ఆమంచి స్ధానిక పట్టు పంచాయతీ విజయ సభ, సర్పంచ్ పదవి బలరాం వర్గానికి - Politics - లోకం తీరు/ News
           
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. 2078 కధనాలు. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు. 2113 General Articles and views 1,871,224; 104 తత్వాలు (Tatvaalu) and views 225,367.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
2 min read time.

చీరాల వేటపాలెం మండలం, రామన్నపేట పంచాయతీ విజయోత్సవ అభినందన సభలో పాల్గొన్న, ఆమంచి వర్గం మరియు గెలిచిన స్ధానిక నాయకులు కు అభినందనలు. నాగార్పమ్మ గుడి దగ్గర జరిగిన సభ ఫోటోలు చూడవచ్చు, వారి సోషల్ మీడియా లో.

మరోసారి స్ధానిక పట్టు ను నిరూపించారు, మొత్తం 14 లో షుమారు 8/9 మంది ని గెలిపించి, తనకున్న జన బలం తో. ఆమంచి అన్నదమ్ములు ఇద్దరూ, ప్రజలకు స్ధానికంగా అందుబాటులో ఉంటూ, ఫోన్ చేస్తే, అండగా వస్తాము ఉంటాము అంటున్నారు, తాము స్వయంగా అధికారంలో లేకపోయినా, ఎన్ని అవమానాలు ఎదురు అయినా కూడా, జనాన్ని వీడలేదు.

సర్పంచ్ పదవి కరణం ఆమంచి ల ఇరు వర్గాలు పంచుకున్నారు అని, మొదట టర్మ్ బలరాం వర్గానికి అని, స్నేహపూర్వక పోటీకి ఆమంచి కొందరు అభ్యర్థులు ను తగ్గించారు అని, ఉప సర్పంచ్ పదవి మాత్రం 5 ఏళ్ళు ఆమంచి వర్గానికే అని, వార్తలు వస్తున్నాయి. గెలిచిన సర్పంచి, కరణం ను కలసి, కృతజ్ఞతలు తెలిపారు.

కరణం ఆమంచి లను, దూరముగా అద్దంకి మరియు పర్చూరు కి పంపే ప్రయాత్నాలు జరుగుతున్నవి, అని గతంలో అనుకున్నాం, తగిన సలహాలు మార్గాలు కూడా ఇచ్చాము. ఇప్పుడు మరలా పుకార్లు వస్తున్నాయి, ఇంకో కధనం లో దాని గురించి అనుకుందాం.

కొత్తగా మరలా ఎమ్మెల్సీ సీటు వచ్చిన తర్వాత, పోతుల సునీత గారి సందడి, పంచాయితీ ఎన్నికల్లో కనపడలేదు.

ఎప్పటి లాగే నీరసము గా ఉండే, చీరాల తెదేపా, బీజేపీ, జనసేన స్ధానిక నాయకుల ఎన్నికల సందడి, మరి కనీసం ఫేస్బుక్ లో కూడా కనపడినట్లు లేదని, ప్రజలు భావన. గత రెండు ఏళ్లుగా లేనిదే, ఇప్పుడు ఉన్నా, ఉపయోగం లేదని ఇంకొందరు అంటున్నారు.

ప్రజలలో ఎప్పుడూ తిరగనిదే, మొఖాలు పదిమంది కి తెలియనిదే, అభివృద్ధి మరియు విమర్శల గొంతు వినపడనిదే, స్ధానిక ఫోటోలు వీడియో లు ప్రచారం లేనిదే, మన మంచి కష్టం అందరికీ కనపడదు వినపడదు అని, వీరికి ఎవరు చెపుతారో, ఎప్పుడు వారంతట వారు అర్థం చేసుకుంటారో అని గుసగుసలు.

మనం కూడా ఎన్నోమార్లు వీరికి, అధిష్ఠానం కు గుర్తు చేసినా, నిద్ర లేపినా, మత్తు వదలిన, మార్పులు లేవు.

పక్కన బాపట్ల ఎమ్మెల్యే కోన, గెలిచిన అందరూ స్థానిక నాయకులు తో, ఫోటోలు కూడా పెట్టారు. ఆయనను ఆదర్శంగా తీసుకుని, ప్రజలలో తిరుగుతూ, స్ధానిక ప్రజలలో పట్టు పెంచుకోవాలి, అని అందరూ కోరుతున్నారు.

ఇకనుంచి అయినా, ఆమంచి మరియు కరణం వర్గాలు మరియు ఇతర పార్టీల నాయకులు, చీరాల అసెంబ్లీ ప్రాంతాల్లో అందుబాటులో ఉంటూ, ప్రజల సమస్యలు పై తక్షణమే అదే రోజు స్పందిస్తూ, చీరాల జిల్లా లేదా జిల్లా శాఖలు, చేనేత పార్కు, ఫిషింగ్ హార్బర్ లాంటి, పెద్ద అభివృద్ధి పనులు జగనన్న దగ్గర నుంచి తెచ్చి, తమ పేరును పరువును నిలబెట్టుకుని, 2024 సీటు కు చేరువ అవుతారని అందరూ భావిస్తున్నారు.  
Author photo Sri, Telugu , 15+ yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 840+ Foreign and local events/ places coverage, 2113 General Articles and views 1,871,224; 104 తత్వాలు (Tatvaalu) and views 225,367
Dt : 11-Feb-2021, Upd Dt : 11-Feb-2021, Category : Politics
Views : 831 ( + More Social Media views ), Id : 969 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags : chirala , amanchi , local grip , ramannapet , panchayati , vijaya sabha , sarpanch post , term , karanam balaram , folks
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.

Share
అన్ని పత్రిక, టీవీ, సంక్షిప్త, రేడియో వార్తలు ఇక్కడే, అబ్బో అన్ని లింక్ లు గుర్తు వద్దు
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 11 yrs
No Ads or Spam, free Content