాము అని గొప్పగా చెప్పవచ్చును.
మీరు శాంపిల్ కు, ప్రస్తుత చిత్తూరు, కడప, క్రిష్ణ, గుంటూరు, విశాఖ లాంటి ఉత్తమ బాధ్యత గలిగిన, ప్రజా కలెక్టర్ ల సమాచారం, లింక్ లు సాక్ష్యం తో, మొన్న ఆర్టికల్ లో చూసారు. వారు రోజూ సవినయముగా ప్రజలకు తమ వివరాలను ఇస్తున్నారు.
ఒంగోలు ఎంపీ మాగుంట గారు, బాపట్ల ఎంపీ సురేష్ గారు, మంత్రి వర్యులు బాలినేని మరియు సురేష్ గార్లు, అలాగే తెలుగు దేశం నేతలు బాబు మరియు లోకేష్ గార్లు, జనసేన అధ్యక్షులు పవన్ గారు, భాజపా అధ్యక్షులు కన్నా గార్లు ఎవరైనా సరే. ఎవరు చిత్తశుద్ధి తో కార్యదీక్షతో, ఈ ప్రజలకు ఉపయోగపడే పనిని సాధించగలరో, త్వరలోనే చూద్దాం. ఏ అధికారులు, ఇటువంటి ప్రశ్నలకు మరియు విన్నపాలకు జవాబు చెప్పకుండా, ప్రభుత్వ ఫోన్ వాట్సప్ ఆపారో, వారి పేర్లు కూడా తెలుసుకుందాం.
ఇది వారికి అంటే నాయకులు మరియు అధికారులకు కూడా లాభం. ఎందుకంటే, కలెక్టర్ గారిని ఈరోజు బాలినేని మరియు మాగుంట గార్లు, కలెక్టర్ భవన్ లో మీటింగ్ లో పాల్గనటానికి వచ్చారు అని , కలెక్టర్ గారి మరియు ఇతర అధికారుల సోషల్ మీడియా లో చూడటం గొప్పే కదా, ధనం తో ప్రజలు పేపరు కొనే అవసరము లేదు కదా.
ఎందుకంటే, కలెక్టర్ గారు మరియు ఇతర శాఖల జిల్లా అధికారులు, జిల్లా మొత్తానికి అధినాయకులు దేవుళ్ళు. వారి ఫోటోలు, వారి సొంత సోషల్ మీడియాలో చూడటం వారికి మరియు మనకు గర్వ కారణం. వీరు మొదలు పెడితే, అలాగే, డివిజన్, మండలము, పట్టణము, గ్రామ అధికారులు కూడా మొదలు పెడతారు.
ఘనమైన టంగుటూరి ప్రకాశం జిల్లా పరువు మర్యాద గౌరవము ఉన్నతి, పైన చెప్పిన మిగతా జిల్లా ల సమాచార స్ధాయిలో ఉంచే, శక్తి యుక్తులు మనకు ఉన్నాయి అని నిరూపిద్దాము. మన సమర్ధులైన నాయకులు మరియు అధికారులు నిరూపిస్తారు త్వరలోనే.
Sri, Telugu , 15+ yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 840+ Foreign and local events/ places coverage, 2108 General Articles and views 1,865,292; 104 తత్వాలు (Tatvaalu) and views 224,877 Dt : 28-May-2020, Upd Dt : 28-May-2020, Category : Request
Views : 824
( + More Social Media views ), Id : 565 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags :
prakasam elected leaders ,
balineni ,
suresh ,
magunta ,
yv ,
district officials ,
govt plans ,
social media Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది. తెలుగు మీడియాను నమ్మరా, ఆంగ్ల హిందీ మీడియాను నమ్ముతారా? పర్లేదు, వాటినీ ఇక్కడే చూడొచ్చు
Facebook Comments