నిద్ర లేద్దామా, అభివ్రుద్దిని ప్రశ్నించడం చూపిద్దామా? అధికారులు, నాయకులు, ప్రతిపక్షాలూ, ఓటర్లూ? - General - లోకం తీరు/ News
           
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. 2110 కధనాలు. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు. 2145 General Articles and views 2,137,015; 104 తత్వాలు (Tatvaalu) and views 239,974.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
1 min read time.

*నిద్ర లేద్దామా, అభివ్రుద్దిని అలాగే ప్రశ్నించడం ని చూపిద్దామా? రాష్ట్ర, జిల్లా, మున్సిపల్, మండల, పంచాయితీ అధికారులు, నాయకులు, ప్రతిపక్షాలూ, ఓటర్లూ - ఎన్నికల ఏడాది వచ్చేస్తుంది - బదిలీలు? మాజీలు? 1/ 23/ 150? ఎన్ని కొత్త కపటాలు/ నాటకాలు/ అబద్దాలు/ వరాలు/ పన్నులు/ అప్పులు/ తాకట్టులు/ కన్నీళ్ళు/ కష్టాలు మనకు? ఆవుకు ఓటా లేక నక్క, పాము, పులి కేనా? మన రాత మనమే?*

*Can we wake up, Show development and questioning? State, Zilla, Municipal, Mandal, Panchayat, officials, leaders, Voters and opposition - election year coming - Transfers? Ex? 1/ 23/ 150? How many new hypocrites /dramas /lies /gifts /taxes /debts /collaterals /tears/ suffering do we have? vote for cow or fox, snake and tiger? writing our own fate?*

మల్లెపువ్వు సువాసన ఎక్కడైనా పరిమళిస్తుంది, వరాహం ఎక్కడవున్నా సువాసనలోనే బొర్లాడుతుంది, చోటును మనిషిని బట్టి మారదు, అది అధికారి, నాయకుడు, ఓటరు అయినా.

చిత్తశుద్ది అంటే, మాట ఆలోచన పనులు ఒకే విధముగా ఉండాలి, ఎవరికైనా. అది లేనప్పుడు, అంటే అరిషడ్వర్గ అష్టవ్యసనాలకు బానిసలమైనప్పుడు, వాటి ఫలితాలు అందరమూ అనుభవించాలి.

గత ప్రభుత్వాలలో పని చేసిన, ఎంతో మంది అధికారులు, నాయకులు జైలుకు పోయారు, ప్రజల చేత 23 సీట్లతో అక్షింతలు వేసుకున్నారు, తమ తప్పులకు. కోర్ట్ కు హజరు అయ్యి, తల దించుకున్నారు.

2017-2018 సమయం లో చంద్రన్న కు చెవిలో జోరీగలాగా చెప్పాము, కధనాలు చూడండి. ప్రజా పధకాలకు తన బొమ్మలు పెట్టుకున్నారు, పసుపు మనుషులకు పనులు కల్పించారు, మన మాటలు లెక్క చేయలేదు, చీరాలకు ఫిషింగ్ హార్బర్ కూడా వెనక్కు నెట్టేసారు. రాష్ట్ర ప్రజలు పక్కకు నెట్టేసారు, కానీ మా చీరాల ప్రజలు గెలిపించారు. అలాంటి వారికి బుద్ది చెప్పాలని, మా ఎమ్మెల్యే కరణం బాబాయి గబుక్కున పార్టీ గోడ దూకేశారు. అంటే, చంద్రన్న చుట్టూ ఉండే మాయ, కోటరీ, పై అధికారులు ఆయనను బ్రష్టు పట్టించారు. మనల్ని పతనం చేసేది మనవారే, అని చంద్రన్న తెలుసుకుని, మారారా?

చదువు సంస్కారం ఉన్న అధికారులు ఇది తప్పు, రాజ్యాంగ విరుద్దం, ప్రజాస్వామ్యానికి అవమానం, మీరు ఉండేది 5 ఏళ్ళు, మేము 30 ఏళ్ళు పైగా ఉండాలి, మా జీవితాలలో మచ్చగా ఉంటుంది, మా పిల్లల సంస్కారం పై ఇది ప్రభావం ఉంటుంది, ఇలాంటి పనులు మేము చెయ్యము అని చెప్పరా? జీతం సౌకర్యాలు ఆమ్యామ్యాలు వస్తే చాలా? ఉద్యోగ సంఘాలు వీటి కోసమేనా? ఐయేయెస్ లక్ష్మి కోసం ఎందుకు సంఘాలు పోరాడలేదు?

గత వెన్ను పోటుకు, కరోనా సమయములో, ఓటర్లు నాయకులు మంత్రులు అధికారులు ప్రాణాలు అరచేతిలో పట్టుకుని, హైదరాబాద్ ఆసుపత్రులకు పరుగులు, జగనన్న చంద్రన్న ఇద్దరూ కళ్ళతో చూసారు. నేటికీ మార్పు ఉందా?

సేం అదే పనులు, జగనన్న కొనసాగిస్తున్నారు, అవే అప్పులు అవే తాకట్టులు, అవే పంచడాలు, పధకాలకు బొమ్మలు మార్చారు, బులుగు మనుషులకు పనులు కల్పించారు. చీరాలకు ఏమీ ఇవ్వలేదు, బాబాయి దూకినందుకు అయినా. మాజీ ఎమ్మెల్యే ఆమంచి అన్న గుణం మారలేదు అని, పర్చూరు పంపారు. అసలు రాష్ట్రం లో ఎక్కడ ఏమి జరుగుతుందో, జగనన్నకు ఎవరు చెపుతారు? మరి అదే మాయ, కోటరి, అధికారులు జగనన్నను మాత్రం బ్రష్టు పట్టించరా? లేక నక్క పులి పాము లక్షణాలు ఉన్న జనం, మనల్ని వదలరు అని ధీమానా? మరి ఎలా 150 పైన వస్తాయి?

మా దగ్గరలో, ఉమ్మడి ప్రకాశం జిల్లాలో మంత్రి బాలినేని, బాపట్ల జిల్లాలో ఉపసభాపతి కోన, జగనన్న విశ్వాసం కోల్పోయారు, పదవులకు దూరం అయ్యారు. ముఖ్యముగా, బాలినేని విషయములో మనము మొత్తుకున్నాము, మీరు తప్పు దోవలో వెళుతున్నారు - జగనన్న మడమ తిప్పుతారు మాట తప్పుతారు అని మీ పనులతో నిరూపిస్తున్నారు, వద్దు వద్దు అని. అందరిలాగే, ఆయనా లెక్క చేయలేదు, తర్వాత కాలం లెక్క చేయలేదు. అలాగే మీ జిల్లాలలో మహాను భావులు, చాల మంది ఉంటారు.

ఇది ఒక వైపు. ఇప్పుడు ఇంకో వైపు చూడండి.

2020 సంవత్సరములో, అనంతపురం జిల్లా కలెక్టర్ శ్రీ గంధం చంద్రుడు గారు, అన్ని జిల్లా శాఖల తో, సోషల్ మీడియా లో సమాచారం పెట్టించే, ప్రయత్నం చేసారు. అలాంటి దమ్ము క్రుతజ్ఞత విశ్వసనీయత ఉన్న అధికారి, నేడు ఉన్నారా? ఉంటే, వారి రాష్ట్ర/జిల్లా/పట్టణ/గ్రామ శాఖల లింక్లు పంపగలరా?

నిర్లక్ష్యముగా, బాధ్యతా రహితముగా ఉన్న అధికారులను, కదిలించే అదిలించే, ఉత్తమ సంస్కార నాయకులు, ప్రజలు ఏరి?

చంద్రుడు గారు కు, మనము అండగా ఎన్నో కధనాలు రాసాము, అక్కడి నాయకులు బదిలీ చేయాలని విశ్వ ప్రయత్నం చేసినా. కొంత కాలం ఆగినా, చివరికి నాయకుల నీచ రాజకీయమే గెలిచింది. ప్రాపంచికము లో గెలిచినా, ఆత్మలో ఆధ్యాత్మికములో ఓడిపోయారు, ఓడిపోతారు, ఆ నాయకులు, వారిని ఎన్నుకున్న ప్రజలు.

అదే జిల్లా ధర్మవరం నుంచి ఎమ్మెల్యే కేతిరెడ్డి గారు, జనములో రోజూ తిరుగుతూ, అధికారులను కూడా వెంట తిప్పారు. కొంతమంది నటన, షో అన్నా, అదే పని ఇతర ఎమ్మెల్యేలు/ ఎంపీలు చేయలేక పోయారు, వారికి ఓపిక లేదు, జనం తో మాట్లాడే ధైర్యం లేదు - మరి వీరిని వేస్ట్ అని మరి ఎవరన్నా అన్నారా?

*ఇప్పుడు ఓ ఊహా జనిత మానసిక సంస్కార సంవాదన వినండి* - జిల్లాల మీటింగ్ లో జగనన్న, ఆ జిల్లా కలెక్టర్, అధికారులు, నాయకుల, మాటలు.

జగనన్న - బాపట్ల అధికారులు నాయకులకు నమస్కారములు, అంతా బాగానే ఉందా. మన ప్రభుత్వ పధకాలను, ప్రచారం చేస్తున్నారా, సోషల్ మీడియాలో. ప్రజలకు అందుబాటులో అధికారుల వాట్సాప్ నంబర్లు ఉంచారా?

కలెక్టరు, ఎమ్మెల్యేలు, ఎంపీలు - ముక్త కంఠముగా, మీరు చెప్పాక మేము ఎలా మరుస్తాము, జిల్లా అంతా బాగుంది, అధికారులు వాట్సాప్ నంబర్లతో విలేఖరులకు, ప్రజలకు అందుబాటులో ఉన్నారు.

జగనన్న - బాపట్ల జిల్లాలో ఎంత మంది, జిల్లా అధికారులు ఉన్నారు? నలుగురా, లేక అంతకన్నా ఎక్కువ మందా? ఒకవేళ 4 గురు ఇతే, మిగతా జీతాలు ఎటు వెళుతున్నాయి. ఒకవేళ జీతాలు ఇవ్వలేక మనము జిల్లా అధికారులను నియమించకపోతే, పారదర్శకతకు, అది ఎందుకు ప్రజలకు చెప్పడం లేదు.

కలెక్టరు, ఎమ్మెల్యేలు, ఎంపీలు - సీయెం గారు, మిమ్మల్ని ఎవరో తప్పు దోవ పట్టించారు, 4 గురు ఏమిటి, మనకు రెవెన్యూ, విద్యా, వైద్య, పంచాయితీ, ఇంకా చాలా మంది జిల్లా అధికారులు ఉన్నారు కదా?

జగనన్న - https://bapatla.ap.gov.in/ (ఈ కధనం బొమ్మలో పెద్దది చేసి చూడండి)

ఈ వెబ్సైట్ లో కేవలం 4 గురు పేర్లు ఫోన్ నంబర్లు మాత్రమే కనపడుతున్నాయి. మిగతావారి పేర్లు నంబర్లు ఏవి? ఎంపీడీవోలు ఉన్నారు, పంచాయితీ ఈవోలు ఏరి? వీరు ఉద్యోగులు కాదా, వీరిని గౌరవించమా? కొత్త ఉద్యోగి వచ్చినప్పుడు, ఇతను వచ్చారు, ఇది కొత్త నంబర్ అని ఎక్కడ వివరము ఉంది? అంగన్ వాడీ టీచర్లు, వాలంటీర్ల వివరాలు నంబర్లు ఎక్కడ ఉన్నాయి?

జనం సమాచారం మనతో ఉండాలి, మన సమాచారం జనముతో వద్దా? ఇదేమి నీతయ్యా మీకు? వారి పన్నులతో జీతాలు సౌకర్యాలు చాలా? ప్రజల విన్నపాలు, సమస్యలు, తీర్చామని, బహిరంగముగా సోషల్ మీడియాలో ప్రతి రోజూ లిస్ట్ ఏది, మీ పని తనానికి సాక్ష్యం ఏది? మనం మీటింగు లు పెట్టుకుంటుంది, పెళ్ళి కబుర్లకా, నిజమైన అభివ్రుద్దికా? అన్న అన్న అని మిమ్మల్ని ఎంత గౌరవిస్తున్నాను, మీరు చేసే మర్యాద ఇదేనా?

ఎవరు, ఎవరిని తప్పు దోవ పట్టిస్తున్నారు? ప్రతిపక్షాలు జనసేన, తెదేపా, బీజేపీ నిద్ర పోతున్నారు కాబట్టి ఇవి అడగరు, మనకు రోజులు బాగున్నాయి. ఆ ప్రజా పౌరసంబంధ అధికారులు ఏమి చేస్తున్నారు? నా వీడియోలు ఫోటోలు పెట్టడమేనా? జిల్లా స్థాయిలో ఏమి జరుగుతుందో చూడరా? ఇవే సరిగ్గా చేయకపోతే, పధకాలు అందరికీ సరిగ్గా అందుతున్నాయి అని నమ్మకము ఏమిటి?

సరే అధికారులు నిద్రమత్తులో ఉంటే, ఎమ్మెల్యేలు ఎంపీలు ఏమి చేస్తున్నారు, ఇన్నాళ్ళుగా? మీ పనితనం కు, ఈ ఒక్క మెతుకు పట్టుకుంటే చాలదా, కుండ మొత్తం బోర్లించి చూడాలా? ఏమయ్యా బాపట్ల ఎమ్మెల్యే, ఇందుకు కదా, మీకు పదవి తీసేసింది? చీరాల ఎమ్మెల్యే, మిమ్మల్ని మా వైపు తీసుకున్నందుకు, మీరు కూడా మొద్దు నిద్ర, మాకూ ద్రోహం యేనా? ఆ వేమూరు, సంతనూతల పాడు ఎమ్మెల్యేలు, ఉత్సవ విగ్రహాలేనా? బాపట్ల ఎంపీ నా భజన తప్ప, ప్రజల భజన చేయడు, జిల్లాలో అందుబాటులో ఉండడు. మిమ్మల్ని నమ్ముకుని, మీకు మరలా టిక్కెట్లు ఇచ్చి, జిల్లాలో నేను ఎన్నికలు పోతున్నానా, పోవాలా?

ఫోటోలు ఎన్ని పెట్టుకున్నాము, మన సొంత సోషల్ మీడియాలో కాదయ్యా కావలసింది. రాష్ట్ర, జిల్లా, పట్టణ, మండల, గ్రామ అధికారుల సోషల్ మీడియాలో, మీ ఎమ్మెల్యేల ఎంపీల, ఫోటోలు ఎన్ని పెట్టారు ఎన్ని ప్రజా పధకాలు చూపారు అని కదా జనము చూసేది.

ఈ పార్టీలో/ ప్రభుత్వం లో, పనిచేయని వారికి టిక్కెట్లు ఇవ్వము రేపు ఎన్నికలలో. జనసేన, బీజీపీ, తెదేపా, మేము వేస్ట్ అన్న వారి తో ఎన్నికలకు వెళ్ళేంత దౌర్బాగ్య స్తితిలో ఉన్నారా? 5 ఏళ్ళు గా పనిచేయని వారిని, మరలా ప్రజలు ఎన్నుకుంటారా? వారి ఇష్టము.

ఈ సంవత్సరం అయినా, అందరము ఒళ్ళు దగ్గర జాగ్రత్త గా పెట్టుకుని, ప్రజలకు మంచి చేస్తూ, మన విజయ అవకాశాలను, పెంచుకుందాము. అన్ని జిల్లాల కలెక్టర్లు, ఇది బాపట్ల ఒక్క దాని కే కాదు, మీ అందరికి కూడా గుణపాఠం కావాలి. మీ జిల్లాలలో కూడా, ఏదొ ఒక గ్రామ ఈవో, పట్టణ ఎమ్మార్వో, ఎంపీడీవో, జిల్లా అధికారుల సోషల్ మీడియాలో రోజూ పెట్టిన మీ పనులు, ఫోటోలు కనపడాలి, లేదంటీ మీ మెమోలలో, మీరు పనిచేయలేని అసమర్దులు అని రాస్తాము, బదిలీలు చేస్తాము, డిమోషన్ (తక్కువ పదవికి), జీతం కట్ చేస్తాము. మాకు ప్రజలు ప్రజా సంక్షేమం ముఖ్యం.

కాబట్టి, నాయకులు, అధికారులు, ఓటర్లు, నిద్ర లేద్దామా, అభివ్రుద్దిని అలాగే ప్రశ్నించడం ని చూపిద్దామా? రాష్ట్ర, జిల్లా, మున్సిపల్, మండల, పంచాయితీ అధికారులు, నాయకులు, ప్రతిపక్షాలూ, ఓటర్లూ - ఎన్నికల ఏడాది వచ్చేస్తుంది. ఎవరికి బదిలీలు? ఎవరు మాజీలు అవుతారు? ఎవరికి 1/ 23/ 150 సీట్లు? ఎన్ని కొత్త కపటాలు/ నాటకాలు/ అబద్దాలు/ వరాలు/ పన్నులు/ అప్పులు/ తాకట్టులు/ కన్నీళ్ళు/ కష్టాలు మనకు? మన ఆవుకు ఓటా లేక నక్క, పాము, పులి కేనా ఎప్పుడు లా పతన దిశలో? మన రాత మనమే రాసుకుంటున్నాము అని అందరికీ తెలుసు కదా?  
Author photo Sri, Telugu , 15+ yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 840+ Foreign and local events/ places coverage, 2145 General Articles and views 2,137,015; 104 తత్వాలు (Tatvaalu) and views 239,974
Dt : 11-Aug-2023, Upd Dt : 11-Aug-2023, Category : General
Views : 414 ( + More Social Media views ), Id : 1873 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags : wakeup , development , questioning , Officials , leaders , opposition , jagan , chandranna , bapatla , ap
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.

Share
అన్ని పత్రిక, టీవీ, సంక్షిప్త, రేడియో వార్తలు ఇక్కడే, అబ్బో అన్ని లింక్ లు గుర్తు వద్దు
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 11 yrs
No Ads or Spam, free Content