భీమ్ దీక్ష - ఆరోగ్యం - బహుజనుల పవిత్ర మాసం - అనంత కలెక్టర్ పిలుపు - General - లోకం తీరు/ News
           
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. 2082 కధనాలు. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు. 2117 General Articles and views 1,877,746; 104 తత్వాలు (Tatvaalu) and views 225,933.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
2 min read time.

మంచి వారు మంచి కార్యక్రమం చేస్తూ ఉంటే, కనీసం మనం మంచిగా 4 మాటలు రాసి 10 మందికి ప్రచారం చేయడం, లేదా పంపడం మన ధర్మం, ఉచితముగా దేవుని అండ మనం కోరేటప్పుడు. ఈ చిన్న ఉచిత పని కూడా చేయలేమా?

మన ఫేవరెట్ ప్రభుత్వ హీరో, సామాజిక, మనసున్న, ఉత్తమ బాధ్యత గల అధికారి, అనంతపురం కలెక్టర్ శ్రీ గంధము చంద్రుడు గారు. మరొక కొత్త కార్యక్రమం మొదలు పెట్టారు.

మహనీయులు అంబేద్కర్ ను స్మరించడం మరియు ఇంద్రియాలను అదుపులో ఉంచడం, మరియు ఉత్తమ అలవాట్లు గా ఉదయం 5 కి లెగవడం, మరియు ఇది ఆరోగ్యం కు కూడా సంబంధించినది మంచిది, నెల రోజులు కార్యక్రమం.

గత కార్యక్రమాలు కొన్ని గుర్తు చేసుకుందాం - స్కూలు విద్యార్థినుల ను ఒక రోజు అధికారిగా, అనంతపురం చరిత్ర ను గోడల మీద బొమ్మలు గా, జిల్లా అధికారులు అందరి చేత సోషల్ సమాచారం, వెనుకబడిన వారికి అండగా కార్యక్రమాలు, . . . చాలా పెద్ద లిస్ట్ ఉన్నాయి చెప్పకుంటూ పోతే.

గతములోనే చెప్పినా, మనము ప్రతి వారం వీరి గొప్ప కధనం ఒకటి రాయాల్సి ఉంటుంది అని.

ఇవి చేయని జిల్లా పట్టణ గ్రామ అధికారులూ చాలా మంది ఉన్నారు, మనల్ని పై వాళ్ళు అడిగినప్పుడు నెట్టినప్పుడు చూద్దాం లే, అన్న నిర్లక్ష్యం ధోరణి తో, గౌరవ ముఖ్యమంత్రి ని అగౌరవపరుస్తున్నారు.

సోషల్ మీడియా లో, ప్రభుత్వ పధకాల సమాచారం పెట్టని అధికారులు కు, జీతం లో కోత, ఇంక్రిమెంట్ ప్రమోషన్ బదిలీ ఆపడం చేస్తే, ఉద్యోగ ప్రేమ లేకపోయినా, కనీసం ధనం కోసమైనా బాధ్యత గుర్తు చేసుకుంటారు, అని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

నిబద్దత గల నాయకులు తగిన చర్యలు తీసుకుని, గౌరవ ముఖ్యమంత్రి జగన్ గారికి, ప్రచారం లో జరుగుతున్న అన్యాయం ను, సరిచేయాలని పలువురు కోరుతున్నారు.

సీనియారిటీ, అనుభవం, కృతజ్ఞతలు, బాధ్యత, వృత్తి ధర్మం, సీఎం అంటే గౌరవం ఉన్న అధికారులు, తమకు తామే ముందు జాగ్రత్తలు తీసుకుంటారు, ప్రపంచ మార్పులు ఇతర అధికారుల పని తనాన్ని చూసైనా మారతారు, వెనక బెంచీ చిన్న పిల్లలు లా ఒకరితో చెప్పించుకోరు కదా.

ఉద్యోగం రానంత వరకూ, ప్రజలతో కలసి ప్రభుత్వం ను అధికారులు ను నిందిస్తూ, కాళ్ళు అరిగేలా తిరుగుతూ, చేతులు నొప్పి వచ్చే విధంగా అన్ని పరీక్షలు రాస్తూ,

ఒకసారి అదృష్టం కలసి వచ్చి, తమకు ప్రభుత్వ అధికారులు గా ఉద్యోగము వస్తే,

ప్రజల పన్నులు, నెల నెలా జీతాలు గా తీసుకుంటూ, సౌకర్యాలు అనుభవిస్తూ కూడా,

ఇక మేము దేవుళ్ళము, ఉన్నత స్ధితి లో ఉన్నాం అని, గతం మరచి,

ప్రజల నెత్తిన ఎక్కి ఆడే, ప్రజలు కు దూరంగా ఉండే అలాగె ఉంచే, అధికారులు ఎక్కువ. ఎక్కువ మంది నాయకులు కూడా అంతే, అని ప్రజల భావన.

కానీ ప్రజలతో మమేకమై, ప్రజలతో రోజూ ముచ్చటిస్తూ, మంచి కార్యక్రమాలతో, ఉచిత సోషల్ మీడియా లో, అందుబాటులో ఉంటూ, గతాన్ని మరువకుండా, ప్రజలకు కృతజ్ఞతలు తెలుపుకునే, నిస్వార్ధ పరులు, ఉత్తములు కొందరే ఉంటారు.

అందులో మన అనంతపురం కలెక్టర్ ఒకరు. మా మాటలు కూడా నమ్మవద్దు, దయచేసి వారి సోషల్ మీడియా చూసి మీరే చెప్పగలరు, నిర్ణయం చేయగలరు. రాష్ట్రంలో ఇంకో జిల్లా అధికారి ఎవరైనా ఇలా ఉంటే, దయచేసి లింక్ పంపగలరు.

ప్రతి ఎమ్మెల్యే, ఎంపీ, అధికారులు, నాయకులు కూడా, సోషల్ మీడియా వాడుతూ, తమ మంచి వ్యక్తిత్వంతో, ఇలాగే ప్రజలను ఆదర్శ మార్గం లో పయనించే విధంగా, మంచి కార్యక్రమాలను ప్రచారం చేసిన, కనీసం కొంతమంది అయినా స్ఫూర్తి పొందుతారు.

భీమ్ దీక్ష - బహుజనుల పవిత్ర మాసం - కాన్షిరాం జయంతి, మార్చ్ 15 నుండి అంబేడ్కర్ జయంతి, ఏప్రిల్ 14 వరకు ఉదయాన్నే 5:00 గం. లకు లేవడం, అంబేడ్కర్ రచనలు చదవడం, ఇంద్రియాలను అదుపు చేసుకోవడం లాంటివి ఈ దీక్ష యొక్క ముఖ్య ఉద్దేశాలు. జై భీమ్ ... జై భారత్ !  
Author photo Sri, Telugu , 15+ yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 840+ Foreign and local events/ places coverage, 2117 General Articles and views 1,877,746; 104 తత్వాలు (Tatvaalu) and views 225,933
Dt : 17-Mar-2021, Upd Dt : 17-Mar-2021, Category : General
Views : 923 ( + More Social Media views ), Id : 1042 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags : bhim deeksha , health , holy , month , bahujan , anantapuram , collector , chandrudu
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.

Share
అన్ని పత్రిక, టీవీ, సంక్షిప్త, రేడియో వార్తలు ఇక్కడే, అబ్బో అన్ని లింక్ లు గుర్తు వద్దు
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 11 yrs
No Ads or Spam, free Content