Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
2 min read time. *ఏవండీ 40 ఏళ్ళ ఎన్టీఆర్ తెదేపా ను పతనం చేస్తున్న చంద్రన్న కధనం చదివాను. ఎన్టీఆర్ అభిమానిగా, నచ్చింది, అభినందిస్తున్నా. మీరు కూడా, వెన్నుపోటు పాప ఫలితాలు అంటున్నారు. మరి మన వాళ్ళు పార్టీని రక్షించడం అంటున్నారు. రెంటికీ తేడా, మీ ఉదాహరణలతో తేలికగా చెప్పగలరు. మీరు ఆనాటి సలహా దారులైతే, వెన్నుపోటు మచ్చ చంద్రన్న మీద లేకుండా, చేసేవారా? ఇది అసలు జరగకుండా ఆపేవారా?*
జవాబు - గురువు గారు, శిష్యులకు జ్ఞాన బోధ కోసము, మీరు కావాలని తెలిసీ అడుగుతున్నారు, ఇందులో తప్పులు ఉంటే, పెద్దలు మీరే సరిచేయాలి.
కాలాన్ని మాయ చేయలేము, మోసానికి ఫలితాలు వస్తాయి. ఇంక ఎవరూ ఇలా చేయకుడదు, అందుకే వివరముగా తెలియ చెప్పాలి.
గతాన్ని మార్చలేము, కాబట్టి అందరమూ జాగ్రత్తలతో ఉండాలి. గతము మనల్ని నీడలా వెంటాడుతుంది సుమా. మనకు వద్దు ఆ నరకయాతన. తప్పు చేసిన వారికి అలాగే తప్పును మూర్ఖముగా సమర్ధించిన వారికి కూడా, ఫలితాలు తప్పవు.
ఇతరులు కూడా తప్పులు చేస్తున్నారు ఫలితాలు పొందుతున్నారు, మనము తప్పు చేయవద్దు, నష్ట ఫలితాలు పొందవద్దు సుమా. కరోనా తో ఎంతో మంది పోయారని, మనమూ పోతామా?
అందరూ రాజకీయాలు మనకెందుకు, టైం వేస్ట్ అంటుంటారు మూర్ఖముగా. మన ఇంట్లో, ఆఫీసులో, సంఘములో, బంధు మిత్రులలో, కూడా అవే రాజకీయాలు ఉంటాయి అంటే ఒప్పుకోరు కదూ?
కరెంట్ చార్జీలు పెరిగితే, అబ్బో అంటారు, ఓటు ఉచితము గా వెయ్యాలి అంటే, కూడదు నోటు మందు బిర్యాని కులం వర్గం కావాలి అంటారు.
కొత్త నాయక కుటుంబాలు వద్దు, పాత నాయకుల బానిసత్వం ముద్దు అంటారు. మరి మన తర్వాత తరాల, రాతలు మారేది ఎలా, కొత్త ఆలోచనలు వచ్చేది ఎలా?
కొత్త హీరోయిన్ లు కావాలి గానీ సినిమాలో, కొత్త నాయకులు వద్దు రాజకీయాలలో. ఏమండీ మన మొద్దు నిద్ర వీడమా?
మన ఇంట్లో, మన చుట్టుపక్కల వారితో, జరిగే రోజూ భాగోతమే కదా, రాజకీయాలలో జరిగేది. తెలుసుకుని ఉంటే, జాగ్రత్తలు పడవచ్చు.
అలాగే భారతం రామాయణాన్ని కూడా చదివి అర్ధం చేసుకోకుండా పిల్లలకు చెప్పకుండా, సమయం లేదు వ్రుధా అంటారు, మూర్ఖులు. మన ఇంట్లో జరిగే జరగబోయే జరిగిన కధలే వాటికి జవాబులే, ఆ గ్రంధాలలో కూడా ఉంది అని మూర్ఖులు తెలుసుకోలేరు, తమ జీవితాలను బాగుచేసుకోలేరు, కష్టాలనుంచి కాపాడుకోలేరు. అందుకే చదవడం వేరు, చదువుల పరమార్ధం గ్రహించడం వేరు.
అలాగే నమ్మిన రామన్న కుటుంబాన్ని, మాయతో మోసముతో గాయపరచిన ఆక్రమించిన చంద్రన్న, ఆక్రమణ కధ సారాంశం పూర్తి గా చదివితే, రక్షించడమా, భక్షించడమా అనేది, మీరే నిర్ణయం చేసుకోవచ్చు, తప్పు చెపితే మేము సరి చేసుకుంటాము.
ఒకరకముగా చంద్రన్న కూడా తెలివి తక్కువ మనిషే, అసలు మంచి నాయకత్వ లక్షణాలు లేవు, కానీ ఆ 4 గురు ఆయనకు బలమిచ్చి, తమ స్వార్ధానికి వాడుకున్నారు, చంద్రన్న దురాశ తీర్చారు.
తేలిక ఉదాహరణ లో, రామయ్య చంద్రయ్య బంధువులు అనుకుందాము. రామయ్యకు కోటి రూపాయల బంగారం షాపు ఉంది, ఇతరుల పెట్టుబడితో సహకారం తో కలిపి, ఓ 30 మంది పని చేస్తున్నారు. కపటం తెలియని 4 గురు పెళ్ళి అయిన పెద్ద పిల్లలు ఉన్నారు.
రామయ్య ని ఎవరూ పట్టించుకోవడం లేదు అని, భార్య చనిపోవడం వలన ఒంటరి తనమై, పెద్ద వయసులో కాషాయం కట్టి కూడా, లక్ష్మమ్మ ను కట్టుకున్నారు. ఆ షాపు మరియు ఆస్తి అధికారం లక్ష్మమ్మ కు వెళితే, ఇక మనకు విలువ ఉండదు, అని పిల్లలు మరియు బంధువులు భావించారు అనుకుందాము.
1) చంద్రయ్య వారిని మరియు షాపు ను రక్షించడము ఎలా? - ఆ 4 గురు పిల్లలకు నచ్చ చెప్పి, అది మీ నాన్న ఆస్తి, కష్టార్జితము, ఇందులో మనకు హక్కు లేదు. మీకు తగిన ఆస్తులు బతుకు దోవలు ఇచ్చారు వచ్చాయి, హాయిగా కాపురాలు చేసుకుంటున్నారు.
దోవ 1 - ఆయన సొంత వ్యవహారములో, వేలు పెట్టవద్దు అని నచ్చ చెప్పాలి, కష్టం నష్టం ఆయనే పడతారు, అని గమ్ముగా జరిగేది చూడాలి. మనము ఎటూ తోడు లేము కదా. మీకు కావాలంటే, మీరూ ఇంకో షాపు పెట్టుకోండి అని చెప్పాలి.
దోవ 2 - మరీ వారు పట్టుబడితే, అలా అయితే, మీలో నే ఎవరో ఒకరు, ఆ కొట్టు కు నాయకులు గా ఉండండి. మీ సహకారము తో నే, మీ తండ్రి నుంచి లాగి, మీకే ఇస్తాను, ఈ పాపము తో నాకు సంబంధము లేదు. నేను పక్కన ఉండి, మీకు ఎలా నడపాలో చెపుతాను, మీకు అనుభవము లేకపోతే, అని చెప్పాలి.
2) చంద్రయ్య వెన్నుపోటు ఎలా? - పై రెండు వదలి, మోసపూరిత దోవ 3 ఎంచుకున్నారు. ఎందుకంటే, అవకాశం కోసం కాసుకు కూర్చున్న, తడిగుడ్డ తో గొంతు కోసే గుంట నక్క, లక్షణాలు, పక్క దోవలో పైకి తొందరగా ఎదుగుదాం అన్న ఆత్రము. మోసాన్ని లోన దాచి, పైకి మంచి చేస్తున్నట్లు, తన తెలివి తేటలు ప్రదర్శించారు.
మీ సహకారము తో, దానిని నేను లాక్కుని, దానికి నేనే నాయకుడి ని అయ్యి, ముందుకు తీసుకుని వెళతాను, మిమ్మల్ని ఆదరిస్తాను అని చెప్పిన మాటలకు, ఆ అమాయకపు పిల్లలు నమ్మి మోసపోయారు.
తండ్రికే వెన్ను పోటు పొడవడానికి సహాయము చేసారు, రామయ్య మనసు క్షోభించేటట్లు చేసారు. ఆ తర్వాత ఆ పిల్లలకు కూడా, అన్యాయం చేసారు. నోరు ఎత్త కుండా, కొడుకుకి వారి పిల్ల నిచ్చి పెళ్ళి చేసాడు.
అంతా చాలా ముందు ప్రణాలికతో అమలు చేసారు. వారిని పిచ్చొళ్ళు గా చేసారు, వారు కూడా తెలివితక్కువ గా స్వయముగా అంగీకరించారు లొంగిపోయారు. ఇప్పుడు ఫలితాలు అందరూ అనుభవిస్తున్నారు.
*మనము సలహా దారులమైతే* - ముందు చంద్రయ్యకు నచ్చ చెప్పే వారము, మొదటి 2 దోవలలో నే వెళ్ళండి, ధర్మముగా. మీకు భవిష్యత్ వెన్ను పోటు మచ్చ వద్దు అని. అసలు ఇది జరగకుండా ప్రయత్నం చేస్తాము. మనము ఇందులో పాలు పంచుకోము, భాగం బహుమతి తీసుకోము, ఎప్పుడు లా దూరము గా ఉంటాము.
ఆయన ఒప్పుకోరు, సరే 3 వ దోవను కొంత మార్చి, ముందు వారి పిల్లలనే సీయెం చేద్దాము, మీరు వెనక ఉండండి, నడిపించండి 6 - 12 నెలలు. తర్వాత మీకు, వారే వారి చేతులతో అధికారము అప్పగిస్తారు, మా వల్ల కాదు అని.
అలా కొంత పాప భాగం తగ్గించే వారము. రామయ్య అంత బాధపడే వారు కాదు, తన పిల్లలే అధికారం లో ఉన్నారు లే అని గమ్ముగా ఉండే వారు. ఎందుకంటే, తన పిల్లలనే తాను తిట్టాలి, ఏమి చెయ్యాలో తెలీక గమ్ముగా ఉంటారు. చంద్రయ్య ను తిట్టినాకూడా, జనము పెద్దగా పట్టించుకోరు. చంద్రయ్య వెన్నుపోటు మచ్చ ఉండేది కాదు.
చంద్రయ్య అడుగుతారు - ఒక ఏడు తర్వాత కూడా, వారు నాకు ఇవ్వకపోతే పరిస్థితి ఏమిటి అని, నన్నే వారు, మోసం చేయవచ్చు గదా అని. లేదు, రామయ్య పిల్లలు అంత సాహసము చెయ్యరు, మిమ్మల్ని దాటి పోరు, వారికి మోసము తెలీదు అని నచ్చ చెపుతా. చంద్రయ్య చల్ల బడతారు, ఇంకా మిగతా విషయాలు మరియు భవిష్యత్తు కూడా క్షుణ్ణముగా చెబితే. చంద్రయ్య కు ఈ వెన్నుపోటు మచ్చ బహుశా ఉండేది కాదు.
చంద్రయ్య అనుమతి తీసుకుని, ధర్మము కోసము, రామయ్య దగ్గరకు కూడా వెళ్ళి, చూచ్చాయగా, జరగబోయేది చెపుతాము. మీరు ఇలా దోవ తప్పి వెళితే, మనకు ముళ్ళ బాటలు వస్తాయి, జాగ్రత్త గా ఉండాలి. ఈ పని చేయకుండా దయచేసి ఉండండి, మీకు ఇంకో మార్గము చెపుతాను, మీ అవసరాలకు భంగము కలగకుండా, ధర్మము తప్పకుండా అని నచ్చ చెపుతాము.
ఆయనకున్న సహజ ధోరణిలో, రామయ్య గారు ఇలా చెబుతారు - బ్రదర్, మనల్ని ఎదిరించే వారు ఎవరు ఉంటారు, అంత ధైర్యం ఎవరికి ఉంటుంది, మీరు అనవసరముగా భయపడకండి భయపెట్టకండి, అంతా మన దోవలోనే జరుగుతుంది అంటారు.
మరలా చెబుతాను, అన్న గారూ కాలం బలమైనది, రాముడే కారడవులకు వెళ్ళారు అని. ఆయన వినరు. ఇక మన తప్పు లేదు.
ఇక మన బాధ్యత ముగిసింది, ఇద్దరికీ జాగ్రత్తలు మంచి దోవలు చెప్పము. ఇక ఏమి చేసుకుంటారో వారి ఇష్టము. మనము నిమిత్త మాత్రులము, అంతకన్న మనము ఎక్కువ ముందుకు వెళితే, ఆ పాప కార్యములో మనకు భాగము ఉంటుంది, కాబట్టి, సలహా వరకే మన పని.
పాపాన్ని పూర్టి క్రుష్ణుడే ఆపలేక రాయబారం విఫలమై వచ్చారు, యుద్దం జరిగింది. మనము కూడా అంతే, కనీసం పాప శాతం, మచ్చ, బాధ తగ్గించే ప్రయత్నం చేయాలి సుమా.
ఇప్పుడైనా, చంద్రయ్య, బహిరంగము గా, రామయ్య అభిమానులకు కుటుంబానికి, భేషరతు క్షమాపణలు చెప్పలి - ఆ రోజు తెలిసో తెలీకో తప్పులు జరిగాయి, మన్నించండి అని.
అప్పుడు కాస్త పాపం తగ్గుతుంది, లోకయ్యకు ప్రతిబంధకాలు తగ్గుతాయి.
Chandranna did ntr backstabbing or party saving, is there best alternate way example
Sri, Telugu , 10 yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 828 Foreign events/ places coverage, 1795 General Articles and views 1,386,737; 93 తత్వాలు (Tatvaalu) and views 184,203 Dt : 17-Apr-2022, Upd Dt : 17-Apr-2022, Category : Politics
Views : 514
( + More Social Media views ), Id : 1350 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags :
chandranna ,
ntr ,
backstabbing ,
party ,
saving ,
alternate ,
way ,
babu ,
balakrishna Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది. తెలుగు మీడియాను నమ్మరా, ఆంగ్ల హిందీ మీడియాను నమ్ముతారా? పర్లేదు, వాటినీ ఇక్కడే చూడొచ్చు
Facebook Comments