ఆధ్యాత్మిక దేశభక్తి - పాడవోయి భారతీయుడా, నా జన్మభూమి, గాంధీ పుట్టిన, అర్ధ శతాబ్దపు, జాతీయ ప్రతిజ్ఞ - Songs - లోకం తీరు/ News
           
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. 2073 కధనాలు. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు. 2108 General Articles and views 1,860,986; 104 తత్వాలు (Tatvaalu) and views 224,449.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
చివరలో ఉన్న చిత్రం/ వీడియో/ ఆడియో మరువద్దు. 1 min read time.

*ఆధ్యాత్మిక దేశభక్తి - పాడవోయి భారతీయుడా, నా జన్మభూమి, గాంధీ పుట్టిన దేశమా, అర్ధ శతాబ్దపు అజ్ఞానాన్ని, జాతీయ ప్రతిజ్ఞ*

దేవుడు జ్ఞానం ఇస్తే, బావి నుండి ఊట ఊరినట్లుగా, మన మదిలోనుంచి ఎన్నో వందల సందేశాలు మాటలు జాగ్రత్తలు ముందుచూపు గా, ఆ భగవంతుడు, తన బిడ్డల క్షేమం కోసం, ముందే హెచ్చరికలు చేస్తారు. కానీ మనము అరిషడ్వర్గాల బానిసత్వములో పట్టించుకోము, పతనము అయ్యిందాకా.

ముదుసలి తల్లి దండ్రుల/ అత్త మామల సేవా భక్తి లేనిదే, ఆ సజీవ గురువులను ఇంట్లో ఉంచి ఆదరించనిదే, దేశభక్తి రాదని, దైవ భక్తి ఆచరించలేమని, ఎన్నో కధనాలలో చెప్పుకున్నాము.

అంటే కనీసం సొంత ఇంటి మానవ సేవ లేనిదే, భూమాత గోమాత సేవ, అలాగే లోకమాత విశ్వపతి సేవ కూడా, చేయ అనర్హులము. జనాల ఎదురు, కపట నటన వలన, ప్రయోజనము లేదు, ధన కాల వస్తు ప్రయాణ వ్రుధా ప్రయాస తప్ప.

నా జన్మభూమి ఎంత అందమైన దేశము, నా ఇల్లు అందులోన కమ్మని ప్రదేశము అని అందరము అంటాము. నడిచే దారిలో నవ్వే పువ్వులు, శాంతి నాదాలతో, ఎగిరే పిట్టలు అని ఆనంద పడతాము.

బతకాలందరు, దేశం కోసమే. దేశమంటేను, మట్టికాదోయ్, మనుషులే. స్వార్థమూ వంచన లేనిదే పుణ్యము, త్యాగమూ రాగమూ మిళితమే ధన్యమూ అని కలలు కంటాము. కానీ ఆచరణలో చూపము. అది మిగతావారి బాధ్యత అని అనుకుంటాము. చిత్రముగా అందరూ అదే అనుకుని, మన సామూహిక పతనానికి సువర్ణ బాటలు వేస్తున్నాము.

ఇగోలు దేశాల మధ్యకూడా పెరిగి, నెత్తుటి యుద్దం చేస్తునే, జనాలు రామా లక్ష్మణా అంటూ పారిపోతుంటే, మనకేమి కాదులే మనకు సంబంధము లేదులే అని, అని నిమ్మళముగా ఉన్నాము. అక్కడి కార్చిచ్చు ఇక్కడి దాకా రాదా, ఏదో ఒక రూపములో? మన గడప దగ్గరలో ఉన్న, లంకలో కాలుతున్నది కదా మానవ జీవితము?

స్వాతంత్ర్యం వచ్చె ననీ, సభలే చేసి సంబరపడగానే, సరిపోదోయి. ఆగకోయి భారతీయుడా,
కదలి సాగవోయి, ప్రగతిదారులా అంటూ మనల్ని మేల్కొలిపే వారేరి? ఇంకొకరి మంచి మాట వినే సంస్కారం మనకు మన కుటుంబానికి ఉందా?

ఆకాశం అందుకునే, ధరలొక వైపు, అదుపులేని, నిరుద్యోగం మింకొక వైపు, అవినీతి, బంధు ప్రీతి చీకటి బజారు, అలుముకొన్న మన దేశం, ఎటు దిగజారు? కాంచవోయి నేటి దుస్థితి, ఎదిరించవోయి, ఈ పరిస్థితి? అంటే మాత్రం, మనము టీవీలు/ సినిమాలు/ గేం లు చూడకుండా ఉంటామా? మంచి కోసం, ఎదిరించే గుణం, అసలు పిరికివారమని అవసర అవకాశవాదులం, మనకు తెలుసా? ఎందుకంటే, ఆ తప్పుడు పనులు జరగడానికి, మొదటి కారణం మనము, మనము వేసిన మన బాధ్యత లేని ఓటు.

సమ్మె ఘెరావు దొమ్మీ, బస్సుల దహనం లూటీ. శాంతి సహనం, సమధర్మం పై, విరిగెను గూండా లాఠీ. అధికారం కై పెనుగులాటలో, అన్నా దమ్ముల పోటీ, హెచ్చెను హింసా ద్వేషం, ఏమవుతుంది, మన దేశం అని, మన బాధ్యత గుర్తు ఎరుగుతామా, ఇకనైనా? మన పూజలు వ్రతాలు ఎందుకని, ఓటు అప్పుడు మనకు మంచి బుద్ది ఇవ్వడము లేదు? ఎందుకనీ, సంవత్సరానికి 100 గుళ్ళు కు వెళ్ళిన, 100 పద్యాలు శ్లోకాలు పుస్తకాలు చదివిన, పుణ్యం, మనకు బుద్ది ఇవ్వడం లేదు?

కులాల కోసం, గుంపులు కడుతూ, మతాల కోసం, మంటలు పెడుతూ, ఎక్కడలేని, తెగువను చూపి, తగువుకి లేస్తారే, జనాలు తలలర్పిస్తారే? సమూహక్షేమం, పట్టని స్వార్థపు, ఇరుకుతనంలో, ముడుచుకు పోతూ, మొత్తం దేశం, తగలడుతోందని, నిజం తెలుసుకోరే, తెలిసి భుజం కలిపి రారే? ఎవరి రావాలి, ఎవరి కోసం రావాలి? ఈ ఇంగిత జ్ఞానం మనకు దేవుడు ఇవ్వాలా? మనకై మనము తెలుసుకోలేమా? మరి చిత్త శుద్ది పూజలేనా మనవి? రాష్ట్రం లో ఉన్న తండ్రి లాంటి తెలుగు గురువులను చూడ ఒపికలేని మనము, ఇతర రాష్ట్రాల ఇతర భాషల గురువు దగ్గరకు పరుగులు అంటే, మనకు నిబద్దత లేదు అనే కదా?

గుర్తు ఉన్నాయా ఈ మాటలు - భారత జాతీయ ప్రతిజ్ఞ? గతములో, స్కూల్లో చెప్పిన, మనకు నేర్పిన పాఠాలు. మరి దేవుడు, తల్లి దండ్రులు, పుట్టిన పిల్లల మీద ప్రమాణము చేసి చెప్పగలమా, ఎంత మందిమి, ఈ జాతీయ ప్రతిజ్ఞ లో కొన్ని అయినా, కనీసము త్రికరణ శుద్దిగా చేస్తున్నాము? బిజీ బిజీ అన్న పదం లేకుండా, నాకేమిటీ ఇతరులతో పని అన్న స్వార్ధం లేకుండా, పాటిస్తున్నామా?

పైవి పాటించకపోవడము వలన, నష్టం ఎవరికి? మన మోసము నిర్లక్ష్యము కుసంస్కారం వలన, ఈ రోజుకు నష్టం ఇంకొకరుకి కావచ్చు. కానీ తర్వాత వరుసలో ఉంది మనమే మన బిడ్డలే/ మనుమలే అని మరువకుమా. మన బిడ్డలకు కూడా సంస్కారం నేర్పలేము కదా, వారూ నేర్చుకోరు కదా? కళ్ళు తెరుద్దాము, ధర్మాన్ని కాపాడుదాము, ఇది మనందరి బాద్యత. ఫలితాలు మనకే.

ఎంత దిగజారిపోయాము అంటే, వర్గం ధనం కులం అవసరం అవకాశం చూడనిదే, ఉచితముగా ఓటు వెయ్యం. పులి, పాము, నక్క, ఆవు లలో, బీదదైన సంస్కారం గల, మన క్షేమం కోరే, అందరికీ ఉపయోగ పడే ఆవును, ఏనాటికీ ఎన్నుకోము. మూడు పంటల పొలాలు కాంక్రీట్ చెయ్యద్దని చెప్పలేము. ప్రజా పన్నులతో నడిచే పధకాలకు, మన పేర్లు పెట్టి ఆనందపడే వంశ నీచానికి దిగజారవద్దని కూడా చెప్పలేము.

మరి వైకుంఠ ఏకాదశికి, శివరాత్రికి, విజయదశమికి గుడులన్నీ ఇసకవేస్తే రాలని, నటన భక్త అరిషడ్వర్గాల బానిసత్వ జనం? మరి పై పాపాలు ఎవరివి, మాట రాత నడత కలిసే పుణ్యవంతులు లేరా, ఇకనైనా రారా?

చుట్టూ తగలబడుతుంటే, మనొక్కరమే ప్రశాంతముగా కూర్చోలేము నిద్రపోలేము కదా? మనం ధర్మాన్ని కాపాడలేక పోతే, ఆ పంచభూతాలు మనకు బుద్ది చెప్పడానికి, భూకంపాలు, సునామీ, ఉల్కాపాతం, కరోనా వైరసులు, వరదలు, అగ్ని మంటలు, గాలి వానలు, కరువు లు గా వచ్చి, భూమిని శుద్ది చేసి, ధర్మాన్ని కాపాడతాయి.

మరి మనం మారదామా? మనల్నే మార్చేద్దామా అంటే మనల్ని తుడిచిపెట్టే అవకాశం పంచభూతాలకు ఇద్దామా? మీ ఇష్టం, మన అందరి ఇష్టం.

1) పాడవోయి భారతీయుడా, ఆడి - పాడవోయి విజయగీతిక

నేడే స్వాతంత్ర్య దినం - వీరుల త్యాగఫలం 2
నేడే నవోదయం, నీదే.. ఆనందం ఓ ఓ||పాడ||

స్వాతంత్ర్యం వచ్చె ననీ.., సభలే చేసి
సంబరపడగానే.., సరిపోదోయి - 2 లైన్లు
సాధించినదానికి, సంతృప్తిని పొన్ది..
అదే విజయమనుకుంటే, పొరపాటోయి
ఆగకోయి భారతీయుడా..
కదలి సాగవోయి, ప్రగతిదారులా .. - 2 లైన్లు ||ఆగ||

ఆకాశం అందుకునే.., ధరలొక వైపు
అదుపులేని, నిరుద్యోగం మింకొక వైపు- 2 లైన్లు
అవినీతి, బంధు ప్రీతి చీకటి బజారు
అలుముకొన్న నీదేశం, ఎటు దిగజారు
కాంచవోయి నేటి దుస్థితి..,
ఎదిరించవోయి, ఈ పరిస్థితి... - 2 లైన్లు కాంచవోయి

పదవీ వ్యామోహాలు, కులమత భేదాలు
భాషా ద్వేషాలు, చెలరేగె నే.డు - 2 లైన్లు
ప్రతి మనిషి, మరియొకని, దోచుకొనె వాడే ఏ ఏ 2
తన సౌఖ్యం, తన భాగ్యం, చూచుకొనెవాడే..
స్వార్ధమీ.. అనర్ధ కారణం
అది చంపుకొనుట క్షేమదాయకం - 2 లైన్లు స్వార్ధమీ

సమ సమాజ నిర్మాణమే, నీ ధ్యేయం, నీ ధ్యేయం
సకల జనుల సౌభాగ్యమె నీ లక్ష్యం, నీ లక్ష్యం
సమ సమాజ నిర్మాణమే నీ ధ్యేయం
సకల జనుల సౌభాగ్యమె నీ లక్ష్యం - 2 లైన్లు
ఏక దీక్షతో గమ్యం చేరిన నా..డే
లోకానికి మన భారతదేశం, అందించునులె, శుభ సందేశం 3

Velugu Needalu, Paadavoyi Bhaaratheeyudaa, Patriotic Song, ANR, Savitri

2) సిపాయి చిన్నయ్య 1969, సంగీతం::M.S.విశ్వనాధం, రచన::ఆరుద్ర, గానం::ఘంటసాల

నా జన్మభూమి ఎంత అందమైన దేశము 2
నా ఇల్లు అందులోన కమ్మని ప్రదేశము
నా సామిరంగా హాయ్ హాయ్, నా సామిరంగా..2 ||నా జన్మభూమి||

నడిచే. దారిలో, నవ్వే. పువ్వులు
శాంతి నాదాలతో, ఎగిరే పిట్టలు ఆ ఆ - 2 లైన్లు
పచ్చని.. పంటలు, వెచ్చని.. జంటలు
చల్లని.. జీవితం, ఇదే నవభారతం
ఆయ్ హాయ్ నా సామిరంగా, ఓయ్ హోయ్ నా సామిరంగా ||నా జన్మభూమి||

బతకా.లందరు, దేశం కోసమే
దేశమంటేను, మట్టికాదోయ్, మనుషులే ఆ ఆ - 2 లైన్లు
స్వార్థమూ.. వంచన., లేనిదే.. పుణ్యము
త్యాగమూ.. రాగమూ.., మిళితమే ధన్యమూ
ఆయ్ హాయ్ నా సామిరంగా, ఓయ్ హోయ్ నా సామిరంగా ||నా జన్మభూమి||

Sipayi Chinnayya, Naa Janma Bhoomi, ANR, KR Vijaya

3) గాంధీ పుట్టిన దేశమా ఇది

గాంధీ పుట్టిన దేశమా.. ఇది, నెహ్రూ కోరిన సంఘమా ఇది
సా.మ్యవాదం, రా.మరాజ్యం, సంభవించే కాలమా.. || గాంధీ ||

సస్యశ్యామల దే.శం., అయినా నిత్యం క్షా..మం. 2
ఉప్పొంగే నదుల జీవజలాలు, ఉప్పు సముద్రం పాలు
యువకుల శక్తికి, భవితవ్యానికి, ఇక్కడ తిలోదకా.లు
ఉన్నది మనకూ ఓ.టు, బ్రతుకు తెరువుకే లో.టు || గాంధీ ||

సమ్మె ఘెరావు దొమ్మీ.., బస్సుల దహనం లూటీ.. 2
శాంతి సహనం, సమధర్మం పై, విరిగెను గూండా లాఠీ.
అధికారం కై పెనుగులాటలో, అన్నా..దమ్ముల పోటీ
హెచ్చెను హింసా ద్వేషం, ఏమవుతుంది. దేశం || గాంధీ ||

వ్యాపా.రాలకు పర్మిట్, వ్యవహా.రాలకు లైసెన్సు
అర్హతలేని ఉద్యోగాలు, లంచం యిస్తే ఓ.యస్
సిఫార్సు లేనిదే, స్మశానమందు, దొరకదు రవ్వంత చోటు
పేరుకు ప్రజలది రా..జ్యం, పెత్తందార్లకే భో..జ్యం || గాంధీ ||

Pavithra Bandham, gandhi puttina desama idhi, ANR

4) అర్ధ శతాబ్దపు అజ్ఞానాన్ని, స్వతంత్రమందామా! స్వర్ణోత్సవాలు చేద్దామా!
ఆత్మ వినాశపు అరాచకాన్ని, స్వరాజ్యమందామా! దానికి సలాము చేద్దామా!
శాంతి కపోతపు, కుత్తుక తెంచి, తెచ్చిన బహుమానం, ఈ రక్తపు సిందూరం
నీ పాపిటలో, భక్తిగ దిద్దిన, ప్రజలను చూడమ్మా! ఓ! పవిత్ర భారతమా!

అర్ధ శతాబ్దపు అజ్ఞానాన్ని, స్వతంత్రమందామా, స్వర్ణోత్సవాలు చేద్దామా
నిత్యం కొట్టుకు, చచ్చే జనాల, స్వేచ్చను చూద్దామా! దాన్నే స్వరాజ్యమందామా!

కులాల కోసం, గుంపులు కడుతూ, మతాల కోసం, మంటలు పెడుతూ
ఎక్కడలేని, తెగువను చూపి, తగువుకి లేస్తారే, జనాలు తలలర్పిస్తారే
సమూహక్షేమం, పట్టని స్వార్థపు, ఇరుకుతనంలో, ముడుచుకు పోతూ
మొత్తం దేశం, తగలడుతోందని, నిజం తెలుసుకోరే, తెలిసి భుజం కలిపి రారే
అలాంటి, జనాల తరఫున, ఎవరో, ఎందుకు పోరాడాలి? పోరి, ఏమిటి సాధించాలి?

ఎవ్వరికోసం, ఎవరు ఎవరితో, సాగించే సమరం, ఈ చిచ్చుల సిందూరం
జవాబు చెప్పే, బాధ్యత మరచిన, జనాల భారతమా! ఓ అనాథ భారతమా!

అర్ధ శతాబ్దపు అజ్ఞానాన్ని, స్వతంత్రమందామా! స్వర్ణోత్సవాలు చేద్దామా!
ఆత్మవినాశపు అరాజకాన్ని, స్వరాజ్యమందామా! దానికి సలాము చేద్దామా!

Ardha Shathabdapu, Sindhooram , Ravi Teja, Sanghavi, Sirivennela

5) భారత జాతీయ ప్రతిజ్ఞ
భారతదేశము నా మాతృభూమి.
భారతీయులందరు నా సహోదరులు, సోదరీమణులు
నేను నా దేశమును ప్రేమించుచున్నాను.
సుసంపన్నమైన, బహువిధమైన నాదేశ వారసత్వసంపద నాకు గర్వకారణము.
దీనికి అర్హుడనగుటకై సర్వదా నేను కృషి చేయుదును.
నా తల్లిదండ్రులను, ఉపాధ్యాయులను, పెద్దలందరిని గౌరవింతును.
ప్రతివారితోను మర్యాదగా నడచుకొందును.
నా దేశముపట్లను, నా ప్రజలపట్లను సేవానిరతి కలిగియుందునని ప్రతిజ్ఞ చేయుచున్నాను.
వారి శ్రేయోభివృద్ధులే నా ఆనందమునకు మూలము.

మీరూ పాడే ప్రయత్నం చేయాలి, శ్వాస వ్యాయామం కు, ఆరోగ్యం కు, వాక్సుద్ది కి, ఉచిత మనశ్శాంతికి. పూర్తి పాటలు మాటలు వీడియోలు లింక్ లోపల చూడగలరు.

desabhakti - padavoyi bharatiyuda na janmabhumi gandi puttina desama ardha satabdapu ajnananni jatiya prtijna  
Author photo Sri, Telugu , 15+ yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 840+ Foreign and local events/ places coverage, 2108 General Articles and views 1,860,986; 104 తత్వాలు (Tatvaalu) and views 224,449
Dt : 15-Aug-2022, Upd Dt : 15-Aug-2022, Category : Songs
Views : 551 ( + More Social Media views ), Id : 1496 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags : desabhakti , padavoyi , bharatiyuda , janmabhumi , gandhi , puttina , ardha , satabdapu , jatiya , prtijna , Velugu , Needalu , Sipayi , Chinnayya , Pavithra , Bandham , Sindhooram
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.

Share
కేవలం ఒక మీడియా వార్త నే నమ్మలేము, ఒకే చోట అందరి వార్తలను ఇక్కడ చూసి, నిజాలు పోల్చుకోగలము
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 11 yrs
No Ads or Spam, free Content